2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జనవరి 25–31. సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9: “ఇదియే బయల్పాటు ఆత్మ”


“జనవరి 25–31. సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9: ‘ఇదియే బయల్పాటు ఆత్మ,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జనవరి 25–31. సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

కాగితంపై వ్రాయుచున్న లేఖకుడు

జనవరి 25–31

సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9

“ఇదియే బయల్పాటు ఆత్మ”

ప్రభువు మన మనస్సులలో మరియు హృదయాలలో సత్యాలను బయలుపరుచును (సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2–3 చూడండి). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9 చదువుతున్నప్పుడు, మీరు పొందే మనోభావాలేవైనా నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

1828 శరదృతువులో, ఆలీవర్ కౌడరీ అనే యువ పాఠశాల ఉపాధ్యాయుడు న్యూయార్క్‌లోని మాంఛెస్టర్‌లో అధ్యాపకునిగా పనిలో చేరి, లూసీ మరియు జోసెఫ్ స్మిత్‌ సీ. కుటుంబంతో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో పెన్సిల్వేనియాలోని హార్మొనీలో నివసిస్తున్న వారి కుమారుడైన జోసెఫ్ గురించి ఆలీవర్ విన్నాడు మరియు తనను తాను సత్యాన్వేషిగా భావించే ఆలీవర్ మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు. దేవదూతల సందర్శనలు, ఒక ప్రాచీన గ్రంథము మరియు దేవుని శక్తితో అనువదించే బహుమానం గురించి స్మిత్‌లు వివరించారు. ఆలీవర్ ఆకర్షితుడయ్యాడు. ఇది నిజం కాగలదా? లూసీ మరియు జోసెఫ్ సీ. సత్యాన్ని కోరుకునే ఎవరికైనా వర్తించే సలహా అతనికి ఇచ్చారు, అదేమనగా ప్రార్థన చేసి ప్రభువును అడుగుట.

ఆలీవర్ ఆవిధంగా చేయగా, ఆలీవర్ మనస్సుకు శాంతిని, అభయాన్నిస్తూ ప్రభువు సమాధానమిచ్చారు. ఆలీవర్ కనుగొన్న బయల్పాటు వ్యక్తిగతమైనది కావచ్చు, కాని రాబోయే నెలల్లో అతడు మరింత విస్తారంగా నేర్చుకుంటాడు. బయల్పాటు ప్రవక్తలకు మాత్రమే కాదు; దానిని కోరి, వెదికే వారెవరికైనా అది ఇవ్వబడుతుంది. ఆలీవర్‌కు అప్పటికింకా ప్రతిదీ తెలియదు, కానీ తదుపరి అడుగు వేయడానికి కావలసిన జ్ఞానాన్ని అతడు పొందాడు. ప్రభువు జోసెఫ్ స్మిత్ ద్వారా ఒక ముఖ్యమైన పని చేస్తున్నారు మరియు ఆలీవర్ దానిలో భాగం కావాలని కోరుకున్నాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9 వెనుక ఉన్న చరిత్ర గురించి మరింత సమాచారం కోసం, Saints, 1:58–64; “Days of Harmony” (వీడియో, ChurchofJesusChrist.org) చూడండి.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 6; 8–9

పరలోక తండ్రి “సత్యాత్మ” ద్వారా నాతో మాట్లాడతారు.

1829 వసంత కాలములో, ఆలీవర్ కౌడరీ హార్మొనీకి ప్రయాణించి, జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథమును అనువదించుచుండగా స్వచ్ఛందంగా అతడికి లేఖకుడిగా ఉన్నాడు. అనువాదం యొక్క బయల్పాటు ప్రక్రియను ఆలీవర్ ఇప్పుడు దగ్గరగా చూసాడు. ఆ అనుభవం అతడిని ఆశ్చర్యపరిచింది, అనువాదపు బహుమానముతో తాను కూడా ఆశీర్వదించబడగలడా అని అతడు ఆశ్చర్యపోయాడు. అనువదించేందుకు ప్రయత్నించడానికి ప్రభువు అతడిని అనుమతించారు, కాని బయల్పాటు పొందడం ఆలీవర్‌కు క్రొత్త ప్రక్రియ మరియు అతడి ప్రయత్నం సరిగ్గా జరుగలేదు. అతడు ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది, సిద్ధాంతము మరియు నిబంధనలు 6, 8 మరియు 9 ప్రకరణములు ప్రభువు అతనికి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారని చూపుతాయి.

మీరు ఈ ప్రకరణములను చదువుతున్నప్పుడు, వ్యక్తిగత బయల్పాటు గురించి ప్రభువు ఏమి బోధించారో గమనించండి. అతడి మాటలు మీరు కలిగియున్న లేదా కలిగియుండాలనుకుంటున్న అనుభవాలతో ఎలా సంబంధం కలిగియున్నాయి?

ఉదాహరణకు, ప్రభువు తన చిత్తాన్ని బయల్పరచడానికి ముందు మీ నుండి కోరుతున్న దాని గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 6:5–7; 8:1; 9:7–8 వచనాలు ఏమి సూచిస్తున్నాయి?

బయల్పాటు రాగల వివిధ మార్గాల గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 6:14–17, 22–24; 8: 2–3; 9:7–9 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

ఈ ప్రకరణముల నుండి బయల్పాటు గురించి మీరు నేర్చుకున్నది ఇంకేమైనా ఉందా?

బయల్పాటు గురించి మరింత తెలుసుకోవడానికి, రస్సెల్ ఎమ్. నెల్సన్,, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2018, 93–96; జూలీ బి. బెక్, “And upon the Handmaids in Those Days Will I Pour Out My Spirit,” ఎన్‌సైన్ లేదా Liahona, మే 2010, 10–12 చూడండి. 8వ ప్రకరణము లో వివరించబడిన, “అహరోను బహుమానము” గురించి మరింత తెలుసుకొనుటకు “Oliver Cowdery’s Gift,” Revelations in Context, 15–19 చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 6:18–21, 29–37

ప్రతి తలంపులో క్రీస్తు వైపు చూడండి.

ప్రభువు కార్యమును చేయుచూ (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:18) జోసెఫ్ అప్పటికే “క్లిష్ట పరిస్థితులను” అనుభవించినప్పటికీ, రాబోయే అనేక సంవత్సరాలలో ఆ పరిస్థితులు ఇంకెంత కష్టమవుతాయో అతడికి మరియు ఆలీవర్‌కు తెలియదు. కానీ ప్రభువుకు తెలుసు మరియు మీ భవిష్యత్తులో మీకు గల శ్రమలు ఆయనకు తెలుసు. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:18–21, 29–37 వచనములలో జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు ఆయన ఇచ్చిన సలహా మీకు కూడా సహాయపడగలదు. ఈ మాటలు విన్న తర్వాత జోసెఫ్ మరియు ఆలీవర్ ఎలా భావించారు? ప్రభువును విశ్వసించడంలో మీకు సహాయపడేలా ఈ వచనాలలో మీరు ఏమి కనుగొంటారు? మీ జీవితంలో మీరు ఎక్కువగా క్రీస్తు వైపు ఎలా చూడగలరు?

ఆలీవర్ కౌడరీ

ఆలీవర్ కౌడరీ, లూయిస్ ఏ. రామ్సే చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 6–7; 9:3, 7–14 చూడుము.

“నీవు నన్ను కోరినట్లే నీకు జరుగును.”

ప్రకరణములు 6 మరియు 7 లో “కోరిక” లేదా “కోరికలు” వంటి పదాలు ఎన్నిసార్లు కనిపిస్తాయో గమనించండి. మీ కోరికలకు దేవుడు ఇచ్చే ప్రాముఖ్యత గురించి ఈ ప్రకరణముల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? సిద్ధాంతం మరియు నిబంధనలు 7:1 లో ప్రభువు యొక్క ప్రశ్నను మీకుమీరు ప్రశ్నించుకోండి: “నీవేమి కోరుచున్నావు?”

ఆలీవర్ కౌడరీ యొక్క నీతివంతమైన కోరికలలో ఒకటి—జోసెఫ్ స్మిత్ అనువదించినట్లుగా అనువదించడం—ఆ కోరిక నెరవేరలేదు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 9:3, 7–14చదివేటప్పుడు, నీతివంతమైన మీ కోరికలు నెరవేరనప్పుడు మీకు సహాయపడేలా ఏ ప్రేరేపణలు మీరు పొందుతారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 11:8; Dallin H. Oaks, “Desire,” ఎన్‌సైన్ లేక Liahona, మే 2011, 42–45 కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 6:7, 13.నిత్య జీవములో నిజమైన “ఐశ్వర్యములు” ఉన్నాయని అర్థం చేసుకోవడానికి మీ కుటుంబానికి మీరు ఎలా సహాయపడగలరు? (7వ వచనము). నకిలీ నోట్లను తయారుచేసి, వాటిపై పునఃస్థాపించబడిన సువార్త కారణంగా మీ కుటుంబానికి లభించిన అనేక ఆశీర్వాదాలలో కొన్నింటిని వ్రాయమని లేదా బొమ్మలు గీయమని కుటుంబ సభ్యులను మీరు ఆహ్వానించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 6:15, 22–23; 8:2–3; 9:7–9.దేవుడు తన పిల్లలతో ఎలా మాట్లాడునో వివరించే ఈ వచనాలను చదవడం ఆయన మీతో ఎలా మాట్లాడారో మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం కావచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 6:33–37.భయపడుచున్నప్పుడు కూడా వారు “మంచి చేయగల” మార్గాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. ఎల్డర్ రొనాల్డ్ ఏ. రాస్బాండ్ సందేశము, “కలవరపడకుము” (ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2018, 18–21) లో అన్ని లేదా కొన్నింటిని వీక్షించడం కూడా మీకు సహాయపడగలదు. “ప్రతి తలంపులో [క్రీస్తు] వైపు చూడుడి” అంటే అర్థం ఏమిటి? (36వ వచనము). సందేహాన్ని, భయాన్ని అధిగమించడానికి ప్రభువు వైపు తిరిగిన వ్యక్తులకు మరికొన్ని ఉదాహరణలేవి? (ఉదాహరణకు, ఎస్తేరు 4; ఆల్మా 26: 23–31 చూడండి).

సిద్ధాంతము మరియు నిబంధనలు 8:10.యేసు క్రీస్తుపై విశ్వాసం మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఎలా బలోపేతం చేసిందో పంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం కాగలదు. మనం “విశ్వాసంతో అడగడం” ఎందుకు ముఖ్యం? విశ్వాసంతో సమాధానాలు లేదా సహాయం కోరడం నుండి మీరు ఏ ఆశీర్వాదాలను చూశారు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Dare to Do Right,” Children’s Songbook, 158.

పునఃస్థాపన యొక్క స్వరముల చిహ్నము

పునఃస్థాపన యొక్క స్వరములు

మోర్మన్ గ్రంథము యొక్క అనువాదము

1829 ఏప్రిల్‌లో, సిద్ధాంతం మరియు నిబంధనలు 6–9 ప్రకరణములు పొందిన నెలలో, జోసెఫ్ స్మిత్ యొక్క ప్రధానమైన పని మోర్మన్ గ్రంథమును అనువదించడం. ఈ గ్రంథము ఎలా అనువదించబడిందో వివరించమని తరువాత అడుగబడినప్పుడు, “ప్రపంచానికి అన్ని వివరాలను తెలియజేయడానికి ఉద్దేశించబడలేదని” జోసెఫ్ చెప్పెను. 1 ఇది “దేవుని శక్తి మరియు బహుమానము చేత” అనువదించబడెనని అతడు తరచుగా చెప్పెను.2

అద్భుతమైన అనువాద ప్రక్రియ గురించి మనకు చాలా వివరాలు తెలియవు, కాని దేవుడు తయారుచేసిన పరికరాలైన యూరీము తుమ్మీము అని పిలువబడే రెండు పారదర్శక రాళ్ళు మరియు దీర్ఘదర్శి రాయి అని పిలువబడే మరొక రాయి సహాయము పొందిన జోసెఫ్ స్మిత్ ఒక దీర్ఘదర్శి అని మనకు తెలుసు.3

ప్రత్యక్ష సాక్షుల నుండి అనువాద ప్రక్రియ వరకు క్రింది ప్రకటనలు జోసెఫ్ సాక్ష్యమునకు మద్దతునిస్తున్నాయి.

బంగారు పలకలను కలిగి ఉన్న హైరం స్మిత్ యొక్క చెక్క పెట్టె

హైరం స్మిత్‌కు చెందిన ఈ పెట్టె బంగారు పలకలను తాత్కాలికంగా దాచడానికి ఉపయోగించినట్లు భావిస్తున్నారు.

ఎమ్మా స్మిత్

ఎమ్మా స్మిత్

“నా భర్త మోర్మన్ గ్రంథమును అనువదిస్తున్నప్పుడు, నేను దానిలో కొంత భాగాన్ని వ్రాసాను, ఆయన ప్రతి వాక్యాన్ని, మాటకు మాట చెప్పి వ్రాయిస్తున్నప్పుడు మరియు ఆయన పలుకలేని పేర్లు లేదా పొడవైన పదాలు వచ్చినప్పుడు ఆయన ఆ పదాల యొక్క అక్షరాలను చెప్పేవారు, నేను వాటిని వ్రాస్తున్నప్పుడు, నేను అక్షరాలు వ్రాయుటలో ఏదైనా పొరపాటు చేస్తే, ఆ సమయంలో నేను వాటిని ఎలా వ్రాస్తున్నానో చూడడం ఆయనకు అసాధ్యమైనప్పటికి ఆయన నన్ను ఆపి ఆ అక్షరములను సరిచేసేవారు. శరయ అనే పదాన్ని కూడా ఆయన మొదట ఉచ్ఛరించలేకపోయారు, కానీ ఆ పదము యొక్క అక్షరాలు ఆయన పలుకవలసి వచ్చింది మరియు నేను ఆయన కొరకు ఆ పదాన్ని ఉచ్ఛరించాను.”4

“పలకలను మరుగుపరచుటకు ఎటువంటి ప్రయత్నము చేయబడకుండా తరచు అవి బల్లపైన నేను ఆయనకు ఇచ్చిన చిన్న నారవస్త్రముతో చుట్టబడి ఉండేవి. ఒకసారి నేను పలకలు బల్లపై ఉండగా, వాటి రూపురేఖలు మరియు ఆకారాన్ని గుర్తించాను. అవి మందపాటి కాగితం వలె తేలికైనవిగా అనిపించాయి మరియు ఒక పుస్తకం యొక్క అంచులను బొటనవేలుతో కదిలించినప్పుడు కలిగే ధ్వనివలె ఆ పలకలు లోహపు ధ్వనితో సందడి చేస్తాయి. …

“నా నమ్మకం ఏమిటంటే, మోర్మన్ గ్రంథము దైవిక ప్రామాణికత కలిగి ఉంది—దాని గురించి నాకు కొంచెమైనా సందేహం లేదు. ప్రేరేపించబడితే తప్ప ఆ వ్రాతప్రతులను రచనను ఎవరూ చెప్పి వ్రాయించలేరని నేను సంతృప్తి చెందుతున్నాను; ఎందుకంటే, తన లేఖకురాలిగా వ్యవహరించేటప్పుడు, [జోసెఫ్] గంటల తరబడి నాకు చెప్పి వ్రాయించేవారు; మరియు భోజనం తర్వాత లేదా అంతరాయాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు, ఆయన ఆ వ్రాతప్రతులను చూడకుండా లేదా దానిలో కొంత భాగాన్ని చదివి వినిపించకుండానే, ఆయన విడిచిపెట్టిన చోటనే ప్రారంభించేవారు. ఇది ఆయనకు ఒక సాధారణ విషయం. ఒక పండితుడు దీన్ని చేయడం సాధ్యము కాకపోవచ్చు; ఆయన వలె జ్ఞానం, పాండిత్యం లేని వ్యక్తికి ఇది ఖచ్చితంగా అసాధ్యమే.”5

అనువాదంలో సహాయం చేస్తున్న ఎమ్మా స్మిత్

మైఖేల్ టి. మామ్ చేత ఎమ్మా మరియు జోసెఫ్ స్మిత్ యొక్క దృష్టాంతము

ఆలీవర్ కౌడరీ

ఆలీవర్ కౌడరీ

“దేవుని బహుమానము మరియు శక్తి ద్వారా, యూరీము తుమ్మీము ద్వారా లేదా పరిశుద్ధ అనువాదక సాధనములని ఆ గ్రంథముచే పిలువబడిన వాటి చేత ప్రవక్త అనువదించగా అది ప్రవక్త యొక్క నోటినుండి జారిపడినట్లుగా నా కలముతో (కొన్ని పేజీలు తప్ప మిగిలినవన్ని) మోర్మన్ గ్రంథమును నేను వ్రాసాను. అది అనువదించబడిన ఆ బంగారు పలకలను నేను నా కళ్ళతో చూశాను మరియు నా చేతులతో పట్టుకున్నాను. అనువాదక సాధనములను కూడా నేను చూసాను.”6

వివరణలు

  1. Minutes, 25–26 October 1831,” Minute Book 2, 13, josephsmithpapers.org.

  2. “Church History,” Times and Seasons, Mar. 1, 1842, 707; Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 441 కూడా చూడండి.

  3. మరింత సమాచారము కొరకు “Book of Mormon Translation,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org; Richard E. Turley Jr., Robin S. Jensen, and Mark Ashurst-McGee, “Joseph the Seer,” Ensign, Oct. 2015, 48–55 చూడండి.

  4. Edmund C. Briggs, “A Visit to Nauvoo in 1856,” Journal of History, vol. 9, no. 4 (Oct. 1916), 454; quoted in Russell M. Nelson, “A Treasured Testament,” Ensign, July 1993, 62.

  5. “Last Testimony of Sister Emma,” Saints’ Herald, Oct. 1, 1879, 290; వర్ణక్రమము ఆధునీకరించబడింది.

  6. Reuben Miller Journal, Oct. 21, 1848, Church History Library, Salt Lake City; వర్ణక్రమము, విరామచిహ్నాలు మరియు క్యాపిటలైజేషన్ ఆధునీకరించబడ్డాయి.

బంగారు పలకలను అనువదిస్తున్న జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీలు

జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీలు బంగారు పలకలను అనువదించే ప్రక్రియ ద్వారా చాలా నేర్చుకున్నారు.