2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
ఫిబ్రవరి 1–7. సిద్ధాంతము మరియు నిబంధనలు 10–11: “నీవు అజేయుడవగునట్లు”


“ఫిబ్రవరి 1–7. సిద్ధాంతము మరియు నిబంధనలు 10–11: ‘నీవు అజేయుడవగునట్లు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“ఫిబ్రవరి 1–7. సిద్ధాంతము మరియు నిబంధనలు 10–11,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
మోర్మన్ గ్రంథపు వ్రాతప్రతులు

అసలైన మోర్మన్ గ్రంథపు వ్రాతప్రతుల నకలు.

ఫిబ్రవరి 1–7

సిద్ధాంతము మరియు నిబంధనలు 10–11

“నీవు అజేయుడవగునట్లు”

లేఖనాలు చదువుతున్నప్పుడు మనోభావాలను నమోదు చేయడమనేది విత్తనాలు నాటడం వంటిది; సూక్ష్మమైన మనోభావాలు కూడా అర్థవంతమైన వ్యక్తిగత బయల్పాటుకు దారితీయవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

మోర్మన్ గ్రంథపు అనువాదము ముందుకు సాగినప్పుడు, సహజంగానే ఒక ప్రశ్న తలెత్తింది: కోల్పోబడిన అనువాద పేజీల గురించి జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీ ఏమి చేయాలి? న్యాయంగా అయితే వెనుకకు వెళ్ళి మరలా ఆ భాగాన్ని అనువదించాలి, కానీ వారు చూడలేని దానిని ప్రభువు చూడగలరు—దుష్టులు జోసెఫ్ యొక్క ప్రేరేపిత కార్యముపై సందేహం కలుగజేయడానికి ఆ పేజీలలోని పదాలను మార్చడానికి కుట్రపన్నుతున్నారు. సాతాను ప్రయత్నాలను అడ్డుకోవడానికి మరియు కోల్పోబడిన దానిని భర్తీచేయడానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగియున్నాడు. వేల సంవత్సరాల క్రితం అదే నియమిత కాలాన్ని వివరించే రెండవ గ్రంథాన్ని తయారు చేయాలని ప్రవక్త నీఫై ప్రేరేపించబడినప్పుడే ఈ ప్రణాళిక ఆరంభమైంది. తరువాత ప్రభువుకే తెలిసిన “ఒక తెలివైన ఉద్దేశము నిమిత్తము” ఈ గ్రంథమును మోర్మన్ గ్రంథములో చేర్చడానికి మోర్మన్ ప్రేరేపించబడ్డాడు (మోర్మన్ వాక్యములు 1:3–7 చూడండి).

“అపవాది యొక్క కుయుక్తి కంటే నా జ్ఞానము గొప్పదని,” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 10:43) ప్రభువు జోసెఫ్‌తో చెప్పారు. విశ్వాసాన్ని బలహీనపరచడానికి విరోధి యొక్క ప్రయత్నాలు తీవ్రమవుతున్న మన కాలంలో అభయమిచ్చు సందేశమది. మనము చేయాలని దేవుడు పిలిచిన కార్యములో జోసెఫ్ వలె మనము “నమ్మకముగా ఉండి, కొనసాగగలము” (3వ వచనము). మన యెదుట “నరకపు ద్వారములు నిలువజాలకుండా” ఇదివరకే ఆయన మార్గమును ఏర్పరిచారని అప్పుడు మనము కనుగొంటాము (69వ వచనము).

Saints, 1:51–61 చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 10:1–33

దేవుని కార్యమును నాశనము చేయాలని సాతాను కోరును.

అతని ఉనికిని మనము మరచిపోవాలని లేదా కనీసం మనల్ని ప్రభావితం చేసే అతని ప్రయత్నాలను గుర్తించడంలో మనం విఫలమవ్వాలని సాతాను కోరుకుంటాడు (2 నీఫై 28:22–23 చూడండి). కానీ సాతాను దేవుని కార్యాన్ని నిరంతరము క్రియాశీలకంగా వ్యతిరేకిస్తాడని సిద్ధాంతము మరియు నిబంధనలు 10 లో ప్రభువు యొక్క మాటలు బయల్పరుస్తాయి. 1–33 వచనాలు మీరు చదువుతున్నప్పుడు, జోసెఫ్ స్మిత్ కాలంలో దేవుని కార్యాన్ని నాశనం చేయడానికి సాతాను ఎలా ప్రయత్నించాడో గుర్తించండి (62–63 వచనాలు కూడా చూడండి). నేడు సాతాను పనిచేసే విధానాలలో ఎటువంటి పోలికలను మీరు చూస్తారు? సాతాను మిమ్మల్ని ఏవిధంగా శోధిస్తాడో చూడగలుగుటకు మీకు సహాయపడమని మీరు ప్రభువును అడగవచ్చు. సాతాను ప్రయత్నాలను నిరోధించడంలో మీకు సహాయపడేలా 10వ ప్రకరణము నుండి మీరేమి నేర్చుకుంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 10:34–52

“అపవాది యొక్క కుయుక్తి కంటే ప్రభువు యొక్క జ్ఞానము గొప్పది.”

2400ల కంటే ఎక్కువ సంవత్సరాలకు ముందే మోర్మన్ గ్రంథము నుండి కోల్పోబడిన పేజీలను భర్తీచేయడానికి ప్రభువు సిద్ధంచేసారు (1 నీఫై 9 చూడండి). సిద్ధాంతము మరియు నిబంధనలు 10:34–52 నుండి ప్రభువు గురించి మీరేమి నేర్చుకుంటారు? ప్రభువు యొక్క జ్ఞానము మరియు దివ్యదృష్టికి ఏ సాక్ష్యాన్ని మీరు మీ జీవితంలో చూసారు?

కోల్పోబడిన వ్రాతప్రతులను భర్తీచేయడానికి దేవుడు సిద్ధపరచిన గ్రంథాన్ని ఇప్పుడు 1 నీఫై నుండి ఓంనై వరకు కనుగొనవచ్చు. ఈ గ్రంథములోనున్న కథలు, బోధనలు ఏవిధంగా మీకు “సువార్తను గూర్చి అధిక గ్రహింపును (ఇచ్చాయి)”? (సిద్ధాంతము మరియు నిబంధనలు 10:45).

చిత్రం
బంగారు పలకలను సంక్షిప్తపరుస్తున్న మోర్మన్

పలకలను సంక్షిప్తపరుస్తున్న మోర్మన్, టామ్ లోవెల్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 11

నేను దేవుడిని అడిగినట్లయితే, నేను పొందుతాను.

జోసెఫ్ స్మిత్ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు అనేకమంది వారి యెడల ప్రభువు చిత్తమేమిటో తెలుసుకోమని అతడిని అడిగారు. దానిని చేయడానికి జోసెఫ్ సంతోషించాడు, కానీ వారికి వ్యక్తిగత బయల్పాటునివ్వడానికి కూడా ప్రభువు సమ్మతించారు. అతని అన్న హైరం కొరకు జోసెఫ్ పొందిన బయల్పాటు అయిన సిద్ధాంతము మరియు నిబంధనలు 11 లో ప్రభువు ఇలా చెప్పారు, “నా ఆత్మను నీకిచ్చెదను, … నా నుండి నీవు కోరు సంగతులన్నియు అప్పుడు నీవు తెలుసుకొందువు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 11:13–14).

ఆయన మాటలు “మంచి కోరికలు కలిగి, తమ కొడవలితో కోతకోయు వారందరి” కొరకైనవి (27వ వచనము) అని ప్రభువు చెప్పారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 11 లో వ్యక్తిగత బయల్పాటు గురించి, దేవుని కార్యములో పాల్గొనుట గురించి మీకేమి చెప్పాలని ప్రభువు ప్రయత్నిస్తున్నారు? మీ కొరకు ఆయన కలిగియున్న ఇతర సందేశాలేవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 11:15–26

“(దేవుని) వాక్యాన్ని పొందడానికి” నేను వెదకినప్పుడు ఆయన ఆత్మను, శక్తిని నేను పొందుతాను.

మోర్మన్ గ్రంథము అనువదించబడడానికి ముందే సువార్తను ప్రకటించడానికి హైరం స్మిత్ ఆతృతగా ఉండెను. అతని కోరికల పట్ల ప్రభువు యొక్క స్పందనను మీరు చదువుతున్నప్పుడు, మీ దృష్టిలో “(దేవుని) వాక్యాన్ని పొందడం” (21వ వచనము) అనగా అర్థమేమిటో పరిగణించండి. దేవుని వాక్యాన్ని పొందడం సంఘములో సేవచేయడానికి మీకెలా సహాయపడుతుంది? దేవుని శక్తిని అది మీ జీవితంలోకి ఎలా తెస్తుంది?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 10:5.ప్రార్థన యొక్క శక్తి గురించి ఈ వచనము నుండి మనము ఏమి నేర్చుకుంటాము? ఎలా మనము “ఎల్లప్పుడు ప్రార్థిస్తాము”? (కొన్ని ఉపాయాల కొరకు, డేవిడ్ ఎ. బెడ్నార్, “Pray Always,” ఎన్‌సైన్ లేక Liahona, నవ. 2008, 41–44 చూడండి.)

సిద్ధాంతము మరియు నిబంధనలు 10:38–46.మోర్మన్ గ్రంథ అనువాదము నుండి కోల్పోబడిన పేజీలను ప్రభువు ఏవిధంగా భర్తీచేసారో చర్చించడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, బహుశా కుటుంబ సభ్యులు ఇటీవల వారు కోల్పోయిన దాని గురించి మాట్లాడవచ్చు. అది కోల్పోబడిందని వారు కనుగొనినప్పుడు వారెలా భావించారు? అది కనుగొనబడినప్పుడు వారెలా భావించారు? మోర్మన్ గ్రంథము నుండి కోల్పోబడిన పేజీలు ఎన్నడూ కనుగొనబడనప్పటికీ, సిద్ధాంతము మరియు నిబంధనలు 10:38–46 ప్రకారము ప్రభువు వాటిని ఎలా భర్తీ చేసారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 10:55–70.“నేను” లేక “నేను చేయుదును” అని పూర్తయ్యే వాక్యభాగాలను కనుగొనమని లేక గుర్తించమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. యేసు క్రీస్తు ఎవరు మరియు ఆయన ఎలాంటి వారు అనేదాని గురించి “నేను” అనే వాక్యభాగాల నుండి మనమేమి నేర్చుకుంటాము? ఆయన ఏమి చేస్తారనే దాని గురించి “నేను చేయుదును” అనే వాక్యభాగాల నుండి మనమేమి నేర్చుకుంటాము? యేసు క్రీస్తు యందు వారి విశ్వాసాన్ని ఈ సత్యాలు ఎలా బలపరుస్తాయో పంచుకోమని కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–14.ఆత్మ వారికి ఎప్పుడు తెలియజేస్తున్నదో గుర్తించడానికి ఈ వచనాలను చదవడం మీ కుటుంబ సభ్యులకు సహాయపడగలదు. మీరు నేలమీద ఒక ఫ్లాష్‌లైటును వేసి, ఆ లైటు కాంతిని బట్టి కదలమని ఒక కుటుంబ సభ్యుడిని ఆహ్వానించవచ్చు. ఇది పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరించడాన్ని ఏవిధంగా పోలియున్నది? మీరు ఏ వ్యక్తిగత అనుభవాలను పంచుకోగలరు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 11:15–30.సువార్తను పంచుకోవడానికి అతడు సిద్ధంగా ఉండేందుకు హైరం స్మిత్ ఏమి చేయాలని ప్రభువు చెప్పారో ఆ విషయాలను జాబితా చేయడాన్ని పరిగణించండి. మన కుటుంబమంతా కలిసి దేనిపై పనిచేయాలి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు” చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

లేఖనాలను మీ జీవితానికి అన్వయించుకోండి. ఒక లేఖన భాగాన్ని చదివిన తరువాత, ఆ భాగం వారి జీవితాలకు వర్తించే మార్గాలను పంచుకోమని కుటుంబ సభ్యులను అడగండి. ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–13 లో వర్ణించబడిన విధానాలలో ఆత్మ వారిని ఏవిధంగా ప్రభావితం చేసిందో వారు పంచుకోవచ్చు.

చిత్రం
జోసెఫ్ మరియు హైరం స్మిత్

జోసెఫ్ మరియు హైరం స్మిత్, కెన్ కార్బెట్ చేత

ముద్రించు