2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
ఫిబ్రవరి 22–28. సిద్ధాంతము మరియు నిబంధనలు 18–19: “ఆత్మల విలువ గొప్పది”


“ఫిబ్రవరి 22–28. సిద్ధాంతము మరియు నిబంధనలు 18–19: ‘ఆత్మల విలువ గొప్పది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“ఫిబ్రవరి 22–28. సిద్ధాంతము మరియు నిబంధనలు 18–19,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
మార్టిన్ హారిస్ పొలము

మార్టిన్ హారిస్ పొలము, ఆల్ రౌండ్స్ చేత

ఫిబ్రవరి 22–28

సిద్ధాంతము మరియు నిబంధనలు 18–19

“ఆత్మల విలువ గొప్పది”

సిద్ధాంతము మరియు నిబంధనలు లోని బయల్పాటులు సుమారు 200 సంవత్సరాల క్రితం ఉన్న ప్రత్యేక పరిస్థితులకు జవాబుగా ఇవ్వబడ్డాయి, కానీ అవి బోధించే సూత్రాలు నిత్యమైనవి. మీరు చదువుతున్నప్పుడు ఈ సూత్రాల కొరకు చూడండి మరియు అవి మీకు ఎలా అన్వయించబడతాయో పరిగణించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మార్టిన్ మరియు లూసీ హారిస్‌లు పాల్మైరా, న్యూయార్క్‌లో ఉత్తమమైన పొలాలలో ఒకదానిని కలిగియున్నారు. దానిని సంపాదించడానికి వారికి అనేక సంవత్సరాలు పట్టింది, అది వారికి ఒక కుటుంబాన్ని పెంచే సామర్థాన్నిచ్చింది మరియు సమాజంలో వారికి మంచి స్థానం కల్పించింది. కానీ ముద్రించువానికి చెల్లించడానికి మార్టిన్ తన పొలాన్ని తాకట్టు పెడితేనే మోర్మన్ గ్రంథము ప్రచురించబడగలదని 1829లో స్పష్టమైంది. మోర్మన్ గ్రంథము గురించి మార్టిన్ సాక్ష్యాన్ని కలిగియున్నాడు, కానీ లూసీ సాక్ష్యం కలిగిలేదు. మార్టిన్ తాకట్టుపెట్టిన తర్వాత మోర్మన్ గ్రంథము సరిగ్గా అమ్ముడుపోకపోతే అతడు తన పొలాన్ని కోల్పోతాడు మరియు తన వివాహాన్ని చిక్కుల్లో పెట్టుకుంటాడు. నా దృష్టిలో యేసు క్రీస్తు సువార్తకున్న విలువేమిటి? అని మార్టిన్ ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్నలను ఏదో ఒక సమయంలో మనమందరం ఎదుర్కొంటాము. దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి సహాయపడేందుకు ఏ త్యాగానికి నేను సిద్ధంగా ఉన్నాను? దేవుని పిల్లలను దీవించడానికి “అందరికంటే గొప్పవాడైన” యేసు క్రీస్తు కంటే అధికవెల చెల్లించిన వారు ఎవ్వరూ లేరని గుర్తుంచుకోవడానికి ఇది మనకు సహాయపడగలదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18).

తన పొలాన్ని తాకట్టుపెట్టాలని మార్టిన్ నిర్ణయించుకున్నాడు. అతని త్యాగము మోర్మన్ గ్రంథము యొక్క మొదటి 5000 ప్రతులు ముద్రించడానికి వెల చెల్లించింది. ఇప్పుడు 190 మిలియన్లకు పైగా ప్రతులు ముద్రించబడిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది దీవించబడ్డారు.

మోర్మన్ గ్రంథము యొక్క ప్రచురణ గురించి మరింత సమాచారం కొరకు Saints, 1:76–84 చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–16

మనము పశ్చాత్తాపపడినప్పుడు ప్రభువు ఆనందించును.

పశ్చాత్తాపపడు మరియు పశ్చాత్తాపము అను పదాలు సిద్ధాంతము మరియు నిబంధనలు18 మరియు 19 అంతటా ఎంత తరచుగా ఉపయోగించబడ్డాయో గమనించండి మరియు అవి ఉపయోగించబడిన ప్రతిసారీ ఈ పదాల నుండి మీరు నేర్చుకొనేదానిని ధ్యానించండి. ప్రత్యేకించి సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–16 పరిగణించండి; పశ్చాత్తాపము—మీ స్వంత పశ్చాత్తాపము మరియు ఇతరులను పశ్చాత్తాపపడమని ఆహ్వానించు బాధ్యత గురించి మీరు భావించేదానిని ఈ వచనాలు ఎలా ప్రభావితం చేస్తాయి?

ఆల్మా 36:18–21; డేల్ జి. రెన్లండ్, “పశ్చాత్తాపము: ఒక ఆనందకరమైన ఎంపిక,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2016, 121–24 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:34–36

సిద్ధాంతము మరియు నిబంధనలులో నేను ప్రభువు యొక్క స్వరమును వినగలను.

ప్రభువు యొక్క స్వరము ఎలా ఉంటుందని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేమి చెప్తారు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 18:34–36 చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు చదువుట ద్వారా ప్రభువు యొక్క స్వరము గురించి మీరేమి నేర్చుకున్నారు? ఆయన స్వరమును మరింత స్పష్టముగా వినడానికి మీరేమి చేయగలరు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 19:15–20

యేసు క్రీస్తు బాధననుభవించినందు వలన నేను పశ్చాత్తాపపడి, ఆయన యొద్దకు రాగలను.

గెత్సేమనేలో రక్షకుడు అనుభవించిన బాధ గురించి దానిని గమనించిన వారి దృష్టికోణం నుండి క్రొత్త నిబంధన వివరిస్తుంది. సిద్ధాంతము మరియు నిబంధనలు 19:15–20 లో యేసు క్రీస్తు తన బాధ గురించి తన స్వంత మాటలలో చెప్పారు. ఈ పరిశుద్ధ, వ్యక్తిగత వృత్తాంతాన్ని మీరు చదువుతున్నప్పుడు, రక్షకుని బాధను వర్ణించే పదాలు, వాక్యభాగాల కొరకు చూడండి. ప్రతి పదము లేక వాక్యభాగము మీకు బోధించేదానిని పరిగణించండి. రక్షకుడు బాధను అనుభవించడానికి ఎందుకు సమ్మతించారు? యేసు క్రీస్తు మరియు మీ కొరకు ఆయన త్యాగము గురించి మీ భావాలను నమోదు చేయడాన్ని పరిగణించండి.

యోహాను 15:13; మోషైయ 3:7; ఆల్మా 7:11–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13 చూడండి.

చిత్రం
చిన్న బిడ్డను ఎత్తుకొనిన యేసు

ఆత్మ యొక్క విలువ, లిజ్ లెమన్ స్విండిల్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 19:26–27, 34–41

భూలోక నిధుల కంటే దేవుని దీవెనలు గొప్పవి.

మోర్మన్ గ్రంథము పాల్మైరాలో ఎక్కువగా అమ్ముడుపోలేదు, దాని ఫలితంగా అప్పు చెల్లించడానికి మార్టిన్ హారిస్ తన పొలంలో పెద్ద భాగాన్ని అమ్మివేయవలసి వచ్చింది (“The Contributions of Martin Harris,” Revelations in Context, 7–8 చూడండి). మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు ఆ త్యాగమును, దాని మూలంగా మీరు పొందిన దీవెనలను ధ్యానించండి. మీరు త్యాగం చేయాలని ప్రభువు అడిగిన దాని గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. “సంతోషంగా” మరియు “ఆనందంగా” మీరు ఈ త్యాగాలను చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా ఈ వచనాలలో మీరేమి కనుగొన్నారు? (15–20 వచనాలు కూడా చూడండి).

సిద్ధాంతము మరియు నిబంధనలు 19:23

యేసు క్రీస్తు గురించి నేర్చుకొని, ఆయనను అనుసరించడం ద్వారా సమాధానము కలుగుతుంది.

“నన్ను గూర్చి నేర్చుకొనుము” అనే రక్షకుని ఆహ్వానాన్ని పరిగణించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 19 లో యేసు క్రీస్తు గురించి మీరేమి నేర్చుకుంటారు? మీ ఆలోచనలను నమోదు చేయండి మరియు సమాధానాన్ని కనుగొనడానికి రక్షకుని గురించిన ఈ సత్యాలు మీకేవిధంగా సహాయపడతాయో ధ్యానించండి. మీ దృష్టిలో “(ఆయన) ఆత్మ యొక్క దీనత్వమందు నడుచుట” అనగా అర్థమేమిటి?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:1–5.ఆయన ఆలీవర్ కౌడరీకి చేసినట్లుగా, లేఖనములు నిజమైనవని ఆత్మ వారికి ప్రత్యక్షపరచిన “అనేక ఉదాహరణలలో” (2వ వచనము) కొన్నింటిని కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. మీ కుటుంబము ఏవిధంగా లేఖనాలలో “వ్రాయబడిన విషయాలపై ఆధారపడగలదు” (3వ వచనము)? సువార్త యొక్క “బండ” (4వ వచనము) పైన మీ కుటుంబపు పునాదిని మీరెట్లు నిర్మించగలరు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13; 19:16–19.ప్రతి కుటుంబ సభ్యుడు సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13 చదివి, “ఆత్మ,” “ఆత్మలు” మరియు “జనులందరు” అనే పదాల స్థానంలో అతని లేక ఆమె పేరును ప్రత్యామ్నాయంగా ఉంచవచ్చు. ఆ తర్వాత, తండ్రికి మరియు కుమారునికి మనమెంత విలువైనవారమో అర్థం చేసుకోవడానికి ఈ వచనాలు మనకెలా సహాయపడతాయో మీరు చర్చించవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:16–19 చూడండి).

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:21–25.మీ కుటుంబ సభ్యుల పేర్లకు ఏదైనా ప్రత్యేక అర్థమున్నదా? పేర్లు ఎందుకు ముఖ్యమైనవి మరియు యేసు క్రీస్తు నామమును మనపై తీసుకోవడమనగా అర్థమేమిటని మీరు మాట్లాడవచ్చు (మోషైయ 5:7 చూడండి). మీ కుటుంబ సభ్యులు బాప్తీస్మము తీసుకున్నప్పుడు క్రీస్తు నామమును వారిపై తీసుకోవడానికి వారు సిద్ధపడడానికి సహాయపడేందుకు ఇది మీకొక మంచి అవకాశము కాగలదు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 19:15–20.ఈ వచనాలతో ఒక అర్థవంతమైన అనుభవాన్ని కలిగియుండేందుకు మీ కుటుంబానికి సహాయపడడానికి బహుశా యేసు క్రీస్తు చిత్రాన్ని (ఈ సారాంశముతో ఒకటి ఇవ్వబడినది) ప్రదర్శిస్తూ మీరు వాటిని చదువవచ్చు. తర్వాత కుటుంబ సభ్యులు రక్షకుని గురించి వారి భావాలను పంచుకోవచ్చు. రక్షకుని గురించి ఇష్టమైన ఒక కీర్తన కూడా ఆత్మను ఆహ్వానించగలదు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “I Stand All Amazed,” Hymns, . 193.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ప్రశ్నలు అడగండి. ప్రశ్నలు బయల్పాటుకు దారితీస్తాయనడానికి సిద్ధాంతము మరియు నిబంధనలే సాక్ష్యము. మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, మీకు వచ్చే ప్రశ్నలను నమోదు చేయండి. తర్వాత ధ్యానించండి మరియు జవాబుల కోసం ప్రార్థించండి.

చిత్రం
గెత్సేమనే తోటలో క్రీస్తు ప్రార్థించుట

గెత్సేమనే తోటలో క్రీస్తు ప్రార్థించుట, హెర్మన్ క్లెమెంట్జ్ చేత

ముద్రించు