2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
మార్చి 1–7. సిద్ధాంతము మరియు నిబంధనలు 20–22: “క్రీస్తు సంఘము ఉద్భవించుట”


“మార్చి 1–7. సిద్ధాంతము మరియు నిబంధనలు 20–22: ‘క్రీస్తు సంఘము ఉద్భవించుట,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“మార్చి 1–7. సిద్ధాంతము మరియు నిబంధనలు 20–22,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
పీటర్ విట్మర్ గృహము

పీటర్ విట్మర్ గృహము, ఆల్ రౌండ్స్ చేత

మార్చి 1–7

సిద్ధాంతము మరియు నిబంధనలు 20–22

”క్రీస్తు సంఘము ఉద్భవించుట“

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 20–22 చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ తలంపులను పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు మరలా వాటిని చూడగలుగునట్లు వాటిని నమోదు చేయడాన్ని పరిగణించండి

మీ మనోభావాలను నమోదు చేయండి

ప్రవక్త జోసెఫ్ స్మిత్ చేస్తున్న మోర్మన్ గ్రంథము యొక్క అనువాద కార్యము ఇప్పుడు పూర్తయ్యింది. కానీ పునఃస్థాపన కార్యము ఇప్పుడే మొదలైంది. సిద్ధాంతమును, యాజకత్వ అధికారమును పునఃస్థాపించుటకు అదనముగా ప్రభువు ఒక క్రమబద్ధమైన సంస్థను, అనగా ఆయన సంఘమును పునఃస్థాపించాలని కోరెనని ఇంతకుముందున్న బయల్పాటుల నుండి స్పష్టమవుతుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 10:53; 18:5 చూడండి). కావున 1830, ఏప్రిల్ 6వ తేదీన యేసు క్రీస్తు సంఘము యొక్క ఏర్పాటును చూడడానికి ఫేయెట్, న్యూయార్క్ లోని విట్మర్ కుటుంబము యొక్క కలప గృహములో 40 కంటే ఎక్కువమంది విశ్వాసులు సమకూడారు.

క్రమబద్ధమైన సంఘము యొక్క అవసరమేమిటి? అని ఇంకను కొందరు ఆశ్చర్యపడ్డారు. 1830లో జరిగిన ఆ మొదటి సంఘ సమావేశానికి సంబంధించిన బయల్పాటులలో కొంతవరకు జవాబు కనుగొనబడవచ్చు. కడవరి దినాలలో యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘము “క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడి, స్థాపించబడకపోయినట్లయితే”, ఇక్కడ వివరించబడిన దీవెనలు సాధ్యమయ్యేవి కావు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:1).

పరిశుద్ధులు, 1:84–86; “Build Up My Church,” Revelations in Context, 29–32 కూడా చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:1–36

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము నిజమైన సిద్ధాంతంపై కనుగొనబడుతుంది.

20వ ప్రకరణము “సంఘ ఏర్పాటు మరియు ప్రభుత్వమును గూర్చిన బయల్పాటుగా” పరిచయం చేయబడింది (ప్రకరణ శీర్షిక). కానీ సంఘ విధానాలు, యాజకత్వ స్థానాలు మరియు విధులను నిర్వర్తించే పద్ధతులను వివరించడానికి ముందు ప్రధాన సిద్ధాంతాన్ని బోధించడంతో ఈ బయల్పాటు మొదలవుతుంది. ఈ బయల్పాటు యొక్క మొదటి 36 వచనాలను మీరు చదివినప్పుడు, అవి ఎందుకు అలా ఉన్నవో ధ్యానించండి. మీరు కనుగొనే సువార్త సత్యాలను మీరు జాబితా చేయవచ్చు కూడా. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి:

సంఘము స్థాపించబడుతున్నప్పుడు ఈ సత్యాలను నొక్కిచెప్పడం ఎందుకు ముఖ్యము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37, 75–79

పరిశుద్ధ విధులు, పునఃస్థాపించబడిన సంఘము యొక్క ఆవశ్యకమైన భాగము.

సంఘము ఏర్పాటు చేయబడినప్పుడు, బాప్తీస్మము మరియు సంస్కారముతో పాటు పరిశుద్ధ విధులను గురించి ప్రభువు తన పరిశుద్ధులకు బోధించారు. 37వ వచము లో “బాప్తీస్మ విధానమును గూర్చి” సూచనలను మీరు చదివినప్పుడు, మీ స్వంత బాప్తీస్మము గురించి ఆలోచించండి. ఈ వచనంలో వివరించబడిన భావనలేవైనా మీరు కలిగియున్నారా? వాటిని మీరిప్పుడు కలిగియున్నారా? “అంతమువరకు (యేసు క్రీస్తు) ను సేవించాలనే దృఢసంకల్పాన్ని” బలంగా ఉంచుకోవడానికి మీరేమి చేయగలరో ధ్యానించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:75–79 లో సంస్కారము గురించి మీరు చదివినప్పుడు, ఒకరు మొదటిసారి వాటిని వింటున్నారనే దృష్టితో ఈ పరిశుద్ధ ప్రార్థనలను చదవడానికి ప్రయత్నించండి. సంస్కారము గురించి, మీ గురించి ఎటువంటి అంతర్దృష్టులను మీరు పొందుతారు? ఈ వారం సంస్కారము తీసుకోవడానికి మీరు సిద్ధపడే విధానాన్ని ఈ అంతరార్థములు ఏవిధంగా ప్రభావితం చేయగలవు?

చిత్రం
పరిచారకుడు సంస్కారమును అందించుట

సంస్కారము ఒక పరిశుద్ధ విధి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:38–60

యాజకత్వ సేవ సంఘ సభ్యులను మరియు వారి కుటుంబాలను దీవిస్తుంది.

యాజకత్వము కలిగియున్న ఒకరి విధులను చెప్పమని ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే, మీరేమి చెప్తారు? సిద్ధాంతము మరియు నిబంధనలు 20:38–60 చదవండి, వివిధ యాజకత్వ స్థానాల విధులను అది జాబితా చేస్తుంది. యాజకత్వ విధులు మరియు రక్షకుడు తన కార్యాన్ని ఏవిధంగా చేస్తారనే దాని గురించి మీ ఆలోచనా విధానాన్ని ఈ వచనాలలో ఉన్నదేదైనా మార్చిందా? ఈ వచనాలలో వివరించబడిన పని చేత మీరెలా దీవించబడ్డారు?

సంఘ కార్యములో స్త్రీలు ఏవిధంగా యాజకత్వపు అధికారాన్ని అభ్యసిస్తారో తెలుసుకోవడానికి డాల్లిన్ హెచ్. ఓక్స్, “The Keys and Authority of the Priesthood,” Ensign or Liahona, మే 2014, 49–52 చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 21

యేసు క్రీస్తు యొక్క సంఘము జీవముతోనున్న ప్రవక్తచేత నడిపించబడుతుంది.

ప్రభువు ప్రవక్తల యొక్క మాటల గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 21:4–9 నుండి మీరేమి నేర్చుకుంటారు? ఆయన ప్రవక్త ద్వారా ప్రభువు యొక్క మాటలను పొందేవారి కొరకు 6వ వచనం లో వివరించబడిన వాగ్దానాలను పరిగణించండి. ఈ వాగ్దానాలపై మీ అభిప్రాయమేమిటి?

“(దేవుని) నోటినుండి వచ్చినట్లుగా” జీవముతోనున్న ప్రవక్త మాటను మీరేవిధంగా పొందగలరు? (5వ వచనము). 6వ వచనం లో వాగ్దానమివ్వబడిన దీవెనలకు నడిపించేలా నేటి ప్రవక్త ఇచ్చిన సలహా ఏమిటి?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 20.మనకు సంఘము ఎందుకు అవసరమని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనమేమి చెప్తాము? సిద్ధాంతము మరియు నిబంధనలు 20 లో మనము ఏ జవాబులను కనుగొంటాము? D. Todd Christofferson, “Abide in My Love,” Ensign or Liahona, Nov. 2015, 108-11 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:69.“ప్రభువు యెదుట పరిశుద్ధముగా (నడుచుకొనుట)” అనగా అర్థమేమిటి? పరిశుద్ధముగా నడుచుకోవడానికి వారికి సహాయపడగల కొన్ని విషయాలను లేదా ఆ విధంగా చేయడాన్ని ఆటంకపరిచే విషయాలను కాగితపు ముక్కలపై చిత్రించడం లేక వ్రాయడం కుటుంబ సభ్యులకు సరదాగా ఉండవచ్చు. అప్పుడు వారు ఆ కాగితాలను ఉపయోగించి ఒక దారిని తయారుచేసి, వారిని క్రీస్తునొద్దకు తీసుకువచ్చే చిత్రాలమీద మాత్రమే అడుగులు వేస్తూ ఆ దారిలో నడిచేందుకు ప్రయత్నించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37, 71–74.మీ కుటుంబములో ఎవరైనా ఇంకా బాప్తీస్మము తీసుకోనట్లయితే, బాప్తీస్మము కొరకు ఏవిధంగా సిద్ధపడాలి (37వ వచనము చూడండి) మరియు బాప్తీస్మములు ఏవిధంగా నిర్వహించబడతాయి (71–74 వచనాలు చూడండి) అనేదాని గురించి ఈ వచనాలు చర్చకు దారితీయగలవు. వారి బాప్తీస్మము నాటి చిత్రాలను లేక జ్ఞాపకాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:75–79.సంస్కారములో అర్థవంతమైన, భక్తిపూర్వకమైన అనుభవాల కొరకు సిద్ధపడేందుకు మీ కుటుంబము ఈ వచనాలను ఏవిధంగా ఉపయోగించగలదు? సంస్కార సమయంలో మీరు ధ్యానించగల విషయాలను ఈ వచనాలు సూచించగలవు, మరియు కుటుంబ సభ్యులు ఆ విషయాలను కనుగొనవచ్చు లేదా వాటి చిత్రాలు గీయవచ్చు. తగినట్లయితే, సంస్కార సమయంలో ఆలోచించవలసిన దానికి గుర్తుగా మీ తరువాతి సంస్కార సమావేశానికి మీరు ఆ చిత్రాలను తీసుకురావచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 21:4–7.ప్రభువు యొక్క ప్రవక్తను అనుసరించడం గురించి బోధించే పదాలు మరియు వాక్యభాగాల కొరకు 4–5 వచనాల లో చూడమని కుటుంబ సభ్యులను ఆహ్వానించడం గురించి ఆలోచించండి. సహనంతో, విశ్వాసంతో ప్రవక్త మాటలను పొందడం అనగా అర్థమేమిటి? 6వ వచనం లో వాగ్దానం చేయబడిన దీవెనలను మనమెప్పుడు పొందాము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “The Church of Jesus Christ,” Children’s Songbook, 77.

మన బోధనను మెరుగుపరచుట

రక్షకుని యొక్క జీవితమును అనుకరించుము. “బోధించుటకు మరియు ఇతరులను హెచ్చించుటకు రక్షకుని యొక్క శక్తి, ఆయన జీవన విధానము మరియు ఆయన వ్యక్తిగత స్వభావం నుండి వచ్చింది. యేసు క్రీస్తు వలె జీవించడానికి మీరు ఎంత శ్రద్దగా ప్రయత్నిస్తే అంత ఎక్కువగా మీరు ఆయన వలె బోధించగలుగుతారు” (Teaching in the Savior’s Way, 13).

చిత్రం
ఆలీవర్ కౌడరీ, జోసెఫ్ స్మిత్‌ను నిర్థారించుట

ఆలీవర్ కౌడరీ, జోసెఫ్ స్మిత్‌ను నిర్థారించును, వాల్టర్ రానె చేత

ముద్రించు