2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
మార్చి 22–28. సిద్ధాంతము మరియు నిబంధనలు 29: “యేసు క్రీస్తు తన జనులను సమకూర్చును”


“మార్చి 22–28. సిద్ధాంతము మరియు నిబంధనలు 29: ‘యేసు క్రీస్తు తన జనులను సమకూర్చును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“మార్చి 22–28. సిద్ధాంతము మరియు నిబంధనలు 29,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
మోకరిల్లిన జనుల యెదుట నిలబడిన యేసు క్రీస్తు

ప్రతి మోకాలు వంగును, జె. కిర్క్ రిచర్డ్స్ చేత

మార్చి 22–28

సిద్ధాంతము మరియు నిబంధనలు 29

యేసు క్రీస్తు తన జనులను సమకూర్చును

లేఖనాలను అధ్యయనం చేసే ఉద్దేశాలలో ఒకటి ఏమనగా మన రక్షణకు అవసరమైన సిద్ధాంతాన్ని లేదా సువార్త సత్యాలను నేర్చుకోవడం. మీరు ఈ వారం సిద్ధాంతము మరియు నిబంధనలు 29 అధ్యయనం చేస్తున్నప్పుడు, మీకు అర్థవంతమనిపించే సిద్ధాంతపరమైన అంతరార్ధముల కొరకు చూడండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు క్రీస్తు సంఘము 1830లో స్థాపించబడినప్పటికీ, అనేక సువార్త సత్యాలు అప్పటికింకా బయలుపరచబడవలసి ఉండెను మరియు అనేకమంది ప్రారంభ సంఘ సభ్యులు ప్రశ్నలు కలిగియున్నారు. ఇశ్రాయేలీయులు సమకూర్చబడుట, సీయోను నిర్మించబడుటను గూర్చి మోర్మన్ గ్రంథములో ప్రవచనాలను వారు చదివారు (3 నీఫై 21 చూడండి). అది ఎలా జరిగి ఉండవచ్చు? ఆ విషయం గురించి బయల్పాటులు పొందానని హైరమ్ పేజ్ ఆరోపించెను, అది కేవలం సభ్యుల ఉత్సుకతను పెంచింది (సిద్ధాంతము మరియు నిబంధనలు 28 చూడండి). ఆదాము హవ్వల పతనం మరియు ఆత్మీయ మరణం గురించి ఇతరులు ఆశ్చర్యపడ్డారు. 1830లో ప్రభువు ఈ ప్రశ్నలను స్వాగతించెను: “ఆజ్ఞానుసారముగా ప్రార్థనలో ఏకమై, విశ్వాసముతో మీరు ఏమి అడిగినను, దానిని మీరు పొందెదరు” అని పరిశుద్ధులతో ఆయన చెప్పెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 29:6). ఆయన నేడు మన ప్రశ్నలను స్వాగతించును; మనము ప్రార్థనలో ఆయనను అడుగవలెనని ఆయన వేచి చూస్తున్నారు. వాస్తవానికి, సిద్ధాంతము మరియు నిబంధనలు 29 లో సిద్ధాంతపరమైన గొప్ప బయల్పాటు చూపినట్లుగా, మనం మొదట అడిగిన ప్రశ్నలకు మించిన సత్యమును, జ్ఞానమును ఇవ్వడం ద్వారా ఆయన కొన్నిసార్లు స్పందిస్తారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 29

పరలోక తండ్రి మన మహోన్నతస్థితి కొరకు పరిపూర్ణమైన ప్రణాళికను సిద్ధం చేశారు.

తన పిల్లల కోసం దేవుని ప్రణాళిక గురించి అనేక సత్యాలను సిద్ధాంతము మరియు నిబంధనలు 29 బోధిస్తుంది. మీరు చదివేటప్పుడు, ప్రణాళిక యొక్క ఈ క్రింది భాగాలలో ప్రతిదాని గురించి మీరు నేర్చుకున్న సత్యాల కోసం చూడండి:

ఏ కొత్త అంతరార్థములను మీరు పొందారు? ఈ సత్యముల గురించి మీకు తెలియకపోయి ఉంటే మీ జీవితం ఎలా భిన్నంగా ఉండేది?

The Plan of Salvation” (Preach My Gospel: A Guide to Missionary Service, rev. ed. [2018], ChurchofJesusChrist.org/manual/missionary) లో మీరు పరలోక తండ్రి ప్రణాళిక గురించి మరింత అధ్యయనము చేయవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 29:1-8

యేసుక్రీస్తు తన రెండవ రాకడకు ముందే తన జనులను సమకూర్చును.

“కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో” ఆ విధముగా తన జనులను సమకూర్చుట గురించి యేసు క్రీస్తు మాట్లాడును ( సిద్ధాంతము మరియు నిబంధనలు 29:2). మిమ్మల్ని సమకూర్చాలనే రక్షకుని కోరిక గురించి ఈ చిత్రం మీకు ఏమి బోధిస్తుంది? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 29:1–8 చదివేటప్పుడు, మనం ఎందుకు సమకూడుతాము, ఎవరు సమకూర్చుతారు మరియు “ఎన్నుకోబడిన” వారిని సమకూర్చుటకు మనం ఏవిధంగా సహాయపడగలము అనేవాటి యొక్క అంతరార్థముల కొరకు చూడండి (7వ వచనము).

మన కాలములో, సీయోనులో సమకూడడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీయోను స్టేకులలో ఏకమవ్వడం. రక్షకుని రెండవ రాకడకు ముందు వచ్చే కష్టాల “కొరకు సమస్త విషయములలో సిద్ధపడియుండుటకు” పరిశుద్దులుగా సమకూడుట మనకు ఎలా సహాయపడుతుంది? (8వ వచనము; 14–28 వచనములు కూడా చూడండి).

విశ్వాస ప్రమాణాలు 1:10; రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు వెన్డీ నెల్సన్, “Hope of Israel” (worldwide devotional for youth, June 3, 2018, ChurchofJesusChrist.org).

చిత్రం
కోడి మరియు కోడిపిల్లలు

ఎన్ని మారులు, లిజ్ లెమన్ స్విండిల్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 29:31–35

“సమస్తము నాకు ఆత్మీయముగా నున్నవి.”

ఏ అర్థములో ఆజ్ఞలన్నీ ఆత్మీయంగా ఉన్నాయి? ఆజ్ఞలన్నీ ఆత్మీయమైనవి అని తెలుసుకోవడం, ఆజ్ఞల ఉద్దేశం గురించి మీకు ఏమి బోధిస్తుంది? మీరు కొన్ని ఆజ్ఞలను జాబితా చేసి, ప్రతిదానికి సంబంధించిన ఆత్మీయ సూత్రాలను పరిగణించవచ్చు.

మీ రోజువారీ పనులు లోకసంబంధమైనవి లేదా ఐహికసంబంధమైనవిగా అనిపించినప్పటికీ, వాటిలో కూడా మీరు ఆత్మీయ అర్థం లేదా ప్రయోజనం కోసం చూసినట్లయితే ఏమి మారవచ్చు?

రోమా 8:6; 1 నీఫై 15:30–32 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 29:36–50.

పతనము నుండి యేసు క్రీస్తు మనలను విమోచించును.

“[మన] పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన” (1వ వచనము) ప్రభువు తననుతాను విమోచకునిగా పరిచయం చేసుకోవడంతో ఈ బయల్పాటు ప్రారంభమవుతుంది. మనకు విమోచకుడు అవసరమయ్యే కొన్ని కారణాలను వివరిస్తూ ఈ బయల్పాటు కొనసాగుతుంది. రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు విమోచన ఎందుకు అవసరమో వివరించడానికి మీరు 36–50 వచనములు ఎలా ఉపయోగిస్తారో పరిశీలించండి. అనేక విశ్వాస సంప్రదాయాలలో పతనము ఒక విషాదంగా చూడబడుతుంది; పతనము యొక్క సానుకూల ఫలితాలను బోధించేలా ఈ వచనాలలో మీరు ఏమి కనుగొన్నారు? (1 కొరింథీయులకు 15:22; 2 నీఫై 2:6–8, 15–29; మోషైయ 3:1–19; మోషే 5:9–12 కూడా చూడండి.)

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 29.రక్షణ ప్రణాళిక గురించి మీ కుటుంబానికి బోధించడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 29 తో పాటు ఈ సారాంశము చివర ఇవ్వబడిన చిత్రాలను మీరు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, సూచించబడిన వచనాలను చదవడం మరియు చర్చించడం ద్వారా కుటుంబ సభ్యులు ప్రణాళికలోని వివిధ భాగాల గురించి తెలుసుకోవచ్చు. వారు అదనపు సత్యాలను సువార్త అంశములు (topics.ChurchofJesusChrist.org) లేదా లేఖన సూచిక (scriptures.ChurchofJesusChrist.org లో కనుగొనవచ్చు). మీరు నేర్చుకొన్నది వ్రాయండి. రక్షణ ప్రణాళిక గురించి తెలుసుకొనుటకు మనము ఎందుకు కృతజ్ఞత కలిగియుండాలి? దాని గురించి తెలుసుకోవడం మన దైనందిన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 29:2, 7–8.రక్షకుని చేత సమకూర్చబడటం అంటే ఏమిటి? ఎన్నుకోబడినవారిని సమకూర్చుటకు ఆయనకు మనమెలా సహాయపడగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 29:3–5.“[మన] హృదయములను పైకెత్తుకొని ఆనందించుటకు” సహాయపడే ఈ వచనాలలో రక్షకుడి గురించి మనం ఏమి నేర్చుకుంటాము? (5వ వచనము). “మనము ఆనందాన్ని కనుగొనగలము” ( ChurchofJesusChrist.org ) వీడియో, రక్షణ ప్రణాళిక గురించి తెలుసుకోవడం మీ కుటుంబానికి ఆనందాన్ని ఎలా తెచ్చిందో చర్చించడంలో మీకు సహాయపడగలదు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 29:34–35.ఈ వచనాలను చదవడం వలన మీరు అనుసరించడానికి ప్రయత్నిస్తున్న కొన్ని ఆజ్ఞలు లేదా ప్రవచనాత్మక సలహాల వెనుక ఉన్న ఆత్మీయ కారణాల గురించి మాట్లాడటానికి మీ కుటుంబానికి అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు, మనం కుటుంబ సమేతముగా లేఖనాలను చదవాలని ప్రభువు ఎందుకు కోరుకుంటున్నారు? ఆజ్ఞలను పాటించడం ద్వారా మనం ఏ ఆత్మీయ ప్రయోజనాలను చూశాము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Israel, Israel, God Is Calling,” Hymns, no. 7.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

యేసు క్రీస్తు కొరకు చూడండి. దేవుని సృష్టిలో సమస్తము యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తున్నాయని లేఖనాలు మనకు బోధిస్తాయి ( మోషే 6:62–63 చూడండి), కాబట్టి మీరు లేఖనాలను చదివేటప్పుడు ఆయన కోసం వెదకండి. ఆయన గురించి బోధించే వచనాలను గమనించుట లేదా గుర్తించుటను పరిగణించండి.

ముద్రించు