2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
మార్చి 15–21. సిద్ధాంతము మరియు నిబంధనలు 27–28: “అన్నిసంగతులు సక్రమముగా జరుగవలెను”


“మార్చి 15–21. సిద్ధాంతము మరియు నిబంధనలు 27–28: ‘అన్నిసంగతులు సక్రమముగా జరుగవలెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“మార్చి 15–21. సిద్ధాంతము మరియు నిబంధనలు 27–28,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

జోసెఫ్ స్మిత్

మార్చి 15–21

సిద్ధాంతము మరియు నిబంధనలు 27–28

“అన్నిసంగతులు సక్రమముగా జరుగవలెను”

మీరు లేఖనాలను అధ్యయనం చేసి, మీ మనోభావాలను నమోదు చేస్తున్నప్పుడు, “మీరు దేవుని వాక్యానికి మీ హృదయంలో స్థానం ఇస్తారు మరియు ఆయన మీతో మాట్లాడతారు” (“నీవు పరివర్తన చెందినప్పుడు,” ఎన్‌సైన్ లేదా లియాహోనా, మే 2004, 11).

మీ మనోభావాలను నమోదు చేయండి

పునఃస్థాపన విశదపరచబడుట కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధులకు బయల్పాటు అనేది ఇంకా క్రొత్త భావనగా ఉన్నది. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ సంఘము కొరకు బయల్పాటును పొందగలరని ప్రారంభ సంఘ సభ్యులకు తెలుసు, కాని ఇతరులు కూడా పొందగలరా? బంగారు పలకలకు ఎనిమిది మంది సాక్షులలో ఒకరైన హైరమ్ పేజ్ తాను సంఘము కొరకు బయల్పాటులు పొందుచున్నాడని నమ్మడంతో ఇలాంటి ప్రశ్నలు క్లిష్టమైనవిగా మారెను. విశ్వాసులైన అనేకమంది పరిశుద్ధులు ఈ బయల్పాటులు దేవుని నుండి వచ్చాయని నమ్మారు. తన సంఘములో “అన్నిసంగతులు సక్రమముగా జరుగవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 28:13) అని బోధించడం ద్వారా ప్రభువు స్పందించెను, దీని అర్థం సంఘమంతటికి “ఆజ్ఞలు మరియు బయల్పాటులు పొందుటకు” ఒక్కరు మాత్రమే నియమించబడతారు. ( సిద్ధాంతము మరియు నిబంధనలు 28:2). అయినప్పటికీ, ఇతరులు ప్రభువు కార్యములో తమ వంతుగా వ్యక్తిగత బయల్పాటులు పొందవచ్చు. వాస్తవానికి, ఆలీవర్ కౌడరీకి ప్రభువు చెప్పిన మాటలు మనమందరము జ్ఞాపకముంచుకోదగినవి: “నీవేమి చేయవలెనో… అది నీకు తెలియజేయబడును” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 28:15 ).

All Things Must Be Done in Order,” Revelations in Context, 50–53 కూడా చూడండి.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 27:1–4

దేవుని మహిమయే లక్ష్యముగా నేను సంస్కారము తీసుకోవాలి.

1830 జూన్‌లో సాలీ నైట్, ఎమ్మా స్మిత్‌లు బాప్తీస్మము పొందారు, కాని వారి నిర్థారణలు ఒక అల్లరిమూక చేత ఆటంకపరచబడ్డాయి. రెండు నెలల తరువాత, సాలీ మరియు ఆమె భర్త న్యూవెల్, ఎమ్మా మరియు జోసెఫ్‌లను చూడడానికి వచ్చారు, అప్పుడే నిర్థారణలు జరపాలని మరియు ఈ బృందం కలిసి సంస్కారములో పాల్గొంటుందని నిర్ణయించారు. సంస్కారము కొరకు ద్రాక్షారసము తెచ్చుటకు వెళ్ళుచున్నప్పుడు, జోసెఫ్ ఒక దేవదూత చేత ఆపబడ్డాడు. సంస్కారము గురించి ఆ దేవదూత అతడికి ఏమని బోధించెను? (సిద్ధాంతము మరియు నిబంధనలు 27:1–4 చూడండి).

సంస్కారమును మీరు ఏవిధంగా తీసుకోవాలని రక్షకుడు కోరుచున్నారు అనే దాని గురించి ఈ వచనాలు మీకు ఏమి బోధిస్తాయి? మీరు నేర్చుకుంటున్నదాని కారణంగా మీరు ఏమి చేయడానికి ప్రేరణ పొందారు?

సంస్కారపు రొట్టె మరియు గిన్నె

సంస్కారము రక్షకుని త్యాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 27:15–18

దేవుని కవచం చెడుకు వ్యతిరేకంగా నిలబడడానికి నాకు సహాయపడుతుంది.

అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ ఇలా అన్నారు: “ఆధ్యాత్మికంగా మనల్ని సాయుధపరచుకోవడానికి మనం చేయగలిగే గొప్పదైన ఘనమైన విషయం ఏదీ లేదు. సమస్త కీడు నుండి రక్షించి, కాపాడే ఆత్మీయ రక్షణదుర్గమనే వస్త్రములో అల్లబడిన అనేకమైన చిన్న చిన్న క్రియలలో నిజమైన ఆత్మీయ శక్తి కలదు” (“Be Strong in the Lord,” Ensign, July 2004, 8).

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 27:15–18 చదివినప్పుడు, క్రింద ఇవ్వబడిన పటము వంటిది మీరు తయారుచేయవచ్చు. దేవుని కవచం యొక్క ప్రతి భాగాన్ని ధరించడానికి మీరు ఏమి చేస్తున్నారు?

కవచం యొక్క భాగం

రక్షించబడే శరీర భాగం

ఆ శరీర భాగం దేనిని సూచించవచ్చు

కవచం యొక్క భాగం

నీతియను వక్షస్థల కవచము

రక్షించబడే శరీర భాగం

హృదయము

ఆ శరీర భాగం దేనిని సూచించవచ్చు

మన కోరికలు, ఆప్యాయతలు

కవచం యొక్క భాగం

రక్షణయను శిరస్త్రాణము

రక్షించబడే శరీర భాగం

శిరస్సు లేదా మనస్సు

ఆ శరీర భాగం దేనిని సూచించవచ్చు

ఎఫెసీయులకు 6:11–18; 2 నీఫై 1:23 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 28

జీవముతోనున్న ప్రవక్త దేవుని సంఘం కొరకు ప్రతినిధియైయున్నాడు.

ఎవరైనా సంఘమంతటి కొరకు ఆజ్ఞలు, బయల్పాటులు పొందగలిగితే ఎలా ఉంటుందో ఊహించండి. హైరమ్ పేజ్ అటువంటి బయల్పాటు పొందుచున్నట్లు పేర్కొన్నప్పుడు, సంఘ సభ్యులలో గందరగోళం ఏర్పడింది. సిద్ధాంతము మరియు నిబంధనలు 28 లో ఆయన సంఘములో బయల్పాటు పొందుటకు ప్రభువు ఒక క్రమమును బయలుపరచెను. సంఘ అధ్యక్షుని యొక్క నిర్దిష్ట పాత్ర గురించి ఈ ప్రకరణము నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? 3వ వచనము లో ఆలీవర్ కౌడరీకి ప్రభువు చెప్పిన మాటల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించగలడు అనే దాని గురించి ఈ ప్రకరణము నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

డాలిన్ హెచ్. ఓక్స్, “Two Lines of Communication,” Ensign or Liahona, Nov. 2010, 83–86 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 28

లేమనీయుల యొద్దకు వెళ్ళుటకు ఆలీవర్ కౌడరీకి ఇవ్వబడిన నియమిత కార్యము ఎందుకు ముఖ్యమైనది?

మోర్మన్ గ్రంథము యొక్క ఒక ఉద్దేశమేమనగా “తద్వారా లేమనీయులు వారి పితరులను గూర్చిన జ్ఞానమునకు రాగలిగి, ప్రభువు యొక్క వాగ్దానాలను వారు తెలుసుకొనగలరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 3:20). ఇది చాలామంది మోర్మన్ గ్రంథ ప్రవక్తలకు ప్రభువు ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఉంది. (ఉదాహరణకు 1 నీఫై 13:34–41; ఈనస్ 1:11–18; హీలమన్ 15:12–13 చూడండి). ప్రారంభ సంఘ సభ్యులు అమెరికా వాసులను మోర్మన్ గ్రంథ జనుల వారసులుగా భావించారు. (లేమనీయులు “అమెరికన్ ఇండియన్ల యొక్క పూర్వీకుల మధ్య ఉన్నారు” అనేది నేడు సంఘము యొక్క అధికారిక సిద్ధాంతము [మోర్మన్ గ్రంథ పీఠిక].)

సమీపంలోని అమెరికన్ ఇండియన్ల తెగలకు ఆలీవర్ యొక్క పరిచర్య గురించి మరింత చదవడానికి, “A Mission to the Lamanites” (Revelations in Context, 45–49) చూడండి. ఈ నియమిత కార్యము ప్రభువు గురించి మరియు ఆయన కార్యము గురించి మీకు ఏమి బోధిస్తుంది?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 27:1–2.సంస్కారములో పాలుపంచుకున్నప్పుడు మన కోసం రక్షకుని త్యాగాన్ని మనం ఎలా ఉత్తమముగా గుర్తుంచుకోగలం?

సిద్ధాంతము మరియు నిబంధనలు 27:5–14.ఈ వచనాలలోని ప్రవక్తల గురించి మనకు ఏమి తెలుసు? లేఖనదీపికలో (scriptures.ChurchofJesusChrist.org) మీరు వాటి గురించి సమాచారం కోసం శోధించవచ్చు. వారు కలిగియున్న తాళపుచెవుల ద్వారా మనకు ఏ దీవెనలు లభ్యమగుచున్నవి? ఈ తాళపుచెవుల గురించి మరింత సమాచారము కొరకు, మత్తయి 16:16–19; సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11–16 చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 27:15–18.దేవుని కవచాన్ని సూచించడానికి టోపీలు, ధోవతులు,పైవస్త్రములు లేదా బూట్లు వంటి అదనపు దుస్తులతో యుద్ధం చేయటాన్ని అభినయించడం మీ కుటుంబం ఆనందించవచ్చు. యుద్ధంలో మనల్ని రక్షించడానికి కవచం ఎలా సహాయపడుతుంది? మీ కుటుంబం ఎదుర్కొంటున్న కొన్ని చెడు ప్రభావాలను మరియు ఆత్మీయ కవచాన్ని ధరించడానికి మీరు చేయగలిగే విషయాలను చర్చించండి. “Put on the Whole Armor of God” (ChurchofJesusChrist.org) వీడియోను చూపించుటను పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 28:2–7.ప్రవక్త పిలుపు గురించి ఈ వచనాల నుండి మనం ఏమి నేర్చుకుంటాము? కుటుంబ సభ్యులు జీవించుచున్న మన ప్రవక్త నుండి గత సందేశాలను సమీక్షించి, యేసు క్రీస్తును అనుసరించడానికి ఆయన సలహా ఎలా సహాయపడుతుందో పంచుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 28:11.మనము ఎవరినైనా సరిదిద్దాలని అనుకున్నప్పుడు, “ఏకాంతముగా తీసుకొనివెళ్ళుట” ఎందుకు అవసరము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Come, Listen to a Prophet’s Voice,” Hymns, no. 21.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

కడవరి-దిన ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలను అధ్యయనము చేయండి. లేఖనాల్లో మీరు కనుగొన్న సూత్రాల గురించి కడవరి-దిన ప్రవక్తలు మరియు అపొస్తలులు ఏమి బోధించారో చదవండి. సర్వసభ్య సమావేశ అంశముల సూచికను conference.ChurchofJesusChrist.org లో లేదా సువార్త గ్రంథాలయ యాప్‌లో సమీక్షించుటను పరిగణించండి.