2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
మార్చి 29–ఏప్రిల్ 4. ఈస్టర్: “జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే”


“మార్చి 29–ఏప్రిల్ 4. ఈస్టర్: ‘జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“మార్చి 29–ఏప్రిల్ 4. ఈస్టర్,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

క్రైస్టస్ విగ్రహము

మార్చి 29–ఏప్రిల్ 4

ఈస్టర్

“జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే”

ఈస్టర్ ఆదివారం నాడు రక్షకుని పునరుత్థానమును జరుపుకోవడానికి మీరు సిద్ధపడుతున్నప్పుడు, యేసు క్రీస్తు దేవుని యొక్క అద్వితీయ కుమారుడని మరియు లోక విమోచకుడని ఆధునిక బయల్పాటు మీ విశ్వాసాన్ని ఎలా బలపరిచినదో ధ్యానించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

1836, ఏప్రిల్ 3 ఈస్టర్ ఆదివారము. క్రొత్తగా ప్రతిష్టించబడిన కర్ట్‌లాండ్ దేవాలయంలో సమకూడిన పరిశుద్ధులకు సంస్కారమును అందించడంలో సహాయపడిన తర్వాత, జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలు దేవాలయంలోని తెర వెనుక ఒక నిశ్శబ్ద స్థలాన్ని కనుగొని, నిశ్శబ్ద ప్రార్థనలో మోకరించారు. అప్పుడు, క్రైస్తవులందరు ప్రతిచోట యేసు క్రీస్తు పునరుత్థానమును జరుపుకుంటున్న ఈ పవిత్ర దినమున, తిరిగి లేచిన రక్షకుడు “జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే” (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:4) అని ప్రకటిస్తూ, తనకుతానుగా తన దేవాలయంలో ప్రత్యక్షమయ్యారు.

“జీవించుచున్న వాడు” యేసు క్రీస్తే అని చెప్పడంలో అర్థమేమిటి? మూడవరోజు ఆయన సమాధి నుండి లేచారని మరియు తన గలిలయ శిష్యులకు అగుపించారని మాత్రమే దానర్థము కాదు. దానర్థము, ఆయన నేటికీ జీవించియున్నారు. ఆయన నేడు ప్రవక్తల ద్వారా మాట్లాడతారు. నేడు ఆయన తన సంఘాన్ని నడిపిస్తారు. నేడు ఆయన గాయపడిన ఆత్మలను, విరిగిన హృదయాలను స్వస్థపరుస్తారు. కావున మనము జోసెఫ్ స్మిత్ యొక్క శక్తివంతమైన సాక్ష్యము యొక్క పదాలను ప్రతిధ్వనించగలము: “ఆయనను గూర్చి ఇవ్వబడిన అనేక సాక్ష్యముల తరువాత ఆయనను గూర్చి … మేమిచ్చు సాక్ష్యము: అదేమనగా ఆయన సజీవుడు!” (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:22). ఈ బయల్పాటులలో మనము ఆయన స్వరమును వినగలము. మన జీవితాలలో ఆయన హస్తమును మనము చూడగలము. ‘నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు!’ అను వాక్యము ఇచ్చే ఆనందాన్ని మనలో ప్రతి ఒక్కరము అనుభవించగలము” (Hymns, no. 136).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 29:5; 38:7; 62:1; 76:11–14, 20–24; 110:1–10

యేసు క్రీస్తు సజీవుడు.

తిరిగి లేచిన రక్షకుడిని ప్రవక్త జోసెఫ్ స్మిత్ అనేకసార్లు చూసారు మరియు ఈ అనుభవాలలో రెండు సిద్ధాంతము మరియు నిబంధనలలో నమోదు చేయబడ్డాయి. మీరు ప్రకరణములు 76:11–14, 20–24; 110:1–10 చదివినప్పుడు, జోసెఫ్ స్మిత్ సాక్ష్యము గురించి ఏది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది? ఆయన సాక్ష్యము మీకెందుకు విలువైనది?

సిద్ధాంతము మరియు నిబంధనలు అంతటా, రక్షకుడు తన నియమిత కార్యము మరియు దైవత్వము గురించి సాక్ష్యమిచ్చారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 29:5; 38:7; 62:1లో ఆయన మాటల నుండి సజీవుడైన క్రీస్తు గురించి మీరేమి నేర్చుకుంటారు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు చదువుతున్నప్పుడు, మీరు కనుగొనే ఇలాంటి ప్రకటనలను నమోదు చేయడాన్ని మీరు పరిగణించవచ్చు.

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 29:26–27; 42:45–46; 63:49; 88:14–17, 27–31; 93:33–34

యేసు క్రీస్తు మూలముగా నేను పునరుత్థానము చెందుతాను.

ప్రియమైన వారు మరణించినప్పుడు దుఃఖించడం ఎలా ఉంటుందో జోసెఫ్ స్మిత్‌కు తెలుసు. ఆయన సహోదరులలో ఇద్దరైన ఆల్విన్ మరియు డాన్ కార్లోస్ యవ్వనంలో మరణించారు. జోసెఫ్ మరియు ఎమ్మా ఆరుగురు పిల్లలను సమాధి చేసారు, ప్రతి ఒక్కరు రెండు సంవత్సరాలకంటే తక్కువ వయస్సు వారు. కానీ ఆయన పొందిన బయల్పాటుల నుండి జోసెఫ్, మరణము మరియు దేవుని నిత్య ప్రణాళికపై ఒక నిత్య దృష్టిని పొందారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 29:26–27; 42:45–46; 63:49; 88:14–17, 27–31; 93:33–34లో బయల్పరచబడిన సత్యాలను పరిగణించండి. మీరు మరణమును చూసే దృష్టిని ఈ బయల్పాటులు ఎలా ప్రభావితం చేస్తాయి? మీరు జీవించే విధానాన్ని అవి ఎలా ప్రభావితం చేస్తాయి?

1 కొరింథీయులకు 15; ఎమ్. రస్సెల్ బల్లార్డ్, “మృతుల విమోచనను గూర్చి దర్శనము,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2018, 71–74 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13; 19:16–19; 45:3–5; 76:69–70

యేసు క్రీస్తు ఒక “పరిపూర్ణ ప్రాయశ్చిత్తము”ను సాధించారు.

ఈస్టర్ సమయంలో రక్షకునిపై దృష్టి కేంద్రీకరించడానికి ఒక విధానము, సిద్ధాంతము మరియు నిబంధనలలో ఆయన ప్రాయశ్చిత్త త్యాగము గురించి బోధించే బయల్పాటులను చదవడం. వీటిలో కొన్ని సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13; 19:16–19; 45:3–5; 76:69–70లో కనుగొనబడగలవు. బహుశా మీరు, ఈ వచనాలలో రక్షకుని ప్రాయశ్చిత్తము గురించి మీరు కనుగొనే సత్యాల జాబితా చేయవచ్చు. మీ అధ్యయనమును వృద్ధిచేయడానికి “Atone, Atonement” (Guide to the Scriptures, scriptures.ChurchofJesusChrist.org) లో జాబితా చేయబడిన లేఖన ఉదాహరణలను పరిశోధించడం ద్వారా మీరు మీ జాబితాకు జతచేయవచ్చు.

మీ అధ్యయనమును నడిపించగల ప్రశ్నలు కొన్ని ఇక్కడున్నాయి:

  • యేసు క్రీస్తు బాధపడడానికి ఎందుకు ఎంచుకున్నారు?

  • ఆయన త్యాగము యొక్క దీవెనలను పొందడానికి నేనేమి చేయాలి?

  • ఆయన ప్రాయశ్చిత్తము నా జీవితంలో ప్రభావము కలిగియుందో లేదో నేనెలా చెప్పగలను?

ప్రార్థించుచున్న యేసు

ప్రార్థన యొక్క ప్రభువు, యాంగ్‌సుంగ్ కిమ్ చేత

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సర్వసభ్య సమావేశము.ఈ సంవత్సరము సర్వసభ్య సమావేశము మరియు ఈస్టర్ ఆదివారము ఒకేసమయంలో వస్తున్నందున, యేసు క్రీస్తు గురించి మీ కుటుంబము యొక్క సాక్ష్యాన్ని సమావేశ సందేశాలు (సంగీతంతో కలిపి) ఏవిధంగా వృద్ధిచేయగలవో మీరు పరిగణించవచ్చు. ఉదాహరణకు, చిన్నపిల్లలు యేసు క్రీస్తు గురించి ఒక సందేశాన్ని లేక పాటను వినినప్పుడు, వారు రక్షకుని చిత్రాన్ని గీయవచ్చు లేక ఆయన చిత్రాన్ని పైకెత్తి పట్టుకోవచ్చు. ఇతర కుటుంబ సభ్యులు రక్షకుని గురించి వారు వినే సత్యాలను జాబితా చేయవచ్చు. తర్వాత, కుటుంబ సభ్యులు వారి బొమ్మలను లేక జాబితాలను మరియు యేసు క్రీస్తు గురించి వారి సాక్ష్యాలను పంచుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 88:14–17; 138:17, 50.మరణించడం మరియు పునరుత్థానము చెందడం అంటే ఏమిటో వివరించడానికి—శరీరము మరియు ఆత్మ వేరుచేయబడడం మరియు తర్వాత తిరిగి ఏకమవడాన్ని వివరించేలా ఒకటి, ఒక చేయి మరియు ఒక తొడుగు వంటిది ఏదైనా ఉపమానము లేక వస్తుపాఠము గురించి ఆలోచించడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు. రక్షకుడు మన కొరకు చేసిన దానికి మన ప్రశంసను ఈ వచనాలు ఎలా బలపరుస్తాయి?

జీవముతోనున్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము.”రక్షకుని గురించి ఆధునిక ప్రవక్తల యొక్క సాక్ష్యము గురించి చర్చను ప్రోత్సహించడానికి, “జీవముతోనున్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము” (ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2017, ముఖచిత్రము లోపల) లో ఒక భాగాన్ని చదివి, యేసు క్రీస్తు గురించి వారు నేర్చుకున్న దానిని పంచుకోమని మీరు ప్రతి కుటుంబ సభ్యునికి చెప్పవచ్చు. మీరు “Apostle Testimony Montage” (ChurchofJesusChrist.org) వీడియో కూడా చూపించవచ్చు. మనల్ని ప్రేరేపించేలా ఏ సత్యాలను మనము కనుగొంటాము?

“నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు.”తిరిగి లేచిన రక్షకుడు నేడు మనల్ని దీవించే అనేక విధాలను పరిగణించడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 6:34; 45:3–5; 84:77; 98:18; 138:23లో బోధించబడిన సత్యాలను చదువవచ్చు.

ఈస్టర్ వీడియో మరియు ఇతర వనరుల కొరకు Easter.ComeUntoChrist.org చూడండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

అనుదిన విషయాలలో పాఠాలను కనుగొనండి. మీ కుటుంబ సభ్యుల అనుదిన అనుభవాలు ఏ విధంగా ఒక సువార్త సత్యము గురించి అర్థవంతమైన సంభాషణలకు దారితీయగలవో పరిగణించండి (Teaching in the Savior’s Way, 4 చూడండి). ఉదాహరణకు, ఒక తుఫాను, దేవుడు తన పిల్లలపై ఏవిధంగా దీవెనలు క్రుమ్మరిస్తాడనే దాని గురించి మాట్లాడడానికి అవకాశం కాగలదు.

జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు అగుపించిన యేసు

ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు యేసు క్రీస్తు అగుపించును, వాల్టర్ రానె చేత