“ఏప్రిల్ 19–25. సిద్ధాంతము మరియు నిబంధనలు 41–44: ‘నా సంఘమును పరిపాలించుటకు నా చట్టము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“ఏప్రిల్ 19–25. సిద్ధాంతము మరియు నిబంధనలు 41–44,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
ఏప్రిల్ 19–25
సిద్ధాంతము మరియు నిబంధనలు 41–44
“నా సంఘమును పరిపాలించుటకు నా చట్టము”
“నీవు అడిగినయెడల, బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును నీవు పొందెదవు” అని ప్రభువు వాగ్దానము చేసారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61). మీకవసరమైన బయల్పాటును పొందడానికి మీరు ఏ ప్రశ్నలు అడుగగలరు?
మీ మనోభావాలను నమోదు చేయండి
1830 మరియు 1831లో సంఘము యొక్క త్వరిత ఎదుగుదల—ప్రత్యేకించి క్రొత్తగా పరివర్తన చెందినవారు కర్ట్‌లాండ్, ఒహైయోకు వేగంగా రావడం—పరిశుద్ధులకు ఉత్సాహం మరియు ప్రోత్సాహం కలిగించేదిగా ఉండెను. కానీ అది కొన్ని సవాళ్ళను కూడా కలిగించెను. త్వరితగతిన విస్తరిస్తున్న విశ్వాసుల బృందమును, ప్రత్యేకించి వారు మునుపటి విశ్వాసాల నుండి సిద్ధాంతాన్ని మరియు అలవాట్లను వారితో తెస్తున్నప్పుడు వారిని మీరెలా ఐక్యపరుస్తారు? ఉదాహరణకు, 1831 ప్రారంభములో జోసెఫ్ స్మిత్ కర్ట్‌లాండ్‌కు చేరుకున్నప్పుడు, క్రొత్త నిబంధన క్రైస్తవులను అనుకరిస్తూ క్రొత్త సభ్యులు ఒక ప్రత్యేక ప్రయత్నంలో ఉమ్మడి ఆస్తిని పంచుకోవడాన్ని ఆయన కనుగొన్నారు (అపొస్తలుల కార్యములు 4:32–37 చూడండి). సిద్ధాంతము మరియు నిబంధనలు 42లో నమోదు చేయబడి, “నా సంఘమును పరిపాలించుటకు నా చట్టము” (59వ వచనము) అని ఆయన పిలిచిన బయల్పాటు ద్వారా ఎక్కువగా దీనిపై మరియు ఇతర విషయాలపై ప్రభువు కొన్ని ముఖ్యమైన సవరణలను చేసారు మరియు వివరణలనిచ్చారు. నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ మరింత ఉంటుందని స్పష్టం చేస్తూ ఒక ప్రత్యేక వాగ్దానము: “నీవు అడిగినయెడల, బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును నీవు పొందెదవు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61) అనేదానితో పాటు కడవరి దినాలలో ప్రభువు యొక్క సంఘాన్ని స్థాపించడంలో ప్రధానమైన సత్యాలను ఈ బయల్పాటులో మనం నేర్చుకుంటాము.
Saints, 1:114–19 కూడా చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
“ఎవడైతే నా ధర్మశాస్త్రమును పొంది, దానికి విధేయుడైయుండునో, అట్టివాడే నా శిష్యుడు.”
1831 ప్రారంభం నాటికి, పరిశుద్ధులు ఒహైయోలో సమకూడడానికి బయలుదేరబోతున్నారు, అక్కడ బయల్పరుస్తానని ప్రభువు వాగ్దానం చేసిన చట్టాన్ని పొందడానికి ఆతృతగా ఉన్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:32 చూడండి). కానీ ముందుగా, ఆయన చట్టాన్ని పొందడానికి ఆయన శిష్యులు ఎలా సిద్ధపడాలో ప్రభువు బోధించారు. దేవుని చట్టాన్ని పొందడంలో పరిశుద్దులకు సహాయపడిన ఏ సూత్రాలను 1–5 వచనాలలో మీరు కనుగొంటారు? ఆయన నుండి ఉపదేశాన్ని పొందడానికి ఈ సూత్రాలు మీకెలా సహాయపడవచ్చు?
దేవుని చట్టాలు ఆయన సంఘాన్ని పరిపాలిస్తాయి మరియు మన జీవితాలను పరిపాలించగలవు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:1–72లో కనుగొనబడే బయల్పాటును ప్రవక్త పొందిన అతి ముఖ్యమైన బయల్పాటులలో ఒకటిగా పరిశుద్ధులు పరిగణించారు. రెండు ఒహైయో వార్తాపత్రికలలో కనిపిస్తూ, మొదట ప్రచురించబడిన వాటిలో అది ఉంది మరియు సాధారణంగా అది “చట్టము” అని తెలియజేయబడింది. ఈ ప్రకరణములోని సూత్రాలలో అనేకము ప్రభువు చేత ముందుగానే బయల్పరచబడ్డాయి. ఆయన పరిశుద్ధులు లోబడియుండాలని ప్రభువు కోరిన ప్రతి ఆజ్ఞను ఈ ప్రకరణము కలిగియుండనప్పటికీ, క్రొత్తగా పునఃస్థాపించబడిన సంఘానికి ఈ సూత్రాలను మరలా చెప్పడం ఎందుకు ముఖ్యమో ధ్యానించడం యోగ్యమైనది.
క్రింది వాటివలె చిన్న భాగాలలో 42వ ప్రకరణమును చదవడం మరియు ప్రతిదానిలో బోధించబడిన సూత్రాలను గుర్తించడం మీకు సహాయపడవచ్చు. మీరలా చేసినప్పుడు, సంఘాన్ని నడిపించడానికి ఇవ్వబడిన ఈ చట్టము మీ వ్యక్తిగత జీవితాన్ని నడిపించడానికి కూడా ఎలా సహాయపడగలదో పరిగణించండి.
3 నీఫై 15:9 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:30–42
బీదల సహాయార్థము పరిశుద్ధులు ఎలా “(వారి) ఆస్తులను సమర్పణ చేసారు”?
42వ ప్రకరణములో బయల్పరచబడిన చట్టములో ఒక ముఖ్యభాగము సమర్పణ చట్టము మరియు గృహనిర్వాహకత్వముగా చెప్పబడింది. ప్రాచీనకాలంలో క్రీస్తు యొక్క అనుచరుల వలె “వారి మధ్య బీదవారెవరు లేకుండా” (మోషే 7:18) ఎలా “అంతయు సమిష్టిగా” (అపొస్తలుల కార్యములు 2:44; 4 నీఫై 1:3) వారు కలిగియుండగలరోనని ఈ చట్టము పరిశుద్ధులకు బోధించింది. బిషప్పు ద్వారా ప్రభువుకు ఇవ్వడం చేత పరిశుద్ధులు తమ ఆస్తిని సమర్పించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:30–31 చూడండి). బిషప్పు వారికి అవసరమైన దానిని తిరిగి ఇచ్చారు (32వ వచనము చూడండి)—సాధారణంగా వారు సమర్పించిన దానికంటే ఎక్కువగా ఇచ్చారు. సభ్యులు వారి అధిక ఆదాయాన్ని బీదల సహాయార్థము విరాళమిచ్చారు (33–34 వచనాలు చూడండి). ఈ చట్టము పరిశుద్ధులకు, ప్రత్యేకించి ఒహైయోకు రావడానికి అన్నిటిని వదిలివచ్చిన వారికి గొప్ప దీవెనైయుండెను. అనేకమంది పరిశుద్ధులు వారి విరాళాలలో ఉదారముగా ఉన్నారు.
నేడు మనము దానిని భిన్నంగా చేసినప్పటికీ, కడవరి-దిన పరిశుద్ధులు ఇంకా సమర్పణ చట్టాన్ని పాటిస్తున్నారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 42:30–42 చదువుతున్నప్పుడు, ఆయన రాజ్యమును నిర్మించడానికి మరియు అవసరతలోనున్న వారిని దీవించడానికి దేవుడు మీకిచ్చిన వాటిని మీరెలా సమర్పించగలరో ధ్యానించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61, 65–68; 43:1–16
ఆయన సంఘాన్ని నడిపించడానికి దేవుడు బయల్పాటునిస్తారు.
సంఘము బయల్పాటు చేత నడిపించబడుతున్నదని తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్న ఒక క్రొత్త సంఘ సభ్యునితో మీరు మాట్లాడుతున్నట్లు ఊహించుకోండి. ఆయన ప్రవక్త చేత ఆయన సంఘాన్ని నడిపించడానికి ప్రభువు యొక్క నమూనాను ఆమె లేక అతనికి వివరించడానికి మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 43:1–16ను ఎలా ఉపయోగించగలరు? వ్యక్తిగత బయల్పాటును పొందడం గురించి బోధించడానికి మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61, 65–68ను ఎలా ఉపయోగించగలరు?
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 41:1–5.పౌర చట్టాలకు కొన్ని ఉదాహరణలేవి, మరియు ఆ చట్టాలు మనకెలా ప్రయోజనం చేకూర్చగలవు? పరలోక తండ్రి చట్టాలు లేక ఆజ్ఞలు మనల్ని ఎలా దీవిస్తాయి? దేవుని చట్టాలకు లోబడియున్న తమ చిత్రాలను కుటుంబ సభ్యులు గీయవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:45, 88.“ఒకరినొకరు ప్రేమించుకొనునట్లు” మీ కుటుంబానికి సహాయపడేదేది? (మోషైయ 4:14–15 కూడా చూడండి). ఒకరి గురించి ఒకరు మంచి విషయాలను వ్రాయడం లేక చెప్పడం లేక కుటుంబంలో ప్రేమ గురించి “Love at Home” (Hymns, no. 294) వంటి పాట పాడడం గురించి ఆలోచించండి.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61.పజిల్‌ను పేర్చుతూ మీరు ఈ వచనాన్ని చదువవచ్చు. దేవుడు తన మర్మములను—“బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును” ఎలా బయల్పరుస్తారో బోధించడానికి పజిల్‌ను ఉపయోగించండి. కొంచెం కొంచెంగా దేవుడు వారికి సత్యమును ఎలా బయల్పరిచారో కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 43:25.25వ వచనము గురించి చర్చను ప్రారంభించడానికి ఒక మార్గంగా ఉరుము శబ్దాన్ని సృష్టించడానికి బహుశా మీ కుటుంబము ఉపయోగించగలిగినది ఏదైనా ఉండవచ్చు. ప్రభువు యొక్క స్వరము “ఉరుముల స్వరము”వలె ఎట్లున్నది? పశ్చాత్తాపపడమని ప్రభువు మనల్ని పిలిచే విధానాల కొరకు కలిసి ఈ వచనాన్ని పరిశోధించండి. ప్రభువు యొక్క స్వరానికి మరింత స్పందించేలా మనమెట్లుండగలము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “I Want to Live the Gospel,” Children’s Songbook, 148; “మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు” చూడండి.