2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
ఏప్రిల్ 12–18. సిద్ధాంతము మరియు నిబంధనలు 37–40: “మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు”


“ఏప్రిల్ 12–18. సిద్ధాంతము మరియు నిబంధనలు 37–40: ‘మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“ఏప్రిల్ 12–18. సిద్ధాంతము మరియు నిబంధనలు 37–40,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
వెళ్ళడానికి సిద్ధపడుతున్న పరిశుద్ధులు

కర్ట్‌లాండ్‌కు వెళ్తున్న పరిశుద్ధులు, శామ్ లాలర్ చేత

ఏప్రిల్ 12–18

సిద్ధాంతము మరియు నిబంధనలు 37–40

“మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు”

మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు మీ మనోభావాలను నమోదు చేయడమనేది “జ్ఞానమును భద్రపరచుకొనుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:30) అనే దేవుని ఉపదేశానికి మీరు విధేయులవడానికి ఒక మార్గము.

మీ మనోభావాలను నమోదు చేయండి

ప్రారంభ పరిశుద్ధులకు సంఘమనేది ఆదివారం కొద్దిగా బోధనను వినడానికి వెళ్ళే ప్రదేశాన్ని మించినది. జోసెఫ్ స్మిత్‌కు ఆయనిచ్చిన బయల్పాటులన్నిటిలో, ప్రభువు సంఘాన్ని హేతువు, రాజ్యము, సీయోను అనే పదాలతో మరియు చాలా తరచుగా కార్యము అని వర్ణించారు. ప్రారంభ సభ్యులలో అనేకమందిని సంఘానికి ఆకర్షించిన దానిలో అది భాగమైయుండవచ్చు. వారు సంఘం యొక్క పునఃస్థాపించబడిన సిద్ధాంతాన్ని ప్రేమించినంతగా, అనేకమంది తమ జీవితాలను సమర్పించునంతగా దేనినైనా కోరుకున్నారు. అయినప్పటికీ, 1830లో ఒహైయోలో సమకూడమని ప్రభువు పరిశుద్ధులకిచ్చిన ఆజ్ఞను అనుసరించడం కొంతమందికి సులువుగా లేకుండెను. ఫీబి కార్టర్ వంటివారికి దాని అర్థము, తెలియని ప్రాంతం కోసం సౌకర్యవంతమైన ఇళ్ళను వదిలిపెట్టడం (ఈ సారాంశపు అంతములో “పునఃస్థాపన స్వరములు“ చూడండి). ఆ పరిశుద్ధులు కేవలం విశ్వాసపు దృష్టితో చూడగలిగిన దానిని నేడు మనం స్పష్టంగా చూడగలము: ఒహైయోలో వారి కొరకు ప్రభువు గొప్ప దీవెనలను కలిగియున్నారు.

ఒహైయోలో సమకూడవలసిన అవసరం ఎప్పడో తీరిపోయింది, కానీ నేటికీ పరిశుద్ధులు ఇంకా అదే హేతువు, అదే కార్యమైన “సీయోనును స్థాపించుటకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 39:13) ఏకమవుతారు. ఆ ప్రారంభ పరిశుద్ధుల వలె మనము “ఐహిక విచారములు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 40:2) విడిచిపెడతాము, ఎందుకంటే మనము ప్రభువు యొక్క వాగ్దానాన్ని నమ్ముతాము: “నీవు … నీవెన్నడు యెరుగని గొప్ప దీవెనను పొందెదవు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 39:10).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 37:1

1830లో జోసెఫ్ స్మిత్ దేనిని అనువదిస్తున్నారు?

ఈ వచనములో, “అనువాదము” అని చెప్పబడిన బైబిలు యొక్క ప్రేరేపిత సవరణపై జోసెఫ్ స్మిత్ చేస్తున్న పని గురించి ప్రభువు చెప్తున్నారు. జోసెఫ్ 37వ ప్రకరణములో నమోదు చేయబడిన బయల్పాటును పొందినప్పుడు, ఆయన ఆదికాండములో కొన్ని అధ్యాయాలను పూర్తిచేసి, అప్పుడే హనోకు మరియు అతని సీయోను పట్టణము గురించి తెలుసుకున్నారు (ఆదికాండము 5:18–24; మోషే 7 చూడండి). ప్రభువు హనోకుకు బోధించిన సూత్రాలలో కొన్ని ఆయన 38వ ప్రకరణములో బయల్పరచిన వాటిని పోలియున్నాయి.

చిత్రం
జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్

బైబిలు యొక్క ప్రేరేపిత సవరణపై సిడ్నీ రిగ్డన్‌తో కలిసి పనిచేస్తున్న జోసెఫ్ స్మిత్. ఆన్నీ హెన్రీ నాడెర్ చేత వివరణ

సిద్ధాంతము మరియు నిబంధనలు 38

మనల్ని దీవించడానికి ప్రభువు మనల్ని సమకూరుస్తారు.

“ఇదిగో ఇందులో జ్ఞానము కలదు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 37:4) అని చెప్పుచూ ఒహైయోలో సమకూడమనే ఆయన ఆజ్ఞను ప్రభువు ముగించారు. కానీ ప్రతీఒక్కరు జ్ఞానాన్ని సరైన విధంగా చూడలేదు. 38వ ప్రకరణములో, ప్రభువు తన జ్ఞానాన్ని మరింత వివరంగా బయల్పరిచారు. సమకూడిక యొక్క దీవెనల గురించి 11–33 వచనాల నుండి మీరేమి నేర్చుకుంటారు? ఒక ప్రదేశానికి వెళ్ళడం ద్వారా సమకూడమని సంఘ సభ్యులు ఇకపై ఆజ్ఞాపించబడలేదు; నేడు మనం ఏవిధాలుగా సమకూడుతాము? ఈ దీవెనలు మనకెలా అన్వయిస్తాయి?

ఈ ప్రకరణములో మిగిలిన భాగాన్ని మీరు చదువుతున్నప్పుడు, ఒహైయోలో సమకూడమనే దేవుని ఆజ్ఞకు లోబడేందుకు వారికి అవసరమైన విశ్వాసాన్ని పొందడానికి పరిశుద్ధులకు సహాయపడిన వాక్యభాగాల కొరకు చూడండి. అలాగే ఆయన మీకిచ్చిన ఆజ్ఞలు మరియు వాటికి లోబడేందుకు మీకు అవసరమైన విశ్వాసం గురించి ఆలోచించండి. క్రింది ప్రశ్నలు మీ అధ్యయనాన్ని నడిపించగలవు:

  • ప్రభువు యందు మరియు ఆయన ఆజ్ఞల యందు మీకు నమ్మకాన్ని ఇచ్చేలా 1–4 వచనాలలో మీరేమి కనుగొంటారు?

  • దేవుని ఆజ్ఞలకు త్యాగం అవసరమైనప్పటికీ, వాటికి లోబడేందుకు 39వ వచనము మీకెలా సహాయపడగలదు?

మీరు ఇంకేమి కనుగొంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:11–13, 22–32, 41–42

నేను సిద్ధపడియుండిన యెడల, నేను భయపడనవసరము లేదు.

అప్పటికే పరిశుద్ధులు చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు మరియు ఇంకా రాబోతున్నదని ప్రభువుకు తెలుసు (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:11–13, 28–29 చూడండి). భయపడకుండా ఉండేలా వారికి సహాయపడేందుకు ఆయన ఒక అమూల్యమైన సూత్రాన్ని బయల్పరిచారు: “మీరు సిద్ధపడియుండిన యెడల మీరు భయపడనవసరము లేదు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:30). మీరు ఎదుర్కొనే సవాళ్ళను ఒక్క క్షణం ధ్యానించండి. తర్వాత మీరు 38వ ప్రకరణము చదువుతున్నప్పుడు, మీరు భయపడనవసరము లేకుండా సవాళ్ళ కొరకు మీరు సిద్ధపడగల విధానాల గురించి ఆత్మ ఇచ్చే ప్రేరేపణలను వినండి.

రోనాల్డ్ ఎ. రాస్బాండ్, “కలవరపడకుము,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2018, 18–21 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 39–40

దేవుని వాక్యానికి లోబడకుండా ఐహిక విచారములు నన్ను కలవరపెట్టరాదు.

ప్రకరణ శీర్షికలలో ఉన్న చారిత్రాత్మక నేపథ్యముతో పాటు 3940 ప్రకరణములు చదవండి మరియు జేమ్స్ కోవెల్ అనుభవము మీకు అన్వయించబడగల విధానాలను పరిగణించండి. ఉదాహరణకు, మీ “హృదయము (దేవుని) యెదుట యధార్థముగా ఉన్న” (సిద్ధాంతము మరియు నిబంధనలు 40:1) సమయాల గురించి ఆలోచించండి. మీ విశ్వసనీయతను బట్టి మీరెలా దీవించబడ్డారు? అలాగే మీరు ఎదుర్కొనే “ఐహిక విచారాల” గురించి ఆలోచించండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 39:9; 40:2). మరింత నిలకడగా విధేయులైయుండడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా దేనిని మీరు ఈ ప్రకరణాలలో కనుగొంటారు?

మత్తయి 13:3–23 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 37:3.ఒహైయోలో సమకూడడానికి పరిశుద్ధులు చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, ఈ సారాంశముతో పాటు ఉన్న భౌగోళిక పటాన్ని మీరు ఉదహరించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:22.యేసు క్రీస్తును మన కుటుంబ “శాసనకర్తగా” మనమెలా చేయగలము? ఆయన చట్టాలను అనుసరించడం మనల్ని “స్వేచ్ఛ కలిగిన జనముగా” ఎలా చేస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:24–27.“ఒకటిగా నుండుట” అనగా అర్థమేమిటో పిల్లలకు బోధించడానికి, వారు మీ కుటుంబ సభ్యులను లెక్కించేలా మీరు వారికి సహాయపడవచ్చు మరియు ప్రతీఒక్కరు మీ కుటుంబానికి ఎందుకు ముఖ్యమో మాట్లాడవచ్చు. మీరందరు కలిసి ఒక కుటుంబమని నొక్కిచెప్పండి. మీ పిల్లలు ఒక పోస్టరు మీద 1 అని పెద్దగా గీసి, ప్రతి కుటుంబ సభ్యుని పేరు మరియు రేఖాచిత్రాలు లేక చిత్రపటాలతో దానిని అలంకరించేలా మీరు సహాయపడవచ్చు. ఒక కుటుంబంగా మీరు మరింత ఐక్యతతో ఉండడానికి మీరు చేసే వాటిని కూడా మీరు పోస్టరు మీద వ్రాయవచ్చు. మీరు మోషే 7:18 కూడా చదువవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:29–30.సిద్ధపాటు అవసరమైన ఇటీవలి కుటుంబ లేక వ్యక్తిగత అనుభవాలను మీరు చర్చించవచ్చు. మీ సిద్ధపాటు ఆ అనుభవాన్ని ఎలా ప్రభావితం చేసింది? దేనికొరకు సిద్ధపడమని ప్రభువు మనల్ని కోరుచున్నారు? సిద్ధపడియుండడం భయపడకుండా ఉండేందుకు మనకెలా సహాయపడగలదు? సిద్ధపడడానికి మనమేమి చేయగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 40.“ఐహిక విచారములు” (2వ వచనము) అనే వాక్యభాగం మనకు ఏ అర్థాన్నిస్తుంది? దేవుని వాక్యమును “సంతోషముగా” స్వీకరించడం నుండి మనల్ని నిరోధించే ఐహిక విచారములు ఏవైనా ఉన్నాయా? వాటిని మనమెలా జయించగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

చిత్రం
పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

ఒహైయోలో సమకూడుట

చిత్రం
కర్ట్‌లాండ్ భవనాలు

కర్ట్‌లాండ్ గ్రామము, ఆల్ రౌండ్స్ చేత

ఫీబి కార్టర్

చిత్రం
ఫీబి కార్టర్ ఉడ్రఫ్

1830లో ఒహైయోలో సమకూడిన అనేకమంది పరిశుద్ధులలో ఫీబి కార్టర్ ఒకరు. ఆమె తల్లిదండ్రులు చేరనప్పటికీ, ఇరవై ఏళ్ళ వయస్సులో ఆమె ఈశాన్య సంయుక్త రాష్ట్రాలలో సంఘములో చేరింది. పరిశుద్ధులతో ఏకమవ్వడానికి ఒహైయోకు వెళ్ళాలనే తన నిర్ణయం గురించి ఆమె తరువాత వ్రాసింది:

“నాలాగే నా స్నేహితులు నా ప్రయాణం గురించి ఆశ్చర్యపడ్డారు, కానీ లోపల ఉన్నదేదో నన్ను ముందుకు త్రోసింది. నేను ఇల్లు విడిచి వెళ్తున్నప్పుడు నేను భరించగలిగిన దానికంటే ఎక్కువగా మా అమ్మ బాధపడింది; నాలో ఉన్న ఆత్మ వలన కాకపోతే, చివరలో నేను సంకోచించి ఆగిపోయేదానిని. క్రూరమైన లోకంలోకి నన్ను ఒంటరిగా పంపడం కంటే నేను సమాధి కావడాన్ని చూడడం మేలని మా అమ్మ నాతో చెప్పింది.

“మనస్సుకు తగిలేలా ఆమె నాతో, ‘(ఫీబి),’ ‘మోర్మనిజం తప్పని తెలిస్తే నువ్వు తిరిగి నా దగ్గరకు వస్తావా?’ అంది.

“‘అవును అమ్మా; నేను వస్తాను,‘ అని నేను జవాబిచ్చాను. … నా జవాబు ఆమె బాధను ఉపశమింపజేసింది; కానీ విడిపోవడానికి మేము చాలా బాధపడ్డాము. నేను వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, నేను వీడ్కోలు చెప్పే ధైర్యం చేయలేదు; అందువల్ల నేను ప్రతిఒక్కరికి వీడ్కోలు సందేశాలు వ్రాసి, వాటిని నా బల్లమీద పెట్టి పరిగెత్తుకుంటూ క్రిందికి వెళ్ళి బండి ఎక్కాను. ఆవిధంగా నేను నాకిష్టమైన చిన్ననాటి ఇంటిని వదిలిపెట్టి, దేవుని పరిశుద్ధులతో నా జీవితాన్ని ఏకం చేసుకోవడానికి వెళ్ళాను.”1

ఆ వీడ్కోలు సందేశాలలో ఒకదానిలో ఫీబి వ్రాసింది:

“ప్రియమైన తల్లిదండ్రులకు—నేనిప్పుడు కొంతకాలం కోసం నా తల్లిదండ్రుల ఇంటిని విడిచి వెళ్ళబోతున్నాను … ఎంతకాలమో నాకు తెలియదు—కానీ నా పసితనం నుండి ఇప్పటివరకు నేను పొందిన దయ కొరకు నేను కృతజ్ఞతాభావాలు కలిగియున్నాను—అయితే, ఇప్పుడున్న దానికి భిన్నంగా దేవుడు ఆజ్ఞాపించాడు అనిపిస్తోంది. ఈ విషయాలన్నిటినీ దేవుని చేతికి అప్పగిద్దాము మరియు మనం దేవుడిని అత్యుత్తమంగా ప్రేమించినట్లయితే, అన్నీ మన మంచి కొరకే జరుగుతాయని నమ్ముతూ, ఇంతకాలం అనుకూల పరిస్థితులలో మనం కలిసి జీవించడానికి అనుమతించబడినందుకు కృతజ్ఞత కలిగియుందాము. మనం ఒకే దేవుడిని ప్రార్థించగలమని తెలుసుకుందాము, ఆయన తన ప్రాణులన్నిటి యొక్క మనఃపూర్వక ప్రార్థనలు వింటారు మరియు మన కొరకు ఉత్తమమైన దానిని మనకిస్తారు. …

“అమ్మా, నేను పశ్చిమానికి వెళ్ళాలనేది దేవుని చిత్తమని నేను నమ్ముతున్నాను మరియు వెళ్ళాలని చాలాకాలం నుండి నేను ఒప్పించబడ్డాను. ఇప్పుడు వెళ్ళడం నాకు సాధ్యపడింది … ; దీనిని చేసింది ప్రభువు యొక్క ఆత్మయేనని నేను నమ్ముతున్నాను, అది చాలు అన్నిటికీ. నీ బిడ్డ గురించి ఆందోళన పడవద్దు; ప్రభువు నన్ను ఓదారుస్తాడు. ప్రభువు నన్ను కాపాడతారని మరియు అత్యుత్తమమైన దానిని నాకిస్తారని నేను నమ్ముతున్నాను. … నేను వెళ్తున్నాను, ఎందుకంటే నా యజమాని పిలుస్తున్నాడు—ఆయన నా బాధ్యతను స్పష్టం చేసాడు.”2

వివరణలు

  1. ఎడ్వర్డ్ డబ్ల్యు. టుల్లిడ్జ్, The Women of Mormondom (1877), 412 లో.

  2. తన తల్లిదండ్రులకు ఫీబి కార్టర్ ఉత్తరం, తేదీ వ్రాయలేదు, సంఘ చరిత్ర గ్రంథాలయం, సాల్ట్ లేక్ సిటీ; విరామచిహ్నాలు ఆధునికీకరించబడ్డాయి. 1834లో ఫీబి సంఘములో చేరింది, 1835 ప్రాంతంలో ఒహైయోకు వెళ్ళింది మరియు 1837లో విల్ఫర్డ్ వుడ్రఫ్‌ను వివాహం చేసుకుంది.

ముద్రించు