2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు


“మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు:2021

కుటుంబాలు లేఖనాలను అధ్యయనం చేయుట

మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు

మీ కుటుంబము సువార్తను నేర్చుకోవడానికి సహాయపడేందుకు క్రమంతప్పని కుటుంబ లేఖన అధ్యయనము ఒక శక్తివంతమైన మార్గము. మీ ప్రయత్నాలలో నిలకడగా ఉండడం కంటే కుటుంబంగా మీరు ఎంత మొత్తం మరియు ఎంత సమయం చదివారనేది అంత ముఖ్యము కాదు. మీ కుటుంబ జీవితంలో లేఖన అధ్యయనాన్ని ఒక ముఖ్యమైన భాగంగా మీరు చేసినప్పుడు, మీ కుటుంబ సభ్యులు ఒకరికొకరు మరియు యేసు క్రీస్తుకు దగ్గరవడానికి, ఆయన వాక్యము యొక్క పునాదిపై వారి సాక్ష్యాలను నిర్మించడానికి మీరు సహాయం చేస్తారు.

క్రింది ప్రశ్నలను పరిగణించండి:

  • స్వయంగా లేఖనాలను అధ్యయనం చేయడానికి కుటుంబ సభ్యులను మీరు ఎలా ప్రోత్సహించగలరు?

  • వారు నేర్చుకుంటున్న వాటిని పంచుకునేలా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి మీరు ఏమి చేయగలరు?

  • సిద్ధాంతము మరియు నిబంధనలులో మీరు నేర్చుకుంటున్న సూత్రాలను రోజువారీ బోధనా క్షణాల్లో మీరెలా నొక్కి చెప్పగలరు?

సువార్త అభ్యాసానికి గృహమే ఆదర్శమైన ప్రదేశమని గుర్తుంచుకోండి. సంఘ తరగతిలో సాధ్యం కాని మార్గాల్లో మీరు ఇంటివద్ద సువార్తను నేర్చుకోగలరు మరియు బోధించగలరు. లేఖనాల నుండి నేర్చుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడే మార్గాల గురించి మీరు ఆలోచించినప్పుడు సృజనాత్మకంగా ఉండండి.

ప్రోత్సాహకార్యక్రమ ఉపాయములు

మీ కుటుంబ లేఖన అధ్యయనాన్ని మెరుగుపరచడానికి క్రింది ఉపాయాలలో కొన్నింటిని పరిగణించండి:

సంగీతాన్ని ఉపయోగించండి

లేఖనాలలో బోధించబడిన సూత్రాలను బలపరిచే పాటలను పాడండి. సూచించబడిన ఒక కీర్తన లేక పిల్లల పాట ప్రతి వారం సారాంశంలో జాబితా చేయబడింది. పాటలలోని మాటలు లేక వాక్యభాగములను గూర్చి మీరు ప్రశ్నలు అడగవచ్చు. పాట పాడుటకు అదనముగా, మీ కుటుంబము పాటలకు తగినట్లుగా అభినయించవచ్చు లేక వారు ఇతర ప్రోత్సాహకార్యక్రమాలను చేస్తుండగా నేపథ్య సంగీతముగా పాటలను వినవచ్చు.

అర్థవంతమైన లేఖనాలను పంచుకోండి

వారి వ్యక్తిగత అధ్యయనంలో అర్థవంతమైనవిగా వారు కనుగొన్న లేఖన భాగాలను పంచుకోవడానికి కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వండి.

మీ స్వంత పదాలను ఉపయోగించండి

మీరు అధ్యయనం చేస్తున్న లేఖనాల నుండి వారు నేర్చుకున్న వాటిని వారి స్వంత మాటలలో సంక్షిప్తం చేయడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

లేఖనాలను మీ జీవితానికి అన్వయించుకోండి

ఒక లేఖన భాగాన్ని చదివిన తరువాత, ఆ భాగం వారి జీవితాలకు వర్తించే మార్గాలను పంచుకోమని కుటుంబ సభ్యులను అడగండి.

ఒక ప్రశ్న అడగండి

ఒక సువార్త ప్రశ్న అడగడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి, ఆపై ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సహాయపడే వచనాల కోసం వెతకండి.

ఒక లేఖనాన్ని ప్రదర్శించండి

మీకు అర్థవంతముగా అనిపించే వచనం ఎంచుకోండి మరియు కుటుంబ సభ్యులు తరచూ చూసే చోట దాన్ని ప్రదర్శించండి. ప్రదర్శించడానికి ఒక లేఖనాన్ని వంతుల వారీగా ఎంచుకోమని ఇతర కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

లేఖన జాబితాను తయారు చేయండి

వచ్చే వారంలో మీరు చర్చించదలచిన అనేక వచనాలను కుటుంబముగా ఎంచుకోండి.

లేఖనాలను కంఠస్థం చేయండి

మీ కుటుంబానికి అర్థవంతంగా అనిపించే ఒక లేఖన భాగాన్ని ఎంచుకోండి మరియు ప్రతిరోజూ పునరావృతం చేయడం ద్వారా లేదా జ్ఞాపకశక్తి ఆట ఆడటం ద్వారా దాన్ని కంఠస్థం చేయడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

వస్తుపాఠాలను పంచుకోండి

మీరు కుటుంబంగా చదువుతున్న అధ్యాయాలు మరియు వచనాలకు సంబంధించిన వస్తువులను కనుగొనండి. ప్రతి వస్తువు లేఖనాల్లోని బోధనలతో కలిగి ఉన్న సంబంధం గురించి మాట్లాడేందుకు కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

ఒక అంశమును ఎంపిక చేయండి

కుటుంబము కలిసి అధ్యయనం చేసే అంశాన్ని వంతుల వారీగా కుటుంబ సభ్యులు ఎంపిక చేయనివ్వండి. ఒక అంశం గురించి లేఖన భాగాలను కనుగొనడానికి విషయదీపిక, బైబిల్ నిఘంటువు, లేక లేఖనదీపిక (scriptures.ChurchofJesusChrist.org{) ఉపయోగించండి.

ఒక బొమ్మను గీయండి

కుటుంబంగా కొన్ని వచనాలను చదవండి, ఆపై మీరు చదివిన వాటికి సంబంధించిన బొమ్మ గీయడానికి కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వండి. ఒక్కొక్కరు గీసిన చిత్రాల గురించి చర్చించడానికి సమయం కేటాయించండి.

ఒక కథను అభినయించండి

ఒక కథను చదివిన తరువాత, దాన్ని అభినయించడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. తరువాత, మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబముగా అనుభవిస్తున్న విషయాలతో ఆ కథ ఎలా సంబంధం కలిగి ఉందో అనేదాని గురించి మాట్లాడండి.

పిల్లలకు బోధించుట

మీ కుటుంబములో చిన్న పిల్లలున్న యెడల, వారు నేర్చుకోవడానికి సహాయపడగల ప్రోత్సాహకార్యక్రమాలు కొన్ని ఇక్కడ కలవు:

పాడండి

కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకము లోని పాటలు సిద్ధాంతమును శక్తివంతముగా బోధిస్తాయి. సూచించబడిన ఒక పాటను ఈ వనరులోని ప్రతి సారాంశము కలిగియున్నది. మీరు బోధించే సువార్త సూత్రములకు సంబంధించిన పాటలను కనుగొనుటకు పిల్లల పాటల పుస్తకము వెనుక భాగంలో గల విషయముల సూచిక ను కూడా మీరు ఉపయోగించవచ్చు. పాటలలోని సందేశాలను వారి జీవితాలకు సంబంధింపజేసుకొనేలా పిల్లలకు సహాయం చేయండి.

ఒక కథను వినండి లేక అభినయించండి

లేఖనములనుండి, మీ జీవితము నుండి, సంఘ చరిత్ర నుండి, లేక సంఘ మాస పత్రికల నుండి కథలను చిన్న పిల్లలు ఇష్టపడతారు. కథను చెప్పుటలో వారిని చేర్చగల మార్గముల కొరకు వెదకండి. వారు వినే దాని చిత్రములను లేక వస్తువులను వారు పట్టుకోవచ్చు, చిత్రములను గీయవచ్చు, కథను అభినయించవచ్చు, లేక కథను చెప్పుటలో సహాయపడవచ్చు. మీరు పంచుకునే కథలలో సువార్త సత్యములను గుర్తించుటకు మీ పిల్లలకు సహాయపడండి.

ఒక లేఖనమును చదవండి

చిన్న పిల్లలు ఎక్కువగా చదవలేకపోవచ్చు, అయినప్పటికీ లేఖనములనుండి నేర్చుకొనుటలో మీరు వారిని నిమగ్నం చేయండి. మీరు ఒక వచనము, ముఖ్యమైన వాక్యభాగము, లేక పదముపై దృష్టిసారించవలసి రావచ్చు.

ఒక చిత్రమును లేక ఒక వీడియోను చూడండి

మీరు చర్చిస్తున్న సువార్త సూత్రానికి సంబంధించిన చిత్రము లేక వీడియో గురించి ప్రశ్నలు అడగండి. ఉదాహరణకు, “ఈ చిత్రములో జరుగుచున్నదేమిటి? అది మిమ్మల్ని ఏవిధంగా భావించునట్లు చేస్తుంది?” అని మీరు అడగవచ్చు. సువార్త గ్రంథాలయ యాప్, medialibrary.ChurchofJesusChrist.org, మరియు children.ChurchofJesusChrist.org అనునవి వీడియోలు మరియు చిత్రాలు చూడడానికి మంచి ఎంపికలు.

సృష్టించండి

పిల్లలు వారు నేర్చుకుంటున్న కథ లేక సూత్రానికి సంబంధించిన వాటిని నిర్మించవచ్చు, గీయవచ్చు, లేక రంగులు వేయవచ్చు.

వస్తు పాఠములలో పాల్గొనండి

గ్రహించుటకు కష్టమైన సువార్త సూత్రమును మీ పిల్లలు గ్రహించుటకు సరళమైన వస్తు పాఠము సహాయపడగలదు. వస్తు పాఠమును ఉపయోగించినప్పుడు, మీ పిల్లలు పాల్గొనుటకు అనుమతించు విధానములు కనుగొనండి. కేవలము ఒక ప్రదర్శనను చూచుట కంటే పరస్పర అనుభవము నుండి వారు ఎక్కువగా నేర్చుకుంటారు.

నటించి చూపుట

నిజ జీవితంలో వారు ఎదుర్కొనే ఒక పరిస్థితిని పిల్లలు నటించి చూపినప్పుడు, ఒక సువార్త సూత్రము తమ జీవితానికి ఎలా అన్వయించబడుతుందో వారు గ్రహించగలుగుతారు.

ప్రోత్సాహకార్యక్రమాలను పునరావృతం చేయండి

భావనలను గ్రహించడానికి చిన్న పిల్లలు వాటిని పలుమార్లు వినవలసిన అవసరమున్నది. ఉదాహరణకు, ఒక లేఖన వృత్తాంతమును అనేకసార్లు వేర్వేరు విధాలుగా—లేఖనాలనుండి చదువుట, మీ స్వంత మాటలలో సంక్షిప్తపరచుట, కథ చెప్పుటలో మీ పిల్లల్ని మీకు సహాయము చేయనిచ్చుట, ఒక కథను అభినయించుటకు వారిని ఆహ్వానించుట, మరియు మొదలైన విధానాలలో మీరు పంచుకోవచ్చు.

వారి వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యాలతో సంబంధాలను ఏర్పరచండి

వారి ఆత్మీయ, భౌతిక, మేధోపరమైన మరియు సామాజిక ఎదుగుదల కొరకు లక్ష్యాలను నిర్దేశించడానికి కుటుంబ లేఖన అధ్యయనము యౌవనులకు మరియు పిల్లలకు ప్రేరేపణనివ్వగలదు (లూకా 2:52 చూడుము).

కుటుంబము కలిసి నవ్వుట

యౌవనులకు బోధించుట

మీ కుటుంబములో యౌవనులున్న యెడల, వారు నేర్చుకోవడానికి సహాయపడగల ప్రోత్సాహకార్యక్రమాలు కొన్ని ఇక్కడ కలవు:

బోధించడానికి వారిని ఆహ్వానించండి

మనము ఒక విషయాన్ని వినినప్పటి కంటే దానిని బోధించినప్పుడు ఎక్కువగా నేర్చుకుంటాము. లేఖనాల గురించి కుటుంబ చర్చలను నడిపించడానికి మీ యౌవనులకు అవకాశాలివ్వండి.

సెమినరీతో సంబంధాలను ఏర్పరచండి

ఈ సంవత్సరం సెమినరీ విద్యార్థులు సిద్ధాంతము మరియు నిబంధనలు అధ్యయనం చేస్తున్నారు. మీ యౌవనులు సెమినరీకి హాజరవుతున్నట్లయితే, అక్కడ వారు నేర్చుకొనేదానిని పంచుకోమని వారిని ఆహ్వానించండి.

లేఖనాలను పోల్చండి

లేఖనాలలోని సిద్ధాంతాలు మరియు సూత్రాలు వారి జీవితాలతో ఏవిధమైన సంబంధం కలిగియున్నాయో చూడడం కొన్నిసార్లు యౌవనులకు కష్టంగా ఉండవచ్చు. ఇంటివద్ద, పాఠశాలలో, లేక వారి స్నేహితులతో వారు ఎదుర్కొనే పరిస్థితులతో లేఖనాలలోని కథలు మరియు బోధనలు ఎటువంటి సంబంధం కలిగియున్నాయో చూడడానికి వారికి సహాయపడండి.

ధ్యానించడాన్ని ప్రోత్సహించే ప్రశ్నలు అడగండి

లేఖనాలలో ఉన్నదానిని పువరావృతం చేయడం కంటే లేఖనాల గురించి వారి ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అనుమతించే ప్రశ్నలకు చాలామంది యౌవనులు బాగా స్పందిస్తారు. ఉదాహరణకు, “ఈ వచనాలలో ప్రభువు మీకు ఏమి బోధించవచ్చు?” లేక “1830ల లోని పరిశుద్ధులకు ఈ బయల్పాటు అర్థవంతమైనదై యుండవచ్చని మీరెందుకు అనుకుంటున్నారు?” అని మీరు అడగవచ్చు.

వారి వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యాలతో సంబంధాలను ఏర్పరచండి

వారి ఆత్మీయ, భౌతిక, మేధోపరమైన మరియు సామాజిక ఎదుగుదల కొరకు లక్ష్యాలను నిర్దేశించడానికి కుటుంబ లేఖన అధ్యయనము యౌవనులకు మరియు పిల్లలకు ప్రేరేపణనివ్వగలదు (లూకా 2:52 చూడండి).

వారి ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి

యౌవనుల నుండి వచ్చిన ఒక ప్రశ్న, సత్యాన్ని పంచుకోవడానికి మరియు అతడు లేక ఆమె ప్రత్యేక ఆసక్తి కలిగియున్న ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చిన అమూల్యమైన అవకాశము. ప్రశ్నలకు భయపడకండి లేదా చర్చిస్తున్న అంశంతో సంబంధం లేకపోయినప్పటికీ వాటిని త్రోసిపుచ్చకండి. మీ వద్ద అన్నింటికీ జవాబులు లేకపోయినా ఫరవాలేదు. కలిసి జవాబులను వెదకడానికి గృహమే ఆదర్శవంతమైన ప్రదేశము.

వారి అంతరార్థములను పంచుకోమని వారిని ప్రోత్సహించండి

కుటుంబ లేఖన అధ్యయనానికి తోడ్పడడానికి యౌవనులు ప్రత్యేక దృష్టికోణాలను, అంతరార్థములను కలిగియుంటారు. లేఖనాల గురించి ఆత్మ వారికి బోధించుచున్న దానిలో మీరు ఆసక్తి కలిగియున్నారని వారికి తెలియజేయండి. వారి వ్యక్తిగత అధ్యయనం నుండి అంతరార్థములను పంచుకోమని కూడా మీరు వారిని అడగవచ్చు.

మృదువుగా ఉండండి

కుటుంబ లేఖన అధ్యయనంలో పాల్గొనడానికి ఇష్టపడని యౌవనులు మీకున్నట్లయితే, అతడు లేక ఆమెను చేర్చకోవడానికి ఇతర మార్గాలను వెదకండి. ఉదాహరణకు, మీ సంభాషణలలో సహజంగా మీరు సువార్త గురించి మాట్లాడవచ్చు లేదా ఉపదేశిస్తున్నట్లుగా, నిర్భంధిస్తున్నట్లుగా అనిపించని విధానంలో అర్థవంతమైన లేఖనాన్ని పంచుకోవచ్చు. లేఖన అధ్యయనము ప్రతి కుటుంబములో ఒకేవిధంగా ఉండవలసిన అవసరం లేదు. ఒక్కొక్కరితో విడిగా లేఖనాలను అధ్యయనం చేయడం పట్ల కొద్దిమంది పిల్లలు బాగా స్పందించవచ్చు. ప్రార్థనాపూర్వకంగా ఉండండి మరియు ఆత్మ యొక్క ప్రేరేపణలను అనుసరించండి.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “సువార్త అభ్యాసానికి కేంద్రంగా మీరు మీ ఇంటిని మార్చడానికి శ్రద్ధగా పనిచేసినప్పుడు, కొంతకాలానికి మీ విశ్రాంతి దినములు నిజంగా సంతోషభరితమవుతాయని నేను వాగ్దానమిస్తున్నాను. మీ పిల్లలు రక్షకుని బోధనలను నేర్చుకోవడానికి, జీవించడానికి ఆరాటపడతారు, మరియు మీ జీవితంలో, మీ ఇంటిలో అపవాది ప్రభావము తగ్గుతుంది. మీ కుటుంబములో మార్పులు నాటకీయంగా మరియు ఆమోదయోగ్యంగా ఉంటాయి” (“ఆదర్శవంతమైన కడవరి-దిన పరిశుద్ధులగుట,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2018, 113).