“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనము మెరుగుపరచుకొనుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనము మెరుగుపరచుకొనుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
మీ వ్యక్తిగత లేఖన అధ్యయనము మెరుగుపరచుకొనుటకు ఉపాయములు
లేఖనాలలో దేవుని వాక్యము యొక్క మీ అధ్యయనాన్ని మెరుగుపరిచే కొన్ని సులువైన మార్గాలు ఇక్కడున్నాయి.
ప్రేరేపణ కొరకు ప్రార్థించండి
లేఖనాలు దేవుని యొక్క వాక్యము గనుక, వాటిని అర్థం చేసుకొనుటకు ఆయన సహాయము కోరండి.
యేసు క్రీస్తు గురించి సత్యముల కొరకు చూడండి
సమస్త సంగతులు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చునని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి (2 నీఫై 11:4; మోషే 6:63 చూడండి), కాబట్టి రక్షకుడి గురించి సాక్ష్యమిచ్చి, ఆయన పట్ల మీకున్న ప్రేమను బలపరచి, ఆయనను ఎలా అనుసరించాలో నేర్పే వచనాలను గమనించడాన్ని లేదా గుర్తించడాన్ని పరిగణించండి.
ప్రేరేపించే పదములు మరియు వాక్యభాగముల కొరకు వెదకండి
లేఖనములందు మీ కోసం ప్రత్యేకంగా వ్రాయబడినట్లుగా, మిమ్మల్ని ముగ్ధులను చేసే కొన్ని నిర్ధిష్టమైన పదములు మరియు వాక్యభాగములను మీరు కనుగొనవచ్చు. అవి వ్యక్తిగతంగా మీకు సంబంధితమైనవిగా అనిపించి, మిమ్మల్ని ప్రేరేపించి, ప్రోత్సహించవచ్చు. వాటిని మీ లేఖనాలలో గుర్తించుటకు లేక దినచర్య పుస్తకములో వ్రాయుటకు ఆలోచించండి.
సువార్త సత్యముల కొరకు వెదకండి
కొన్నిసార్లు సువార్త సత్యములు (సిద్ధాంతము లేక సూత్రముగా తరచుగా పిలువబడినవి) సూటిగా వ్యాఖ్యానించబడతాయి, మరికొన్నిసార్లు అవి ఒక ఉదాహరణ లేక వృత్తాంతము ద్వారా సూచించబడతాయి. “ఈ వచనములలో బోధించబడిన నిత్య సత్యములేవి?” అని మీకై మీరు ప్రశ్నించుకోండి.
ఆత్మను ఆలకించండి
మీరు చదువుతున్న దానికి సంబంధించకపోయినప్పటికీ, మీ ఆలోచనలు మరియు భావనలపట్ల శ్రద్ధ వహించండి. ఆ మనోభావాలే మీ పరలోక తండ్రి మీరు నేర్చుకోవాలని కోరే విషయాలు కావచ్చు.
లేఖనాలను మీ జీవితమునకు పోల్చుకోండి
మీరు చదువుతున్న వృత్తాంతములు మరియు బోధనలు ఏవిధంగా మీ జీవితానికి వర్తిస్తాయో ఆలోచించండి. ఉదాహరణకు, మీకై మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు, “నాకు కలిగిన ఏ అనుభవాలు నేను చదివిన దానిని పోలియున్నాయి?” లేక “లేఖనాలలోని ఈ వ్యక్తి యొక్క మాదిరిని నేను ఎలా అనుసరించగలను?”
మీరు అధ్యయనము చేస్తున్నప్పుడు ప్రశ్నలు అడగండి
మీరు లేఖనాలను అధ్యయనము చేస్తున్నప్పుడు, మీ మనస్సులో ప్రశ్నలు తలెత్తవచ్చు. ఈ ప్రశ్నలు మీరు చదివే దానికి లేక సాధారణంగా మీ జీవితానికి సంబంధించినవైయుండవచ్చు. మీరు లేఖనాలను అధ్యయనము చేయుట కొనసాగించినప్పుడు, ఈ ప్రశ్నలను ధ్యానించండి మరియు జవాబుల కొరకు వెదకండి.
లేఖన అధ్యయన సహాయములను ఉపయోగించండి
మీరు చదువు వచనాల యొక్క అదనపు అంతరార్థములను తెలుసుకొనుటకు, పాదవివరణలను, విషయదీపిక, బైబిల్ నిఘంటువు, లేఖనదీపిక (scriptures.ChurchofJesusChrist.org) మరియు ఇతర అధ్యయన సహాయకాలను ఉపయోగించండి.
లేఖనాల సందర్భాన్ని పరిగణించండి
అది వచ్చిన పరిస్థితులు లేదా అమరికతో సహా దాని సందర్భాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఒక లేఖన భాగము గురించి అర్థవంతమైన అంతరార్థములను మీరు కనుగొనవచ్చు. ఉదాహరణకు, దేవుడు మాట్లాడిన మనుషుల యొక్క నమ్మకాలను మరియు నేపథ్యాన్ని తెలుసుకోవడం, ఆయన మాటల ఉద్దేశాన్ని బాగా అర్థంచేసుకోవడానికి మీకు సహాయపడగలదు.
మీ ఆలోచనలు మరియు మనోభావాలను నమోదు చేయండి
మీరు అధ్యయనము చేస్తున్నప్పుడు కలిగే మనోభావాలను నమోదు చేయుటకు అనేక విధానములున్నాయి. ఉదాహరణకు, మీరు ఒక అర్థవంతమైన పదము లేక వాక్యభాగమును గుర్తించవచ్చు మరియు మీ లేఖనములందు ఒక వివరణగా మీ ఆలోచనలను వ్రాయవచ్చు. మీరు పొందే అంతరార్థములు, భావనలు మరియు మనోభావాలతో దినచర్య పుస్తకము కూడా వ్రాసుకోవచ్చు.
కడవరి-దిన ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలను అధ్యయనము చేయండి
లేఖనములందు మీరు కనుగొనే సూత్రములను గూర్చి కడవరి-దిన ప్రవక్తలు మరియు అపొస్తలులు బోధించిన దానిని చదవండి (ఉదాహరణకు, conference.ChurchofJesusChrist.org మరియు Church magazines చూడండి).
అంతరార్థములను పంచుకోండి
మీ వ్యక్తిగత అధ్యయనము నుండి అంతరార్థములను చర్చించుట ఇతరులకు బోధించుటకు మంచి విధానము మాత్రమే కాదు, కానీ మీరు చదివిన దానిని గూర్చి మీ అవగాహనను బలపరచుటకు కూడా అది సహాయపడుతుంది.
మీరు నేర్చుకున్నదాని ప్రకారము జీవించండి
లేఖన అధ్యయనము మనల్ని ప్రేరేపించడం మాత్రమే కాదు, కానీ అది మనం జీవిస్తున్న మార్గాన్ని మార్చేలా కూడా ఉండాలి. మీరు చదువుతున్నప్పుడు ఆత్మ మిమ్మల్ని ఏమి చేయమని ప్రేరేపిస్తుందో వినండి, తరువాత ఆ ప్రేరణలపై పనిచేయడానికి కట్టుబడి ఉండండి.