“రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట
ఈ వనరు ఎవరి కొరకైనది?
ఈ వనరు సంఘములోని ప్రతి వ్యక్తి మరియు కుటుంబము కొరకైనది. మీ స్వంతంగానైనా లేక మీ కుటుంబంతోనైనా సువార్తను నేర్చుకోవడానికి మీకు సహాయపడేందుకు ఇది రూపొందించబడింది. గతంలో మీరు క్రమం తప్పక సువార్తను అధ్యయనం చేయనట్లయితే, మీరు ప్రారంభించడానికి ఈ వనరు సహాయపడగలదు. సువార్తను అధ్యయనం చేసే మంచి అలవాటు మీకు ఇదివరకే ఉన్నట్లయితే, మరిన్ని అర్థవంతమైన అనుభవాలను కలిగియుండేందుకు ఈ వనరు మీకు సహాయపడగలదు.
ఈ వనరును నేనెలా ఉపయోగించాలి?
మీకు సహాయకరంగా ఉండే ఏ విధానంలోనైనా ఈ వనరును ఉపయోగించండి. వ్యక్తిగత మరియు కుటుంబ లేఖన అధ్యయనం కొరకు ఒక మార్గదర్శిగా లేక సహాయముగా మీరు దీనిని ఉపయోగకరమైనదిగా కనుగొనగలరు. మీరు దీనిని కుటుంబ గృహ సాయంకాలము కొరకు కూడా ఉపయోగించవచ్చు. ఇందులోని సారాంశాలు సిద్ధాంతము మరియు నిబంధనలు లో కనుగొనబడే ముఖ్యమైన సూత్రాలను నొక్కి చెప్తాయి, వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు అధ్యయన ఉపాయాలను, ప్రోత్సాహ కార్యక్రమాలను సూచిస్తాయి, మరియు మీ మనోభావాలను నమోదు చేయడానికి స్థలమును అందిస్తాయి.
రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు అనునది మీరు చేస్తున్న మంచి పనులకు బదులుగా లేక వాటితో పోటీపడేందుకు ఉద్దేశించబడినది కాదు. దేవుని వాక్యాన్ని మీ స్వంత పద్ధతిలో ఎలా అధ్యయనం చేయాలో నిర్థారించడానికి ఆత్మ యొక్క నడిపింపును అనుసరించండి.
సంఘంలో జరిగే దానితో ఈ వనరు ఏవిధమైన సంబంధం కలిగియుంది?
ఈ వనరులోని సారాంశాలు ఒక వారపు పఠన పట్టిక ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు మరియు రండి, నన్ను అనుసరించండి—ఆదివారపు బడి కొరకు అదే పట్టికను అనుసరిస్తాయి. సువార్తను నేర్చుకొని, జీవించడానికి ఇంటివద్ద మీ ప్రయత్నాలలో సహకరించేందుకు, ఇంటివద్ద మీరు చదువుతున్న లేఖన భాగాల గురించి మీ అనుభవాలను, ఆలోచనలను మరియు ప్రశ్నలను పంచుకోవడానికి సంఘములో మీ బోధకులు మీకు అవకాశాన్ని ఇస్తారు.
ఆదివారపు బడి నెలకు రెండుసార్లు మాత్రమే బోధించబడుతుంది కాబట్టి, వారపు కాలపట్టికతో పాటు నిలిచేందుకు ఆదివారపు బడి యొక్క బోధకులు సారాంశాలను వదిలివేయడానికి లేక కలిపి చెప్పడానికి ఎంచుకోవచ్చు. స్టేకు సమావేశం లేక ఇతర కారణాల వల్ల క్రమమైన సంఘ కూడికలు జరుగని వారాలలో కూడా ఇది అవసరం కావచ్చు. ఈ వారాలలో ఇంటివద్ద సిద్ధాంతము మరియు నిబంధనల అధ్యయనాన్ని కొనసాగించడానికి మీరు ఆహ్వానించబడ్డారు.
నేను పట్టికను అనుసరించవలెనా?
ఈ పట్టిక సంవత్సరాంతం లోపు సిద్ధాంతము మరియు నిబంధనలు చదవడాన్ని పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది. అదనంగా, ఇతరుల వలే అదే పట్టికను అనుసరించడమనేది గృహములో, సంఘములో మరియు అన్నిచోట్లా అర్థవంతమైన అనుభవాలకు దారితీస్తుంది. కానీ పట్టికకు కట్టుబడి ఉండనవసరము లేదు లేదా ప్రతి వచనం చదువుటకు బలవంతం చేయబడవద్దు; పట్టిక కేవలం మిమ్మల్ని వేగవంతం చేయడంలో సహాయపడడానికి ఇవ్వబడింది. ముఖ్యమైన విషయమేదనగా, మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబంగా సువార్తను నేర్చుకుంటున్నారు.