2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
పరివర్తనే మన లక్ష్య


“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

లేఖనాలను అధ్యయనం చేయుచున్న స్త్రీ

పరివర్తనే మన లక్ష్యం

యేసు క్రీస్తు పట్ల మన పరివర్తనను హెచ్చించడం మరియు ఆయన వలె ఎక్కువగా కావడానికి మనకు సహాయపడడమే సమస్త సువార్త అభ్యాసము మరియు బోధన యొక్క లక్ష్యము. ఈ కారణంగా సువార్తను అధ్యయనం చేసినప్పుడు, మనం కొత్త సమాచారం కోసం చూడడం లేదు; మనం “నూతన సృష్టిగా” మారాలి అని అనుకుంటున్నాము (2 కొరిథీయులకు 5:17). దీని అర్థము మన హృదయాలు, మన అభిప్రాయాలు, మన చర్యలు మరియు మన స్వభావాలను మార్చుకొనుటలో సహాయపడుటకు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై ఆధారపడడం.

కాని మన విశ్వాసాన్ని బలపరచి, పరివర్తన అనే అద్భుతానికి నడిపించే అటువంటి సువార్త అభ్యాసమంతా ఒకేసారి జరుగదు. ఇది తరగతి గదులు దాటి వ్యక్తి యొక్క హృదయము మరియు గృహానికి వ్యాపిస్తుంది. సువార్తను అర్థం చేసుకొని, జీవించడానికి నిలకడయైన, అనుదిన ప్రయత్నాలు అవసరము. కానీ దానిని మనం ఒంటరిగా చేయాలని పరలోక తండ్రి ఆశించరు—మనము పరివర్తన చెందడానికి సహాయపడేందుకు ఆయన పరిశుద్ధాత్మను పంపుతారు.

పరిశుద్ధాత్మ మనల్ని సత్యమునకు నడిపించి, ఆ సత్యము గురించి సాక్ష్యమిచ్చును (యోహాను 16:13 చూడండి). ఆయన మన మనస్సులను వెలుగుతో నింపును, మన అవగాహనను వేగవంతము చేయును మరియు సమస్త సత్యమునకు మూలాధారమైన దేవుని నుండి బయల్పాటుతో మన హృదయాలను తాకును. పరిశుద్ధాత్మ మన హృదయాలను శుద్ధి చేయును. సత్యమును బట్టి జీవించాలనే కోరికను ఆయన మనలో ప్రేరేపించును మరియు దానిని చేసే విధానాలను గుసగుసగా మనకు తెలియజేయును. నిజముగా, “పరిశుద్ధాత్మ … సమస్తమును (మనకు) బోధించును” (యోహాను 14:26).

ఈ కారణాలను బట్టి, సువార్తను జీవించి, అభ్యసించి, బోధించేందుకు మన ప్రయత్నాల్లో మనము అన్నిటికంటే ముందుగా ఆత్మ యొక్క సహవాసాన్ని వెదకాలి. ఈ లక్ష్యము మన ఎంపికలను ప్రభావితం చేయాలి, మన ఆలోచనలను మరియు క్రియలను నడిపించాలి. ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించే ప్రతిదానిని మనం కోరుకోవాలి మరియు ఆ ప్రభావాన్ని పారద్రోలే ప్రతిదానిని తిరస్కరించాలి—ఎందుకనగా, పరిశుద్ధాత్మ సమక్షంలో మనము యోగ్యులుగా ఉండగలిగినట్లయితే, పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు సమక్షంలో జీవించడానికి కూడా మనము యోగ్యులము కాగలము.