“ఫిబ్రవరి 8–14. సిద్ధాంతము మరియు నిబంధనలు 12–13; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75: ‘నా తోటి సేవకులైన మీపై,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“ఫిబ్రవరి 8–14. సిద్ధాంతము మరియు నిబంధనలు 12–13; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
ఫిబ్రవరి 8–14
సిద్ధాంతము మరియు నిబంధనలు 12–13; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75
“నా తోటి సేవకులైన మీపై”
వారు లేఖనాల నుండి నేర్చుకున్న సత్యాల గురించి ప్రార్థించినప్పుడు, జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీ అదనపు జ్ఞానాన్ని పొందారు (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:68 చూడండి). వారి మాదిరిని మీరు ఎలా అనుసరిస్తారు?
మీ మనోభావాలను నమోదు చేయండి
ప్రపంచవ్యాప్తంగా చాలామంది హార్మొని, పెన్సిల్వేనియా అనే ప్రాంతం గురించి ఎన్నడూ వినియుండకపోవచ్చు. కానీ ప్రభువు తరచు ఆయన రాజ్యంలో అత్యంత ముఖ్యమైన సంఘటనల కొరకు అప్రసిద్ధ ప్రదేశాలను ఎంచుకుంటారు. 1829, మే 15న హార్మొని దగ్గర దట్టమైన చెట్లుగల ప్రదేశంలో బాప్తీస్మమిచ్చు యోహాను ఒక పునరుత్థానుడైన వ్యక్తిగా జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు అగుపించాడు. అతడు తన చేతులను వారి తలలపై ఉంచి, వారిని “నా తోటి సేవకులు” అని పిలుస్తూ వారిపై అహరోను యాజకత్వాన్ని ప్రోక్షించాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1).
రక్షకునికి బాప్తీస్మమిచ్చి, ఆయన రాకడ కొరకు మార్గాన్ని సిద్ధం చేసిన బాప్తీస్మమిచ్చు యోహాను తోటి సేవకులుగా పరిగణించబడడం (మత్తయి 3:1–6, 13–17 చూడండి) ఇరవైలలో ఉన్న ఈ ఇద్దరు యువకులను వినమ్రంగా, అలాగే ముంచివేయబడినట్లుగా భావింపజేసియుండవచ్చు. ఆ సమయంలో హార్మొని వలె జోసెఫ్, ఆలీవర్‌లు కూడా ప్రఖ్యాతి చెందినవారు కాదు. కానీ దేవుని కార్యములో సేవచేయడం ఎల్లప్పుడూ మనం ఎలా సేవచేస్తామనే దానికి సంబంధించినదే కానీ ఎవరు గమనిస్తారని కాదు. కొన్నిసార్లు మీ సహాయం ఎంత చిన్నదైనప్పటికీ, తెలియబడనప్పటికీ మీరు కూడా ప్రభువు యొక్క గొప్ప కార్యములో తోటి సేవకులే.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
సీయోను హేతువును స్థాపించడంలో సహాయపడాలని ప్రభువు నన్ను కోరుతున్నారు.
జోసెఫ్ నైట్ సీ. మరియు ఆయన భార్య పోల్లీ, 20 ఏళ్ళ వయస్సులో అతడు కోల్స్విల్, న్యూయార్క్‌లో ఉన్న వారి పొలంలో పనిచేయడం ప్రారంభించినప్పుడు జోసెఫ్ స్మిత్‌ను కలుసుకున్నారు. అతని వద్ద పనిచేసేవారిలో మంచి పనివాడని జోసెఫ్ నైట్ అతని గురించి వర్ణించాడు. బంగారు పలకల గురించి జోసెఫ్ స్మిత్ సాక్ష్యాన్ని అతడు నమ్మాడు మరియు హార్మొని, పెన్సిల్వేనియాలో అతని ఇంటిలో జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథాన్ని అనువదిస్తున్నప్పుడు ఆయనను కలుసుకోవడానికి పోల్లీని తీసుకువెళ్ళాడు. ఆమె వెంటనే నమ్మింది. వారి జీవితాంతము జోసెఫ్, పోల్లీలు పునఃస్థాపించబడిన సువార్త పట్ల విశ్వాసంగా నిలిచారు. 60 మందికి పైగా నైట్ కుటుంబ సభ్యులు సంఘంలో చేరి న్యూయార్క్, ఓహైయో, మిస్సోరి, నావూ మరియు చివరకు సాల్ట్ లేక్ సిటీలలో సంఘాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడ్డారు.
ప్రభువు యొక్క కార్యములో తాను ఏవిధంగా సహాయపడగలడో తెలుసుకోవాలని జోసెఫ్ నైట్ కోరుకున్నాడు. ప్రభువు యొక్క సమాధానము (ఇప్పుడు సిద్ధాంతము మరియు నిబంధనలు 12) మీతో పాటు “ఈ కార్యమును ముందుకు తీసుకొనివచ్చి, స్థాపించుటకు కోరికలుగల వారందరికి” (7వ వచనము) వర్తిస్తుంది. మీ దృష్టిలో “సీయోను హేతువును ముందుకు తీసుకొనివచ్చి, స్థాపించుట” అనగా అర్థమేమిటి? (6వ వచనము). దీనిని చేయడానికి 7–9 వచనాల లోని సూత్రాలు, గుణాలు మీకెలా సహాయపడతాయి?
“The Knight and Whitmer Families,” Revelations in Context, 20–24 కూడా చూడండి.
అహరోను యాజకత్వము బాప్తీస్మమిచ్చు యోహాను చేత పునఃస్థాపించబడింది.
ఒక్క వాక్యములో బాప్తీస్మమిచ్చు యోహాను అహరోను యాజకత్వము గురించి అనేక సత్యాలను బయల్పరిచాడు. (ప్రకరణ శీర్షకతో కలిపి) ఈ ప్రకరణము నుండి మీరు నేర్చుకొనే వాటన్నిటిని జాబితా చేయడాన్ని పరిగణించండి. మీరు కనుగొనే కొన్ని వాక్యభాగాలను అధ్యయనం చేయడం మీకు సహాయకరంగా ఉండవచ్చు. మీరు ప్రారంభించడానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి:
-
“దేవదూతల పరిచర్య యొక్క తాళపుచెవులు”: 2 నీఫై 32:2–3; మొరోనై 7:29–32; జెఫ్రీ ఆర్. హాలండ్, “The Ministry of Angels,” ఎన్‌సైన్ లేక Liahona, నవ. 2008, 29–31; లేఖన సూచిక, “దేవదూతలు,” scriptures.ChurchofJesusChrist.org
-
“పశ్చాత్తాప సువార్త యొక్క తాళపుచెవులు”: 3 నీఫై 27:16–22; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:26–27; డేల్ జి. రెన్లండ్, “యాజకత్వము మరియు రక్షకుని ప్రాయశ్చిత్త శక్తి,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2017, 64–67
-
“లేవి కుమారులు”: సంఖ్యాకాండము 3:5–13; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:31–34; లేఖన సూచిక, “అహరోను యాజకత్వము,” “లేవి,” scriptures.ChurchofJesusChrist.org
అహరోను యాజకత్వము యొక్క విధుల ద్వారా మీరు ఏ దీవెనలను పొందారు?
విధులు మనకు దేవుని శక్తికి ప్రవేశాన్నిస్తాయి.
ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షత్వములో మాజీ సలహాదారిణియైన సహోదరి కేరోల్ ఎమ్. స్టీఫెన్స్ ఇలా బోధించారు: “యాజకత్వపు విధులు మరియు నిబంధనలు దేవుడు మనకు వాగ్దానమిచ్చిన సంపూర్ణ దీవెనలకు ప్రవేశాన్నిస్తాయి, అవి రక్షకుని ప్రాయశ్చిత్తము ద్వారా సాధ్యం చేయబడ్డాయి. అవి దేవుని కుమారులు, కుమార్తెలకు శక్తిని, దేవుని శక్తిని ధరింపజేస్తాయి మరియు నిత్యజీవము పొందే అవకాశాన్ని మనకు అందిస్తాయి” (“Do We Know What We Have?” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2013, 12).
71వ వచనము చివరనున్న గమనికతో కలిపి మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75 చదివినప్పుడు, బాప్తీస్మము గురించి విచారించడానికి జోసెఫ్ మరియు ఆలీవర్‌లను ప్రేరేపించిన దానిని పరిగణించండి మరియు యాజకత్వపు విధులలో పాల్గొనిన తర్వాత వారికి వచ్చిన దీవెనలను గమనించండి. విధులను పొందిన తర్వాత మీరు దినచర్య పుస్తకంలో వ్రాసిన వాటిని చదవడం లేక ఆ సంఘటనల గురించి మీ జ్ఞాపకాలను నమోదు చేయడాన్ని పరిగణించండి. యాజకత్వపు విధుల ద్వారా మీరు ఏ దీవెనలను పొందారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20–22; Saints, 1:65–68 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 12:8.మనము ప్రభువు యొక్క కార్యాన్ని చేస్తున్నప్పుడు ఈ వచనంలో చెప్పబడిన స్వభావాలు ఎందుకు ముఖ్యమైనవి?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 13.అహరోను యాజకత్వము యొక్క పునఃస్థాపనలో మీ కుటుంబము యొక్క విశ్వాసాన్ని ఏది బలపరచగలదు? అహరోను యాజకత్వము యొక్క పునఃస్థాపనను మీ కుటుంబము ఊహించడానికి ఈ సారాంశముతో పాటు ఉన్న కళాకృతి సహాయపడగలదు. వారు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:68–74లో చదివిన దానిపై ఆధారపడి ఆ సంఘటనను చిత్రీకరించడాన్ని వారు ఆనందిస్తారా? వారి జీవితాల్లో యాజకత్వపు శక్తి గురించి వారి సాక్ష్యాలను కూడా వారు పంచుకోవచ్చు.
-
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:68.మన ప్రశ్నలకు జవాబులు కనుగొనడానికి మనము జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీల మాదిరిని ఎలా అనుసరించగలము? బహుశా మీరు కలిసి చదువుతున్నప్పుడు, మీరు మధ్యలో ఆగి, వారు చదువుతున్న దానిలో ఎవరికైనా సందేహాలున్నాయేమోనని అడగడాన్ని అలవాటుగా చేసుకోవచ్చు.
-
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:71, గమనిక.ఆలీవర్ కౌడరీ మాటలలో మీ కుటుంబ సభ్యులకు బాగా నచ్చినదేమిటి? మీ కుటుంబము “ఎన్నటికీ మరచిపోలేని రోజులు” కొన్ని ఏవి?
-
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:73–74.జోసెఫ్ మరియు ఆలీవర్‌లపై పరిశుద్ధాత్మ ఎటువంటి ప్రభావం చూపాడు? లేఖనాలను గ్రహించి, ప్రభువు యందు ఆనందించేలా ఆత్మ మీ కుటుంబానికి ఎప్పుడు సహాయపడింది?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.