2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
ఫిబ్రవరి 15–21. సిద్ధాంతము మరియు నిబంధనలు 14–17: “సాక్షిగా నిలబడుము”


“ఫిబ్రవరి 15–21. సిద్ధాంతము మరియు నిబంధనలు 14–17: ‘సాక్షిగా నిలబడుము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“ఫిబ్రవరి 15–21. సిద్ధాంతము మరియు నిబంధనలు 14–17,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
మోకరించి ప్రార్థించుచున్న జోసెఫ్ స్మిత్ మరియు ముగ్గురు సాక్షులు

ఫిబ్రవరి 15–21

సిద్ధాంతము మరియు నిబంధనలు 14–17

“సాక్షిగా నిలబడుము”

వారు ఏమి చేయవలెనని దేవుడు కోరుచున్నాడో తెలుసుకొనుటకు బయల్పాటును పొందమని జోసెఫ్ స్మిత్ కుటుంబము మరియు స్నేహితులు ఆయనను కొన్నిసార్లు అడిగేవారు. ఈ బయల్పాటులను మీరు చదువుతున్నప్పుడు, దేవుడు మీ కొరకు ఏ నిర్దేశాన్ని కలిగియున్నాడో పరిగణించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

అనువాద కార్యము బాగా పురోగమిస్తున్నప్పటికీ, 1829 మే నాటికి హార్మొనిలో పరిస్థితి జోసెఫ్, ఎమ్మా మరియు ఆలీవర్‌లకు మరింత కష్టమైంది. పొరుగువారి నుండి శత్రుత్వం పెరుగుచుండగా, ఎమ్మా కుటుంబం నుండి మద్దతు క్షీణించుచుండెను. హార్మొని ఇకపై సురక్షితం కాదని భావించిన ఆలీవర్, జోసెఫ్ పని పట్ల ఆసక్తి చూపిన తన స్నేహితుడైన డేవిడ్ విట్మర్‌ను సమీపించాడు. డేవిడ్ తన తల్లిదండ్రులు మరియు తోబుట్టువులతో కలిసి 100 మైళ్ల దూరంలో న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో నివసించాడు. అతడు ఒక సంవత్సరం ముందే ఆలీవర్‌ను కలిశాడు, అప్పటినుండి ఆలీవర్ అతనికి అనేక లేఖలు రాశాడు, ప్రవక్తతో కలిసి పనిచేసిన తన అనుభవాలను పంచుకున్నాడు. డేవిడ్ లేదా అతని కుటుంబంలో ఎవరూ జోసెఫ్‌ను ఎన్నడూ కలవలేదు. మోర్మన్ గ్రంథ అనువాదం పూర్తి చేయడానికి అతడు మరియు జోసెఫ్‌ తన ఇంటికి రావచ్చా అని విట్మర్‌ను ఆలీవర్ అడిగినప్పుడు, విట్మర్ కుటుంబీకులు వెంటనే వారిని స్వాగతించారు. ప్రవక్తకు నివాసం ఏర్పాటుచేయడంతో పాటు మరిన్ని సంగతులు విట్మర్ కుటుంబీకుల కోసం ప్రభువు దాచి ఉంచెను. ఆయన వారి కొరకు కొన్ని నిర్దిష్ట సూచనలను కలిగియుండెను, అవి సిద్ధాంతము మరియు నిబంధనలు 14–17 లో కనుగొనబడును, మరియు కాలక్రమేణా వారు సంఘమునకు పునాదిగా ఉన్న కుటుంబాలలో ఒకటిగా ఉండి, పునఃస్థాపనకు సాక్షులుగా మారవలసి ఉండెను.

విట్మర్ కుటుంబము గురించి మరింత తెలుసుకొనుటకు Saints, 1:68–71 చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 14

దేవుని యొక్క “గొప్ప ఆశ్చర్యకరమైన కార్యము” లో నేను పాల్గొనగలను.

జోసెఫ్ స్మిత్‌ను కలిసినప్పుడు, డేవిడ్ విట్మర్ తన కుటుంబ పొలంలో తన పనికి అంకితమైన యువకుడు. కానీ ప్రభువు తన మనసులో డేవిడ్‌ కొరకు భిన్నమైన పని కలిగి ఉండెను, కొన్ని విధాలుగా అది వ్యవసాయం లాంటిదే. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు14: 1–4 చదువుతున్నప్పుడు, ప్రభువు తన పనిని డేవిడ్‌కు తెలిసిన పనితో ఎలా పోల్చుచుండెనో గమనించండి. ఈ పోలిక నుండి ప్రభువు కార్యము గురించి మీరు ఏమి నేర్చుకుంటారు?

ఏ విధంగా మీరు “[మీ] కొడవలితో కోయుదురు”? (4వ వచనము). “సీయోనును (6వ వచనము) … ముందుకు తెచ్చి, స్థాపించుటకు ప్రయత్నించుచున్న” వారికి ఈ ప్రకరణమంతటా ఇవ్వబడిన వాగ్దానాలను గమనించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 14:2

దేవుని వాక్యము “జీవముగలది శక్తివంతమైనది.”

ప్రభువు తన వాక్యమును “రెండంచులు గల ఖడ్గము” తో పోల్చెను (సిద్ధాంతము మరియు నిబంధనలు14:2). ఈ పోలిక దేవుని వాక్యము గురించి మీకేమి సూచిస్తుంది? ఉదాహరణకు, ఆయన వాక్యము ఏవిధముగా జీవముగలది శక్తివంతమైనది మరియు పదునైనది? దేవుని వాక్యము యొక్క శక్తిని మీరేవిధంగా అనుభవించారు?

దేవుడు తన వాక్యమును వివరించు ఇతర మార్గాలను పరిగణించండి. ఉదాహరణకు, ఈ క్రింది భాగాలలోని పోలికల నుండి మీరు దేవుని వాక్యము గురించి ఏమి నేర్చుకుంటారు?

కీర్తనలు 119:105 

యెషయా 55:10–11 

మత్తయి 4:4 

1 నీఫై 15:23–24 

ఆల్మా 32:28 

చిత్రం
లేఖనములపై ఖడ్గము

ప్రభువు తన వాక్యమును ఖడ్గముతో పోల్చెను.

సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7

నిత్యజీవము “దేవుని బహుమానములన్నింటిలో కెల్లా గొప్పది.”

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7 చదువుతున్నప్పుడు, నిత్యజీవము “దేవుని బహుమానములన్నింటిలో కెల్లా గొప్పది” ఎందుకో ధ్యానించండి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి ఈ అంతర్దృష్టి సహాయపడవచ్చు: “దేవుని యొక్క గొప్ప సంతోష ప్రణాళిక ప్రకారం, కుటుంబాలు దేవాలయాలలో ముద్రింపబడగలవు మరియు ఆయన పవిత్ర సన్నిధిలో శాశ్వతంగా నివసించడానికి తిరిగి రావడానికి సిద్ధపడగలవు. అదియే నిత్యజీవము!” (“Thanks Be to God,” Ensign or Liahona, May 2012, 77).

నిత్యజీవము గురించి మరింతగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే 7వ వచనము నకు పదబంధాలను జోడించడాన్ని పరిగణించండి (విషయదీపిక లేదా లేఖనదీపిక, scriptures.ChurchofJesusChrist.orgలో “నిత్యజీవము” చూడండి). నిత్యజీవం కోసం కష్టపడడానికి మిమ్మల్ని ప్రేరేపించే దేనిని మీరు నేర్చుకుంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 15–16

క్రీస్తు యొద్దకు ఆత్మలను తీసుకురావడం ఎంతో విలువైనది.

జాన్ మరియు పీటర్ విట్మర్‌లు తమ జీవితాలలో “ఏది అత్యంత విలువైనదో ” తెలుసుకోవాలని అనుకున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 15:4; 16:4). దీని గురించి మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 15–16 చదువుతున్నప్పుడు, క్రీస్తు యొద్దకు ఆత్మలను తెచ్చుట ఎందుకు అత్యంత విలువైనదో ధ్యానించండి. మీరు ఆత్మలను క్రీస్తు యొద్దకు ఎలా ఆహ్వానించగలరు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–16 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 17

ప్రభువు తన వాక్యమును స్థిరపరచుటకు సాక్షులను ఉపయోగించును.

సాక్ష్యము అంటే ఏమిటి? ప్రభువు తన పనిలో సాక్షులను ఎందుకు ఉపయోగించును? (2 కొరింథీయులకు 13:1 చూడండి). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 17 లో ముగ్గురు సాక్షులకు ఇవ్వబడిన దేవుని మాటలు చదివేటప్పుడు ఈ ప్రశ్నలను ధ్యానించండి. మోర్మన్ గ్రంథములో “ ముగ్గురు సాక్షుల యొక్క సాక్ష్యము” ను సమీక్షించడం కూడా మీకు సహాయపడవచ్చు. దేవుని యొక్క “నీతిగల ఉద్దేశ్యములు” నెరవేర్చుటకు సాక్షులు ఏవిధంగా సహాయపడతారు? (4వ వచనము).

మేరీ విట్మర్‌ కూడా బంగారు పలకల గురించి సాక్ష్యాన్ని పొందెనని మీకు తెలుసా? జోసెఫ్, ఎమ్మా మరియు ఆలీవర్‌లు ఆమె ఇంటిలో నివసిస్తున్నప్పుడు ఆమె చేసిన త్యాగాలకు అంగీకారంగా మొరోనై దేవదూత వాటిని ఆమెకు చూపెను (Saints, 1: 70–71 చూడండి). సాక్ష్యము పొందడం గురించి ఆమె అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

Saints, 1:73–75; యులిసెస్ సోవారెస్, “మోర్మన్ గ్రంథము ముందుకు వచ్చుట,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2020, 32–35 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 14:1–4.ఈ వచనాలలో వ్యవసాయానికి సంబంధించిన వాక్యభాగాలను కనుగొనడానికి మీ కుటుంబాన్ని ఆహ్వానించడం గురించి ఆలోచించండి. ప్రభువు తన కార్యమును పంటతో ఎందుకు పోల్చవచ్చు? ఆయన కార్యములో సహాయపడుటకు మనమేమి చేయగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 14:2.“వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు” లో ఈ వాక్యము కొరకు ఇవ్వబడిన ప్రోత్సాహకార్యక్రమము దేవుని వాక్యము గురించి కొన్ని లేఖన భాగాలను జాబితా చేస్తుంది. బహుశా కుటుంబ సభ్యులు వాటిని చదివి, వారు నేర్చుకున్న వాటిని పంచుకోవచ్చు. దేవుని వాక్యానికి “చెవి యొగ్గుటకు” ఈ లేఖన భాగాలు మనల్ని ఎలా ప్రేరేపిస్తాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 15:6; 16:6.ఈ వచనాలు మీ కుటుంబానికి ఎంతో విలువైన విషయాల గురించి సంభాషణను ప్రేరేపించగలవు (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10 కూడా చూడండి).

సిద్ధాంతము మరియు నిబంధనలు 17.ముగ్గురు సాక్షులు చూసిన వస్తువుల యొక్క చిత్రాలను గీయడాన్ని మీ కుటుంబం ఆనందించవచ్చు (1వ వచనము చూడండి). మీరు 17వ ప్రకరణము చదివేటప్పుడు, మోర్మన్ గ్రంథము యొక్క ప్రాముఖ్యత గురించి బోధించే వాక్యభాగాల కోసం చూడండి. మోర్మన్ గ్రంథానికి మనం ఏవిధంగా సాక్షులు కాగలము? A Day for the Eternities” (ChurchofJesusChrist.org) అను వీడియోను కూడా మీ కుటుంబం వీక్షించవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “I’ll Go Where You Want Me to Go,” Hymns, సం. 270.

చిత్రం
పునఃస్థాపన స్వరాల యొక్క చిహ్నము

పునఃస్థాపన స్వరాలు

లూసీ మాక్ స్మిత్, ముగ్గురు మరియు ఎనిమిదిమంది సాక్షులు

న్యూయార్క్‌‌లోని ఫేయెట్‌లో విట్మర్ ఇంటికి సమీపంలో ఉన్న అడవుల్లో జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీ, డేవిడ్ విట్మర్ మరియు మార్టిన్ హారిస్‌లకు దేవదూత మొరోనై బంగారు పలకలను చూపెను. జోసెఫ్ తల్లిదండ్రులు ఆ సమయంలో విట్మర్ కుటుంబీకులను సందర్శించారు. ఈ అద్భుత అనుభవం సాక్షులపై చూపిన ప్రభావాన్ని జోసెఫ్ తల్లి లూసీ మాక్ స్మిత్ వివరించెను:

చిత్రం
లూసీ మాక్ స్మిత్

“అప్పుడు మూడు నాలుగు గంటల మధ్య సమయం. శ్రీమతి విట్మర్ , స్మిత్ మరియు నేను ఒక పడకగదిలో కూర్చున్నాము. నేను మంచం ప్రక్కన కూర్చున్నాను. జోసెఫ్ లోపలికి వచ్చినప్పుడు, అతడు నిట్టూరుస్తూ నా పక్కన కూర్చున్నాడు. ‘నాన్నా! అమ్మా!’ అని పిలిచాడు. ‘నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు తెలియదు. నాతో పాటు మరో ముగ్గురికి పలకలు చూపబడునట్లు ప్రభువు చేసారు, వారు ఒక దేవదూతను కూడా చూశారు మరియు నేను చెప్పినదాని యొక్క సత్యానికి వారు సాక్ష్యమివ్వాలి. నేను ప్రజలను మోసం చెయ్యనని వారికి తెలుసు. నేను ఘోరమైన భారం నుండి ఉపశమనం పొందినట్లు భావిస్తున్నాను, అది భరించడానికి చాలా కష్టంగా ఉండెను. కానీ వారు ఇప్పుడు కొంత భాగాన్ని భరించాల్సి ఉంటుంది, ఇకపై నేను ప్రపంచంలో పూర్తిగా ఒంటరిగా ఉండనవసరం లేనందుకు అది నా ఆత్మను సంతోషపరుస్తున్నది.’ అప్పుడు మార్టిన్ హారిస్ లోపలికి వచ్చాడు. దాదాపుగా అతడు అమితానందంతో నింపబడినట్లు అగుపించాడు. తనతో పాటు ఉన్న ఆలీవర్ మరియు డేవిడ్ చేసినట్లే తాను చూసిన మరియు విన్న వాటికి అతడు సాక్ష్యమిచ్చాడు. వారి సాక్ష్యము యొక్క ఆవశ్యక అంశములు మోర్మన్ గ్రంథములో ఉన్నట్లుగానే ఉన్నాయి. …

“మార్టిన్ హారిస్ ముఖ్యంగా తన భావాలను మాటల్లో చెప్పలేకపోయెను. అతడు ఇలా అన్నాడు, ‘నేను ఇప్పుడు పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూతను చూశాను, అతడు ఆ గ్రంథము గురించి నేను విన్న వాటన్నిటి యొక్క సత్యానికి నిశ్చయంగా సాక్ష్యమిచ్చాడు, నా కళ్ళు అతడిని చూశాయి. నేను కూడా పలకలను చూశాను, వాటిని నా చేతులతో పట్టుకున్నాను మరియు ప్రపంచం మొత్తానికి అదే సాక్ష్యమివ్వగలను. కానీ పదాలు వ్యక్తపరచలేని, ఏ నాలుక వర్ణించలేని ఒక సాక్ష్యాన్ని నేను పొందాను, మరియు నా ఆత్మ యొక్క చిత్తశుద్ధితో దేవుడిని ఘనపరుస్తున్నాను, ఆయన నన్ను కూడా మనుష్య సంతానము తరఫున తన కార్యము మరియు ఉద్దేశముల యొక్క గొప్పతనానికి సాక్ష్యమిచ్చేలా చేసెను.’ ఆలీవర్ మరియు డేవిడ్ కూడా అతనితో కలిసి దేవుని మంచితనము, కనికరము కొరకు ఆయనను ప్రశంసించారు. ఉల్లాసంగా, ఆనందంగా ఉన్న చిన్న గుంపుగా మరుసటి రోజు మేము ఇంటికి [పాల్మైరా, న్యూయార్క్‌కు] తిరిగి వచ్చాము.” 1

చిత్రం
ముగ్గురు సాక్షులు

ఆలీవర్ కౌడరీ, డేవిడ్ విట్మర్ మరియు మార్టిన్ హారిస్ యొక్క చిత్రాలు, లూయిస్ ఏ. రామ్సే చేత

ఎనిమిదిమంది సాక్షులు తమ అనుభవం నుండి తిరిగి వచ్చినప్పుడు లూసీ మాక్ స్మిత్ కూడా ఉన్నారు:

“ఈ సాక్షులు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, దేవదూత మళ్ళీ జోసెఫ్‌కు కనిపించెను; ఆ సమయంలో జోసెఫ్ పలకలను అతడికి అప్పగించెను. ఆ సాయంత్రం మేము ఒక సమావేశాన్ని నిర్వహించాము, దానిలో సాక్షులందరూ పైన చెప్పిన వాస్తవాలకు సాక్ష్యమిచ్చారు; మరియు మా కుటుంబ సభ్యులందరూ, 14 సంవత్సరాల వయస్సులో ఉన్న డాన్ కార్లోస్ [స్మిత్] కూడా, కడవరి-దిన యుగము పూర్తిగా ప్రవేశపెట్టబడినదన్న సత్యానికి సాక్ష్యమిచ్చారు.”2

చిత్రం
ఎనిమిదిమంది సాక్షులకు పలకలను చూపుతున్న జోసెఫ్ స్మిత్

జోసెఫ్ స్మిత్ మరియు ఎనిమిదిమంది సాక్షుల శిల్పం, గ్యారీ ఎర్నెస్ట్ స్మిత్ చేత

వివరణలు

  1. Lucy Mack Smith, History, 1844–1845, book 8, page 11–book 9, page 1, josephsmithpapers.org; క్యాపిటలైజేషన్ మరియు విరామచిహ్నాలు ఆధునీకరించబడ్డాయి.

  2. Lucy Mack Smith, History, 1845, 156–57, josephsmithpapers.org.

చిత్రం
మొరోనై దేవదూత బంగారు పలకలను జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీ మరియు డేవిడ్ విట్మర్‌లకు చూపుట

మొరోనై దేవదూత బంగారు పలకలను జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీ మరియు డేవిడ్ విట్మర్‌లకు చూపుట, గ్యారీ బి. స్మిత్ చేత

ముద్రించు