2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జనవరి 11–17. సిద్ధాంతము మరియు నిబంధనలు 2; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–65: “పిల్లల హృదయాలు తమ తండ్రుల తట్టు తిరుగును”


“జనవరి 11–17. సిద్ధాంతము మరియు నిబంధనలు 2; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–65: ‘పిల్లల హృదయాలు తమ తండ్రుల తట్టు తిరుగును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జనవరి 11–17. సిద్ధాంతము మరియు నిబంధనలు 2; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–65,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
మొరోనై, జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమగుట

ఆయన నన్ను పేరుపెట్టి పిలిచెను, మైఖేల్ మామ్ చేత

జనవరి 11–17

సిద్ధాంతము మరియు నిబంధనలు 2; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–65

“పిల్లల హృదయాలు తమ తండ్రుల తట్టు తిరుగును”

ఇంతకుముందు మీరు ఎన్నోసార్లు చదివిన లేఖనాలైనప్పటికీ, మీరు లేఖనాలను చదివిన ప్రతిసారీ పరిశుద్ధాత్మ మీకు బోధించగలడు. కాబట్టి క్రొత్త అంతరార్థములను, ప్రేరేపణను పొందడానికి సిద్ధంగా ఉండండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వనములో జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమై మూడు సంవత్సరాలు గడిచింది, కానీ అప్పటినుండి జోసెఫ్ ఎటువంటి అదనపు బయల్పాటులను పొందలేదు. ప్రభువు యెదుట నిలబడుటను బట్టి అతడు ఆశ్చర్యపడనారంభించాడు. మనందరివలె అతడు కూడా తప్పులు చేసి, వాటి మూలంగా దండించబడ్డాడు. అయినప్పటికీ ఇంకను అతడు చేయడానికి దేవుడు ఒక కార్యమును కలిగియున్నాడు. జోసెఫ్ చేయడానికి పిలువబడిన కార్యము, దేవుడు మనల్ని అడిగే దానితో సంబంధము కలిగియుంది. జోసెఫ్, మోర్మన్ గ్రంథాన్ని ఉనికిలోకి తెస్తాడు; దానితో మనమేమి చేయాలని అడుగబడ్డాము? పిల్లల హృదయాలను తమ తండ్రులతట్టు తిప్పే యాజకత్వ తాళపుచెవులను జోసెఫ్ పొందుతాడు; మనము మన హృదయాలను మన పూర్వీకుల వైపు ఎలా తిప్పుతున్నాము? త్వరలో నెరవేరబోతున్న ప్రవచనాల గురించి జోసెఫ్‌కు చెప్పబడింది; వాటిని నెరవేర్చడానికి సహాయపడడంలో మన పాత్ర ఏమిటి? మనము దేవుని కార్యములో పాలుపంచుకొనినప్పుడు, ప్రవక్తవలె మనము వ్యతిరేకతను, హింసను ఎదుర్కొంటామని ఆశించవచ్చు. కానీ ఆయన జోసెఫ్ కొరకు చేసినట్లుగా, ప్రభువు మనల్ని తన చేతిలో సాధనములుగా చేస్తారని కూడా మనము నమ్మకము కలిగియుండవచ్చు.

పరిశుద్ధులు, 1:20–48 కూడా చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–33

నేను చేయడానికి దేవుడు ఒక కార్యమును కలిగియున్నాడు.

మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–33 చదివినప్పుడు, దేవుడు జోసెఫ్ స్మిత్ కొరకు చేసినట్లే మీరు చేయడానికి ఆయన ఒక కార్యమును కలిగియున్నాడనే దానిని పరిగణించండి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇచ్చిన ఈ ఆహ్వానాన్ని ధ్యానించండి: “మీ గురించి, భూమిపై మీ పరిచర్య గురించి ఆయన ఎలా భావిస్తారని మీ పరలోకతండ్రిని యేసు క్రీస్తు నామములో అడగండి. మీరు నిజమైన ఉద్దేశముతో అడిగినట్లయితే, కొంతకాలానికి జీవితాన్ని మార్చే సత్యాన్ని ఆత్మ మీకు తెలుపుతుంది. … మీ పరలోకతండ్రి మిమ్మల్ని ఏవిధంగా చూస్తారు, మీరు ఆయన కొరకు ఏమి చేయగలరని ఆశిస్తున్నారు అనేదాని గురించి రవ్వంత అయినా మీరు తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు, మీ జీవితం ఎన్నటికీ ఇలాగే ఉండదని నేను వాగ్దానమిస్తున్నాను.” (“Becoming True Millennials” [ప్రపంచవ్యాప్త యువజనుల భక్తి సమావేశము, జన. 10, 2016], broadcasts.ChurchofJesusChrist.org).

28–29 వచనాల లో జోసెఫ్ భావించినట్లుగా కొన్నిసార్లు మీరు భావించవచ్చు. దేవుడు మీరు చేయాలని పిలిచిన కార్యానికి తగినట్లుగా మీ చర్యలు లేనప్పుడు ఏమి చేయాలనే దాని గురించి జోసెఫ్ మాదిరి నుండి మీరేమి నేర్చుకోగలరు?

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:34–65

“శాశ్వతమైన సువార్త యొక్క సంపూర్ణతను” మోర్మన్ గ్రంథము కలిగియుంది.

మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:34–65 చదివినప్పుడు, ఇదివరకు మీరు మోర్మన్ గ్రంథము గురించి ఎన్నడూ విననట్లయితే, ఈ వచనాలలో మీకు ప్రత్యేకంగా అనిపించిన వివరణలను పరిగణించండి. విశ్వాసులుగా మోర్మన్ గ్రంథము గురించి మీ సాక్ష్యానికి ఈ వృత్తాంతము ఎందుకు ముఖ్యమైనది?

యెషయా 29:4, 11–18 లోని ప్రవచనాలను మోర్మన్ గ్రంథము ఏవిధంగా నెరవేరుస్తుందో పరిగణించండి.

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:36–41

సువార్త యొక్క పునఃస్థాపన ప్రాచీన ప్రవచనాలను నెరవేర్చింది.

యెషయా 11; అపొస్తలుల కార్యములు 3:22–23; మరియు యోవేలు 2:28–32 వంటి అనేక పాత మరియు క్రొత్త నిబంధన ప్రవచనాలను మొరోనై జోసెఫ్‌కు ఉదహరించాడు. జోసెఫ్ ఈ ప్రవచనాలను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమైనది? మీరు వాటిని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమైనది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 2

ఏలియా దేనిని పునఃస్థాపించాడు?

అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా చెప్పారు: “ఏలియాను పంపుతానని ప్రభువు ఎందుకు వాగ్దానమిచ్చారో తెలుసుకోవడం ముఖ్యము. ఏలియా దేవుని చేత గొప్ప శక్తి ఇవ్వబడిన గొప్ప ప్రవక్త. దేవుడు తన పిల్లలకు ఇచ్చే అతిగొప్ప శక్తిని అతడు కలిగియున్నాడు: అతడు ముద్రించు శక్తిని, భూమిపై ముద్రించబడినది పరలోకంలో ముద్రింపబడేలా చేసే శక్తిని కలిగియున్నాడు” (“Hearts Bound Together,” Ensign or Liahona, May 2005, 78).

సిద్ధాంతము మరియు నిబంధనలు 110:13–16; డేవిడ్ ఎ. బెడ్నార్, “ఈ గృహము నా నామమున నిర్మించబడుగాక,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2020, 84–87 కూడా చూడండి.

చిత్రం
శరదృతువులో పాల్మైరా న్యూయార్క్ దేవాలయము

పాల్మైరా న్యూయార్క్ దేవాలయము. ఏలియా ద్వారా పునఃస్థాపించబడిన శక్తి చేత దేవాలయములో కుటుంబాలు ముద్రించబడతాయి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 2

నా హృదయాన్ని నా పూర్వీకుల వైపు తిప్పడానికి ఏలియా వచ్చాడు.

ఏలియా నియమితకార్యాన్ని గురించి, అతడు పునఃస్థాపించిన యాజకత్వ తాళపుచెవుల దీవెనల గురించి ఈ ప్రకరణములో ఉన్న “నాటుట,” “హృదయాలు,” “తిప్పుట” వంటి పదాలు మీకేమి బోధిస్తాయి? మీ హృదయము మీ పూర్వీకులవైపు తిరిగినట్లు మీరెలా భావించారు? అటువంటి భావాలను తరచుగా మీరు అనుభవించగలిగే మార్గాల గురించి ఆలోచించండి. మీ పూర్వీకులలో ఒకరి గురించి చెప్పమని మీ బంధువులలో ఒకరిని మీరు అడుగవచ్చు—అంతకుమించి మీరు దానిని నమోదు చేయవచ్చు. సువార్త విధులను పొందకుండా మరణించిన ఒక పూర్వీకుని మీరు గుర్తించి, దేవాలయంలో ఆ పనిని నిర్వహించవచ్చు.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:28–29.తన తప్పుల గురించి జోసెఫ్ స్మిత్ ఎలా భావించాడు? ఆ భావాలకు స్పందించి అతడు ఏమి చేసాడు? మనము తప్పులు చేసినప్పుడు ఏమి చేయాలనేదాని గురించి అతని నుండి మనమేమి నేర్చుకుంటాము?

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:33–54.నాలుగుసార్లు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:33–42 నుండి మొరోనై సందేశములో కొంతభాగాన్ని లేక మొత్తాన్ని గట్టిగా చదవమని ఒక కుటుంబ సభ్యుడిని మీరు అడగవచ్చు (ఎందుకనగా మొరోనై ఈ సందేశాన్ని నాలుగుసార్లు పునరావృతం చేసాడు). చదివేటప్పుడు మధ్యమధ్యలో లేఖనాలు చూడకుండా అతని సందేశం నుండి వారికి జ్ఞాపకమున్న దానిని పంచుకోమని ఇతర కుటుంబ సభ్యులను అడగండి. ముఖ్యమైన సందేశాలను అనేకసార్లు ప్రభువు ఎందుకు పునరావృతం చేస్తారు? పునరావృతం చేయడం ద్వారా ప్రభువు మనకు బోధించే ఇతర విధానాలలో కొన్ని ఏవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 2:2.“తండ్రులకు చేయబడిన వాగ్దానాలను” మీ పిల్లలు గ్రహించేలా సహాయపడేందుకు మీరు కలిసి అబ్రాహాము 2:9–11 చదవవచ్చు. అబ్రాహాముతో ఆయన నిబంధనలో భాగంగా దేవుడు చేసిన వాగ్దానాలను గుర్తించండి. మన హృదయాలలో ఈ వాగ్దానాలను మనమేవిధంగా “నాటెదము”?

సిద్ధాంతము మరియు నిబంధనలు 2:2–3.తమ హృదయాలను తమ తండ్రుల (లేక పూర్వీకుల) తట్టు తిప్పడానికి కుటుంబ సభ్యులకు సహాయపడేందుకు, ఒక పూర్వీకుని గురించి తెలుసుకొని, వారు తెలుసుకున్న దానిని మిగతా కుటుంబముతో పంచుకోమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. మన కుటుంబ సభ్యుల గురించి తెలుసుకొని, వారి కొరకు దేవాలయ విధులను నిర్వహించమని ప్రభువు మనల్ని ఎందుకు కోరుతున్నారు? కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యములో మనము పాల్గొనినప్పుడు మనమేవిధంగా దీవించబడ్డాము? (డేల్ జి. రెన్లండ్, “కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము: బంధింపబడుట మరియు స్వస్థత,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2018, 46–49 చూడండి).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

కుటుంబ చరిత్ర లేక నిత్య కుటుంబాలు అనే విషయానికి సంబంధించిన ఒక పాట పాడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

లేఖన అధ్యయన సహాయములను ఉపయోగించండి. లేఖనాలలోని జనులు, సంఘటనలు మరియు వాక్యభాగాలను బాగా అర్థం చేసుకోవడానికి పాదవివరణలు, విషయ సూచిక, బైబిలు నిఘంటువు, లేఖన మార్గదర్శి, మరియు ChurchofJesusChrist.org వంటి సాధనాలు మీకు సహాయపడగలవు.

చిత్రం
మొరోనై, జోసెఫ్ స్మిత్‌కు బంగారు పలకలను ఇచ్చుట

జోసెఫ్ పలకలను పొందుట, గేరీ ఇ. స్మిత్ చేత

ముద్రించు