2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జనవరి 18–24. సిద్ధాంతము మరియు నిబంధనలు 3–5: “నా కార్యము ముందుకు సాగును”


“జనవరి 18–24. సిద్ధాంతము మరియు నిబంధనలు 3–5: ‘నా కార్యము ముందుకు సాగును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జనవరి 18–24. సిద్ధాంతము మరియు నిబంధనలు 3–5,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
పొలములో పనిచేయుచున్న మనుష్యులు

ఫ్రాన్సులో కోతకాలము, జేమ్స్ టేలర్ హార్వుడ్ చేత

జనవరి 18–24

సిద్ధాంతము మరియు నిబంధనలు 3–5

“నా కార్యము ముందుకు సాగును”

మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మీరు నేర్చుకొనేదానిని, భావించేదానిని వ్రాసి ఉంచండి. ఆ మనోభావాలను గుర్తుంచుకోవడానికి, ఇతరులతో వాటిని పంచుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి

ప్రభువు యొక్క ప్రవక్తగా మొదటి కొన్ని సంవత్సరాలలో అతడు చేయాలని పిలువబడిన “ఆశ్చర్యకార్యము” గురించి జోసెఫ్ స్మిత్‌కు పూర్తిగా తెలియదు. కానీ దేవుని కార్యానికి అర్హులయ్యేందుకు అతని కంటికి నిజంగా “దేవుని మహిమయే లక్ష్యముగా ఉండాలని” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 4:1, 5) తన పూర్వ అనుభవాలు అతనికి నేర్పించాయి. ఉదాహరణకు, అతని కోరికలకు విరుద్ధంగా ప్రభువు అతనికి ఉపదేశమిచ్చినట్లయితే, అతడు ప్రభువు యొక్క ఉపదేశాన్ని అనుసరించాలి. అతడు “అనేక బయల్పాటులు పొంది, … మహా గొప్ప కార్యాలనేకము చేయడానికి శక్తి కలిగియున్నప్పటికీ,” దేవుని చిత్తము కంటే అతని దృష్టిలో తన స్వంత చిత్తమే ముఖ్యమైనట్లయితే, అతడు “తప్పక పతనమైపోవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 3:4). కానీ దేవుని కార్యము చేయడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైన మరొక విషయాన్ని జోసెఫ్ నేర్చుకున్నాడు: “దేవుడు కనికరము గలవాడు,” మరియు జోసెఫ్ మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడినట్లయితే, అతడు “ఇంకను ఎన్నుకోబడియుండును” (10వ వచనము). ఏదేమైనా దేవుని కార్యము విమోచన యొక్క కార్యమైయున్నది. మరియు ఆ కార్యము “భంగపరచబడలేదు” (1వ వచనము).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 3:1–15

నేను మనుష్యునికి భయపడే కంటే దేవుడిని నమ్మాలి.

జోసెఫ్ స్మిత్ పరిచర్య యొక్క తొలినాళ్ళలో మంచి స్నేహితులు—ప్రత్యేకించి గౌరవనీయుడు, భాగ్యవంతుడు, విలువైన సహకారాన్ని అందించే స్థితిలో ఉన్న మార్టిన్ హారిస్ వంటి స్నేహితులు దొరకడం కష్టంగా ఉండేది. అతని స్నేహితులిచ్చే గౌరవాన్ని మూల్యంగా చెల్లించవలసి వచ్చినప్పటికీ, ఆర్థికంగా త్యాగాలు చేయవలసి వచ్చినప్పటికీ మార్టిన్ ఇష్టపూర్వకంగా జోసెఫ్‌కు సహకారమిచ్చాడు.

అందువలన మోర్మన్ గ్రంథము యొక్క సత్యాన్ని సందేహించిన అతని భార్యకు చూపించడానికి మోర్మన్ గ్రంథ అనువాదము యొక్క మొదటి భాగాన్ని తీసుకువెళ్తానన్న మార్టిన్ అభ్యర్థనను జోసెఫ్ ఎందుకు గౌరవించాడో అర్థం చేసుకోవచ్చు. ప్రభువు దానిని వద్దని వారించినప్పటికీ, ఆ అభ్యర్థన గురించి జోసెఫ్ ప్రభువును అడగడం కొనసాగించాడు, చివరకు జోసెఫ్ మూడవసారి అడిగినప్పుడు ప్రభువు సరేనన్నారు. దురదృష్టవశాత్తూ, చేతివ్రాత ప్రతి మార్టిన్ దగ్గర ఉన్నప్పుడు కోల్పోబడింది మరియు జోసెఫ్, మార్టిన్‌లు ప్రభువు చేత తీవ్రంగా శిక్షించబడ్డారు.

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 3:1–15 చదివినప్పుడు, ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ఏవిధంగా ప్రభావితం చేయగలవో ధ్యానించండి. జోసెఫ్ స్మిత్‌ను గద్దించడంతో పాటు ప్రభువు కనికరము గల మాటలు మాట్లాడారని కూడా మీరు గమనించవచ్చు. ప్రభువు జోసెఫ్‌ను సరిదిద్ది, ప్రోత్సహించిన విధానం నుండి మీరేమి నేర్చుకుంటారు? దేవుని కంటే ఎక్కువగా ఇతర జనులకు భయపడేందుకు మీరు శోధించబడినప్పుడు మీకు సహాయపడేలా ఏ ఉపదేశాన్ని మీరు కనుగొంటారు?

history.ChurchofJesusChrist.org కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 4

నా పూర్ణ మనస్సుతో ఆయనను సేవించాలని ప్రభువు నన్ను అడుగుతున్నారు.

4వ ప్రకరణము తరచు పూర్తి-కాల సువార్తికులకు అన్వయించబడుతుంది. అయినప్పటికీ, ఈ బయల్పాటు వాస్తవానికి జోసెఫ్ స్మిత్ సీ. కు ఇవ్వబడిందని గమనించడం ఆసక్తికరమైనది, ఆయన సువార్తసేవకు పిలువబడలేదు, కానీ “దేవుని సేవించాలనే కోరిక” కలిగియున్నారు (3వ వచనము).

ఈ ప్రకరణమును చదివేందుకు ఒక విధానము, ప్రభువు కార్యము చేయాలని కోరుకునే వారి కొరకు ఉద్యోగ వర్ణనగా దానిని ఊహించుకోవడం. అర్హతలేమిటి? ఈ నైపుణ్యాలు లేక స్వభావాలు ఎందుకు అవసరము? “కార్యమునకు (మిమ్మల్ని మీరు) అర్హులుగా చేసుకోవడానికి” బహుశా మీరు బాగా చేయగల ఒకదానిని మీరు ప్రార్థనాపూర్వకంగా ఎంచుకోవచ్చు (5వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 5

మోర్మన్ గ్రంథము గురించి నా స్వంత సాక్ష్యాన్ని నేను పొందగలను.

చిత్రం
మార్టిన్ హారిస్

మార్టిన్ హారిస్, లూయిస్ ఎ. రామ్సీ చేత

మోర్మన్ గ్రంథము యొక్క యధార్థతను గురించి న్యాయస్థానంలో మీరు సాక్ష్యమివ్వడానికి పిలువబడినట్లయితే, మీరు ఏ సాక్ష్యాన్ని అందిస్తారు? బంగారు పలకలను అనువదిస్తున్నట్లుగా నటిస్తూ జనులను జోసెఫ్ స్మిత్ మోసం చేస్తున్నాడని మార్టిన్ హారిస్ భార్య లూసీ దావా వేసినప్పుడు, అతని మదిలో ఇటువంటి ప్రశ్న తలెత్తింది. అందువలన బంగారు పలకలు నిజమైనవని మరింత సాక్ష్యం కొరకు మార్టిన్, జోసెఫ్‌ను అడిగాడు. సిద్ధాంతము మరియు నిబంధనలు 5 మార్టిన్ అభ్యర్థనకు జవాబుగా ఇవ్వబడిన బయల్పాటు.

క్రింది వాటి గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 5 నుండి మీరేమి నేర్చుకుంటారు:

  • వారు సాక్ష్యాన్ని కలిగియుంటే తప్ప ఆత్మీయ సత్యాలను నమ్మని వారి గురించి ప్రభువు ఎలా భావిస్తారు (5–8 వచనాలు చూడండి; యోహాను 20:24–29 కూడా చూడండి).

  • ప్రభువు యొక్క కార్యములో సాక్షుల పాత్ర (11–15 వచనాలు చూడండి; 2 కొరింథీయులకు 13:1 కూడా చూడండి).

  • మీకై మీరు మోర్మన్ గ్రంథము గురించి సాక్ష్యాన్ని ఎలా పొందవచ్చు (16వ వచనము చూడండి; మొరోనై 10:3–5 కూడా చూడండి).

సిద్ధాంతము మరియు నిబంధనలు 5:1–10

ఈ తరము జోసెఫ్ స్మిత్ ద్వారా దేవుని వాక్యాన్ని పొందును.

మన యుగములో—మీ జీవితంలో జోసెఫ్ స్మిత్ యొక్క ముఖ్యపాత్ర గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 5:1–10 మీకేమి బోధిస్తుంది? ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా దేవుని వాక్యాన్ని మీరెలా పొందారో ధ్యానించండి. ఆయన ద్వారా పునఃస్థాపించబడిన లేక స్పష్టం చేయబడిన సత్యాల కొరకు మీ కృతజ్ఞతను దినచర్య పుస్తకంలో వ్రాయడం లేక ఎవరితోనైనా పంచుకోవడం గురించి ఆలోచించండి.

2 నీఫై 3:6–24 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 3:1–4.ఒక “వంకరటింకర” గీత మీద మరియు ఒక “తిన్నని” గీత మీద నడవమని ఒక కుటుంబ సభ్యుడిని అడగండి. “(దేవుని) మార్గాలు తిన్ననివి” అని తెలుసుకోవడం మన కుటుంబానికి ఎటువంటి అర్థాన్నిస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 3:7–10.దేవునికి అవిధేయులవ్వమని ఎవరైనా మనల్ని ఒత్తిడి చేసినప్పుడు, విశ్వాసులుగా నిలిచేందుకు ఈ వచనాలలోని ఏ సత్యాలు మనకు సహాయపడగలవు? దేవునికి అవిధేయులవ్వడానికి ఒత్తిడి చేయబడినప్పటికీ ఒకరు విశ్వాసంగా నిలిచిన సందర్భాన్ని కుటుంబ సభ్యులు అభినయించి చూపవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 4.దేవుని పొలములో పనిచేయడమనగా అర్థమేమిటని మీ కుటుంబ సభ్యులు చర్చిస్తున్నప్పుడు, వారు తోటలో ఏదైనా పని చేయవచ్చు (లేక చేస్తున్నట్లు నటించవచ్చు). తోట పనికి ఏ పనిముట్లు అవసరము? ఆయన పని చేయడానికి అవసరమైన పనిముట్లుగా ఎంచబడగల వేటిని దేవుడు 4వ ప్రకరణము లో వివరించారు? దేవుని కార్యము చేయడంలో ప్రతి పనిముట్టు ఎందుకు ముఖ్యమైనదో మీ కుటుంబము చర్చించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 5:7.మనం చూడలేనప్పటికీ విశ్వసించే సత్యాలకు కొన్ని ఉదాహరణలేవి? మోర్మన్ గ్రంథము నిజమనేందుకు సాక్ష్యాన్ని కోరే స్నేహితుని పట్ల మనం ఎలా స్పందించగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సువార్త సేవకు సంబంధించిన పాట పాడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ఒక వచనమును కంఠస్థం చేయండి. “ఒక లేఖనాన్ని కంఠస్థం చేయడమనేది ఒక క్రొత్త స్నేహాన్ని సృష్టించడం వంటిది. అది అవసరమైన సమయంలో సహాయపడే క్రొత్త వ్యక్తి వంటిది, ప్రేరేపణను ఓదార్పును ఇస్తుంది, అవసరమైన మార్పుకు కావలసిన ప్రేరణకు మూలాధారమవుతుంది” (రిఛర్డ్ జి. స్కాట్, “The Power of Scripture,” ఎన్‌సైన్ లేక Liahona, నవ. 2011, 6).

చిత్రం
తన తల్లిదండ్రులతో జోసెఫ్ స్మిత్

116 పేజీల గొప్ప భారము, వాని పోవై విండర్ చేత

ముద్రించు