2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
డిసెంబరు 28–జనవరి 3. సిద్ధాంతము మరియు నిబంధనలు 1: “ఓ జనులారా, ఆలకించుడి”


“డిసెంబరు 28–జనవరి 3. సిద్ధాంతము మరియు నిబంధనలు 1: ‘ఓ జనులారా, ఆలకించుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“డిసెంబరు 28–జనవరి 3. సిద్ధాంతము మరియు నిబంధనలు 1,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
లేఖనాలను చదువుతున్న కుటుంబము

డిసెంబరు 28–జనవరి 3

సిద్ధాంతము మరియు నిబంధనలు 1

“ఓ జనులారా, ఆలకించుడి”

ఆయన కడవరి-దిన బయల్పాటులు గల ఈ గ్రంథానికి ప్రభువు యొక్క వ్యక్తిగత పరిచయముగా సిద్ధాంతము మరియు నిబంధనలు 1 గురించి ఆలోచించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు గురించి మీరు ఏమి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి మరియు మీరు 1వ ప్రకరణము చదవుతున్నప్పుడు మీకు కలుగు ప్రేరేపణలను వ్రాయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

1831 నవంబరులో, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘము ప్రారంభించబడి కేవలం ఒకటిన్నర సంవత్సరాలైంది. సంఘము అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అది ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుగల ఒక ప్రవక్త నేతృత్వంలో పూర్తిగా స్థిరపడని సరిహద్దులో నివసిస్తున్న అప్రసిద్ధ విశ్వాసుల సమూహము. కానీ దేవుడు ఈ విశ్వాసులను తన సేవకులుగా, దూతలుగా భావించెను మరియు వారికిచ్చిన బయల్పాటులు ప్రపంచానికి ప్రచురించబడాలని ఆయన కోరెను.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1వ ప్రకరణము ఈ బయల్పాటుల కూర్పుకు ప్రభువు యొక్క పీఠిక, మరియు సంఘ సభ్యత్వము తక్కువే అయినప్పటికీ, దేవుడు తన పరిశుద్ధులు పంచుకోవాలని కోరిన సందేశము అల్పమైనది కాదని స్పష్టంగా తెలుస్తుంది. పశ్చాత్తాపపడుటకు మరియు దేవుని “నిత్య నిబంధన” (4, 8, 22 వచనాలు) స్థిరపరచుటకు “భూలోక నివాసులు” అందరికీ ఇది “హెచ్ఛరించు స్వరము”. ఈ సందేశాన్ని తీసుకొనివెళ్ళే సేవకులు “బలహీనులు, సామాన్యులు”, కాని ఆయన సంఘాన్ని “చీకటి అంధకారముల నుండి బయటకు తీసుకొని వచ్చుటకు” వినయపూర్వకమైన సేవకులే అప్పుడు మరియు ఇప్పుడు దేవునికి కావాలి( 23, 30 వచనములు).

సిద్ధాంతము మరియు నిబంధనలు 1వ ప్రకరణము వెనుక ఉన్న చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి, Saints, 1:140–43 చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 1

“ఈ ఆజ్ఞలను వెదకుటకు” ప్రభువు నన్ను ఆహ్వానించుచున్నారు.

పీఠిక ఒక గ్రంథాన్ని పరిచయం చేస్తుంది. ఇది గ్రంథం యొక్క ఇతివృత్తాలు, ఉద్దేశాలను గుర్తిస్తుంది మరియు చదవడానికి పాఠకులను సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. మీరు 1వ ప్రకరణము అనగా సిద్ధాంతము మరియు నిబంధనలకు ప్రభువు యొక్క “పీఠిక” (6వ వచనము) చదువుతున్నప్పుడు—ప్రభువు తన బయల్పాటుల కొరకు ఇచ్చిన ఇతివృత్తాలు మరియు ఉద్దేశాల కొరకు చూడండి. సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క మీ అధ్యయనం నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి మీకు సహాయపడే విధంగా 1వ ప్రకరణము నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ఉదాహరణకు, ఈ బయల్పాటులలో (14వ వచనము) లో “ఈ ఆజ్ఞలను వెదకుడి” లేదా (37వ వచనము) లో “ప్రభువు స్వరమును వినుడి” అంటే ఏమిటో మీరు ఆలోచించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు పీఠిక కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:1–6, 23–24, 37–39

దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడును మరియు ఆయన మాటలు నెరవేరును.

ఆయన ఎంచుకున్న సేవకుల ద్వారా ఆయన మాట్లాడును అనే దేవుని ప్రకటనతో 1వ ప్రకరణము ప్రారంభమవుతుంది మరియు ముగుస్తుంది (4–6, 23–24, 38 వచనాలు చూడండి). ప్రభువు మరియు ఆయన స్వరం గురించి ఈ బయల్పాటు నుండి మీరు నేర్చుకున్న వాటిని వ్రాయండి. ప్రభువు యొక్క సేవకుల గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? ప్రభువు స్వరాన్ని ఆయన సేవకుల మాటలలో మీరు ఎప్పుడు విన్నారు? (38వ వచనము చూడండి).

చిత్రం
సర్వసభ్య సమావేశ సభ

ప్రవక్తలు, అపొస్తలులు మనకు దేవుని ఆజ్ఞలను బోధిస్తారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:3, 24–28, 31–33

నేను వినయంగా ఉంటే, ప్రభువు గద్దింపు నన్ను పశ్చాత్తాపమునకు నడిపిస్తుంది.

3వ వచనము మరియు 24–28 వచనములలో జనుల పాపాలు మరియు తప్పిదములు తెలియజేయబడతాయని ప్రభువు చెప్పెనని గమనించండి. ఒక సందర్భంలో ఇది బాధాకరమైన, దుఃఖకరమైన అనుభవం, మరొక సందర్భంలో ఇది బోధనాత్మకమైనది. ఈ పరిస్థితులు ఎందుకు ఇంత భిన్నంగా ఉన్నాయి? మీ పాపాలు మరియు బలహీనతల గురించి తెలుసుకున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారో పరిగణించండి. సరైన రీతిలో స్పందించడానికి మీకు సహాయపడగల ఏ లక్షణాలను 24–28 వచనములలో మీరు కనుగొంటారు? 31–33 వచనాల తో పాటు, ఈ వచనాలు మీ బలహీనతలను, పాపాలను ప్రభువు ఎలా చూస్తారనే దాని గురించి మీకు ఏమి బోధిస్తాయి?

సామెతలు 3:11–12; ఈథర్ 12:27; మొరోనై 6:8 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:12–30, 35–36

కడవరి దిన సవాళ్ళను ఎదుర్కోవడంలో నాకు సహాయపడడానికి ప్రభువు తన సువార్తను పునఃస్థాపించారు.

రాబోయే దుఃఖకరమైన దినముల గురించి 1వ ప్రకరణము హెచ్ఛరించినప్పటికీ, భరోసా కలిగించే సందేశాన్ని కూడా అది కలిగియుంది: “ప్రభువైన నేను, భూలోక నివాసులందరిపైకి రాబోవు విపత్తునెరిగి, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. ను పిలిచి, పరలోకము నుండి మాట్లాడి, ఆజ్ఞలనిచ్చితిని”(17వ వచనము).

ప్రభువు హెచ్ఛరించిన విపత్తులను గమనించండి (ఉదాహరణకు, 13–16, 35 వచనములు చూడండి). నేటి ప్రపంచంలో లేదా మీ స్వంత జీవితంలో మీరు ఏ ఇతర విపత్తులను గమనించవచ్చు? 17–30 వచనములు ఈ విపత్తులను ముందే ఊహించి ప్రభువు మీ కోసం ఏమి చేశారో వివరిస్తాయి. మీరు కనుగొన్న వాటి జాబితాను రూపొందించండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:1–6, 37–39.ప్రభువు నుండి వచ్చిన హెచ్చరికల గురించి చర్చను ప్రారంభించడానికి—జారుడు నేల, భయంకరమైన తుఫాను లేదా సమీపించే కారు వంటి మనం చూడలేని ప్రమాదాల గురించి ఇతరుల నుండి మనకు వచ్చే హెచ్ఛరికల గురించి మీరు మాట్లాడవచ్చు. ప్రభువు యొక్క హెచ్ఛరికల గురించి ఈ ఉదాహరణలు మనకు ఏమి బోధిస్తాయి? సిద్ధాంతము మరియు నిబంధనలు 1:1–6, 37–39 ప్రకారము ప్రభువు మనల్ని ఎలా హెచ్ఛరిస్తారు? ఇటీవల ఆయన మనల్ని దేని గురించి హెచ్ఛరించారు? ఇటీవలి సర్వసభ్య సమావేశ సందేశాల యొక్క భాగాలను మీరు చూడవచ్చు లేదా చదవవచ్చు మరియు దేవుని “హెచ్ఛరిక స్వరం” యొక్క ఉదాహరణల కోసం చూడవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:16.“[ప్రభువు] నీతిని నెలకొల్పుట” అంటే అర్థం ఏమిటి? “[మన] ఇష్టము చొప్పున” నడుచుకొనకుండా దానిని మనం చేస్తున్నామని ఏ విధముగా నిశ్చయపరచుకొనవచ్చు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:30.సంఘము “సత్యమైనది, జీవము గలది” అని చెప్పడంలో అర్థమేమిటి? మీ కుటుంబం ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండడానికి, బహుశా మీరు వారికి జీవమున్న మరియు జీవములేని వస్తువుల చిత్రాలను చూపించవచ్చు. “[సంఘమును] చీకటి అంధకారముల నుండి బయటకు తీసుకొని వచ్చుటకు” కుటుంబంగా మీరు ఏమి చేయగలరో కూడా మీరు చర్చించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:37.ఈ సంవత్సరం సిద్ధాంతము మరియు నిబంధనలలో ఏవిధంగా మీరు “ఈ ఆజ్ఞలను వెదికెదరో” అని కుటుంబ సమేతముగా ప్రణాళిక చేయుటను పరిగణించండి. మీ లేఖన అధ్యయనాన్ని కుటుంబ జీవితంలో క్రమమైన భాగంగా మీరెలా చేస్తారు? లేఖనాల నుండి నేర్చుకోవడానికి ఏ అధ్యయన ఉపాయములు మీకు సహాయపడగలవు? (ఈ వనరు ప్రారంభంలో “మీ కుటుంబ లేఖన అధ్యయనాన్ని మెరుగుపరచడానికి ఉపాయములు” చూడండి.)

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Follow the Prophet,” Children’s Songbook, 110–11, ముఖ్యంగా చివరి వచనము.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

యేసు క్రీస్తు కొరకు చూడండి. రక్షకుడు మరియు ఆయన సువార్త గురించి సాక్ష్యమివ్వడమే లేఖనాల ఉద్దేశ్యం. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 1 చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తు గురించి మీకు కొంత బోధించే వచనాలను గుర్తించడం లేదా గమనించడాన్ని పరిగణించండి.

చిత్రం
ఆజ్ఞల గ్రంథము

పునఃస్థాపించబడిన సంఘానికి ఇవ్వబడిన మొదటి బయల్పాటులు ఆజ్ఞల గ్రంథముగా సంకలనం చేయబడ్డాయి.

ముద్రించు