2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
డిసెంబరు 13–19. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన: “సృష్టికర్త ప్రణాళికకు కుటుంబము కేంద్రమైయున్నది”


“డిసెంబరు 13–19. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన: ‘సృష్టికర్త ప్రణాళికకు కుటుంబము కేంద్రమైయున్నది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“డిసెంబరు 13–19. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
ఒక కుటుంబము

డిసెంబరు 13–19

కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన

“సృష్టికర్త ప్రణాళికకు కుటుంబము కేంద్రమైయున్నది”

అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ చెప్పారు: “… కుటుంబ ప్రకటన వైపు మన స్వభావము మరియు ఉపయోగము ఈ తరము యొక్క పరీక్షలలో ఒకటని నేను నమ్ముచున్నాను. ఆ పరీక్షలో స్థిరముగా నిలబడాలని కడవరి-దిన పరిశుద్ధులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను” (“ప్రణాళిక మరియు ప్రకటన,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2017,31). ఈ వారం మీరు కుటుంబ ప్రకటనను చదివినప్పుడు ఈ పదాలను ధ్యానించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మనం పుట్టక ముందు మనము ఒక కుటుంబము, అనగా మన పరలోక తల్లిదండ్రుల కుటుంబములో భాగము. వారి సన్నిధిని వదిలిపెట్టవలసిన సమయము వచ్చినప్పుడు, భూమిపై దేవుని ప్రణాళికలో కుటుంబాలు కూడా భాగమవుతాయని తెలుసుకోవడం ఓదార్పునిచ్చి ఉండవచ్చు. పరలోకములో నున్న పరిపూర్ణ నమూనాను అనుకరించడమే భూమిపై నున్న నమూనా యొక్క అర్థము.

భూలోక కుటుంబాలు ఆదర్శవంతంగా లేదా ప్రయోజనాత్మకంగా ఉంటాయన్న హామీ ఏదీ లేదు. కానీ అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ బోధించినట్లుగా, కుటుంబాలు “పరలోకములో మనము అనుభవించిన ప్రేమకు దగ్గరగా ఉండే ఏకైక ప్రేమ—తల్లిదండ్రుల ప్రేమతో స్వాగతించుటకు దేవుని యొక్క పిల్లలకు మంచి అవకాశమిచ్చును” (“దేవుని యొక్క కుటుంబాన్ని సమకూర్చుట,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2017,20). కుటుంబాలు అపరిపూర్ణమైనవని, అపవాది దాడులకు లోబడతాయని తెలుసుకొని దేవుడు మనల్ని విమోచించడానికి మరియు మన కుటుంబాలను స్వస్థపరచడానికి ఆయన ప్రియ కుమారుడిని పంపారు. మరియు కుటుంబాలను కాపాడి, బలపరచడానికి ఆయన కడవరి-దిన ప్రవక్తలను ఒక ప్రకటనతో పాటు పంపారు. మర్త్య కుటుంబాలు దైవికంగా ఆదర్శవంతంగా లేకపోయినప్పటికీ, మనము ప్రవక్తలను అనుసరించి, రక్షకునిపై విశ్వాసముంచినట్లయితే, భూమిపై మరియు పరలోకంలో కుటుంబాల కొరకు నిరీక్షణ గలదు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

“సృష్టికర్త ప్రణాళికకు కుటుంబము కేంద్రమైయున్నది”

కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” స్పష్టముగా కుటుంబాలకు సంబంధించినది. కానీ, అది అంతే సమానముగా దేవుని రక్షణ ప్రణాళికకు సంబంధించినది. ప్రకటనను చదివేందుకు గల ఒక విధానము, అది మన పూర్వ మర్త్య, మర్త్య మరియు అమర్త్య జీవితం గురించి ఏమి బోధిస్తుందో చూడడం. ఈ విధానంలో మీరు ప్రకటనను చదివినప్పుడు, మీరేమి నేర్చుకుంటారు? వివాహము మరియు కుటుంబము దేవుని ప్రణాళికకు ఎందుకు ఆవశ్యకమైనవని మీరు గ్రహించడానికి ఇది ఎలా సహాయపడుతుంది?

డాలిన్ హెచ్. ఓక్స్, “ప్రణాళిక మరియు ప్రకటన,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2017, 28–31 కూడా చూడండి.

“ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బోధనలపై పునాది వేయబడిన కుటుంబ జీవితములలో సంతోషము మరింత అధికముగా పొందబడును.”

“కుటుంబ జీవితములో సంతోషము” కొరకు నమూనాగా కుటుంబ ప్రకటన యొక్క ఆరు మరియు ఏడవ పేరాల గురించి ఆలోచించండి. మీరు ఈ పేరాలను చదివినప్పుడు, “విజయవంతమైన వివాహములు మరియు కుటుంబాలు” యొక్క సూత్రాలను గుర్తించండి. తరువాత మీరు బలపరచాలని కోరుకున్న కుటుంబ బంధాన్ని గురించి ఆలోచించండి. ఏమి చేయడానికి మీరు ప్రేరేపించబడ్డారు? మీ ప్రయత్నాలలో మీరు రక్షకుడిని ఏవిధంగా కలుపుకుంటారు?

నేను నా కుటుంబాన్ని ఆదరించే విధానము కొరకు నేను “దేవుని యెదుట లెక్క అప్పగించవలసియున్నాను”.

ఆయన సలహాను అనుసరించే వారికి పరలోక తండ్రి వాగ్దానమిచ్చిన అద్భుతమైన దీవెనలను కుటుంబ ప్రకటన కలిగియుంది. అనుసరించని వారి కొరకు బలమైన హెచ్చరికలను కూడా ఇది కలిగియుంది. మీరు కనుగొనే దీవెనలు మరియు హెచ్చరికల జాబితా తయారు చేయడాన్ని పరిగణించండి.

ప్రకటనలో ఉన్న దేవుని సలహాపై మీరెలా పనిచేస్తున్నారు? నేడు మీరు దేవుని యెదుట నిలబడినట్లయితే, మీ కుటుంబ సంబంధాలలో దేని గురించి ఆయనతో చర్చించడానికి మీరు సాహసిస్తారు? వృద్ధిచెందడానికి మీకేమి అవసరము?

ఆల్మా 5:15–22; సిద్ధాంతము మరియు నిబంధనలు 42:22–25; 93:39–44 కూడా చూడండి.

చిత్రం
వంట చేస్తున్న ఒక కుటుంబము

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమలో మరియు నిజాయితీలో పెంచవలెను.

నా కుటుంబ పరిస్థితి ఆదర్శవంతమైన దానికంటే తక్కువగా ఉన్నట్లయితే, వాగ్దానము చేయబడిన దీవెనలను నేను పొందగలనా?

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ బోధించారు: “వివాహము మరియు కుటుంబమునకు సంబంధించిన మూలాధార సత్యాలను ప్రకటించడమంటే, ఎవరికైతే ఆదర్శవంతము అనేది ప్రస్తుత వాస్తవము కాదో … వారి త్యాగాలు మరియు విజయాలను లెక్కచేయక పోవడం లేదా తక్కువ చేసి చూడడం కాదు. ప్రతిఒక్కరు వరములను కలిగియున్నారు; ప్రతిఒక్కరు నైపుణ్యాలను కలిగియున్నారు; ప్రతి తరములో దైవిక ప్రణాళికను తెలియజేయడానికి ప్రతిఒక్కరు తమ వంతు చేయగలరు. అధికముగా మంచిది, అధికముగా ఆవశ్యకమైనది—కొన్నిసార్లు ఇప్పటికి అవసరమైనదంతా కూడా—ఆదర్శవంతమైన పరిస్థితుల కంటే తక్కువైన దానిలో సాధించబడగలుగుతుంది. … యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ముందుగా ఊహించబడిందని మరియు అంతములో ఆయన వైపు తిరిగే వారి కొరకు వారు పోగొట్టుకొనినది మరియు నష్టపోయినది మొత్తము భర్తీ చేస్తుందని నమ్మకంగా మేము సాక్ష్యమిస్తున్నాము. తన పిల్లల కొరకు తండ్రి కలిగియున్న దానికంటే తక్కువ పొందడానికి ఏ ఒక్కరూ ముందుగా నిశ్చయించబడలేదు” (“Why Marriage, Why Family,” Ensign or Liahona, May 2015,52).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

“వ్యక్తి మర్త్యత్వమునకు ముందు లోకమునందు, మర్త్యత్వమునందు మరియు నిత్య సంకల్పమునకు లింగభేదము ఆవశ్యకమైన విశేష లక్షణము.”లింగభేదము మరియు స్వ-లింగ ఆకర్షణకు సంబంధించిన సిద్ధాంతాన్ని చర్చించడం మీ కుటుంబానికి సహాయపడేటట్లయితే, క్రింది వనరులు సహాయపడగలవు: డాలిన్ హెచ్. ఓక్స్, “సత్యము మరియు ప్రణాళిక,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2018, 25–28.

“సంతోషము కొరకైన దైవిక ప్రణాళిక.”పరలోక తండ్రి ప్రణాళికలో కుటుంబాల యొక్క ప్రాముఖ్యతను చూడడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, మీరు ఒక కాగితంపై మూడు భాగాలలో పూర్వ మర్త్య జీవితం, మర్త్య జీవితం, మరియు మరణం తర్వాత జీవితం అని వ్రాయవచ్చు. కలిసి ప్రకటనను వెదకండి మరియు దేవుని ప్రణాళిక యొక్క ఈ భాగాలలో ప్రతిదాని గురించి మీరు నేర్చుకున్న దానిని కాగితంపై వ్రాయండి. దేవుడికి కుటుంబాలు ఎందుకు అంత ముఖ్యమైనవి?

“కుటుంబాలు నిత్యము కలిసి ఉండ(గలవు).”

“కుటుంబ జీవితములో సంతోషము.”“(మీ) కుటుంబ జీవితములో సంతోషమును” అధికముగా ఎలా సాధించాలో చర్చించడానికి మీరు కుటుంబాల గురించి ఒక పాటను కలిసి పాడవచ్చు. మన కుటుంబానికి మరింత సంతోషాన్ని తెచ్చేలా ఈ పాట నుండి మరియు కుటుంబ ప్రకటన నుండి మనమేమి నేర్చుకుంటాము? మన కుటుంబము “ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బోధనలపై పునాది వేయబడిందని” మనమెలా నిశ్చయపరచగలము? ఈ వారం మీరు పనిచేయదలచిన ఒక బోధనను ఎంచుకోవడాన్ని పరిగణించండి.

“కుటుంబమును సమాజము యొక్క ప్రాథమిక ప్రమాణముగా బలపరచండి.”లోకములోని కుటుంబాలను బలహీనపరచడానికి సాతాను ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు? కుటుంబాలను బలపరచడానికి మన వంతును మనమెలా చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Home Can Be a Heaven on Earth,” Hymns, no. 298.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

దేవుని ప్రేమను కనుగొనండి. అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ ఇలా బోధించారు, “సువార్త అనగా ప్రేమ యొక్క సువార్త—దేవుని పట్ల ప్రేమ మరియు ఒకరిపట్ల ఒకరి ప్రేమ” (“God’s Love for His Children,” Ensign, May 1988,59, 59). మీరు కుటుంబ ప్రకటన చదివినప్పుడు, మీకు బాగా అర్థవంతమనిపించిన దేవుని ప్రేమకు సాక్ష్యాలను గుర్తించడాన్ని పరిగణించండి.

ముద్రించు