2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
డిసెంబరు 6–12. విశ్వాస ప్రమాణాలు మరియు అధికారిక ప్రకటనలు 1 మరియు 2: “మేము నమ్ముచున్నాము”


“డిసెంబరు 6–12. విశ్వాస ప్రమాణాలు మరియు అధికారిక ప్రకటనలు 1 మరియు 2: ‘మేము నమ్ముచున్నాము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

డిసెంబరు 6–12. విశ్వాస ప్రమాణాలు మరియు అధికారిక ప్రకటనలు 1 మరియు 2,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

అనేక చర్మ రంగులు గల చేతులను చూపుతున్న బొంత

యోగ్యులైన పురుష సభ్యులందరికి, ఎమ్మా ఆల్లెబిస్ చేత

డిసెంబరు 6–12

విశ్వాస ప్రమాణాలు మరియు అధికారిక ప్రకటనలు 1 మరియు 2

“మేము నమ్ముచున్నాము”

మీరు విశ్వాస ప్రమాణాలు మరియు అధికారిక ప్రకటనలు 1 మరియు 2 చదివినప్పుడు, అవి సంఘముపై కలిగియున్న ప్రభావాన్ని పరిగణించండి. అవి బోధిస్తున్న సత్యాలలో ఏది మీ మనస్సును ప్రభావితం చేసింది?

మీ మనోభావాలను నమోదు చేయండి

జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనము నుండి 200 సంవత్సరాలలో దేవుడు తన సంఘ నాయకులకు “బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును” ఇచ్చుట కొనసాగించాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61). కొన్ని సందర్భాలలో, “మనుష్య కుమారుల పరిస్థితులకు అనుకూలముగా తన కరుణాకటాక్షములు ఉండునట్లు ప్రభువు చిత్త ప్రకారముగా” సంఘము యొక్క విధానాలు మరియు ఆచారాలలో మార్పులు చేయడానికి ఆ బయల్పాటు సంఘ నాయకులను నడిపించింది (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:15). అధికారిక ప్రకటనలు 1 మరియు2 ఈ విధమైన బయల్పాటును సూచిస్తాయి—ఒకటి బహు వివాహ ఆచరణ యొక్క ముగింపుకు దారితీసింది, మరొకటి దేవాలయ దీవెనలతో పాటుగా యాజకత్వపు దీవెనలు అన్ని జాతుల ప్రజలకు లభ్యమయ్యేలా చేసింది. ఇటువంటి మార్పులు నిజమైన మరియు జీవించియున్న ప్రవక్తతోపాటు “జీవము గల సత్య సంఘమును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:30) కలిగియుండడంలో ఒక భాగము.

అయితే, మార్పుచెందని విషయాలు కూడా ఉన్నాయి—మూలాధారమైన నిత్య సత్యాలు. కొన్నిసార్లు బయల్పాటు యొక్క ఉద్దేశ్యము ఈ సత్యాలపై అదనపు వెలుగును ప్రసరింపజేయడం, వాటిని మరింత స్పష్టంగా చూడగలిగేందుకు మనకు సహాయపడడం అయ్యుంటుంది. విశ్వాస ప్రమాణాలు—కడవరి-దిన పరిశుద్ధుల నమ్మకాలకు సంబంధించి జోసెఫ్ స్మిత్ యొక్క 13 క్లుప్త వివరణలు—ఈ స్పష్టతనిచ్చు ఉద్దేశ్యానికి సహాయపడుతున్నట్లు అనిపిస్తాయి. రెండు విధాల బయల్పాటులు సంఘమును, అనగా నిత్య సత్యముపై బలంగా కనుగొనబడినప్పటికీ నేటి సవాళ్ళను ఎదుర్కోవడానికి మనకు సహాయపడేలా ప్రభువు మన గ్రహింపును అధికం చేసినప్పుడు ఎదుగుదలకు, మార్పుకు తగిన సామర్థ్యమున్న సంఘమును నడిపించి, దీవిస్తాయి. మరొక విధముగా, “దేవుడు బయలుపరచిన సమస్తమును, ఇప్పుడు ఆయన బయలుపరచు సమస్తమును మేము నమ్ముచున్నాము, దేవుని రాజ్యమునకు సంబంధించిన గొప్ప మరియు ముఖ్యమైన సంగతులనేకము ఆయన ఇంకా బయలుపరచునని మేము నమ్ముచున్నాము” (విశ్వాస ప్రమాణాలు 1:9).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

విశ్వాస ప్రమాణాలు

పునఃస్థాపించబడిన సువార్త యొక్క మూలాధార సత్యాలను విశ్వాస ప్రమాణాలు కలిగియున్నాయి.

మీరు విశ్వాస ప్రమాణాలు చదివేందుకు ఒక విధానము, ప్రతిదానిలో కనుగొనబడు సత్యాలను జాబితా చేసి, ఆ తరువాత ఈ సత్యాలకు సంబంధించిన లేఖనాలను కనుగొనడం. ఈ లేఖనాలు విశ్వాస ప్రమాణాలు లోని సత్యాల గురించి మీ గ్రహింపును ఎలా అధికం చేస్తాయి?

విశ్వాస ప్రమాణాలు 1:9; అధికారిక ప్రకటనలు 1 మరియు 2

యేసు క్రీస్తు యొక్క సంఘము బయల్పాటు ద్వారా నడిపించబడుతుంది.

ఆ విషయాలకు అర్థము సంఘ విధానాలు మరియు ఆచరణలలో మార్పులు చేయడమైనప్పటికీ, “దేవుని రాజ్యమునకు సంబంధించిన గొప్ప మరియు ముఖ్యమైన సంగతులనేకము (దేవుడు) ఇంకా బయలుపరచునని మేము నమ్ముచున్నాము” (విశ్వాస ప్రమాణాలు 1:9) ఈ సూత్రాన్ని మనస్సులో ఉంచుకొని, అధికారిక ప్రకటనలు 1 మరియు2 పునర్వీక్షించండి మరియు నిరంతర బయల్పాటులో మీ విశ్వాసాన్ని బలపరిచే పదాలు, వాక్యభాగాల కొరకు చూడండి. ప్రభువు యొక్క ప్రవక్తకు నిరంతర బయల్పాటు గురించి మీరు ఆలోచించగల ఇతర ఉదాహరణలేవి? ఈ బయల్పాటులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయి? పరలోక తండ్రి రాజ్యము యొక్క కార్యాన్ని అవి ఎలా ముందుకు తీసుకువెళ్ళాయి?

ఆమోసు 3:7; 2 నీఫై 28:30 కూడా చూడండి.

అధికారిక ప్రకటన 1

దేవుని కార్యము తప్పక ముందుకు సాగాలి.

“ప్రకటనపత్రం గురించి అధ్యక్షులు విల్ఫర్డ్ ఉడ్రఫ్ ఇచ్చిన మూడు ప్రసంగముల నుండి తీసుకొనబడిన భాగము”లలో(అధికారిక ప్రకటన 1 యొక్క అంతమున), ప్రభువు బహు వివాహ ఆచారమును ముగించడానికి ప్రవక్త చెప్పిన కారణాలేవి? దేవుని కార్యము గురించి ఇది మీకేమి బోధిస్తుంది?

విల్ఫర్డ్ ఉడ్రఫ్ యొక్క వర్ణచిత్రము

విల్ఫర్డ్ ఉడ్రఫ్, హెచ్. ఇ. పీటర్‌సన్ చేత

అధికారిక ప్రకటన 2

మనకు సంపూర్ణ గ్రహింపు లేనప్పటికీ, మనము ప్రభువు యందు నమ్మికయుంచగలము.

ప్రభువు యందు నమ్మికయుంచమని లేఖనాలు మనకు బోధిస్తాయి (సామెతలు 3:5 చూడండి), మరియు సంఘము యాజకత్వ నియామకమును, దేవాలయ విధులను వారి నుండి నిలిపివేసినప్పుడు ఆఫ్రికన్ సంతతి యొక్క అనేకమంది సంఘ సభ్యులు చేసినది అదే. ఈ విధానము ఎందుకు ఉన్నదో వారు గ్రహించలేకపోయినప్పటికీ—ఆనాడు చెప్పబడినవి, నేడు సంఘము చేత నిరాకరించబడిన వివరణల చేత వారు తరచు గాయపరచబడినప్పటికీ—ఆఫ్రికన్ సంతతిలో అనేకమంది భక్తిగల సభ్యులు ప్రభువు నందు నమ్మికయుంచి, వారి జీవితమంతా విశ్వాసులుగా నిలిచారు. మీరు అధికారిక ప్రకటన 2 చదువుతున్నప్పుడు, మీకు పరిపూర్ణ గ్రహింపు లేనప్పటికీ ప్రభువు నందు నమ్మికయుంచడాన్ని మీరెలా నేర్చుకున్నారో ధ్యానించండి.

సంఘము యొక్క నల్లజాతి సభ్యుల విశ్వాసము గురించి తెలుసుకోవడం మీకు ప్రేరణనివ్వవచ్చు.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

విశ్వాస ప్రమాణాలు.విశ్వాస ప్రమాణాలు కొరకు “సూక్ష్మ-పాఠాలను” మీ కుటుంబము ఎలా తయారు చేయగలదో పరిగణించండి. ఉదాహరణకు, వారమంతా ప్రతి కుటుంబ సభ్యుడు ఒక ప్రమాణమును ఎంచుకొని, దానికి సంబంధించిన లేఖనము, చిత్రము, కీర్తన లేదా పిల్లల పాట కనుగొనవచ్చు లేదా వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవచ్చు.

లేదా కుటుంబ సభ్యులు వంతులవారీగా ఒకరినొకరు సంఘము గురించి, మన నమ్మకాల గురించి ప్రశ్నలడిగి, ఒక విశ్వాస ప్రమాణముతో ఆ ప్రశ్నలకు జవాబివ్వవచ్చు.

అధికారిక ప్రకటనలు 1 మరియు2.అధికారిక ప్రకటనలు 1 మరియు2 సంఘములో ఆధునిక బయల్పాటు యొక్క పాత్రను గ్రహించడానికి మనకు సహాయపడతాయి. మీ కుటుంబము కలిసి వాటిని చదువుతున్నప్పుడు, “సర్వశక్తిమంతుడగు దేవుని ప్రేరేపణతో” (అధికారిక ప్రకటన 1) ప్రవక్త మనల్ని ఏవిధంగా నడిపిస్తారో చర్చించడాన్ని పరిగణించండి. తన సంఘాన్ని వ్యక్తిగతంగా నడిపించే జీవముగల దేవుని యందు మన విశ్వాసాన్ని ఈ రెండు ప్రకటనలు ఏవిధంగా బలపరుస్తాయి? నేడు సంఘము యొక్క కార్యములో ఆయన హస్తాన్ని మనమెలా చూస్తాము? పైన ఇవ్వబడిన “వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు” లో కొన్ని వనరులను కలిసి కనుగొనాలని మీరు నిర్ణయించుకోవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

చర్య తీసుకోవడానికిచ్చిన ఆహ్వానాలపై విచారణ చేయండి. “చర్య తీసుకోవడానికిచ్చిన ఆహ్వానాలపై మీరు విచారణ చేస్తున్నప్పుడు, మీరు వారిపట్ల శ్రద్ధ చూపుతున్నారని మరియు సువార్త వారి జీవితాలను దీవిస్తున్నదని (మీ కుటుంబ సభ్యులకు) మీరు చూపుతారు. వారి అనుభవాలను పంచుకోవడానికి కూడా మీరు వారికి అవకాశాలనిస్తారు” (Teaching in the Savior’s Way,35).