2023 క్రొత్త నిబంధన
ఫిబ్రవరి 13-19. మత్తయి 5; లూకా 6: “మీరు ధన్యులు”


“ఫిబ్రవరి 13-19. మత్తయి 5; లూకా 6: ‘మీరు ధన్యులు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఫిబ్రవరి 13-19. మత్తయి 5; లూకా 6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
కొండమీద బోధిస్తున్న యేసు

కొండమీద ప్రసంగము చేస్తున్న యేసు, గుస్తావ్ డోరి చేత

ఫిబ్రవరి 13-19

మత్తయి 5; లూకా 6

“మీరు ధన్యులు”

మత్తయి 5 మరియు లూకా 6 మీరు చదివినప్పుడు మీరు పొందే భావనలపట్ల శ్రద్ధ వహించండి మరియు మీ దినచర్య పుస్తకములో లేదా మరొక విధంగా వాటిని నమోదు చేయండి. ఈ అధ్యాయాలలో ముఖ్యమైన సూత్రాలలో కొన్నిటిని గుర్తించడానికి ఈ సారాంశము మీకు సహాయపడగలదు, కానీ మీ అధ్యయనంలో మీరు కనుగొనే ఇతర వాటికొరకు సిద్ధంగా ఉండండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఈ సమయానికి ఆయన పరిచర్యయందు, ఆయన కాలములో జనులు వినడానికి అలవాటుపడిన దానికి భిన్నంగా యేసు యొక్క బోధనలు ఉంటాయని స్పష్టమైనది. పేదవారు దేవుని రాజ్యమును పొందుతారా? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారా? హింసింపబడేవారు దీవించబడతారా? శాస్త్రులు మరియు పరిసయ్యులు అటువంటి విషయాలను బోధించుట లేదు. అయినప్పటికీ దేవుని యొక్క ధర్మశాస్త్రమును నిజముగా గ్రహించిన వారు రక్షకుని మాటలలోని సత్యాన్ని గుర్తించారు. “కంటికి కన్ను” మరియు “నీ శత్రువును ద్వేషించుము” అనేవి అల్పమైన ధర్మశాస్త్రములు (మత్తయి 5:38, 43). కానీ యేసు క్రీస్తు ఉన్నతమైన ధర్మశాస్త్రమును బోధించడానికి వచ్చారు (3 నీఫై15:2–10 చూడండి), అది “[మన] పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక పరిపూర్ణులుగా” (మత్తయి 5:48 చూడుము) మారడానికి ఒకరోజు మనకు సహాయపడేందుకు రూపొందించబడింది.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 5:1-12; లూకా 6:20–26, 46–49

యేసు క్రీస్తు బోధించిన విధముగా జీవించడం వలన శాశ్వతమైన సంతోషము వస్తుంది.

ప్రతీఒక్కరు సంతోషంగా ఉండాలని కోరతారు, కానీ ఒకే స్థలములలో సంతోషము కొరకు ప్రతీఒక్కరు వెదకరు. కొందరు దానిని లోకసంబంధమైన అధికారము మరియు స్థానములో, ఇతరులు ఐశ్వర్యములో లేదా భౌతిక కోరికలను తృప్తిపరచుకొనుటలో అన్వేషిస్తారు. శాశ్వతమైన సంతోషమునకు మార్గమును బోధించుటకు, ధన్యులుగా ఉండుట అనగా నిజమైన అర్థమేమిటో బోధించుటకు యేసు క్రీస్తు వచ్చారు. మత్తయి 5:1–12 మరియు లూకా 6:20–26 నుండి శాశ్వతమైన సంతోషమును పొందుట గురించి మీరేమి నేర్చుకుంటారు? సంతోషమును గూర్చి ప్రపంచ దృష్టికోణమునకు ఇది భిన్నముగా ఎలా ఉంది?

లూకా 6:46–49తో పాటు ఈ వచనాలు యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండుట గురించి మీకు ఏమి బోధిస్తాయి? ఈ వచనాలలో వివరించబడిన లక్షణాలను వృద్ధి చేసుకొనుటకు మీరేమి చేయుటకు ప్రేరేపించబడ్డారు?

లేఖన దీపిక, “ధన్యతలు,” scriptures.ChurchofJesusChrist.org కూడా చూడండి;

మత్తయి 5:13

“మీరు లోకమునకు ఉప్పయి యున్నారు.”

నిల్వ చేయడానికి, రుచికి మరియు శుద్ధి చేయడానికి ఉప్పు చాలాకాలంగా ఉపయోగించబడింది. ఇశ్రాయేలీయులకు ఉప్పు మతపరమైన అర్థమును కూడా కలిగియున్నది. మోషే ధర్మశాస్త్రము క్రింద జంతు బలినిచ్చు ప్రాచీన ఆచారముతో అది ముడిపడియున్నది (లేవీయకాండము 2:13; సంఖ్యాకాండము 18:19 చూడండి). ఉప్పు దాని సారమును కోల్పోయినప్పుడు, అది నిష్పలమైనదగును లేదా “దేనికి పనికిరాదు” (మత్తయి 5:13). అది ఇతర అంశములతో కలిసినప్పుడు లేదా కల్తీ చేయబడినప్పుడు ఇది జరుగుతుంది.

మీరు మత్తయి 5:13 ధ్యానిస్తున్నప్పుడు దీనిని మనస్సులో ఉంచుకోండి. యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా మీ స్వభావమును మీరెలా నిలుపుకుంటారు? లోకములకు ఉప్పు వలె, మీ భద్రపరచు మరియు శుద్ధిచేయు పనిని మీరెలా నెరవేరుస్తారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 103:9-10 కూడా చూడండి.

చిత్రం
ఉప్పు

“మీరు లోకమునకు ఉప్పయి యున్నారు” (మత్తయి 5:13).

మత్తయి 5:17–48; లూకా 6:27–35

క్రీస్తు ధర్మశాస్త్రము మోషే ధర్మశాస్త్రమునకు బదులుగా ఉంచబడింది.

వారి నీతి, మోషే ధర్మశాస్త్రమును ఎంతో బాగా పాటిస్తున్నామని గర్వించే శాస్త్రులు మరియు పరిసయ్యుల నీతిని అధిగమించాల్సిన అవసరమున్నదని యేసు చెప్పుటను వినుట శిష్యులకు ఆశ్చర్యము కలిగించియుండవచ్చు (మత్తయి 5:20 చూడండి).

మత్తయి 5:21–48 మరియు లూకా 6:27–35 మీరు చదివినప్పుడు, మోషే ధర్మశాస్త్రములో కావాల్సిన ప్రవర్తనలను (“మీరు దానిని విన్నారు గదా …”) మరియు ఈ ప్రవర్తనలను వృద్ధిచేయడానికి యేసు బోధించిన దానిని రెండింటిని గుర్తించుటను పరిగణించండి. రక్షకుని విధానము ఒక ఉన్నతమైన ధర్మశాస్త్రమని మీరెందుకు అనుకుంటున్నారు?

ఉదాహరణకు, మత్తయి 5:27–28 లో మన ఆలోచనలపై మన బాధ్యతను గూర్చి యేసు ఏమి బోధించారు? మీ మనస్సు మరియు హృదయములోనికి వచ్చు ఆలోచనలు మరియు భావాలపై ఎక్కువ నిగ్రహమును మీరు ఎలా పొందగలరు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45 చూడండి).

మత్తయి 5:48

నేను పరిపూర్ణముగా ఉండాలని పరలోక తండ్రి నిజముగా ఆశిస్తున్నారా?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు:

పరిపూర్ణుడు అను పదము టిలీయోస్ అనే గ్రీకు పదము నుండి అనువదించబడింది, దాని అర్థము ‘సంపూర్తి.’ … క్రియ యొక్క ఆనంతమైన రూపము టిలీయ్నో, దాని అర్థము ’సుదూర అంతానికి చేరుకోవడం, పూర్తిగా అభివృద్ధి చెందడం, సంపూర్ణము చేయడం లేదా పూర్తి చేయడం.’ ఆ పదము ‘తప్పు నుండి స్వేచ్ఛను’ సూచించదని దయచేసి గమనించండి; అది ‘సుదూర లక్ష్యాన్ని సాధించడాన్ని సూచిస్తుంది.’ …

“… ప్రభువు ఇలా బోధించారు, ‘ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో నివసించలేరు … ; కాబట్టి, మీరు పరిపూర్ణులగు వరకు ఓపికతో కొనసాగించండి’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 67:13].

“పరిపూర్ణత వైపు మన హృదయపూర్వకమైన ప్రయత్నాలు ఇప్పుడు కష్టతరమైనవిగా మరియు అంతములేనివిగా అనిపిస్తే భయపడనవసరం లేదు. పరిపూర్ణత జరుగుచున్నది. పునరుత్థానము తరువాత మరియు ప్రభువు ద్వారా మాత్రమే అది సంపూర్ణంగా రాగలదు. ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటించు వారందరి కొరకు అది వేచియున్నది” (“Perfection Pending,” Ensign, Nov. 1995, 86, 88).

2 పేతురు 1:3–11; మొరోనై 10:32–33; సిద్ధాంతము మరియు నిబంధనలు 76:69; జెఫ్రీ ఆర్. హాలెండ్, “చివరకు---మీరును పరిపూర్ణులుగా ఉండుము,” లియహోనా, నవ. 2017, 40–42 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 5:1-9.మత్తయి 5:1–9లో బోధించబడిన ఏ సూత్రాలు మీ ఇల్లు సంతోషకరమైన ప్రదేశంగా ఉండడానికి సహాయపడగలవు ? మీ కుటుంబానికి ప్రత్యేకంగా ముఖ్యమనిపించే ఒకటి లేదా రెండింటిని మీరు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, సమాధానకర్తలుగా ఉండడానికి మనకు సహాయపడేలా మనం కనుగొన్న బోధనలేవి? (మత్తయి 5:21–25, 38–44 చూడండి). మనం ఏర్పరచగల లక్ష్యములేవి? మనం ఎలా అనుసరిస్తాము?

మత్తయి 5:13.ఉప్పు వేసిన ఆహారాన్ని కలిసి తినండి మరియు అదే ఆహారాన్ని ఉప్పు లేకుండా తినండి. మనం ఏ తేడాను గమనిస్తాము? “లోకమునకు ఉప్పయి” ఉండుట అనగా అర్థమేమిటి? దీనిని మనము ఎలా చేయగలము?

మత్తయి 5:14-16.“లోకమునకు వెలుగైయుండుట” అనగా అర్థమేమిటో మీ కుటుంబ సభ్యులు గ్రహించుటకు సహాయపడేందుకు మీ గృహము, మీ చుట్టుప్రక్కల మరియు లోకములో వెలుగు యొక్క మూలాధారములలో కొన్నిటిని మీరు అన్వేషించవచ్చు. మీరు వెలుగును దాచినప్పుడు ఏమి జరుగుతుందో చూపుట సహాయకరముగా ఉండవచ్చు. “మీరు లోకమునకు వెలుగైయున్నారు” అని ఆయన చెప్పినప్పుడు యేసు ఉద్దేశ్యమేమిటి? (మత్తయి 5:14). మన కుటుంబానికి ఒక వెలుగుగా ఎవరు ఉన్నారు? మనము ఇతరులకు ఒక వెలుగుగా ఎలా ఉండగలము? (3 నీఫై 18:16, 24–25 చూడండి).

మత్తయి 5:43-45.మీ కుటుంబము ఈ వచనాలలో ఉన్న రక్షకుని మాటలు చదువుతున్నప్పుడు, ప్రత్యేకించి మీరు ఎవరిని ప్రేమించి, దీవించగలరని మరియు ఎవరి కొరకు ప్రార్థించగలరని మీరు భావిస్తున్నారో చెప్పవచ్చు. వారి కొరకు మన ప్రేమను మనము ఎలా పెంచుకోగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

శ్రద్ధ కలిగి ఉండండి. “మీ పిల్లల జీవితాలలో జరుగుతున్న దానిపై మీరు శ్రద్ధ చూపినప్పుడు, మీరు శ్రేష్టమైన బోధనావకాశాలను కనుగొంటారు. … (వారు) చేసే వ్యాఖ్యానాలు లేదా వారు అడిగే ప్రశ్నలు కూడా బోధనా సమయాలకు దారితీయగలవు” (Teaching in the Savior’s Way16).

చిత్రం
క్రొవ్వొత్తి

“మీరు లోకమునకు వెలుగైయున్నారు” (మత్తయి 5:14).

ముద్రించు