2023 క్రొత్త నిబంధన
ఫిబ్రవరి 20-26. మత్తయి 6–7: “ఆయన అధికారముగలవానివలె వారికి బోధించెను”


“ఫిబ్రవరి 20-26. మత్తయి 6–7: ‘ఆయన అధికారముగలవానివలె వారికి బోధించెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఫిబ్రవరి 20-26. మత్తయి 6–7,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
సముద్ర తీరము వద్ద బోధిస్తున్న యేసు

సముద్ర తీరము వద్ద జనులకు బోధిస్తున్న యేసు, జేమ్స్ టిస్సాట్ చేత

ఫిబ్రవరి 20-26

మత్తయి 6–7

“ఆయన అధికారముగలవానివలె వారికి బోధించెను”

మనస్సులో ఒక ప్రశ్నతో, పరలోక తండ్రి మనం తెలుసుకోవాలని కోరిన దానిని గ్రహించాలనే మనఃపూర్వకమైన కోరికతో మనము లేఖనాలను చదివినప్పుడు, మనల్ని ప్రేరేపించడానికి పరిశుద్ధాత్మను మనము ఆహ్వానిస్తాము. మత్తయి 6–7 మీరు చదివినప్పుడు, ఈ మనోభావనలపట్ల శ్రద్ధ చూపండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

కొండమీది ప్రసంగము క్రైస్తవత్వములో బాగా తెలిసిన ఉపన్యాసాలలో ఒకటి. కొండమీదనుండు పట్టణము, పొలములోని అడవి పువ్వులు, గొఱ్ఱెల చర్మములు వేసుకొను తోడేళ్లు వంటి స్పష్టమైన చిత్రాలతో రక్షకుడు బోధించారు. కాని కొండమీది ప్రసంగము మనోహరమైన ప్రసంగము కంటే ఎక్కువైనది. ఆయన శిష్యులకు రక్షకుని బోధనల యొక్క శక్తి, ప్రత్యేకంగా వాటి ప్రకారము మనము జీవించినప్పుడు మన జీవితాలను మార్చగలదు. అప్పుడు ఆయన మాటలు పదాలకన్నా ఎక్కువవుతాయి; అవి జీవితము కొరకు నిశ్చయమైన పునాది అవుతాయి, అవి బుద్ధిమంతుని ఇల్లు వలే, లోకము యొక్క గాలులు, వరదలను తట్టుకొనగలవు (మత్తయి 7:24–25 చూడండి).

చిత్రం
మన బోధనను మెరుగుపరచుట

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 6–7

రక్షకుని బోధనలను జీవించడం ఆయన వలె కావడానికి నాకు సహాయపడగలదు.

కొండమీది ప్రసంగము అనేక సువార్త సూత్రాలను కలిగియుంది. మీరు ఈ అధ్యాయాలను చదివినప్పుడు, మీరు ఏమి నేర్చుకోవాలని ఆయన కోరుతున్నారో ప్రభువును అడగండి.

లోక విషయాలకుపైగా దేవుని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరతను ఒక సూత్రంగా మీరు కనుగొనవచ్చు. మత్తయి 6–7 లోని రక్షకుని బోధనలలో ఏవి పరలోక విషయాలపై దృష్టిసారించుటకు మీకు సహాయపడతాయి? ఏ ఇతర ఆలోచనలు లేదా మనోభావాలను మీరు కలిగియున్నారు? మీరు ఏమి చేయడానికి ప్రేరేపించబడ్డారు? మీ మనోభావాలను నమోదు చేయుటను పరిగణించండి. ఉదాహరణకు:

మత్తయి 6:1–4

ఇతరులు నా గురించి ఏమనుకుంటారనే దానికంటే దేవుడు నా గురించి ఏమనుకుంటారో అనేదానిపై నేను ఎక్కువ శ్రద్ధ చూపాలనుకుంటున్నాను.

మత్తయి 6–7లో మరొక సూత్రము ప్రార్థన. మీ ప్రార్థనలను విలువకట్టడానికి సమయం తీసుకోండి. ప్రార్థన ద్వారా దేవునికి దగ్గరగుటకు మీ ప్రయత్నములందు మీరెలా ఉన్నారని మీరు భావిస్తున్నారు? మత్తయి 6–7లోని ఏ బోధనలు మీరు ప్రార్థించే విధానాన్ని మెరుగుపరచడానికి ప్రేరేపిస్తాయి? మీరు పొందే మనోభావాలను నమోదు చేయండి. ఉదాహరణకు:

మత్తయి 6:9

నేను ప్రార్థించినప్పుడు, పరలోక తండ్రి యొక్క పేరును భక్తితో కూడిన గౌరవముతో పలకాలనుకుంటున్నాను.

మత్తయి 6:10

నేను ప్రార్థించినప్పుడు, ప్రభువు యొక్క చిత్తము నెరవేరాలని నా కోరికను నేను వ్యక్తపరచగలను.

ప్రత్యేకంగా మీకు అన్వయించే పునరావృత సూత్రాలు లేదా సందేశాల కొరకు చూస్తూ కొండమీది ప్రసంగమును మరొకసారి చదువుటకు మీరు ఆలోచించవచ్చు. మీ ఆలోచనలు మరియు మనోభావనలతోపాటు, మీరు కనుగొనేదానిని అధ్యయన పుస్తకములో నమోదు చేయండి.

చిత్రం
ప్రార్థన చేస్తున్న కుటుంబము

ప్రార్థన ద్వారా మనము దేవునికి దగ్గర కాగలము.

మత్తయి 6:7

ప్రార్థనలో “వ్యర్థమైన మాటలు” ఉపయోగించుట అనగా అర్థమేమిటి?

“వ్యర్థమైన మాటలు” అనగా అవే మాటలను మరలా పలుమార్లు పునరావృతం చేయడమని జనులు తరచుగా అర్థము చేసుకుంటారు. అయినప్పటికీ, వ్యర్థము అనే మాట ఏ విలువ లేని దానిని వర్ణిస్తుంది. ప్రార్థనలో “వ్యర్థమైన మాటలు” (ఆల్మా 31:12–23 చూడండి) ఉపయోగించుట అనగా మనఃపూర్వకముగా లేని, హృదయపూర్వకంగా అనుభూతిచెందని ప్రార్థన అని అర్థము.

మత్తయి 7:1–5

నేను నీతిగా తీర్పు తీర్చగలను.

మత్తయి 7:1లో, మనము తీర్పు తీర్చరాదని రక్షకుడు చెప్పుచున్నట్లుగా కనబడవచ్చు, కానీ ఇతర లేఖనములలో (ఈ అధ్యాయములో మిగిలిన వచనములు కలిపి) మనము ఎలా తీర్పు తీర్చాలనే దాని గురించి ఆయన మనకు సూచనలిచ్చారు. అది మిమ్మల్ని కలవరపరచిన యెడల, ఈ వచనము యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదము సహాయపడవచ్చు: “అవినీతిగా తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; కానీ నీతిగా తీర్పు తీర్చుడి” (మత్తయి 7:1, పాదవివరణ లో). ఎలా “నీతిగా తీర్పు తీర్చాలో” తెలుసుకొనుటకు మీకు సహాయపడునట్లు మిగిలిన అధ్యాయముతోపాటు మత్తయి 7:1–5 లో మీరేమి కనుగొంటారు?

topics.ChurchofJesusChrist.org

మత్తయి 7:21–23

ఆయన చిత్తమును చేయుట ద్వారా నేను యేసు క్రీస్తును తెలుసుకోగలిగాను.

మత్తయి 7:23 లో “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను” అనే వాక్యభాగము జోసెఫ్ స్మిత్ అనువాదములో “మీరు ఎన్నడూ నన్ను ఎరుగరు” (మత్తయి 7:23, పాదవివరణ ) అని మార్చబడింది. ఆయన చిత్తమును చేయుట గురించి 21–22 వచనములలో ప్రభువు బోధించిన దానిని బాగా గ్రహించుటకు ఈ మార్పు మీకెలా సహాయపడుతుంది? ప్రభువును మీరు ఎంత బాగా ఎరిగియున్నట్లుగా భావిస్తున్నారు? ఆయనను బాగా ఎరుగుటకు మీరేమి చేయగలరు?

మత్తయి 7:24–27

రక్షకుని బోధనలకు లోబడుట నా జీవితానికి నిశ్చయమైన పునాదిని వేస్తుంది.

సువార్తను జీవించడం మన జీవితాల నుండి దుర్దశను తొలగించదు. మత్తయి 7:24–27 లో రక్షకుని ఉపమానములో ఉన్న రెండు ఇళ్ళు ఒకే తుఫానును అనుభవించాయి. కానీ వాటిలో ఒక ఇల్లు దానిని తట్టుకోగలిగింది. రక్షకుని బోధనలను జీవించడం మీ కొరకు ఒక స్థిరమైన పునాదిని ఎట్లు నిర్మించింది? మీ “ఇంటిని బండపై” కట్టడాన్ని కొనసాగించడానికి మీరేమి చేయాలని ప్రేరేపించబడ్డారు? (24వ వచనము చూడండి).

హీలమన్ 5:12 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 6:5-13.రక్షకుడు ప్రార్థించిన విధానము నుండి ప్రార్థన గురించి మనము ఏమి నేర్చుకోగలము? మన వ్యక్తిగత మరియు కుటుంబ ప్రార్థనలను మెరుగుపరచుటకు ఒక మాదిరిగా ఆయన ప్రార్థనను మనము ఎలా ఉపయోగించగలము? (లూకా 11:1–13 కూడా చూడండి.) మీకు చిన్నపిల్లలు ఉన్న యెడల, మీరు కలిసి ప్రార్థించుటను సాధన చేయవచ్చు.

మత్తయి 6:33.“దేవుని రాజ్యమును మొదట … వెదకుడి” అనగా అర్థమేమిటి? వ్యక్తిగతంగా మరియు ఒక కుటుంబముగా దీనిని మనము ఎలా చేస్తున్నాము?

మత్తయి 7:1-5.ఈ వచనాలలోని బోధనలను ఊహించడానికి మీ కుటుంబము ఒక నలుసు (చిన్న చెక్క తునక) మరియు ఒక దూలమును (పెద్ద చెక్క ముక్క) కనుగొనవచ్చు. రెండిటిని పోల్చడం ఇతరులను తీర్పుతీర్చుట గురించి మనకు ఏమి బోధిస్తుంది?

మత్తయి 7:24-27.రక్షకుని యొక్క బుద్ధిమంతుని మరియు బుద్ధిహీనుని ఉపమానమును బాగా గ్రహించుటకు మీ కుటుంబానికి సహాయపడుటకు, వారిని ఇసుకపై మరియు తరువాత రాయిపై నీళ్ళు వేయనివ్వండి. ఒక బండమీద మన ఆత్మీయ పునాదులను మనము ఎలా కట్టగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

అంతరార్థములు పంచుకోండి. మీ వ్యక్తిగత అధ్యయనము నుండి మీరు నేర్చుకొన్న సూత్రములను చర్చించుట ఇతరులకు బోధించుటకు మంచి విధానము మాత్రమే కాదు; అది మీ స్వంత జ్ఞానమును బలపరచుటకు కూడ సహాయపడుతుంది. ఈ వారము మీరు నేర్చుకొన్న ఒక సూత్రమును కుటుంబ సభ్యునితో లేదా మీ సంఘ తరగతులందు పంచుకోవడానికి ప్రయత్నించండి.

చిత్రం
ప్రార్థన చేస్తున్న యేసు

నేను మీ కొరకు ప్రార్థించాను, డెల్ పార్సన్ చేత

ముద్రించు