2023 క్రొత్త నిబంధన
ఫిబ్రవరి 27–మార్చి 5. మత్తయి 8; మార్కు 2-4; లూకా 7: “నీ విశ్వాసము నిన్ను రక్షించెను”


“ఫిబ్రవరి 27–మార్చి 5. మత్తయి 8; మార్కు 2-4; లూకా 7: ‘నీ విశ్వాసము నిన్ను రక్షించెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఫిబ్రవరి 27–మార్చి 5. మత్తయి 8; మార్కు 2-4; లూకా 7,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
మంచంపై నుండి వ్యక్తిని లేపుతున్న యేసు

ఫిబ్రవరి 27–మార్చి 5

మత్తయి 8; మార్కు 2-4; లూకా 7

“నీ విశ్వాసము నిన్ను రక్షించెను”

మీ లేఖన అధ్యయనములో తొందరపడకుండా జాగ్రత్త వహించండి. ప్రతి వచనాన్ని చదవడానికి మీకు సమయం లేనప్పటికీ, ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడానికి సమయం తీసుకోండి. ఈ ధ్యాన సమయాలు వ్యక్తిగత బయల్పాటుకు దారితీస్తాయి.

మీ మనోభావాలను నమోదు చేయండి

క్రొత్త నిబంధనలోని స్పష్టమైన సందేశాలలో ఒకటి ఏదనగా, యేసు క్రీస్తు స్వస్థత కలుగజేయువాడు. జ్వరముతో ఉన్న స్త్రీ నుండి విధవరాలి యొక్క మరణించిన కుమారుని వరకు—రోగులను, బాధలలో ఉన్నవారిని రక్షకుడు స్వస్థపరచిన వృత్తాంతాలు ఎన్నో. శారీరక స్వస్థతను ఉద్ఘాటించడం దేనికి? ఈ అద్భుతములలో మన కొరకు ఏ సందేశములు ఉండియుండవచ్చు? నిశ్చయముగా ఒక స్పష్టమైన సందేశము ఏదనగా యేసు క్రీస్తు దేవుని కుమారుడు, మన శారీరక బాధలు మరియు లోపాలు కలిపి అన్ని విషయాలపై అధికారము కలిగియున్నారు. కానీ అనుమానస్పదమైన సద్దూకయ్యులకు ఆయన మాటలలో మరొక అర్ధము కలిగియున్నది: “పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని” (మార్కు 2:10). ఒక అంధుడు లేదా ఒక కుష్ఠురోగి స్వస్థపరచబడుట గురించి మీరు చదివినప్పుడు, రక్షకుని నుండి మీరు పొందగల—ఆత్మీయమైన మరియు శారీరకమైన—స్వస్థత గురించి మరియు “నీ విశ్వాసము నిన్ను రక్షించెను” అని ఆయన మీతో చెప్పుట గురించి (లూకా 7:50) మీరు ఆలోచించవచ్చు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 8; మార్కు 2-3; లూకా 7

రక్షకుడు బలహీనతలను మరియు వ్యాధులను స్వస్థపరచగలరు.

ఈ కొన్ని అధ్యయాలు రక్షకుని చేత నెరవేర్చబడిన అద్భుతమైన స్వస్థతలలో అనేక సందర్భాలను నమోదు చేసాయి. ఈ స్వస్థతలను మీరు అధ్యయనము చేసినప్పుడు, మీ కొరకు సాధ్యమైన సందేశాలను వెదకండి. మీకై మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ఈ వృత్తాంతము యేసు క్రీస్తునందు విశ్వాసము గురించి ఏమి బోధించును? రక్షకుని గురించి ఈ వృత్తాంతము ఏమి బోధించును? ఈ అద్భుతము నుండి నేను ఏమి నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నారు? ఇక్కడ కొన్ని మాదిరులున్నాయి, కానీ ఇంకా అనేకం ఉన్నాయి:

మార్కు 2:15–17; లూకా 7:36-50

పాపులను ఖండించుటకు కాదు, కానీ వారిని స్వస్థపరచడానికి యేసు క్రీస్తు వచ్చారు.

శాస్త్రులు మరియు పరిసయ్యులతో యేసు సంభాషణల గురించి ఈ వచనాలలో మీరు చదివినప్పుడు, ఈ వృత్తాంతాలలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారేమో ఆలోచించవచ్చు. ఉదాహరణకు, మీ ఆలోచనలు మరియు క్రియలు ఎప్పుడైనా పరిసయ్యుడైన సీమోను వలె ఉన్నాయా? యేసు పాపులను చూసిన విధానానికి మరియు సీమోను వంటి పరిసయ్యులు వారిని చూసిన విధానానికి మధ్య తేడాను మీరెలా వర్ణిస్తారు? పాపభారముతో నున్న వారు రక్షకునితో ఉన్నప్పుడు ఎలా భావిస్తారో పరిగణించండి. వారు మీతో ఉన్నప్పుడు వారెలా భావిస్తారు?

లూకా 7:36–50 లో వర్ణించబడిన స్త్రీ వలె మీరెట్లున్నారో కూడా మీరు ధ్యానించవచ్చు. రక్షకుడు ఆమెపట్ల చూపించిన సున్నితత్వం మరియు దయను మీరు ఎప్పుడు అనుభవించారు? విశ్వాసం, ప్రేమ మరియు అణకువ గురించి ఆమె మాదిరి నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

మత్తయి 8:18–22; మార్కు 3:31–35

యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా ఉండుట అనగా నా జీవితంలో ఆయనను మొదటగా ఉంచుట అని అర్థము.

ఈ వచనాలలో, కొన్నిసార్లు మనము విలువైనవిగా ఎంచిన ఇతర విషయాలను మనము తప్పక త్యాగము చేయవలసియున్నప్పటికీ, ఆయన శిష్యులుగా ఉండుటకు మన జీవితాలలో ఆయనను మొదటగా ఉంచుట అవసరమని యేసు బోధించారు. ఈ వాక్యభాగాలను మీరు అధ్యయనము చేసినప్పుడు, మీ స్వంత శిష్యత్వమును ధ్యానించండి. శిష్యులు రక్షకుడిని మొదటగా ఉంచుటకు ఎందుకు సమ్మతించాలి? యేసును మొదటగా ఉంచుటకు బదులుగా మీరు వదిలివేయాల్సినది ఏమిటి? (లూకా 9:57-62 కూడా చూడండి.)

మత్తయి 8:23–27; మార్కు 4:35–41

జీవితపు తుఫానుల మధ్యలో శాంతిని తెచ్చుటకు యేసు క్రీస్తు శక్తిని కలిగియున్నారు.

తుఫానులో సముద్రము వద్ద ఉండి—నీటి అలలు పడవను నింపుట చూసి, “బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింతలేదా?” అని యేసు యొక్క శిష్యులు ప్రశ్నించినట్లుగా మీరు ఎప్పుడైనా భావించారా?

మార్కు 4:35–41 లో మీరు నాలుగు ప్రశ్నలు కనుగొంటారు. ప్రతి ఒక్కటి వరుసగా వ్రాయండి మరియు యేసు క్రీస్తునందు విశ్వాసముతో జీవితపు సవాళ్ళును ఎదుర్కొనుట గురించి అది మీకు బోధించే దానిని ధ్యానించండి. రక్షకుడు మీ జీవితపు తుఫానులకు శాంతిని ఎలా తేగలరు?

చిత్రం
పడవలో నుండి తుఫానును నిమ్మళపరుస్తున్న యేసు

భయము నుండి విశ్వాసమునకు, హావర్డ్ లియోన్ చేత

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 8; మార్కు 2-4; లూకా 7.ఈ అధ్యాయాలలో వర్ణించబడిన అద్భుతాల జాబితా తయారు చేయడాన్ని పరిగణించండి. వాటిలో కొన్నింటి చిత్రములను గీయుటకు లేదా కనుగొనుటకు ప్రయత్నించండి (Gospel Art Book or ChurchofJesusChrist.org) చూడండి. అద్భుతాలలో ఒకదాని గురించి చెప్పడానికి మరియు దాని నుండి వారు నేర్చుకున్న దానిని పంచుకోవడానికి ప్రతీ కుటుంబ సభ్యుడు చిత్రాలను ఉపయోగించవచ్చు. మన కాలంలో మీరు చదివిన లేదా చూచిన అద్భుతాల యొక్క కొన్ని మాదిరులను మీరు పంచుకోవచ్చు.

మత్తయి 8:5-13; లూకా 7:1-10.శతాధిపతి విశ్వాసంలో యేసును ప్రభావితం చేసినది ఏమిటి? యేసు క్రీస్తునందు అటువంటి విశ్వాసాన్ని మనమెలా చూపగలము?

మార్కు 2:1–12. నడవలేని వ్యక్తి యొక్క స్నేహితుల వలె మనము ఎట్లు ఉండగలము? మనకు ఆవిధమైన స్నేహితునిగా ఎవరు ఉన్నారు?

మార్కు 4:35-41.కుటుంబ సభ్యులు భయపడినప్పుడు ఈ వృత్తాంతము వారికి సహాయపడుతుందా? బహుశా వారు 39వ వచనము చదువవచ్చు మరియు శాంతిని అనుభవించుటకు రక్షకుడు వారికి సహాయపడినప్పటి అనుభవాలను పంచుకోవచ్చు.

ఒకరు మార్కు 4:35–38 చదువుతున్నప్పుడు, వారు తుఫానుతో ఉన్న సముద్రంలో పడవలో ఉన్నట్లు నటించడాన్ని పిల్లలు ఆనందించవచ్చు. తర్వాత, ఒకరు 39వ వచనము చదువుతున్నప్పుడు, వారు నెమ్మదించిన సముద్రములో పడవలో ఉన్నట్లు నటించవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

అందుబాటులో, చేరువగా ఉండండి. శ్రేష్ఠమైన బోధనా క్షణములలో కొన్ని కుటుంబ సభ్యుల హృదయాలలో ప్రశ్నలు లేదా చింతలుగా ప్రారంభమవుతాయి. మీరు వారిని వినడానికి ఆతృతగా ఉన్నారని మీ మాటలు మరియు చేతల ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకొనేలా చేయండి. (Teaching in the Savior’s Way16 చూడండి.)

చిత్రం
పైకప్పు గుండా దించిన మంచంపై ఉన్న రోగితో యేసు

క్రీస్తు మరియు పక్షవాతముగల మనుష్యుడు, జె. కర్క్ రిఛర్డ్స్ చేత

ముద్రించు