2023 క్రొత్త నిబంధన
మార్చి 20-26. మత్తయి 13; లూకా 8; 13: “చెవులు గలవాడు వినునుగాక”


“మార్చి 20-26. మత్తయి 13; లూకా 8; 13: ‘చెవులు గలవాడు వినునుగాక,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మార్చి 20-26. మత్తయి 13; లూకా 8; 13,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
కోతకు సిద్ధముగానున్న గోధుమలు

మార్చి 20-26

మత్తయి 13; లూకా 8; 13

“చెవులు గలవాడు వినునుగాక”

మత్తయి 13 మరియు లూకా 8; 13 మీరు చదువుతున్నప్పుడు, ఈ ఉపమానాలలో ఉన్న రక్షకుని బోధనలను “విని”, అభినందించడానికి మిమ్మల్ని మీరు ఏవిధంగా సిద్దం చేసుకుంటారో ఆలోచించండి. ఈ బోధనలను మీ జీవితంలో అన్వయించుకోవడానికి మీరేమి చేస్తారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

రక్షకుని యొక్క అతి ప్రసిద్ధమైన బోధనలలో కొన్ని ఉపమానాలు అనబడే సరళమైన కథల రూపంలో ఉన్నాయి. ఇవి సాధారణ వస్తువులు లేదా సంఘటనల గురించిన ఆసక్తికరమైన కథలను మించినవి. ఆత్మీయంగా సిద్ధపడిన వారికొరకు అవి దేవుని రాజ్యం గురించి గంభీరమైన సత్యాలను కలిగియున్నాయి. క్రొత్త నిబంధనలో నమోదు చేయబడిన మొదటి ఉపమానాలలో ఒకటి — విత్తువాని ఉపమానము (మత్తయి 13:3–23 చూడండి) — దేవుని వాక్యాన్ని పొందడానికి మన సంసిద్ధతను పరీక్షించుకోమని మనల్ని ఆహ్వానిస్తుంది. “కలిగినవానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును,” అని యేసు ప్రకటించారు (జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 13:10 [మత్తయి 13:12, పాదవివరణ లో]). కావున రక్షకుని ఉపమానాలు—లేదా ఆయన బోధనలు ఏవైనా అధ్యయనం చేయడానికి మనం సిద్ధపడినప్పుడు—మొదలు పెట్టడానికి మంచి స్థలము, మన హృదయాలను పరీక్షించుకోవడం మరియు దేవుని వాక్యానికి మనం “మంచి నేల” (మత్తయి 13:8) – సమృద్ధిగా మనల్ని, మన కుటుంబాలను దీవించేలా అందులో పెరిగి, పుష్పించి, వృద్ధిచెంది, ఫలాలను అందించే నేలను ఇస్తున్నామో లేదో నిర్ధారించడం .

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 13:3–23; లూకా 8:4–15; 13:6–9

దేవుని వాక్యాన్ని పొందడానికి నా హృదయము తప్పక సిద్ధపడియుండాలి.

కొన్నిసార్లు మన హృదయాలు సత్యాన్ని గ్రహించినట్లు, మరికొన్నిసార్లు దానిని నిరోధించడానికి మనం శోధింపబడినట్లు ఎందుకు అనిపిస్తుంది? ప్రభువు నుండి మీరు సత్యాన్ని ఎంత బాగా పొందుతారో ఆలోచించడానికి, విత్తువాని ఉపమానము చదవడం ఒక మంచి అవకాశాన్ని అందించగలదు. మత్తయి 13 లోని 3 – 8 వచనాలను 18 – 23 వచనాలలో ఇవ్వబడిన వివరణలతో ముందుగా జతచేసి చూడడం సహాయకరంగా ఉండవచ్చు. మీలో “మంచి నేలను” అభివృద్ధి చేయడానికి మీరేమి చేయగలరు? నిజంగా దేవుని వాక్యాన్ని విని, అనుసరించడం నుండి మిమ్మల్ని దూరం చేసే కొన్ని “ముండ్లపొదలేవి”? ఈ “ముండ్లపొదలను” మీరు ఎలా జయించగలరు?

ఈ ఉపమానమును మీరు అధ్యయనం చేయడం లూకా 13:6–9లోని ఉపమానమును మీరెలా చదువుతారనే దానిని కూడా ప్రభావితం చేయగలదు. ప్రభువు మన నుండి కోరు “ఫలము” ఏది? మనము “ఫలము ఫలించునట్లు” మన నేలను మనము ఎలా పోషించెదము?

మోషైయ 2:9; ఆల్మా 12:10–11; 32:28–43 కూడా చూడండి.

మత్తయి 13:24–35, 44–52; లూకా 13:18-21

యేసు ఉపమానాలు ఆయన సంఘము యొక్క వృద్ధిని, గమ్యాన్ని అర్థం చేసుకోవడానికి నాకు సహాయపడతాయి.

మత్తయి 13 లోని ఉపమానాలు కడవరి దినాలలో సంఘము యొక్క వృద్ధి మరియు గమ్యాన్ని వర్ణిస్తున్నాయని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు. ప్రభువు యొక్క సంఘము గురించి క్రింది ఉపమానాలు మీకేమి బోధిస్తాయో పరిగణించండి:

  • గోధుమలు మరియు గురుగులు (13:24–30, 36–43)

  • ఆవగింజ (13:31–32)

  • పుల్లని పిండి (13:33)

  • దాచబడిన ధనము మరియు అమూల్యమైన ముత్యము (13:44–46)

  • వల (13:47–50)

  • ఇంటి యజమాని (13:52)

ఈ ఉపమానాలను ధ్యానించిన తరువాత, క్రీస్తు యొక్క కడవరి దిన సంఘము యొక్క కార్యములో పూర్తిగా పాల్గొనడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

లేఖన దీపిక, “దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము,” “ఉపమానము,” scriptures.ChurchofJesusChrist.org కూడా చూడండి.

చిత్రం
ముత్యము

యేసు క్రీస్తు యొక్క సువార్త ఒక ”అమూల్యమైన ముత్యము” వంటిది (మత్తయి 13:46).

మత్తయి 13:24–30, 36–43

లోకము అంతమయ్యే వరకు నీతిమంతులు తప్పక దుష్టుల మధ్య పెరగవలెను.

ఈ ఉపమానమును విశ్లేషించడానికి ఒక విధానము దాని బొమ్మను గీసి, మత్తయి 13:36–43 మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 86:1–7 లో ఉన్న వివరణలతో దానికి పేర్లు వ్రాయడం. గురుగు అనేది ఒక “విషపూరితమైన మొక్క, అది కంకి వేసే వరకు చూడడానికి గోధుమ వలె కనిపిస్తుంది” (బైబిలు నిఘంటువు, “గురుగులు”). లోకములో దుష్టత్వమున్నప్పటికీ విశ్వాసముగా నిలిచియుండడానికి ఈ ఉపమానములోని ఏ సత్యాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి?

లూకా 8:1–3

ఏ విధాలుగా “నిబ్బరముగల స్త్రీలు” రక్షకునికి పరిచర్య చేసారు?

“(యేసు) నుండి ఆత్మీయంగా నేర్చుకుంటూ, భౌతికంగా ఆయనకు సేవచేస్తూ ఆడ శిష్యులు యేసు మరియు పన్నెండుమందితో ప్రయాణించారు. … యేసు పరిచర్యను—ఆయన సువార్త యొక్క సంతోషకరమైన వార్తలు మరియు ఆయన స్వస్థపరచు శక్తి యొక్క దీవెనలు పొందుటకు అదనంగా—ఈ స్త్రీలు తమ ఆస్తినిచ్చి, భక్తితో ఆయనకు పరిచర్య చేసారు” (Daughters in My Kingdom [2017], 4) రక్షకుడిని అనుసరించిన స్త్రీలు ఆయన గురించి శక్తివంతమైన సాక్ష్యము కూడా ఇచ్చారు (లిండా కె. బర్టన్, “నిబ్బరముగల స్త్రీలు,” లియహోనా, మే 2017, 12–15 చూడండి).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 13.మీ కుటుంబ సభ్యులు రక్షకుని ఉపమానాలు చదువుతున్నప్పుడు, వారికి తెలిసిన వస్తువులు లేదా సందర్భాలను ఉపయోగిస్తూ పరలోక రాజ్యము (సంఘము) గురించి అవే సత్యాలను బోధించే తమ స్వంత ఉపమానాల గురించి ఆలోచించడాన్ని వారు ఆనందించవచ్చు.

మత్తయి 13:3–23; లూకా 8:4–15.కలిసి విత్తువాని ఉపమానమును చదివిన తర్వాత, మీ కుటుంబము ఇటువంటి ప్రశ్నలను చర్చించవచ్చు: ఏది మన “నేలను” (మన హృదయాలు) “రాతినేలగా” లేదా వాక్యమును “అణచివేసేలా” చేయగలదు? మన నేల మంచిగా, ఫలవంతంగా ఉందని మనము ఎలా నిశ్చయపరచగలము?

మీ కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నట్లయితే, దేవుని వాక్యము వినడానికి మన హృదయాలను సిద్ధం చేసుకొనే వివిధ మార్గాలను నటించి చూపడానికి కొద్దిమంది కుటుంబ సభ్యులను మరియు వారు చేస్తున్న దానిని ఊహించడానికి మరికొద్దిమందిని ఆహ్వానించడం సరదాగా ఉండవచ్చు.

మత్తయి 13:13-16.క్రీస్తు మాటలను ఇష్టపూర్వకంగా పొందవలసిన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మీరు మీ కుటుంబ సభ్యులకు ఎలా సహాయపడగలరు? “చెవులు వినుటకు మందములైనవి” అనే దానిని రుజువు చేయడానికి, మీరు నెమ్మదిగా మత్తయి 13:13–16 చదువుతుండగా ఒక కుటుంబ సభ్యుని చెవులను మీరు మూయవచ్చు. ఈ వచనాల నుండి ఆ కుటుంబ సభ్యుడు ఎంతవరకు గ్రహించాడు? దేవుని వాక్యానికి మన కళ్ళు, చెవులు, హృదయాలను మనం తెరువగల మార్గాలేవి?

మత్తయి 13:44-46.ఈ ఉపమానాలలోని ఇద్దరు వ్యక్తులు ఉమ్మడిగా కలిగియున్నదేమిటి? దేవుని రాజ్యాన్ని మన జీవితాల్లో ముందుంచడానికి వ్యక్తులుగా మరియు ఒక కుటుంబంగా మనం చేయవలసిన అదనపు విషయాలేమైనా ఉన్నాయా?

లూకా 13:11-17.వారు “(తమకైతాము) చక్కగా నిలువబడలేకున్నట్లు” భావించేలా చేసిన ఏవైనా అనుభవాలను కుటుంబ సభ్యులు కలిగియున్నారా? ఈవిధంగా భావించే వేరెవరినైనా మనం ఎరిగియున్నామా? మనము ఏవిధంగా సహాయం చేయగలము? మన బలహీనతల నుండి రక్షకుడు మనల్ని ఏ విధంగా “విడిపిస్తారు”?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఒక లేఖనమును కంఠస్థం చేయండి. ప్రత్యేకించి మీ కుటుంబానికి అర్థవంతమైన లేఖన భాగాన్ని ఎంచుకొని, దానిని కంఠస్థం చేయమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. ఎల్డర్ రిచర్డ్ జి. స్కాట్ ఇలా బోధించారు, “కంఠస్థం చేసిన లేఖనం శాశ్వత మిత్రునిగా మారుతుంది, అది కాలక్రమేణా బలహీనపడదు” (“The Power of Scripture,” Liahona, Nov. 2011, 6).

చిత్రం
విత్తులు నాటుతున్న వ్యక్తి

విత్తువాని ఉపమానము, జార్జ్ సోపర్ చేత

ముద్రించు