2023 క్రొత్త నిబంధన
మార్చి 13-19. మత్తయి 11–12; లూకా 11: “నేను మీకు విశ్రాంతి కలుగజేతును”


“మార్చి 13-19. మత్తయి 11–12; లూకా 11: ‘నేను మీకు విశ్రాంతి కలుగజేతును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మార్చి 13-19. మత్తయి 11–12; లూకా 11,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
మేఘాలలో నిలబడియున్న యేసు

భయపడవద్దు, మైఖేల్ మామ్ చేత

మార్చి 13-19

మత్తయి 11-12; లూకా 11

“నేను మీకు విశ్రాంతి కలుగజేతును”

అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ బోధించారు: “గతంలోని బయల్పాటులైన లేఖనాలు, ప్రస్తుత బయల్పాటులను అంగీకరించకుండా అర్థం చేసుకోబడలేవు. … లేఖన అధ్యయనము స్త్రీ పురుషులు బయల్పాటులు పొందడాన్ని సాధ్యం చేస్తుంది” (“Scripture Reading and Revelation,” Ensign, Jan. 1995, 7).

మీ మనోభావాలను నమోదు చేయండి

యెహోవాను ఆరాధించడం అనేక విధాలుగా భారమైనదిగా చేసారు పరిసయ్యులు మరియు శాస్త్రులు. వారు తరచు నిత్య సత్యాలపై కఠినమైన నియమాలను నొక్కి వక్కాణించారు. విశ్రాంతి దినముగా యెంచబడిన సబ్బాతు దినము గురించిన నియమాలు వాటికవే అత్యంత భారమైనవి.

తర్వాత, యెహోవా తనంతట తాను తన జనుల మధ్యకు వచ్చారు. మతం యొక్క నిజమైన ఉద్దేశ్యము భారాలను మోపడం కాదు, కానీ వాటిని ఉపశమింపజేయడం అని ఆయన వారికి బోధించారు. సబ్బాతును గౌరవించడంతో పాటు, దేవుడు ఆజ్ఞలను ఇచ్చేది మనల్ని బాధించడానికి కాదు, కానీ మనల్ని దీవించడానికి అని ఆయన బోధించారు. అవును, దేవుడిని చేరడానికి మార్గము తిన్ననిది మరియు ఇరుకైనది, కానీ ఆ దారిలో మనం ఒంటరిగా నడువవలసిన అవసరం లేదని ప్రకటించడానికి ప్రభువు వచ్చారు. “నా యొద్దకు రండి,” అని ఆయన అభ్యర్థించారు. ఏ కారణం చేతనైనా “భారము మోసుకొనుచున్నట్లు” భావించు వారందరిని ఆయన ప్రక్కన నిలబడమని, ఆయనతో మనల్ని బంధించుకోమని మరియు మన భారాలు పంచుకోవడానికి ఆయనను అనుమతించమని ఆయన ఆహ్వానిస్తున్నారు. “అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును” అనునది ఆయన వాగ్దానము. ప్రత్యామ్నాయాలతో పోల్చితే—ఒంటరిగా మోయడానికి ప్రయత్నించడం లేదా మర్త్య పరిష్కారాలపై ఆధారపడడం— ఆయన “కాడి సులువైనది మరియు (ఆయన) భారము తేలికైనది.” (మత్తయి 11:28–30.)

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 11:28–30

నేను ఆయనపై ఆధారపడినప్పుడు యేసు క్రీస్తు నాకు విశ్రాంతిని కలుగజేస్తారు.

మనమందరం భారాలను మోస్తున్నాము—కొన్ని మన స్వంత పాపాలు మరియు తప్పుల ఫలితంగా, కొన్ని ఇతరుల ఎంపికల వల్ల సంభవిస్తాయి, మరికొన్ని ఎవరి తప్పు వలన కాకుండా భూమిపై జీవితంలో ఒక భాగంగా వస్తాయి. మన పోరాటాలకు కారణాలతో సంబంధం లేకుండా, యేసు తన దగ్గరకు రావాలని మనల్ని వేడుకుంటున్నారు, తద్వారా మన భారాలను భరించడానికి మరియు ఉపశమనం పొందడానికి ఆయన మనకు సహాయపడగలరు (మోషైయ 24 కూడా చూడండి). ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు, “పవిత్ర నిబంధనలను చేయడం మరియు పాటించడం ప్రభువైన యేసు క్రీస్తుతో మనల్ని జతచేస్తుంది మరియు ఏకం చేస్తుంది” (“Bear Up Their Burdens with Ease,” Liahona, May 2014, 88). దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ వచనాలలో ఉన్న రక్షకుని మాటలను బాగా అర్థం చేసుకోవడానికి ఈ క్రింది ప్రశ్నలను ధ్యానించండి: నా నిబంధనలు నన్ను రక్షకుని కాడితో మరియు కాడికి ఎలా జోడిస్తాయి? క్రీస్తు వద్దకు రావడానికి నేను ఏమి చేయాలి? ఏ అర్థంలో రక్షకుని కాడి సులభంగా మరియు ఆయన భారం తేలికగా ఉన్నది?

మీరు చదివేటప్పుడు మీ మనసులో వచ్చే ఇతర ప్రశ్నలేవి? వాటిని నమోదు చేసి, లేఖనాలు మరియు ప్రవక్తల మాటలలో సమాధానాల కోసం ఈ వారం వెదకండి. పైన ప్రస్తావించబడిన ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ సందేశంలో మీ ప్రశ్నలలో కొన్నింటికి మీరు సమాధానాలు కనుగొనవచ్చు.

చిత్రం
గోధుమల పొలం గుండా నడుస్తున్న శిష్యులను చూస్తున్న మనుష్యులు

The Disciples Eat Wheat on the Sabbath [సబ్బాతు నాడు గోధుమలు తింటున్న శిష్యులు], జేమ్స్ టిస్సాట్ చేత

మత్తయి 12:1-13

“విశ్రాంతి దినమున మేలు చేయండి.”

ప్రత్యేకించి సబ్బాతు దినమును ఎలా గౌరవించాలనే విషయంలో, పరిసయ్యుల బోధనలు అనేక విధాలుగా రక్షకుని బోధనల కంటే భిన్నంగా ఉన్నాయి. మీరు మత్తయి 12:1–13 చదువుతున్నప్పుడు, సబ్బాతు గురించి మీ వైఖరులు మరియు చర్యలు రక్షకుని బోధనలతో ఎంత బాగా సరిపోల్చబడతాయో మీరు పరిగణించవచ్చు. దీనిని చేయడానికి, మీరు ఇటువంటి వ్యాఖ్యానాలను ధ్యానించవచ్చు:

  • “కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను” (7వ వచనము; హోషేయ 6:6 చూడండి).

  • “మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు” (8వ వచనము).

  • “విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే” (12వ వచనము).

మీరు సబ్బాతును ఎదుర్కొనే విధానాన్ని ఈ బోధనలు ఎలా ప్రభావితం చేయగలవు?

మార్కు 2:233:5; సువార్త అంశములు, “సబ్బాతు దినము,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

మత్తయి 12:34-37; లూకా 11:33-44

నా మాటలు మరియు చేతలు నా మనస్సులో ఉన్నదానిని ప్రతిబింబిస్తాయి.

పరిసయ్యుల గురించి రక్షకుని విమర్శలలో ప్రధానమైనది ఏమనగా, వారు నీతిమంతులుగా కనిపించడానికి ప్రయత్నించారు, కానీ వారి ఉద్దేశాలు స్వచ్ఛమైనవి కాదు. మత్తయి 12:34–37 మరియు లూకా 11:33–44 లో పరిసయ్యులకు రక్షకుని హెచ్చరికలను మీరు చదువుతున్నప్పుడు, మన మనస్సులు మరియు మన చర్యల మధ్య సంబంధాన్ని ధ్యానించండి. “తన మంచి ధననిధి” అనే వాక్యభాగము మీకు ఏ అర్థమును కలిగియున్నది? (మత్తయి 12:35). మన మాటలు మనల్ని ఎలా సమర్థిస్తాయి లేదా ఖండిస్తాయి? (మత్తయి 12:37 చూడండి). నీ కన్ను “తేటగా నుండుట” అనగా అర్థమేమైయుండవచ్చు? (లూకా 11:34). రక్షకుని శక్తి ద్వారా మీరెలా “వెలుగుమయము” (లూకా 11:36) కాగలరో ధ్యానించండి.

ఆల్మా 12:12–14; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:67-68 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 11:28–30.బరువైన ఒకదానిని లాగడానికి మొదట స్వయంగా, తరువాత సహాయంతో ప్రయత్నిస్తూ ఈ వచనాలలో ఉన్న రక్షకుని బోధనలను మీ కుటుంబం దృశ్యీకరించుకొనడంలో మీరు సహాయపడవచ్చు. మనం మోస్తున్న కొన్ని భారాలు ఏమిటి? క్రీస్తు కాడిని మన పైకి తీసుకోవడం అంటే అర్థం ఏమిటి? ఈ సారాంశం చివరన ఉన్న చిత్రం కాడి అనగా ఏమిటో వివరించడానికి మీకు సహాయపడగలదు.

మత్తయి 12:10-13.సబ్బాతునాడు యేసు ఒక వ్యక్తిని స్వస్థపరచడం గురించి మీరు చదువుతున్నప్పుడు, మనం రక్షకుని చేత ఎలా “బాగుపరచబడెదమో” అనే దాని గురించి మీ కుటుంబము మాట్లాడవచ్చు. సబ్బాతు మన కొరకు ఏ విధంగా ఒక స్వస్థత దినము కాగలదు?

ఈ వచనాలలో రక్షకుని మాదిరి చేత ప్రేరేపించబడి, మీరు “విశ్రాంతి దినమున మేలుచేయగల” (12వ వచనము) విధానాల జాబితాను మీ కుటుంబము తయారు చేయవచ్చు. ఇతరులకు సేవ చేసే అవకాశాలను తప్పక చేర్చండి. మీ జాబితాను చేసి, భవిష్యత్తులో ఆదివారాలలో దానిని చూడడం మీకు సహాయకరంగా ఉండవచ్చు.

లూకా 11:33-36.“వెలుగుమయముగా” (34, 36 వచనాలు) ఉండడం అనగా అర్థమేమిటో మీ కుటుంబానికి మీరు ఎలా బోధించవచ్చో ఆలోచించండి. ఒక వస్తుపాఠము సహాయపడుతుందా? మన జీవితాలు, మన గృహాలు మరియు మన లోకం లోనికి రక్షకుని వెలుగును తీసుకురాగల విధానాలను కూడా మీరు చర్చించవచ్చు.

లూకా 11:37-44.కలిసి గిన్నెలు కడుగుతుండగా బహుశా మీ కుటుంబము ఈ వచనాలను చర్చించవచ్చు. గిన్నెలు మరియు కప్పుల వంటి వాటిని వెలుపల మాత్రమే శుభ్రం చేయడం ఎందుకు సరికాదనే దానిగురించి మీరు మాట్లాడవచ్చు. అప్పుడు కేవలం బయటకు కనిపించే విషయాలలోనే కాకుండా అంతరంగ ఆలోచనలు మరియు భావాలలో కూడా నీతిమంతులుగా ఉండవలసిన అవసరంతో దీనిని మీరు సంబంధింపజేయవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

స్థిరముగా ఉండండి. కొన్నిసార్లు లేఖనాలను అధ్యయనం చేయడం చాలా కష్టంగా లేదా మీరు ఆశించిన దానికంటే తక్కువ ప్రభావవంతంగా మీకు అనిపించవచ్చు. ఆశ వదులుకోవద్దు. “చిన్న చిన్న పనులు చేయడంలో మన స్థిరత్వం ప్రాముఖ్యమైన ఆత్మీయ ఫలితాలకు దారి తీయగలదు” అని ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు (“More Diligent and Concerned at Home,” Liahona, Nov. 2009, 20).

చిత్రం
కాడికి కట్టిన రెండు ఎద్దులు

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి: అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును” (మత్తయి 11:29). Photograph © iStockphoto.com/wbritten

ముద్రించు