2023 క్రొత్త నిబంధన
జనవరి 30–ఫిబ్రవరి 5. మత్తయి 4; లూకా 4–5: “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది”


“జనవరి 30–ఫిబ్రవరి 5. మత్తయి 4; లూకా 4–5: ‘ప్రభువు ఆత్మ నామీద ఉన్నది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జనవరి 30–ఫిబ్రవరి 5. మత్తయి 4; లూకా 4–5” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
అరణ్యములో నిలబడియున్న యేసు

అరణ్యములోనికి, ఇవా కొలేవా టిమోతి చేత

జనవరి 30–ఫిబ్రవరి 5

మత్తయి 4; లూకా 4–5

“ప్రభువు ఆత్మ నామీద ఉన్నది”

సాతాను శోధనలను ఎదుర్కోవడానికి మరియు తన స్వంత దైవిక నియమిత కార్యమును గూర్చి సాక్ష్యమివ్వడానికి రక్షకుడు లేఖనాలను ఉపయోగించారు (లూకా 4:1–21 చూడండి). మీ విశ్వాసాన్ని మరియు శోధనను ఎదుర్కోవడానికి మీ సంకల్పాన్ని లేఖనాలు ఎలా వృద్ధిచేయగలవో ధ్యానించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

తన బాల్యము నుండి, యేసు ఒక ప్రత్యేకమైన, పవిత్రమైన నియమిత కార్యమును తాను కలిగియున్నానని ఎరిగినట్లు కనబడెను. కానీ యేసు తన భూలోక పరిచర్యను ప్రారంభించడానికి సిద్ధపడినప్పుడు, అపవాది రక్షకుని మనస్సులో అనుమానమును నాటుటకు కోరెను. “ నీవు దేవుని కుమారుడవైతే,” అన్నాడు సాతాను (లూకా 4:3,ఏటవాలు అక్షరాలు జోడించబడ్డాయి). కానీ రక్షకుడు పరలోకమందున్న తన తండ్రితో మాట్లాడారు. ఆయన లేఖనాలను ఎరుగును మరియు తాను ఎవరో ఆయన ఎరుగును. ఆయనకు సాతాను ఇచ్చేది—”ఈ అధికారమంతయు నీకిస్తాను” (లూకా 4:6)—బూటకమైనది, ఏలయనగా రక్షకుని జీవితకాల సిద్ధపాటు “ఆత్మ బలము”(లూకా 4:14) పొందడానికి ఆయనను అనుమతించింది. కావున శోధన, శ్రమలు, తిరస్కారము ఉన్నప్పటికీ, యేసు క్రీస్తు తాను నియమించబడిన కార్యము నుండి ఎన్నడూ త్రోవ తప్పలేదు: “నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను … ఇందునిమిత్తమే నేను పంపబడితిని” (లూకా 4:43).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 4:1–2

దేవునితో సంభాషించడం ఆయనను సేవించడానికి నన్ను సిద్ధపరుస్తుంది.

తన నియమిత కార్యము కొరకు సిద్ధపడుటకు, యేసు “దేవునితో ఉండుటకు” (జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 4:1 [మత్తయి 4:1, పాదవివరణ లో]) అరణ్యములోనికి వెళ్ళారు. దేవునికి దగ్గరగా భావించడానికి మీరు చేసేదాని గురించి ఆలోచించండి. మీరు చేయాలని ఆయన కోరిన కార్యము కొరకు ఇది మిమ్మల్ని ఎలా సిద్ధపరుస్తుంది?

మత్తయి 4:1–11; లూకా 4:1–13

శోధనను ఎదిరించుట ద్వారా యేసు క్రీస్తు నాకు మాదిరిగా ఉన్నారు.

కొన్నిసార్లు జనులు పాపము చేయడానికి శోధించబడినప్పుడు, నేరభావనను అనుభవిస్తారు. కానీ “పాపము లేకుండా” (హెబ్రీయులకు 4:15), జీవించిన రక్షకుడు కూడా శోధింపబడ్డారు. మనము ఎదుర్కొనే శోధనలను యేసు క్రీస్తు ఎరుగును మరియు వాటిని జయించుటకు మనకెలా సహాయపడాలో కూడా ఎరుగును (హెబ్రీయులకు 2:18; ఆల్మా 7:11–12 చూడండి).

మత్తయి 4:1–11 మరియు లూకా 4:1–13 మీరు చదివినప్పుడు, మీరు శోధనలను ఎదుర్కొన్నప్పుడు మీకు సహాయపడునట్లు మీరు ఏమి నేర్చుకుంటారు? మీరు మీ ఆలోచనలను క్రింద ఉన్నటువంటి పట్టికలో క్రమపరచవచ్చు:

యేసు క్రీస్తు

నేను

యేసు క్రీస్తు

క్రీస్తును ఏమి చేయమని సాతాను శోధించాడు?

నేను

నన్ను ఏమి చేయమని సాతాను శోధిస్తాడు?

యేసు క్రీస్తు

శోధనను ఎదిరించుటకు క్రీస్తు ఎలా సిద్ధపడ్డారు?

నేను

శోధనను ఎదిరించుటకు నేను ఎలా సిద్ధపడగలను?

మత్తయి 4 యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదము నుండి మీరు పొందిన అదనపు అంతరార్థములేవి ? (మత్తయి 4 అంతటా పాదవివరణలు చూడండి).

1 కొరింథీయులకు 10:13; ఆల్మా 13:28; మోషే 1:10–22; సువార్త అంశములు, “శోధన,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

లూకా 4:16-32

యేసు క్రీస్తే ప్రవచించబడిన మెస్సీయ.

ఏమి చేయడానికి యేసు క్రీస్తు భూమి మీదకు పంపబడ్డారో వివరించమని మీరు అడుగబడిన యెడల, మీరు ఏమి చెప్తారు? మెస్సీయ గురించి యెషయా ప్రవచనాలలో ఒకదానిని ఉదహరిస్తూ, ఆయన స్వంత నియమిత కార్యము యొక్క దశలను రక్షకుడు వివరించారు (లూకా 4:18–19; యెషయా 61:1–2 చూడండి). ఈ వచనాలను మీరు చదివినప్పుడు ఆయన నియమిత కార్యము గురించి మీరు ఏమి నేర్చుకుంటారు?

ఆయన పనిలో పాల్గొనడానికి ప్రభువు మిమ్మల్ని ఆహ్వానించిన విధానాలేవి?

చిత్రం
సమాజ మందిరంలో నిలబడియున్న యేసు

యూదులు యెషయా ప్రవచనము నెరవేరుటకు శతాబ్దాలుగా ఎదురుచూస్తున్నప్పటికీ, “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది” (లూకా 4:21) అని ఆయన ప్రకటించినప్పుడు, యేసే మెస్సీయ అని అనేకమంది అంగీకరించలేదు. లూకా 4:20–30 (మార్కు 6:1–6 కూడా చూడండి) మీరు చదివినప్పుడు, నజరేతు జనుల యొక్క స్థానములో మిమ్మల్ని ఉంచుటకు ప్రయత్నించండి. క్రీస్తును మీ వ్యక్తిగత రక్షకునిగా పూర్తిగా అంగీకరించుట నుండి మిమ్మల్ని నిలిపివేసేది ఏదైనా ఉన్నదా?

మోషైయ 3:5–12 కూడా చూడండి.

మత్తయి 4:18–22; లూకా 5:1–11

నేను ప్రభువుయందు నమ్మకముంచినప్పుడు, నా దైవిక సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఆయన నాకు సహాయపడగలరు.

“దేవునికి తమ జీవితాలను అప్పగించిన స్త్రీ పురుషులు వారి జీవితాలలో వారు చేయగల దానికంటె ఎక్కువగా ఆయన చేయగలరని కనుగొంటారు” (Teachings of Presidents of the Church: Ezra Taft Benson [2014], 42) అని అధ్యక్షులు ఎజ్రా టాప్ట్ బెన్సన్ బోధించారు. సీమోను పేతురు మరియు అతని సహ జాలరులకు ఇది ఎలా జరిగిందో గమనించండి. వారిలో వారు చూసిన దానికంటే గొప్పదానిని యేసు వారిలో చూసారు. ఆయన వారిని “మనుష్యులను పట్టువారిగా” చేయాలనుకున్నారు (మత్తయి 4:19; లూకా 5:10 కూడా చూడండి).

మత్తయి 4:18-22 మరియు లూకా 5:1–11 మీరు చదివినప్పుడు, మీరు ఏమి కావాలని యేసు క్రీస్తు మీకు సహాయపడుతున్నారో ధ్యానించండి. ఆయనను వెంబడించమని ఆయన మిమ్మల్ని ఆహ్వానించుటను మీరెలా భావించారు? ఆయనను అనుసరించుటకు మీరు సమస్తమును విడిచిపెట్టుటకు సమ్మతిస్తున్నారని ప్రభువుకు మీరెలా చూపగలరు? (లూకా 5:11 చూడండి).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 4:1–2; లూకా 4:1–2.ఉపవాసము యొక్క శక్తి గురించి ఈ వృత్తాంతము నుండి మనము పొందగల అంతరార్థములేవి? topics.ChurchofJesusChrist.org కుటుంబ సభ్యులు ఉపవాసముతో వారికి గల అనుభవాలను పంచుకోవచ్చు. బహుశా మీరు ఒక ప్రత్యేక ఉద్దేశ్యము కొరకు కలిసి ఉపవాసముండుటకు ప్రార్థనాపూర్వకంగా ప్రణాళికలను చేయవచ్చు.

మత్తయి 4:3–4; లూకా 4:3–4.రాయిని రొట్టెగా మార్చమని సాతాను క్రీస్తును శోధించినప్పుడు, “ నీవు దేవుని కుమారుడవైతే” (మత్తయి 4:3, ఏటవాలు అక్షరాలు చేర్చబడ్డాయి) అని చెప్పుట ద్వారా అతడు క్రీస్తు యొక్క దైవిక గుర్తింపును సవాలు చేసాడు. మన దైవిక గుర్తింపును—మరియు రక్షకుని దైవిక గుర్తింపును మనం అనుమానించేలా చేయడానికి సాతాను ఎందుకు ప్రయత్నిస్తాడు? అతడు దీనిని చేయడానికి ఎలా ప్రయత్నిస్తాడు? (మోషే 1:10–23 కూడా చూడండి.)

జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 4:11.యేసు శారీరకంగా మరియు ఆత్మీయంగా పరీక్షించబడిన తరువాత, ఆయన ఆలోచనలు చెరలో ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క అవసరాలపై మరలినవి: “యోహాను చెరపట్టబడెనని యేసు ఎరుగును, మరియు ఆయన దేవదూతలను పంపెను. ఇదిగో, వారు వచ్చి అతడికి [యోహాను] పరిచర్య చేసిరి” (జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 4:11 [మత్తయి 4:11, పాదవివరణ లో). ఇతరుల అవసరాలను గూర్చి ఆలోచించిన క్రీస్తు యొక్క మాదిరిని మనము అనుసరించినప్పుడు మనము ఎలా దీవించబడతాము?

లూకా 4:16-21.విరిగిన హృదయముగల వారు లేదా “స్వేచ్ఛ” అవసరమైన వారు ఎవరైనా మీకు తెలుసా? (లూకా 4:18). ఇతరులు రక్షకుని స్వస్థత మరియు విడుదల పొందుటకు మనము ఎలా సహాయపడగలము? దేవాలయ విధులను నెరవేర్చుట “చెరలో ఉన్నవారికి విడుదల” (లూకా 4:18) తెచ్చుటకు ఎలా సహాయపడుతుందో కూడా మీరు చర్చించవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించండి. “బహుశా [ఒక తల్లి, తండ్రి లేదా బోధకునిగా] మీరు చేయగల అత్యంత ముఖ్యమైన విషయము … మీ పూర్ణ హృదయముతో సువార్తను జీవించుట. … పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కొరకు అర్హులగుటకు ఇది ముఖ్యమైన విధానము. మీరు పరిపూర్ణముగా ఉండనవసరం లేదు, మీరు పడిపోయినప్పుడల్లా రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా క్షమాపణను వెదకుతూ—శ్రద్ధగా ప్రయత్నించండి” (Teaching in the Savior’s Way, 13).

చిత్రం
మనుష్యులను పట్టువారిగా ఉండుటకు అపొస్తలులను పిలుస్తున్న యేసు

Christ Calling the Apostles James and John (అపొస్తలులైన యాకోబు మరియు యోహానులను పిలుస్తున్న క్రీస్తు), Edward Armitage (1817–96)/Sheffield Galleries and Museums Trust, UK/© Museums Sheffield/The Bridgeman Art Library International

ముద్రించు