2023 క్రొత్త నిబంధన
జనవరి 23-29. మత్తయి 3; మార్కు 1; లూకా 3: “ప్రభువు మార్గమును సిద్ధపరచుడి ”


“జనవరి 23-29. మత్తయి 3; మార్కు 1; లూకా 3: ‘ప్రభువు మార్గమును సిద్ధపరచుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జనవరి 23-29. మత్తయి 3; మార్కు 1; లూకా 3,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చుట

నావూ ఇల్లినాయ్ దేవాలయములో మరకపడిన గాజు కిటికీ, టామ్ హోల్డ్‌మన్ చేత

జనవరి 23-29

మత్తయి 3; మార్కు 1; లూకా 3

“ప్రభువు మార్గమును సిద్ధపరచుడి”

మత్తయి 3; మార్కు 1; మరియు లూకా 3 చదువుట ద్వారా ప్రారంభించండి. ఈ అధ్యాయములు గ్రహించుటలో మీకు సహాయపడేందుకు పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థించినప్పుడు, మీ కొరకు ప్రత్యేకమైన అంతరార్థములను ఆయన మీకిస్తారు. ఈ మనోభావాలను నమోదు చేయండి మరియు వాటిని అమలు చేయడానికి ప్రణాళిక చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త మిమ్మల్ని మార్చగలదు. రక్షకుని రాకడ కలిగియుండగల ప్రభావాన్ని వర్ణించిన యెషయా యొక్క ప్రాచీన ప్రవచనమును లూకా ఉదహరించాడు: “ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్ననివగును” (లూకా 3:5; యెషయా 40:4 కూడా చూడండి). ఈ సందేశము, తాము మారలేమని అనుకొనే వారితో పాటు మనందరి కొరకైనది. కొండ వంటి శాశ్వతమైనది పల్లముగా చేయబడినప్పుడు, నిశ్చయముగా ప్రభువు మన స్వంత వంకర మార్గములను తిన్నగా చేయడానికి మనకు సహాయపడగలరు (లూకా 3:4–5 చూడండి). పశ్చాత్తాపపడి, మార్పు చెందుటకు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ఆహ్వానమును మనము అంగీకరించినప్పుడు, యేసు క్రీస్తును స్వీకరించుటకు మన మనస్సులు మరియు హృదయాలను మనం సిద్ధపరుస్తాము, ఆవిధంగా మనము కూడా “దేవుని రక్షణను చూడగలము” (లూకా 3:6 ).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మార్కు ఎవరు?

సువార్తను రచించిన వారిలో, మార్కు గురించి మనకు చాలా తక్కువ తెలుసు. అతడు పౌలు, పేతురు మరియు అనేకమంది ఇతర సువార్తికులకు సహవాసిగా ఉన్నాడని మనకు తెలుసు. రక్షకుని యొక్క జీవితములోని సంఘటనలను వ్రాయమని పేతురు మార్కుకు సూచించాడని అనేకమంది బైబిలు పండితులు నమ్మారు. మార్కు యొక్క సువార్త బహుశా మిగిలిన మూడింటికి ముందుగా వ్రాయబడియుండవచ్చు.

బైబిలు నిఘంటువు, “మార్కు” కూడా చూడండి.

మత్తయి 3:1–12; మార్కు 1:1–8; లూకా 3:2–18

పశ్చాత్తాపము అనగా మనస్సు మరియు హృదయము యొక్క బలమైన మార్పు.

బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క నియమిత కార్యము రక్షకుని స్వీకరించుటకు మరియు ఆయనవలే ఎక్కువగా మారుటకు జనుల హృదయాలను సిద్ధపరచుట. అతడు దానిని ఎలా చేసాడు? “మారుమనస్సు పొందుడి,” (మత్తయి 3:2) అని అతడు ప్రకటించాడు. పశ్చాత్తాపము గురించి బోధించడానికి ఫలము మరియు గోధుమ వంటి ప్రతిరూపములను అతడు ఉపయోగించాడు (లూకా 3:9, 17 చూడండి).

బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య వృత్తాంతములలో మీరు కనుగొనే ఇతర ప్రతిరూపములేవి? (మత్తయి 3:1–12; మార్కు 1:1–8; లూకా 3:2–18 చూడండి). వాటిని మీ లేఖనాలలో గుర్తించుటకు లేదా వాటి బొమ్మలను గీయుటకు ఆలోచించండి. పశ్చాత్తాపము యొక్క సిద్ధాంతము మరియు అవసరతను గూర్చి ఈ ప్రతిరూపములు ఏమి బోధిస్తాయి?

నిజమైన పశ్చాత్తాపము అనగా “మనస్సు యొక్క మార్పు, దేవుని గురించి, ఒకరి గురించి మరియు లోకము గురించి తాజా దృక్పథము. … (దాని అర్థము) హృదయము మరియు చిత్తమును దేవుని వైపు త్రిప్పుట” (బైబిలు నిఘంటువు, “పశ్చాత్తాపము”). లూకా 3:7–14 లో, క్రీస్తును స్వీకరించుటకు సిద్ధపడుటకై జనులను ఏ మార్పులు చేయమని యోహాను ఆహ్వానించాడు? ఈ సలహా మీకు ఎలా అన్వయించవచ్చు? మీరు నిజముగా పశ్చాత్తాపపడ్డారని మీరు ఏవిధంగా చూపగలరు? (లూకా 3:8 చూడండి).

రస్సెల్ ఎమ్. నెల్సన్, “మనం ఉత్తమముగా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలము,” లియహోనా, మే 2019, 67–69; డాలిన్ హెచ్. ఓక్స్, “పశ్చాత్తాపము ద్వారా శుద్ధిచేయబడెను,” లియహోనా, మే 2019, 91–94 కూడా చూడండి.

మత్తయి 3:7; లూకా 3:7

పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ఎవరు?

పరిసయ్యులు యూదా మతపక్ష సభ్యులు, వారు మోషే ధర్మశాస్త్రమును, దాని ఆచారాలను కఠినంగా ఆచరించుటలో వారికై వారు గర్వించారు. సద్దూకయ్యులు గొప్ప మతపరమైన, రాజకీయపరమైన ప్రభావముగల ఐశ్వర్యవంతులైన యూదయ వర్గమువారు; వారు పునురుత్థానము యొక్క సిద్ధాంతమందు నమ్మికయుంచలేదు. ఇరు సమూహాలు దేవుని చట్టముల యొక్క నిజమైన ఉద్దేశ్యము నుండి దారితప్పాయి.

మత్తయి 23:23–28; బైబిలు నిఘంటువు, “పరిసయ్యులు,” “సద్దూకయ్యులు” కూడా చూడండి.

మత్తయి 3:11, 13–17; మార్కు 1:9–11; లూకా 3:15–16, 21–22

“నీతి యావత్తు నెరవేర్చుటకు” యేసు క్రీస్తు బాప్తిస్మము పొందారు.

మీరు బాప్తిస్మము పొందినప్పుడు, మీరు రక్షకుని యొక్క మాదిరిని అనుసరించారు. రక్షకుని యొక్క బాప్తిస్మపు వృత్తాంతముల నుండి మీరు నేర్చుకొన్నదానిని, మీ బాప్తిస్మమప్పుడు జరిగిన వాటితో పోల్చండి.

రక్షకుని యొక్క బాప్తిస్మము

నా బాప్తిస్మము

రక్షకుని యొక్క బాప్తిస్మము

యేసుకు ఎవరు బాప్తిస్మమిచ్చారు మరియు అతడు ఏ అధికారమును కలిగియున్నాడు?

నా బాప్తిస్మము

మీకు ఎవరు బాప్తిస్మమిచ్చారు మరియు అతడు ఏ అధికారమును కలిగియున్నాడు?

రక్షకుని యొక్క బాప్తిస్మము

యేసు ఎక్కడ బాప్తిస్మము పొందారు?

నా బాప్తిస్మము

మీరు ఎక్కడ బాప్తిస్మము పొందారు?

రక్షకుని యొక్క బాప్తిస్మము

యేసు ఎలా బాప్తిస్మము పొందారు?

నా బాప్తిస్మము

మీరు ఎలా బాప్తిస్మము పొందారు?

రక్షకుని యొక్క బాప్తిస్మము

యేసు ఎందుకు బాప్తిస్మము పొందారు?

నా బాప్తిస్మము

మీరు ఎందుకు బాప్తిస్మము పొందారు?

రక్షకుని యొక్క బాప్తిస్మము

యేసును చూచి పరలోకతండ్రి ఆనందిస్తున్నట్లుగా ఆయన ఏవిధంగా తెలియజేసారు?

నా బాప్తిస్మము

మీరు బాప్తిస్మము పొందినప్పుడు పరలోకతండ్రి ఆనందిస్తున్నట్లుగా ఆయన ఏవిధంగా తెలియజేసారు? అప్పటి నుండి ఆయన తన అంగీకారమును ఎలా చూపించారు?

2 నీఫై 31; మోషైయ 18:8–11; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37, 68–74 కూడా చూడండి.

మత్తయి 3:16–17; మార్కు 1:9–11; లూకా 3:21–22

దైవసమూహము యొక్క సభ్యులు ముగ్గురు వేర్వేరు వ్యక్తులు.

దైవసమూహము యొక్క సభ్యులు ముగ్గురు వేర్వేరు వ్యక్తులనే అనేక సాక్ష్యములను బైబిలు కలిగియున్నది. రక్షకుని బాప్తిస్మము యొక్క వృత్తాంతములు దానికి ఒక ఉదాహరణ. మీరు ఈ వృత్తాంతములు చదువుతున్నప్పుడు, దైవసమూహము గురించి మీరు నేర్చుకొనే దానిని ధ్యానించండి. ఈ సిద్ధాంతములు మీకు ఎందుకు ముఖ్యమైనవి?

ఆదికాండము 1:26; మత్తయి 17:1–5; యోహాను 17:1–3; అపొస్తలుల కార్యములు 7:55–56; సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 3.బాప్తిస్మమిచ్చు యోహాను అహరోను యాజకత్వమును కలిగియున్నాడు. అహరోను యాజకత్వము యొక్క ఉద్దేశ్యముల గురించి యోహాను యొక్క మాదిరి నుండి మనము ఏమి నేర్చుకోగలము? అహరోను యాజకత్వము వలన మనం ఏ దీవెనలను పొందుతాము? మీ కుటుంబంలో ఒక యౌవనుడు ఉన్నట్లయితే, ఇతరులను దీవించడానికి అహరోను యాజకత్వాన్ని అతడు ఎలా ఉపయోగించగలడో అర్థం చేసుకోవడానికి అతనికి సహాయపడేందుకు మీరు సమయాన్ని వెచ్చించవచ్చు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1; 20:46–60 కూడా చూడండి.)

చిత్రం
మరొకరికి బాప్తిస్మమిస్తున్న యువకుడు

మనము బాప్తిస్మము పొందినప్పుడు, మన పాపములు కడిగివేయబడతాయి.

మత్తయి 3:11–17; మార్కు 1:9–11; లూకా 3:21–22ఎవరైనా బాప్తిస్మము పొందడాన్ని లేదా సంఘ సభ్యునిగా నిర్ధారించబడడాన్ని మీ కుటుంబ సభ్యులు చూసారా? కుటుంబ సభ్యులు ఎలా భావించారు? బహుశా మీరు బాప్తిస్మము మరియు నిర్ధారణ యొక్క చిహ్నాల గురించి వారికి బోధించవచ్చు. బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడం ఒక క్రొత్త జన్మ వలె ఎట్లున్నది? మనం బాప్తిస్మము పొందినప్పుడు మనమెందుకు నీటిలో పూర్తిగా ముంచబడతాము? మనం బాప్తిస్మము పొందినప్పుడు మనమెందుకు తెల్ల దుస్తులు ధరిస్తాము? పరిశుద్ధాత్మ వరము “అగ్నిచేత బాప్తిస్మము” గా ఎందుకు వివరించబడింది? (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:41; బైబిలు నిఘంటువు, “బాప్తిస్మము,” “పరిశుద్ధాత్మ” కూడా చూడండి).

మత్తయి 3:17; మార్కు 1:11; లూకా 3:22.దేవుడు మనల్ని చూసి ఆనందిస్తున్నట్లు మనము ఎప్పుడు భావించాము? దేవుడిని ఆనందింపజేయడానికి మనము ఏమి చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

సహాయము కొరకు ప్రభువును అడగండి. లేఖనాలు బయల్పాటు ద్వారా ఇవ్వబడినవి మరియు వాటిని నిజముగా గ్రహించడానికి మనకు వ్యక్తిగత బయల్పాటు అవసరము. “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును” (మత్తయి 7:7) అని ప్రభువు వాగ్దానమిచ్చారు.

చిత్రం
యేసుకు బాప్తిస్మమిస్తున్న యోహాను

బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చుట, గ్రెగ్ కె. ఓల్సన్ చేత

ముద్రించు