2023 క్రొత్త నిబంధన
డిసెంబరు 26–జనవరి 1. మన స్వంత అభ్యాసానికి మనమే బాధ్యులము


“డిసెంబరు 26–జనవరి 1. మన స్వంత అభ్యాసానికి మనమే బాధ్యులము,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“డిసెంబరు 26–జనవరి 1. మన స్వంత అభ్యాసానికి మనమే బాధ్యులము,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ఫోటో ఆల్బమ్ చూస్తున్న కుటుంబము

డిసెంబరు 26–జనవరి 1

మన స్వంత అభ్యాసానికి మనమే బాధ్యులము

లేఖనముల యొక్క ఉద్దేశ్యము, క్రీస్తునొద్దకు వచ్చుటకు మరియు ఆయన సువార్తకు అధికంగా పరివర్తన చెందుటకు మీకు సహాయపడడమే. లేఖనాలను అర్థం చేసుకొని, మీకు మరియు మీ కుటుంబానికి అవసరమైన ఆత్మీయ బలాన్ని వాటిలో కనుగొనేందుకు ఈ రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు మీకు సహాయపడగలదు. అప్పుడు మీ సంఘ తరగతుల్లో, మెళకువలు పంచుకోవడానికి మరియు క్రీస్తును అనుసరించడానికి వారి ప్రయత్నాల్లో మీ సహ పరిశుద్ధులను ప్రోత్సహించడానికి మీరు అవకాశాలు కలిగియుంటారు.

మీ మనోభావాలను నమోదు చేయండి

“మీరేమి వెదకుచున్నారు?” అని బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులను యేసు అడిగారు (యోహాను 1:38). మిమ్మల్ని మీరు అదే ప్రశ్న అడగవచ్చు—ఎందుకనగా ఈ సంవత్సరం క్రొత్త నిబంధనలో మీరు కనుగొనేది ఎక్కువగా మీరు వెదికే దానిమీద ఆధారపడుతుంది. “వెదకుడి, మీకు దొరకును” అనేది రక్షకుని వాగ్దానము (మత్తయి 7:7). కాబట్టి మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు మీ మనస్సులో వచ్చే ప్రశ్నలు అడగండి, తర్వాత జవాబుల కొరకు శ్రద్ధగా వెదకండి. క్రొత్త నిబంధనలో మీరు యేసు క్రీస్తు శిష్యుల యొక్క శక్తివంతమైన ఆత్మీయ అనుభవాల గురించి చదువుతారు. రక్షకుని యొక్క విశ్వాసం గల శిష్యునిగా, ఈ పరిశుద్ధ గ్రంథమంతటా కనుగొనబడు “రండి, నన్ను అనుసరించండి” (లూకా 18:22) అనే రక్షకుని ఆహ్వానాన్ని మీరు అంగీకరించినప్పుడు, మీ స్వంత శక్తివంతమైన ఆత్మీయ అనుభవాలను మీరు కలిగియుండగలరు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

రక్షకుని నుండి నిజంగా నేర్చుకోవడానికి నేను తప్పకుండా “రండి, నన్ను అనుసరించండి” అనే ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాలి.

శిష్యత్వపు బాటలో మనం క్రొత్త వారమైనప్పటికీ లేదా జీవితమంతా ఆ దారిలో నడిచినప్పటికీ “రండి, నన్ను అనుసరించండి” అనే రక్షకుని ఆహ్వానం అందరికీ వర్తిస్తుంది. ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నిస్తున్న ధనవంతుడైన యౌవనుడికి ఆయనిచ్చిన ఆహ్వానమిది (మత్తయి 19:16–22; లూకా 18:18–23 చూడండి). యౌవనుడు నేర్చుకున్నది—మనమందరం నేర్చుకోవలసినది—ఏమనగా, శిష్యునిగా ఉండడమంటే అర్థము మన పూర్ణాత్మలను పరలోక తండ్రికి, యేసు క్రీస్తుకు ఇవ్వడం. మరి ఎక్కువగా వారిని అనుసరించడంలో మనకేమి కొరతగా ఉంది, ఏమి మార్చాలి, ఏమి వెదకాలి అనే దానిని మనం గుర్తించినప్పుడు మనం మన శిష్యరికంలో వృద్ధి చెందుతాము.

ఆయన బోధించిన దానిని గ్రహించడానికి మనం ప్రయత్నించినప్పుడు, రక్షకుని నుండి నేర్చుకోవడం మొదలవుతుంది. ఉదాహరణకు, క్రింది వాటిని మీరు పరిశోధించినప్పుడు, అణకువ గురించి మీ గ్రహింపు ఏవిధంగా హెచ్చింపబడుతుంది?

మీరింకా ఎక్కువగా నేర్చుకోవాలని కోరినట్లయితే, ప్రేమ లేదా క్షమాపణ వంటి మరొక సువార్త సూత్రంతో ఈ ప్రోత్సాహ కార్యక్రమాన్ని ప్రయత్నించండి.

నా స్వంత అభ్యాసానికి నేనే బాధ్యుడను.

ఎల్డర్ డేవిడ్ ఏ. బెడ్నార్ ఇలా బోధించారు: “అంకితభావంతో కూడిన శిష్యులుగా మారడానికి మరియు అంతము వరకు ధైర్యంగా సహించడానికి మనం తెలుసుకోవలసిన మరియు చేయవలసిన ప్రతిదాన్ని ఒక సంస్థగా సంఘము మనకు బోధించాలని లేదా చెప్పాలని మనము ఆశించకూడదు. బదులుగా, మన వ్యక్తిగత బాధ్యత ఏదనగా మనము నేర్చుకోవలసిన దానిని నేర్చుకొనుట, మనము జీవించాలని మనకు తెలిసినట్లుగా జీవించుట మరియు బోధకుడు మనము కావాలని కోరినట్లుగా మారుట. అభ్యసించుటకు, జీవించుటకు, ఆ విధముగా మారుటకు మన గృహాలే అంతిమ అమరిక” (“అవసరమైన ప్రతిదానిని పొందుటకు సిద్ధపడుము,” లియాహోనా, మే 2019, 102).

మన స్వంత అభ్యాసానికి బాధ్యత వహించడమనగా అర్థమేమిటి? ఎల్డర్ బెడ్నార్ వ్యాఖ్యానంలో మరియు క్రింది లేఖనాలలో సాధ్యమైన జవాబుల కోసం చూడండి: యోహాను 7:17; 1 థెస్సలోనీకయులకు 5:21; యాకోబు 1:5–6, 22; 2:17; 1 నీఫై 10:17–19; 2 నీఫై 4:15; ఆల్మా 32:27; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 18:18; 58:26–28; 88:118. సువార్తను నేర్చుకోవడంలో మరింత చురుకుగా ఉండడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడుతున్నారు?

నాకై నేను సత్యాన్ని తెలుసుకోవాలి.

వారి జీవితాల్లో ఏమి జరిగినప్పటికీ, తమ విశ్వాసాన్ని కోల్పోని జనులను బహుశా మీరు ఎరిగియుండవచ్చు. రక్షకుని ఉపమానంలో గల ఐదుగురు బుద్ధిగల కన్యకలను వారు మీకు గుర్తుచేయవచ్చు (మత్తయి 25:1–13 చూడండి). సత్యము గురించి వారి సాక్ష్యాలను బలపరచుకోవడానికి శ్రద్ధగా వారు చేసిన ప్రయత్నాలను మీరు చూసియుండకపోవచ్చు.

మన స్వంత సాక్ష్యాలను మనమెలా పొందుతాము మరియు పెంచుకుంటాము? క్రింది లేఖనాలను మీరు ధ్యానించినప్పుడు మీ ఆలోచనలను వ్రాయండి: లూకా 11:9–13; యోహాను 5:39; 7:14–17; అపొస్తలుల కార్యములు 17:10–12; 1 కొరింథీయులకు 2:9–11; మరియు ఆల్మా 5:45–46.  topics.ChurchofJesusChrist.org

చిత్రం
ఒక మార్గము వెంట యువతి

మనలో ప్రతిఒక్కరం మనకైమనము తప్పక సాక్ష్యాన్ని పొందాలి.

నాకు ప్రశ్నలున్నప్పుడు నేనేమి చేయాలి?

మీరు ఆత్మీయ జ్ఞానాన్ని వెదికినప్పుడు, మీరు ప్రశ్నల గురించి ఆలోచిస్తారు. విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని పెంపొందించు విధానాల్లో మీ ప్రశ్నలకు జవాబివ్వడానికి క్రింది నియమాలు మీకు సహాయపడగలవు:

  • దేవుని నుండి గ్రహింపును వెదకండి. సత్యానికంతటికి మూలము దేవుడే. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, లేఖనములు, ఆయన ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా సత్యమును బయల్పరుస్తారు.

  • విశ్వాసంతో పనిచేయండి. వెంటనే జవాబులు రానట్లయితే, సరైన సమయంలో ప్రభువు జవాబులను బయల్పరుస్తారని నమ్మండి. ఆలోపు, మీకిదివరకే తెలిసియున్న సత్యమును బట్టి జీవించండి.

  • నిత్య దృష్టిని నిలుపుకోండి. విషయాలను ప్రపంచం చూస్తున్నట్లుగా కాకుండా, ప్రభువు చూస్తున్నట్లు చూడడానికి ప్రయత్నించండి. మీ ప్రశ్నలను మన పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక సందర్భంలో వీక్షించండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 13:1-23.ఈ సంవత్సరం క్రొత్త నిబంధన నుండి నేర్చుకోవడానికి మీ కుటుంబం సిద్ధపడడంలో సహాయపడేందుకు విత్తువాని ఉపమానమును మీరు చదువవచ్చు. మీ కుటుంబం బయటకు వెళ్ళి, ఉపమానంలో వివరించబడిన రకరకాల నేలలను చూడడాన్ని ఆనందించవచ్చు. యేసు క్రీస్తు వివరించిన “మంచి నేలగా” మన హృదయాలను మనమెలా తయారు చేయగలము? (మత్తయి 13:8).

గలతీయులకు 5:22–23; ఫిలిప్పీయులకు 4:8.“(మీ) గృహమును విశ్వాస మందిరముగా మార్చమని” మరియు “సువార్తను నేర్చుకొనుటకు కేంద్రముగా మీ గృహమును పునర్నిర్మించమని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మిమ్మల్ని ఆహ్వానించారు. ఈ విషయాలు చేసేవారికి ఆయన ఇలా వాగ్దానమిచ్చారు: “మీ పిల్లలు రక్షకుని యొక్క బోధనలు నేర్చుకొనుటకు, జీవించుటకు ఉత్సాహపడతారు, మరియు మీ జీవితంలో, మీ గృహములో అపవాది యొక్క ప్రభావము తక్కువగును. మీ కుటుంబములో మార్పులు గణనీయంగా, బలపరచేవిగా ఉంటాయి” (“ఆదర్శవంతమైన కడవరి దిన పరిశుద్ధులగుట,” లియహోనా, నవ. 2018, 113).

మీ ఇంటిని “విశ్వాస మందిరముగా” మరియు “సువార్తను నేర్చుకొనుటకు కేంద్రముగా” చేయడం గురించి ఒక కుటుంబ సభను నిర్వహించడానికి క్రొత్త సంవత్సరపు ఆరంభము ఒక మంచి సమయము. గలతీయులకు 5:22–23 మరియు ఫిలిప్పీయులకు 4:8 మీరు చదివినప్పుడు దీనిని ఎలా చేయాలనే దాని గురించి మీ మనస్సుకు ఏ ఆలోచనలు వస్తాయి? రాబోయే సంవత్సరంలో క్రొత్త నిబంధనను అధ్యయనం చేయడానికి మీ కుటుంబము వ్యక్తిగత మరియు కుటుంబ లక్ష్యాలను ఏర్పరచుకోవచ్చు. మన లక్ష్యాలను మనకు గుర్తుచేయడానికి మనమేమి చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

సిద్ధాంతము కొరకు చూడండి. సిద్ధాంతమనేది ఒక నిత్యమైన, మారని సత్యము. “నిజమైన సిద్ధాంతము గ్రహించబడినప్పుడు, అది వైఖరులను, ప్రవర్తనను మారుస్తుంది” అని అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ ప్రకటించారు (“Little Children,” Ensign, Nov. 1986, 17). మీరు, మీ కుటుంబం లేఖనాలను చదివినప్పుడు, మరింతగా రక్షకుని వలె జీవించడానికి మీకు సహాయపడగల సత్యాల కోసం చూడండి.

చిత్రం
యేసు క్రీస్తు

లోకమునకు వెలుగు, బ్రెంట్ బోరప్ చేత

ముద్రించు