2023 క్రొత్త నిబంధన
జనవరి 16-22. యోహాను 1: మేము మెస్సీయను కనుగొంటిమి


“జనవరి 16-22. యోహాను 1: మేము మెస్సీయను కనుగొంటిమి,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జనవరి 16-22. యోహాను 1,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
రైలు స్టేషనులో సువార్తను పంచుకుంటున్న స్త్రీ

జనవరి 16-22

యోహాను 1

మేము మెస్సీయను కనుగొంటిమి

మీరు యోహాను 1 చదివి, ధ్యానించినప్పుడు మీరు పొందే మనోభావాలను నమోదు చేయండి. మీకు, మీ కుటుంబానికి అత్యంత విలువైన ఏ సందేశాలను మీరు కనుగొంటారు? మీ సంఘ తరగతుల్లో మీరేమి పంచుకోగలరు?

మీ మనోభావాలను నమోదు చేయండి

ఆయన మర్త్య పరిచర్య కాలంలో మీరు జీవించియున్నట్లయితే, నజరేతు యొక్క యేసును దేవుని కుమారుడిగా మీరు గుర్తించియుండే వారేమోయని మీరెప్పుడైనా ఆలోచించారా? అంద్రెయ, పేతురు, ఫిలిప్పు, నతనయేలుతో కలిపి విశ్వాసులైన ఇశ్రాయేలీయులు సంవత్సరాల కొలది వాగ్దానమివ్వబడిన మెస్సీయ రాక కొరకు వేచియున్నారు మరియు ప్రార్థించారు. వారు ఆయనను కలుసుకున్నప్పుడు, వారు వెదుకుతున్న వ్యక్తి ఆయనేనని వారెలా తెలుసుకున్నారు? “వచ్చి, చూడుడను” (యోహాను 1:39) ఆహ్వానాన్ని మనకై మనము అంగీకరించుట ద్వారా—అదేవిధంగా మనమందరం రక్షకుడిని తెలుసుకుంటాము. ఆయన గురించి మనము లేఖనాలలో చదువుతాము. ఆయన సిద్ధాంతాన్ని మనం వింటాము. ఆయన జీవన విధానాన్ని మనం గమనిస్తాము. ఆయన ఆత్మను మనం అనుభవిస్తాము. రక్షకుడు మనల్ని ఎరుగునని, ప్రేమించునని మరియు “గొప్ప కార్యములను” (యోహాను 1:50) పొందడానికి మనల్ని సిద్ధపరచాలని కోరుతున్నారని నతనయేలు వలె మనము మార్గము వెంబడి కనుగొంటాము.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యోహాను ఎవరు?

యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క శిష్యుడు, తరువాత యేసు క్రీస్తు యొక్క మొదటి అనుచరులలో ఒకనిగా మరియు ఆయన పన్నెండుమంది అపొస్తలులలో ఒకనిగా మారాడు. అతడు యోహాను సువార్తను, అనేక పత్రికలను మరియు ప్రకటన గ్రంథమును వ్రాసాడు. తన సువార్తలో అతడు తననుతాను “యేసు ప్రేమించిన” శిష్యునిగా మరియు “మరియొక శిష్యునిగా” పేర్కొన్నాడు (యోహాను13:23; 20:2). సువార్త ప్రకటించాలనే ఉత్సాహం యోహానుకు ఎంత బలంగా ఉన్నదనగా, క్రీస్తు నొద్దకు అతడు ఆత్మలను తేగలుగునట్లు రక్షకుని రెండవ రాకడ వరకు భూమిపై నిలిచియుండాలని అతడు అడిగాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 7:1–6 చూడండి).

యోహాను 1:1–5

యేసు క్రీస్తు “ఆదియందు దేవుని యొద్ద ఉండెను.”

ఆయన పుట్టకముందు క్రీస్తు నిర్వర్తించిన కార్యమును వివరిస్తూ యోహాను తన సువార్తను ప్రారంభించాడు: “ఆదియందు …వాక్యము (యేసు క్రీస్తు) దేవుని యొద్ద ఉండెను.” రక్షకుడు మరియు ఆయన కార్యము గురించి 1–5 వచనాల నుండి మీరేమి నేర్చుకుంటారు? మీరు జోసెఫ్ స్మిత్ అనువాదం, యోహాను 1: 1–5 (బైబిలు అనుబంధం) లో సహాయక వివరణలను కనుగొనవచ్చు. రక్షకుని జీవితం గురించి మీ అధ్యయనాన్ని మీరు ప్రారంభించినప్పుడు, ఆయన పూర్వ మర్త్య కార్యము గురించి తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము?

topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

యోహాను 1:1–18

యేసు క్రీస్తే “నిజమైన వెలుగు,” దేవుని కుమారుడు.

“నిజమైన వెలుగును … గూర్చి సాక్ష్యమిచ్చుటకు“ అతడు వచ్చెనని (యోహాను 1:8–9) ప్రకటించిన బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క సాక్ష్యము కారణంగా రక్షకుడిని వెదికేందుకు యోహాను ప్రేరేపించబడ్డాడు. యోహాను కూడా రక్షకుని జీవితము మరియు నియమితకార్యము గురించి శక్తివంతమైన సాక్ష్యమునిచ్చాడు.

క్రీస్తు గురించి అతని సాక్ష్యము ఆరంభంలో యోహాను జతచేసిన సత్యాలను జాబితా చేయడం ఆసక్తికరంగా ఉండవచ్చు (1–18 వచనాలు; జోసెఫ్ స్మిత్ అనువాదము, యోహాను 1:1–19 [బైబిలు అనుబంధములో] కూడా చూడండి). యోహాను ఈ సత్యాలతో తన సువార్తను ఎందుకు ప్రారంభించాడని మీరనుకుంటున్నారు? యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యాన్ని వ్రాయడం గూర్చి ఆలోచించండి—మీరేమి పంచుకోవాలనుకుంటున్నారు? రక్షకుడిని తెలుసుకొని, అనుసరించడానికి ఏ అనుభవాలు మీకు సహాయపడ్డాయి? మీ సాక్ష్యాన్ని వినడం ద్వారా ఎవరు దీవించబడవచ్చు?

యోహాను 1:11-13

యేసు క్రీస్తు మనకు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా “కావడానికి శక్తిని” ఇస్తారు.

మనమందరం తండ్రియైన దేవుని యొక్క ఆత్మ కుమారులు మరియు కుమార్తెలమైనప్పటికీ, మనం పాపము చేసినప్పుడు విరోధులమవుతాము లేదా ఆయన నుండి వేరుచేయబడతాము. ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా తిరిగి రావడానికి యేసు క్రీస్తు మనకొక మార్గాన్ని అందిస్తున్నారు. దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా కావడం గురించి యోహాను 1:11–13 ఏమి బోధిస్తుందో ధ్యానించండి. మనం ఈ బహుమానాన్ని ఎలా పొందుతామనే దాని గురించి ఈ లేఖనాలు ఏమి బోధిస్తాయో పరిగణించండి: రోమీయులకు 8:14–18; మోషైయ 5:7–9; సిద్ధాంతము మరియు నిబంధనలు 25:1. దేవుని యొక్క కుమారుడు లేదా కుమార్తె “కావడానికి శక్తి” కలిగియుండడమనగా మీకు తెలిసిన అర్థమేమిటి?

యోహాను 1:18

తండ్రి తన కుమారుని గూర్చి సాక్ష్యమిస్తారు.

ఎవ్వరూ దేవుడిని చూడలేదని యోహాను 1:18 వివరిస్తుంది. అయినప్పటికీ, “కుమారుని గూర్చి ఆయన బయలుపరిస్తే తప్ప, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు” (యోహాను 1:18, పాదవివరణ  చూడండి) అని ఈ వచనము గురించి జోసెఫ్ స్మిత్ అనువాదం స్పష్టం చేస్తుంది. కుమారుని గూర్చి తండ్రియైన దేవుడు సాక్ష్యమివ్వడం వినబడిన క్రింది సందర్భాలను పునర్వీక్షించడాన్ని పరిగణించండి: మత్తయి 3:17; 17:5; 3 నీఫై 11:6–7; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17.

ఈ వృత్తాంతాలను కలిగియుండడం ఎందుకు దీవెనకరమైనది? అవి తన తండ్రితో యేసు క్రీస్తు అనుబంధం గురించి మీకేమి బోధిస్తాయి?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

చిత్రం
లేఖనాలు చదువుతున్న అమ్మాయి

మనము లేఖనాలు చదువుతున్నప్పుడు, మన జీవితాల కొరకు మనం ప్రేరేపణను పొందుతాము.

యోహాను 1:4-10.ఈ వచనాలలో వెలుగు గురించి వారు చదివే దానిని ఊహించడానికి మీ కుటుంబానికి మీరెలా సహాయపడగలరు? కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చీకటి గదిలో వెలుగును ప్రకాశింపజేసి, రక్షకుడు వారి జీవితాలకు ఏ విధంగా వెలుగైయున్నాడో పంచుకొనేలా మీరు చేయవచ్చు. అప్పుడు, మీరు యోహాను 1:4–10 చదివినప్పుడు, కుటుంబ సభ్యులు లోకానికి వెలుగైయున్న యేసు క్రీస్తు గురించి యోహాను సాక్ష్యానికి అదనపు అంతరార్థమును కలిగియుండగలరు.

యోహాను 1:35-36.బాప్తిస్మమిచ్చు యోహాను యేసును “దేవుని గొఱ్ఱెపిల్ల” అని ఎందుకు పిలిచియుండవచ్చు?

యోహాను 1:35-46.యోహాను సాక్ష్యము యొక్క ఫలితాలేవి? ఈ వచనాలలో వర్ణించబడిన జనుల నుండి సువార్తను ఎలా పంచుకోవాలనే దాని గురించి మీ కుటుంబం ఏమి నేర్చుకోగలదు?

యోహాను 1:45-51.రక్షకుని గురించి ఒక సాక్ష్యము పొందడానికి అతనికి సహాయపడునట్లు నతనయేలు ఏమి చేసాడు? వారు తమ సాక్ష్యాలను ఎలా పొందారో మాట్లాడడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

వస్తుపాఠాలను పంచుకోండి. ఒక కుటుంబంగా మీరు చదివే లేఖనాల్లో కనుగొనబడు సూత్రాలను వారు గ్రహించడానికి సహాయపడునట్లు వారు ఉపయోగించగల వస్తువులను కనుగొనమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. ఉదాహరణకు, క్రీస్తు యొక్క వెలుగును సూచించడానికి వారొక కొవ్వొత్తిని ఉపయోగించవచ్చు (యోహాను 1:4 చూడండి).

చిత్రం
భూమిని సృష్టిస్తున్న యేసు క్రీస్తు

యెహోవా భూమిని సృష్టిస్తారు, వాల్టర్ రానె చేత

ముద్రించు