2023 క్రొత్త నిబంధన
జనవరి 2–8. మత్తయి 1; లూకా 1: “నీ మాటచొప్పున నాకు జరుగును గాక”


“జనవరి 2–8. మత్తయి 1; లూకా 1: ‘నీ మాటచొప్పున నాకు జరుగును గాక,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జనవరి 2–8. మత్తయి 1; లూకా 1,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
మరియ మరియు ఎలీసబెతు

జనవరి 2–8

మత్తయి 1; లూకా 1

“నీ మాటచొప్పున నాకు జరుగును గాక”

మీరు మత్తయి 1 మరియు లూకా 1 చదివి, ధ్యానించినప్పుడు మీరు పొందే ఆత్మీయ మనోభావాలను నమోదు చేయండి. ఏ సిద్ధాంత సత్యాలను మీరు కనుగొంటారు? మీకు, మీ కుటుంబానికి అత్యంత విలువైన సందేశాలేవి? అదనపు అంతరార్థములను కనుగొనడానికి ఈ సారాంశంలోని అధ్యయన ఉపాయములు మీకు సహాయపడగలవు.

మీ మనోభావాలను నమోదు చేయండి

మర్త్య దృష్టికి అది అసాధ్యము. ఒక కన్య లేదా పిల్లలను కనే వయస్సు దాటిన గొడ్రాలు గర్భము దాల్చలేదు. కానీ తన కుమారుడు మరియు బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టుక కొరకు దేవుడు ఒక ప్రణాళిక కలిగియున్నాడు, కావున సాధ్యమైనన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, మరియ మరియు ఎలీసబెతు ఇద్దరు తల్లులయ్యారు. అసాధ్యమనిపించే దేనినైనా మనం ఎదుర్కొన్నప్పుడు అద్భుతమైన వారి అనుభవాలను జ్ఞాపకముంచుకోవడం సహాయపడగలదు. మన బలహీనతలను మనం జయించగలమా? స్పందించని ఒక కుటుంబ సభ్యుని హృదయాన్ని మనం తాకగలమా? “దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని” (లూకా 1:37) గబ్రియేలు మరియకు చెప్పినప్పుడు, అతడు సులభంగా మనతో మాట్లాడుతుండవచ్చు. మరియు దేవుడు తన చిత్తాన్ని బయల్పరచినప్పుడు మన స్పందన కూడా మరియ స్పందన వలెనే ఉండవచ్చు: “నీ మాటచొప్పున నాకు జరుగును గాక” (లూకా 1:38).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి మరియు లూకా ఎవరు?

మత్తయి ఒక యూదుల సుంకరి లేదా పన్ను వసూలు చేసేవాడు, అతడిని తన అపొస్తలులలో ఒకనిగా యేసు పిలిచారు (మత్తయి 10:3 చూడండి; బైబిలు నిఘంటువు, “సుంకరులు” కూడా చూడండి). మత్తయి ప్రధానంగా తోటి యూదుల కొరకు తన సువార్తను వ్రాసాడు; కావున యేసు జీవితము మరియు పరిచర్య ద్వారా మెస్సీయ గురించి నెరవేర్చబడిన పాత నిబంధన ప్రవచనాలను నొక్కి చెప్పేందుకు అతడు ఎంచుకున్నాడు.

అన్యుడైన (యూదుడు కానివాడు) లూకా ఒక వైద్యుడు, అతడు అపొస్తలుడైన పౌలుతో ప్రయాణించాడు. రక్షకుని మరణం తర్వాత అతడు తన సువార్తను ప్రధానంగా యూదులు కాని వారి కోసం వ్రాసాడు. యేసు క్రీస్తు, అన్యులు మరియు యూదులు ఇరువురి రక్షకుడని అతడు సాక్ష్యమిచ్చాడు. రక్షకుని జీవితంలోని సంఘటనలను కన్నులారా చూచిన వృత్తాంతాలను అతడు నమోదు చేసాడు మరియు ఇతర సువార్తలతో పోల్చినట్లయితే, ఎక్కువగా స్త్రీలకు సంబంధించిన కథలను అతడు జోడించాడు.

మత్తయి 1:18-25; లూకా 1:26-35

యేసు క్రీస్తు ఒక మర్త్య తల్లికి మరియు అమర్త్య తండ్రికి జన్మించారు.

మత్తయి 1:18–25 మరియు లూకా 1:26–35లో, యేసు పుట్టుక యొక్క అద్భుతాన్ని మత్తయి మరియు లూకా ఎలా వర్ణించారో గమనించండి. వారి వర్ణనలు రక్షకుని యందు మీ విశ్వాసాన్ని ఎలా బలపరుస్తాయి? యేసు దేవుని కుమారుడు మరియు మరియ కుమారుడు అని తెలుసుకోవడం మీకు ఎందుకు ముఖ్యమైనది?

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము కొరకు “మరణానికి పాత్రుడు కాని ఒక అమర్త్యుని చేత వ్యక్తిగత త్యాగము అవసరమని, అయినను అతడు తప్పక మరణించాలని మరియు తిరిగి తన స్వంత శరీరాన్ని తీసుకోవాలని, దీన్ని సాధించగలిగింది రక్షకుడు మాత్రమేనని, తన తల్లి నుండి మరణించగల శక్తిని ఆయన వారసత్వంగా పొందారని, తన తండ్రి నుండి మరణాన్ని జయించే శక్తిని పొందారని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వివరించారు (“Constancy amid Change,” Ensign, Nov. 1993, 34).

లూకా 1:5–25, 57–80

దేవుని దీవెనలు ఆయన యుక్తకాలమందు వస్తాయి.

ఒక దీవెన కొరకు మీరు వేచియున్నట్లయితే లేదా దేవుడు మీ ప్రార్థనలను వినడం లేదని మీకనిపిస్తే, ఆయన మిమ్మల్ని మరచిపోలేదని ఎలీసబెతు మరియు జెకర్యా వృత్తాంతము గుర్తుచేయగలదు. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలెండ్ వాగ్దానమిచ్చారు: “మనము పని చేస్తూ, మన ప్రార్థనలలో కొన్నింటికి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, వాటిని దేవుడు విన్నారని, బహుశా మనం కోరుకున్న సమయంలో లేదా విధానంలో కాకపోయినా వాటికి సమాధానం ఇస్తారని అపొస్తలుని వాగ్దానాన్ని నేను మీకు ఇస్తున్నాను. కానీ సర్వజ్ఞులు మరియు శాశ్వతంగా దయగల తల్లిదండ్రులు ఇవ్వవలసిన సమయము మరియు విధానములో అవి ఎల్లప్పుడు జవాబివ్వబడతాయి” (“ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుండుట,” లియహోనా, నవ. 2020, 115–16). జెకర్యా మరియు ఎలీసబెతు విశ్వాసంగా ఎలా నిలిచారు? (లూకా 1:5–25, 57–80 చూడండి). మీరు ఒక దీవెన కొరకు వేచియున్నారా? మీరు వేచియున్నప్పుడు ప్రభువు మీ నుండి ఏమి ఆశిస్తున్నారని మీరు భావిస్తున్నారు?

చిత్రం
బాలుడైన యోహానుతో ఎలీసబెతు మరియు జెకర్యా

విశ్వాసంతో వేచియున్న తర్వాత, ఎలీసబెతు మరియు జెకర్యా ఒక కుమారునితో దీవించబడ్డారు.

మత్తయి 1:18–25; లూకా 1:26–38

విశ్వాసులు మనస్ఫూర్తిగా దేవుని చిత్తానికి లోబడియుంటారు.

మరియ వలెనే మనము కొన్నిసార్లు, మనం ప్రణాళిక చేసిన దానికంటే దేవుడు మన జీవితం కొరకు ప్రణాళిక చేసింది భిన్నంగా ఉన్నట్లు కనుగొంటాము. దేవుని చిత్తాన్ని అంగీకరించడం గురించి మరియ నుండి మీరేమి నేర్చుకుంటారు? క్రింది పట్టికలలో, దేవదూత మరియు మరియల నుండి వ్యాఖ్యానాలను (లూకా 1:26–38 చూడండి), వాటితోపాటు వారి వ్యాఖ్యానాలలో మీరు కనుగొనే సందేశాలను వ్రాయండి:

మరియకు దేవదూత మాటలు

నా కొరకు సందేశము

మరియకు దేవదూత మాటలు

“ప్రభువు నీకు తోడైయున్నాడు” (28వ వచనము).

నా కొరకు సందేశము

నా పరిస్థితి మరియు శ్రమలు ప్రభువుకు తెలుసు.

మరియకు దేవదూత మాటలు

నా కొరకు సందేశము

మరియకు దేవదూత మాటలు

నా కొరకు సందేశము

మరియ ప్రతిస్పందనలు

నా కొరకు సందేశము

మరియ ప్రతిస్పందనలు

“ఇది ఏలాగు జరుగును?” (34వ వచనము).

నా కొరకు సందేశము

దేవుని చిత్తాన్ని బాగా గ్రహించడానికి ప్రశ్నలడగడం తప్పు కాదు.

మరియ ప్రతిస్పందనలు

నా కొరకు సందేశము

మరియ ప్రతిస్పందనలు

నా కొరకు సందేశము

మత్తయి 1:18–25 లో యోసేపు యొక్క నీతిగల మాదిరి గురించి మీరు చదివినప్పుడు, దేవుని చిత్తాన్ని అంగీకరించడం గురించి మీరేమి నేర్చుకుంటారు? జెకర్యా మరియు ఎలీసబెతు యొక్క అనుభవాల నుండి ఏ అదనపు అంతరార్థాలను మీరు నేర్చుకుంటారు? (లూకా 1 చూడండి).

లూకా 22:42; లేఖనదర్శిని, “గబ్రియేలు” కూడా చూడండి.

లూకా 1:46–55

యేసు క్రీస్తు యొక్క నియమిత కార్యము గురించి మరియ సాక్ష్యమిచ్చింది.

లూకా 1:46–55 లో మరియ మాటలు రక్షకుని నియమిత కార్యము యొక్క అంశాలను ముందుగా చెప్పాయి. మరియ వ్యాఖ్యానాల నుండి యేసు క్రీస్తు గురించి మీరేమి నేర్చుకుంటారు? 1 సమూయేలు 2:1–10 లో హన్నా మాటలు మరియు మత్తయి 5:3–12 లో యేసు ధన్యతలతో ఈ వచనాలను మీరు పోల్చవచ్చు. ఈ వచనాలను మీరు ధ్యానించినప్పుడు ఆత్మ మీకు ఏమి నేర్పుతుంది?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 1:1-17.యేసు యొక్క వంశావళిని మీ కుటుంబము చదువుతున్నప్పుడు, మీ స్వంత కుటుంబ చరిత్రను చర్చించి, మీ పూర్వీకుల గురించి కొన్ని కథలు పంచుకోవచ్చు. మీ కుటుంబ చరిత్ర గురించి తెలుసుకోవడం మీ కుటుంబాన్ని ఏవిధంగా దీవిస్తుంది?

మత్తయి 1:20; లూకా 1:11–13, 30ఈ వచనాలలోని జనులు ఎందుకు భయపడి యుండవచ్చు? మనకు భయం కలిగించేది ఏది? “భయపడవద్దని” దేవుడు మనల్ని ఎలా ఆహ్వానిస్తారు?

లూకా 1:37.“దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదు” అనే విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు మీరు కలిసి లూకా 1 వెదికి, దేవుడు చేసిన అసాధ్యమనిపించు విషయాలను కనుగొనవచ్చు. లేఖనాల నుండి లేదా మన స్వంత జీవితాల నుండి—దేవుడు అసాధ్యమనిపించు విషయాలను చేసిన—ఏ ఇతర వృత్తాంతాలను మనం పంచుకోగలము? Gospel Art Book లో వెదకడం ఉపాయాలను అందించగలదు.

లూకా 1:46-55.రక్షకుడు మన కోసం చేసిన “గొప్ప పనులలో” కొన్ని ఏవి? “ప్రభువును ఘనపరచుట” అనేది మన ఆత్మలకు ఏ అర్ధాన్ని కలిగియున్నది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

లేఖనాలను మీ జీవితానికి అన్వయించుకోండి. ఒక లేఖన భాగము చదివిన తర్వాత, దానిని వారి జీవితాలకు అన్వయించమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి (Teaching in the Savior’s Way21 చూడండి). ఉదాహరణకు, ప్రభువు పిలుపుకు స్పందించడం గురించి మత్తయి 1 మరియు లూకా 1 నుండి వారు నేర్చుకొనిన దానిని కుటుంబ సభ్యులు ఎలా అన్వయించగలరు?

చిత్రం
గబ్రియేలు మరియకు అగుపించుట

స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు, వాల్టర్ రానే చేత

ముద్రించు