2023 క్రొత్త నిబంధన
జనవరి 9-15. మత్తయి 2; లూకా 2: ఆయనను పూజింప వచ్చితిమి


“జనవరి 9-15. మత్తయి 2; లూకా 2: ఆయనను పూజింప వచ్చితిమి,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జనవరి 9-15. మత్తయి 2; లూకా 2,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ఒంటెలపై ప్రయాణిస్తున్న జ్ఞానులు

ఆయనను ఆరాధించెదము, డానా మారియో వుడ్ చేత

జనవరి 9-15

మత్తయి 2; లూకా 2

ఆయనను పూజింప వచ్చితిమి

మీరు మత్తయి 2 మరియు లూకా 2 చదువుతున్నప్పుడు, మీరు పొందే ఆత్మీయ అంతరార్థములపై శ్రద్ధ వహించండి. ఈ సారాంశములోని అధ్యయన ఉపాయములు ఈ అధ్యాయములలో ముఖ్యమైన మరియు తగిన సూత్రములను గుర్తించుటకు మీకు సహాయపడగలవు.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఆయన పుట్టిన రోజు నుండి కూడా యేసు సాధారణ శిశువు కాదని స్పష్టమైనది. యేసు పసితనాన్ని ప్రత్యేకంగా చేసినది పరలోకములోని క్రొత్త తార లేదా ఆనందకరమైన దూత ప్రకటన మాత్రమే కాదు. విభిన్న రకాల విశ్వాసులు—వివిధ దేశాలు, వృత్తులు మరియు నేపథ్యాల నుండి — వెంటనే ఆయన వైపుకు ఆకర్షించబడ్డారనే వాస్తవం కూడా. “రండి, నన్ను అనుసరించండి,” అనే తన ఆహ్వానాన్ని ఆయన పలుకకముందే వారు వచ్చారు (లూకా 18:22). అయితే, ప్రతీఒక్కరూ ఆయన వద్దకు రాలేదు. ఆయనను గమనించని వారు అనేకులున్నారు మరియు అసూయాపరుడైన నాయకుడొకడు ఆయనను చంపడానికి కూడా ప్రయత్నించాడు. కానీ, వినయులు, శుద్ధులు మరియు నీతికి అంకితమైన వారు ఆయన ఎవరనే దానిని—వారికి వాగ్దానమివ్వబడిన మెస్సీయను కనుగొన్నారు. వారి భక్తి మన భక్తిని ప్రేరేపిస్తుంది, ఎందుకనగా గొఱ్ఱెల కాపరులకు అందించబడిన “మహాసంతోషకరమైన సువర్తమానము” అందరి కొరకైనది మరియు “రక్షకుడు, ప్రభువైన క్రీస్తు” ఆనాడు మనందరి కొరకు జన్మించారు (లూకా 2:10–11 చూడండి).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

లూకా 2:1–7

యేసు క్రీస్తు వినయపూర్వకమైన పరిస్థితులలో జన్మించారు.

“లోకము పుట్టకమునుపు” (యోహాను 17:5) యేసు క్రీస్తు తండ్రియైన దేవునితో పాటు మహిమ కలిగియున్నప్పటికీ, సాధారణ పరిస్థితులలో పుట్టి, భూమి మీద మన మధ్య నివసించడానికి ఆయన సమ్మతించారు. మీరు లూకా 2:1–7 చదివినప్పుడు, ఆయన పుట్టుక యొక్క ఈ వృత్తాంతము ఆయన గురించి మీకేమి బోధిస్తుందో ధ్యానించండి. మీరు ఇదివరకు గమనించని వివరణలను లేదా అంతరార్థములను ఈ కథలో గుర్తించడానికి ప్రయత్నించండి. ఈ విషయాలను గమనించడం ఆయన పట్ల మీ భావాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

మత్తయి 2:1–12; లూకా 2:8–38

క్రీస్తు పుట్టుకకు అనేక సాక్ష్యాలున్నాయి.

అనేక సామాజిక స్థితిగతుల నుండి వచ్చిన సాక్షులు మరియు ఆరాధికుల చేత క్రీస్తు యొక్క పుట్టుక మరియు బాల్యము స్పష్టముగా చెప్పబడింది. వారి కథలను మీరు పరిశోధించినప్పుడు, క్రీస్తును ఆరాధించడానికి మరియు సాక్షిగా ఉండడానికి గల మార్గాల గురించి మీరేమి నేర్చుకుంటారు?

క్రీస్తు యొక్క సాక్షి

క్రీస్తును ఆరాధించుట మరియు సాక్షిగా ఉండుట గురించి నేనేమి నేర్చుకుంటాను?

క్రీస్తు యొక్క సాక్షి

గొఱ్ఱెల కాపరులు (లూకా 2:8–20)

క్రీస్తును ఆరాధించుట మరియు సాక్షిగా ఉండుట గురించి నేనేమి నేర్చుకుంటాను?

క్రీస్తు యొక్క సాక్షి

సుమెయోను (లూకా 2:25–35)

క్రీస్తును ఆరాధించుట మరియు సాక్షిగా ఉండుట గురించి నేనేమి నేర్చుకుంటాను?

క్రీస్తు యొక్క సాక్షి

అన్న (లూకా 2:36–38)

క్రీస్తును ఆరాధించుట మరియు సాక్షిగా ఉండుట గురించి నేనేమి నేర్చుకుంటాను?

క్రీస్తు యొక్క సాక్షి

జ్ఞానులు (మత్తయి 2:1–12)

క్రీస్తును ఆరాధించుట మరియు సాక్షిగా ఉండుట గురించి నేనేమి నేర్చుకుంటాను?

1 నీఫై 11:13–23; 3 నీఫై 1:5–21 కూడా చూడండి.

మత్తయి 2:13–23

తమ కుటుంబాలను రక్షించుకోవడానికి తల్లిదండ్రులు బయల్పాటు పొందగలరు.

యోసేపు తాను అడుగబడిన కార్యమును—యేసును ఆయన బాల్యములో రక్షించడం—పరలోక సహాయము లేకుండా ఎన్నటికీ చేయలేకపోయేవాడు. జ్ఞానుల వలె అతడు ఒక బయల్పాటును పొందాడు, అది ప్రమాదము గురించి అతడిని హెచ్చరించింది. మత్తయి 2:13–23లో యోసేపు అనుభవం గురించి మీరు చదివినప్పుడు, నేడు మనకు ఎదురవుతున్న భౌతిక మరియు ఆత్మీయ ప్రమాదాల గురించి ఆలోచించండి. మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని రక్షించడంలో మీరు దేవుని నడిపింపును భావించిన అనుభవాలను ధ్యానించండి. ఈ అనుభవాలను ఇతరులతో పంచుకోవడం గురించి ఆలోచించండి. భవిష్యత్తులో అటువంటి నడిపింపును పొందడానికి మీరేమి చేయగలరు?

లూకా 2:40–52

యౌవనుడిగా కూడా యేసు తన తండ్రి చిత్తమును చేయడంపై దృష్టిపెట్టారు.

యౌవనుడిగా రక్షకుడు సువార్తను ఎంత శక్తివంతంగా బోధించారనగా, ఆయన “ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును” (లూకా 2:47) దేవాలయములోని బోధకులు కూడా విస్మయమొందారు. ఒక యౌవనుడిగా రక్షకుని గురించి ఈ వచనాల నుండి మీరేమి నేర్చుకుంటారు? మీకు తెలిసిన యౌవనులు ఏవిధంగా “(తమ) తండ్రి పనుల మీద” ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు? (లూకా 2:49). సువార్త గురించి లోతైన గ్రహింపును పొందడానికి యౌవనులు మరియు పిల్లలు మీకెలా సహాయపడ్డారు? లూకా 2:40–52 లో మరియు జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 3:24–26లో (బైబిలు అనుబంధములో) యేసు బాల్యము యొక్క మాదిరి నుండి మీరింకేమి నేర్చుకుంటారు?

చిత్రం
దేవాలయములో బోధకులతో బాలుడైన యేసు

“నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?” (లూకా 2:49).

జోసెఫ్ స్మిత్ అనువాదమేమిటి?

శతాబ్దాలుగా బైబిలు నుండి “అనేక స్పష్టమైన, ప్రశస్థమైన” సత్యములు కోల్పోబడిన కారణంగా (1 నీఫై13:28; మోషే 1:41 కూడా చూడండి), బైబిలు యొక్క ప్రేరేపించబడిన సవరణ చేయమని ప్రభువు జోసెఫ్ స్మిత్‌ను ఆజ్ఞాపించారు, అది జోసెఫ్ స్మిత్ అనువాదముగా చెప్పబడింది. ప్రవక్త చేత చేయబడిన అనేక సవరణలు లేఖనముల యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంచిక యొక్క అనుబంధములో చేర్చబడ్డాయి. జోసెఫ్ స్మిత్—మత్తయి గా పిలువబడు మత్తయి 24 యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదము అమూల్యమైన ముత్యములో కనుగొనబడుతుంది. మరింత సమాచారము కొరకు బైబిలు నిఘంటువులో “జోసెఫ్ స్మిత్ అనువాదము (జో స్మి అ)” చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

లూకా 2.లూకా 2 లో వర్ణించబడిన ఒక వ్యక్తిని ఎంచుకోమని, రక్షకునితో ఆ వ్యక్తి జరిపిన సంభాషణల గురించి కొన్ని వచనాలు చదవమని మరియు యేసు క్రీస్తు నందు వారి విశ్వాసాన్ని పెంచేలా వారు నేర్చుకున్న దానిని పంచుకోమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

క్రీస్తు పుట్టుక గురించి మీ చర్చను చిత్రకళ ఏవిధంగా వృద్ధిచేయగలదో పరిగణించండి. (ఉదాహరణలకు,Gospel Art Book (సువార్త చిత్రకళా పుస్తకము) లేదా history.ChurchofJesusChrist.org/exhibit/birth-of-Christ చూడండి.)

మత్తయి 2:1-12.జ్ఞానుల మాదిరి నుండి రక్షకుడిని వెదకుట మరియు కనుగొనుట గురించి మనమేమి నేర్చుకుంటాము?

లూకా 2:41-49.“తండ్రి పని” ఏది? (లూకా 2:49; మోషే 1:39; లూకా 2:41–49 లోని వృత్తాంతము నుండి ఆ పని గురించి మనమేమి నేర్చుకుంటాము? తండ్రి పనిలో మీ కుటుంబము పాల్గొనగల కొన్ని విధానాలను వ్రాసి, వాటిని ఒక సీసాలో వేయడం గురించి ఆలోచించండి. వచ్చే వారంలో, మీ కుటుంబము పరలోక తండ్రి పనికి సహాయపడే విధానాల కొరకు చూస్తున్నప్పుడు, వారు సీసాలో నుండి ఉపాయాలను ఎంచుకోవచ్చు. మీ అనుభవాలను పంచుకోవడానికి ఒక సమయాన్ని ప్రణాళిక చేయండి.

లూకా 2:52.యేసు తన జీవితంలో ఎలా వృద్ధిచెందారనే దాని గురించి లూకా 2:52 నుండి మనమేమి నేర్చుకోగలము? “జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును” వర్థిల్లడానికి ఏ వ్యక్తిగత మరియు కుటుంబ లక్ష్యాలను మనం ఏర్పరచగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

లేఖన అధ్యయన సహాయములను ఉపయోగించండి. మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, అదనపు అంతరార్థములను పొందడానికి పాదవివరణలు, విషయ దీపిక, బైబిలు నిఘంటువు, లేఖన దీపిక మరియు ChurchofJesusChrist.org వద్ద కనుగొనబడు ఇతర అధ్యయన సహాయాలను ఉపయోగించండి.

చిత్రం
మరియ, యోసేపు మరియు బాలుడైన యేసు

లోక రక్షకుడు అణకువ గల పరిస్థితులలో భూమిపైకి వచ్చారు.

ముద్రించు