2023 క్రొత్త నిబంధన
మీ సువార్త అభ్యాసంలో పవిత్ర సంగీతాన్ని చేర్చుట


“మీ సువార్త అభ్యాసములో పవిత్ర సంగీతాన్ని చేర్చుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మీ సువార్త అభ్యాసంలో పవిత్ర సంగీతాన్ని చేర్చుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

మీ సువార్త అభ్యాసంలో పవిత్ర సంగీతాన్ని చేర్చుట

ప్రాథమిక పాటలు, కీర్తనలు పాడడం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అనేక విధాలుగా దీవించగలదు. మీరు సువార్తను నేర్చుకొని, జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఉపాయాలు పవిత్ర సంగీతాన్ని ఉపయోగించడానికి మీకు సహాయపడగలవు.

  • సిద్ధాంతపరమైన సూత్రాలను నేర్చుకోండి. మీరు పాడే లేదా వినే పాటలలో బోధించబడిన సత్యాల కొరకు చూడండి. ఈ సత్యాల గురించి రోజంతా సువార్త చర్చలకు ఇది దారితీయవచ్చు. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి బోధించే ప్రాథమిక పాటలు లేదా కీర్తనలను పాడండి లేదా వినండి. రక్షకుడు మరియు ఆయన బోధనల గూర్చి పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చు విధానాల పట్ల శ్రద్ధ వహించండి.

  • సంగీతపు శక్తిని గుర్తించండి. అవసరమైన సమయాల్లో ప్రాథమిక పాటలు, కీర్తనలు పాడడం లేదా వినడం దీవెనకరంగా ఉండగలదు. ఉదాహరణకు, ఒక పాట పాడడం నిద్రపోయే సమయంలో ఒక బిడ్డను సముదాయించగలదు, మీ కుటుంబము కలిసి పనిచేస్తున్నప్పుడు ఆనందాన్నివ్వగలదు, అస్వస్థతతో ఉన్న పొరుగువారిని ఉత్తేజపరచగలదు, లేదా ఆందోళనలో ఉన్నవారిని ఓదార్చగలదు.

  • అనుభవాలను పంచుకోండి. పాటలలోని సందేశాలకు సంబంధించిన వ్యక్తిగత మరియు కుటుంబ అనుభవాలను పంచుకోండి. సంబంధిత లేఖన వృత్తాంతాలను కూడా మీరు పంచుకోవచ్చు.

  • మీ కుటుంబాన్ని చేర్చుకోండి. మీ కుటుంబము క్రియాశీలకంగా పాల్గొనినట్లయితే, వారు పాటల నుండి అధికంగా నేర్చుకుంటారు. కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి, చిన్నపిల్లలకు ఒక పాట నేర్పించడంలో సహాయపడమని ఒక పెద్ద పిల్లవాడిని మీరు ఆహ్వానించవచ్చు లేదా వారు ప్రాథమికలో నేర్చుకున్న పాటను కుటుంబానికి నేర్పించమని పిల్లలను ఆహ్వానించవచ్చు. కుటుంబ సభ్యులు వంతులవారీగా ఒక పాటను నేర్పించేలా కూడా మీరు చేయవచ్చు.

  • సృజనాత్మకంగా ఉండండి. ఒక కుటుంబముగా పవిత్ర సంగీతాన్ని నేర్చుకోవడానికి విభిన్న విధానాలను ఉపయోగించండి. ఉదాహరణకు, పాటలోని పదాలు మరియు వాక్యభాగాలకు సరిపోయే అభినయాలను మీరు చేయవచ్చు. లేదా ఇతర కుటుంబ సభ్యులు ఆ పాటను ఊహించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మీరు వంతులవారీగా పాటలోని భాగాలను అభినయించవచ్చు. విభిన్న వేగాలలో లేదా శ్రుతులలో పాటలు పాడడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు. వినడానికి పవిత్ర సంగీతం యొక్క పాటల జాబితాలను కూడా మీరు చేయవచ్చు.

ముద్రించు