2023 క్రొత్త నిబంధన
రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట


రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట

ఈ వనరు ఎవరి కొరకైనది?

ఈ వనరు సంఘములోని ప్రతి వ్యక్తి మరియు కుటుంబము కొరకైనది. మీ స్వంతంగానైనా లేక మీ కుటుంబంతోనైనా సువార్తను నేర్చుకోవడానికి మీకు సహాయపడేందుకు ఇది రూపొందించబడింది. గతంలో మీరు క్రమం తప్పక సువార్తను అధ్యయనం చేయనట్లయితే, మీరు ప్రారంభించడానికి ఈ వనరు సహాయపడగలదు. సువార్తను అధ్యయనం చేసే మంచి అలవాటు మీకు ఇదివరకే ఉన్నట్లయితే, మరిన్ని అర్థవంతమైన అనుభవాలను కలిగియుండేందుకు ఈ వనరు మీకు సహాయపడగలదు.

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న భార్యాభర్తలు

ఈ వనరును నేనెలా ఉపయోగించాలి?

మీకు సహాయకరంగా ఉండే ఏ విధానంలోనైనా ఈ వనరును ఉపయోగించండి. వ్యక్తిగత మరియు కుటుంబ లేఖన అధ్యయనం కొరకు ఒక మార్గదర్శిగా లేదా సహాయముగా మీరు దీనిని ఉపయోగకరమైనదిగా కనుగొనగలరు. మీరు దీనిని గృహ సాయంకాలము కొరకు కూడా ఉపయోగించవచ్చు. ఇందులోని సారాంశాలు క్రొత్త నిబంధనలో కనుగొనబడే ముఖ్యమైన సూత్రాలను నొక్కి చెప్తాయి, వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు అధ్యయన ఉపాయాలను, ప్రోత్సాహ కార్యక్రమాలను సూచిస్తాయి మరియు మీ మనోభావాలను నమోదు చేయడానికి స్థలమును అందిస్తాయి.

రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు అనునది మీరు చేస్తున్న మంచి పనులకు బదులుగా లేదా వాటితో పోటీపడేందుకు ఉద్దేశించబడినది కాదు. దేవుని వాక్యాన్ని మీ స్వంత పద్ధతిలో ఎలా అధ్యయనం చేయాలో నిర్ధారించడానికి ఆత్మ యొక్క నడిపింపును అనుసరించండి.

సంఘంలో జరిగే దానితో ఈ వనరు ఏవిధమైన సంబంధం కలిగియుంది?

ఈ వనరులోని సారాంశాలు ఒక వారపు పఠన పట్టిక ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాథమిక, ఆదివారపు బడి మరియు అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతుల కొరకైన రండి, అనుసరించండి వనరులు అదే కాలపట్టికను అనుసరిస్తాయి. సువార్తను నేర్చుకొని, జీవించడానికి ఇంటివద్ద మీ ప్రయత్నాలలో సహకరించేందుకు, ఇంటివద్ద మీరు చదువుతున్న లేఖన భాగాల గురించి మీ అనుభవాలను, ఆలోచనలను మరియు ప్రశ్నలను పంచుకోవడానికి సంఘములో మీ బోధకులు మీకు అవకాశాన్ని ఇస్తారు.

ఆదివారపు బడి నెలకు రెండుసార్లు మాత్రమే బోధించబడుతుంది కాబట్టి, వారపు కాలపట్టికతో పాటు నిలిచేందుకు ఆదివారపు బడి యొక్క బోధకులు సారాంశాలను వదిలివేయడానికి లేదా కలిపి చెప్పడానికి ఎంచుకోవచ్చు. స్టేకు సమావేశం లేదా ఇతర కారణాల వల్ల నియమిత సంఘ సమావేశాలు జరుగని వారాలలో కూడా (ఆదివారపు బడి మరియు ప్రాథమికకు) ఇది అవసరం కావచ్చు. ఈ వారాలలో ఇంటివద్ద క్రొత్త నిబంధన అధ్యయనాన్ని కొనసాగించడానికి మీరు ఆహ్వానించబడ్డారు.

నేను కాలపట్టికను అనుసరించాలా?

ఈ కాలపట్టిక సంవత్సరాంతం లోపు క్రొత్త నిబంధన చదవడాన్ని పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది. అదనంగా, మిగిలిన వారివలే అదే కాలపట్టికను అనుసరించడమనేది గృహములో, సంఘములో మరియు ఎక్కడైనా అర్థవంతమైన అనుభవాలకు దారితీయవచ్చు. కానీ కాలపట్టిక‌కు కట్టుబడి ఉండనవసరము లేదు లేదా ప్రతి వచనం చదువుటకు బలవంతం చేయబడవద్దు; కాలపట్టిక కేవలం మిమ్మల్ని వేగవంతం చేయడంలో సహాయపడడానికి ఇవ్వబడింది. ముఖ్యమైన విషయమేదనగా, మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబంగా సువార్తను నేర్చుకుంటున్నారు.

ముద్రించు