2023 క్రొత్త నిబంధన
చిన్న పిల్లలకు బోధించుట


“చిన్న పిల్లలకు బోధించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“చిన్న పిల్లలకు బోధించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిన్న పిల్లలకు బోధించుట

మీ కుటుంబములో చిన్న పిల్లలున్నట్లయితే, వారు నేర్చుకోవడానికి సహాయపడగల ప్రోత్సాహకార్యక్రమాలు కొన్ని ఇక్కడ కలవు:

  • పాడండి. కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకము లోని పాటలు సిద్ధాంతమును శక్తివంతముగా బోధిస్తాయి. పాటలలోని సందేశాలను వారి జీవితాలకు సంబంధింపజేసుకొనేలా పిల్లలకు సహాయం చేయండి. (ఈ వనరులో “మీ సువార్త అభ్యాసంలో పవిత్ర సంగీతాన్ని చేర్చుట” కూడా చూడండి.)

  • ఒక వృత్తాంతమును వినండి లేదా అభినయించండి. లేఖనాల నుండి, మీ జీవితం నుండి, సంఘ చరిత్ర లేదా మీ కుటుంబ చరిత్ర నుండి మరియు సంఘ మాసపత్రికల నుండి—కథలను చిన్న పిల్లలు ఇష్టపడతారు. కథ చెప్పుటలో వారిని చేర్చగల మార్గముల కొరకు వెదకండి. వారు వినే దాని చిత్రములను లేదా వస్తువులను వారు పట్టుకోవచ్చు, చిత్రములను గీయవచ్చు, కథను అభినయించవచ్చు లేదా కథ చెప్పడానికి సహాయం చేయవచ్చు. మీరు పంచుకునే కథలలోని సువార్త సత్యములను గుర్తించుటకు మీ పిల్లలకు సహాయపడండి.

  • ఒక లేఖనము చదవండి. చిన్న పిల్లలు ఎక్కువగా చదవలేకపోవచ్చు, అయినప్పటికీ మీరు వారిని లేఖనాల నుండి నేర్చుకోవడంలో నిమగ్నం చేయండి. మీరు ఒక వచనము, ముఖ్యమైన వాక్యభాగము లేదా పదముపై దృష్టిసారించవలసి రావచ్చు. వారు పదే పదే చెప్పడం వల్ల లేఖనాలలోని చిన్న వాక్యభాగాలను పిల్లలు కంఠస్థం చేయగలుగుతారు. దేవుని వాక్యమును వారు విన్నప్పుడు, వారు ఆత్మను అనుభవిస్తారు.

  • ఒక చిత్రమును లేదా ఒక వీడియోను చూడండి. ఒక సువార్త సూత్రము లేదా లేఖన వృత్తాంతమునకు సంబంధించిన ఒక చిత్రమును లేదా ఒక వీడియోను మీరు పిల్లలకు చూపించినప్పుడు, వారు చూస్తున్న దానినుండి నేర్చుకోవడానికి సహాయపడేలా వారిని ప్రశ్నలడగండి. ఉదాహరణకు, “ఈ చిత్రములో లేదా వీడియోలో జరుగుచున్నది ఏమిటి? అది మిమ్మల్ని ఏవిధంగా భావించునట్లు చేస్తుంది?” అని మీరు అడగవచ్చు.

  • సృష్టించండి. పిల్లలు వారు నేర్చుకొంటున్న వృత్తాంతము లేదా సూత్రమునకు సంబంధించిన దానిని నిర్మించవచ్చు, గీయవచ్చు లేదా రంగులు వేయవచ్చు.

  • వస్తు పాఠములలో పాల్గొనండి. గ్రహించుటకు కష్టమైన సువార్త సూత్రమును మీ పిల్లలు గ్రహించుటకు సరళమైన వస్తు పాఠము సహాయపడగలదు. వస్తు పాఠములను ఉపయోగించినప్పుడు, మీ పిల్లలు పాల్గొనుటకు అనుమతించు విధానములు కనుగొనండి. కేవలము ఒక నిదర్శనమును చూచుట కంటె పరస్పర అనుభవము నుండి వారు ఎక్కువగా నేర్చుకుంటారు.

  • నటించి చూపుట. నిజ జీవితంలో వారు ఎదుర్కోగల ఒక సందర్భాన్ని పిల్లలు నటించి చూపుతున్నప్పుడు, ఒక సువార్త సూత్రం వారి జీవితాలకు ఎలా వర్తిస్తుందనే దానిని వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు.

  • ప్రోత్సాహకార్యక్రమాలను పునరావృతం చేయండి. భావనలను గ్రహించటానికి చిన్న పిల్లలు వాటిని పలుమార్లు వినాల్సిన అవసరమున్నది. తరుచుగా కథలను లేదా ప్రోత్సాహకార్యక్రమాలను పునరావృతం చేయుటకు భయపడవద్దు. ఉదాహరణకు, లేఖనాల నుండి చదవడం, మీ స్వంత మాటలలో చెప్పడం, వీడియో చూపించడం, మీరు కథ చెప్పడానికి మీ పిల్లలు సహాయపడేలా చేయడం, ఒక కథను నటించి చూపడానికి వారిని ఆహ్వానించడం, మరియు ఇంకా అలాంటి రకరకాల విధానాల్లో ఒక లేఖన వృత్తాంతమును మీరు అనేకమార్లు పంచుకోవచ్చు.

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న కుటుంబము

ముద్రించు