2023 క్రొత్త నిబంధన
మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు


“మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న తల్లీబిడ్డలు

మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు

మీ కుటుంబము పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని అనుభవించడానికి మరియు సువార్తను నేర్చుకోవడానికి సహాయపడేందుకు క్రమంతప్పని కుటుంబ లేఖన అధ్యయనము ఒక శక్తివంతమైన మార్గము. మీ ప్రయత్నాలలో నిలకడగా ఉండడం కంటే కుటుంబంగా మీరు ఎంత మొత్తం మరియు ఎంత సమయం చదివారనేది అంత ముఖ్యము కాదు. మీ కుటుంబ జీవితంలో లేఖన అధ్యయనాన్ని ఒక ముఖ్యమైన భాగంగా మీరు చేసినప్పుడు, మీ కుటుంబ సభ్యులు పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు దగ్గరవడానికి, దేవుని వాక్యము యొక్క పునాదిపై వారి సాక్ష్యాలను నిర్మించడానికి మీరు సహాయం చేస్తారు. క్రింది ప్రశ్నల గురించి కలిసి చర్చించడాన్ని పరిగణించండి:

  • వ్యక్తిగతంగా లేఖనాలను అధ్యయనం చేయడానికి మీ కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఏవిధంగా ప్రోత్సహించగలరు?

  • వారు నేర్చుకున్న వాటిని పంచుకొనేలా ప్రతి వ్యక్తిని ప్రోత్సహించడానికి మీ కుటుంబ సభ్యులు ఏమి చేయగలరు?

  • క్రొత్త నిబంధనలో మీరు నేర్చుకుంటున్న సూత్రాలను రోజువారీ బోధనా క్షణాల్లో ఎలా నొక్కి చెప్పగలరు?

సువార్త అభ్యాసానికి గృహము ఆదర్శవంతమైన స్థలం అని గుర్తుంచుకోండి. సంఘ తరగతిలో సాధ్యం కాని మార్గాల్లో మీరు ఇంటివద్ద సువార్తను నేర్చుకోగలరు మరియు బోధించగలరు. లేఖనాలనుండి నేర్చుకొనుటలో మీ కుటుంబానికి సహాయపడే మార్గాల గురించి మీరు ఆలోచించినప్పుడు సృజనాత్మకంగా ఉండండి. మీ కుటుంబ లేఖన అధ్యయనాన్ని పెంపొందించడానికి క్రింది ఉపాయాలలో కొన్నింటిని పరిగణించండి.

చిత్రం
ఒక ఇంటిలో కలిసి పాడుతున్న కుటుంబము మరియు సంఘ నాయకులు

సంగీతాన్ని ఉపయోగించండి

లేఖనాలలో బోధించబడిన సూత్రాలను బలపరిచే పాటలను పాడండి. సూచించబడిన ఒక కీర్తన లేదా పిల్లల పాట ప్రతీ వారపు సారాంశంలో జాబితా చేయబడింది. పాటలలోని మాటలు లేదా వాక్యభాగములను గూర్చి కుటుంబ సభ్యులను మీరు ప్రశ్నలు అడగవచ్చు. పాట పాడుటకు అదనముగా, మీ కుటుంబము పాటలకు తగినట్లుగా అభినయించవచ్చు లేదా వారు ఇతర ప్రోత్సాహ కార్యక్రమాలను చేస్తుండగా నేపథ్య సంగీతముగా పాటలను వినవచ్చు. మరిన్ని ఉపాయాల కోసం, ఈ వనరులో “మీ సువార్త అభ్యాసంలో పరిశుద్ధ సంగీతాన్ని చేర్చుట” చూడండి.

అర్థవంతమైన లేఖనాలను పంచుకోండి

వారి వ్యక్తిగత అధ్యయనంలో అర్థవంతమైనవిగా కనుగొన్న లేఖన భాగాలను పంచుకోవడానికి కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వండి.

మీ స్వంత పదాలను ఉపయోగించండి

మీరు అధ్యయనం చేసే లేఖనాల నుండి వారు నేర్చుకున్న వాటిని వారి స్వంత మాటలలో సంగ్రహించడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

లేఖనాలను మీ జీవితానికి అన్వయించుకోండి

ఒక లేఖన భాగాన్ని చదివిన తరువాత, ఆ భాగం వారి జీవితాలకు వర్తించే మార్గాలను పంచుకోమని కుటుంబ సభ్యులను అడగండి.

ఒక ప్రశ్న అడగండి

ఒక సువార్త ప్రశ్న అడగమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి, ఆపై ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సహాయపడే వచనాల కోసం వెదకండి.

ఒక లేఖనాన్ని ప్రదర్శించండి

మీకు అర్థవంతముగా అనిపించే వచనం ఎంచుకోండి మరియు కుటుంబ సభ్యులు తరచూ చూసే చోట దాన్ని ప్రదర్శించండి. ప్రదర్శించడానికి ఒక లేఖనాన్ని వంతుల వారీగా ఎంచుకోమని ఇతర కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న తల్లి మరియు పిల్లలు

లేఖన జాబితాను తయారు చేయండి

కుటుంబంగా, రాబోయే వారంలో మీరు చర్చించదలిచిన అనేక వచనాలను ఎంచుకోండి.

లేఖనాలను కంఠస్థం చేయండి

మీ కుటుంబానికి అర్థవంతంగా అనిపించే ఒక లేఖన భాగాన్ని ఎంచుకోండి మరియు ప్రతిరోజూ పునరావృతం చేయడం ద్వారా లేదా జ్ఞాపకశక్తి ఆట ఆడడం ద్వారా దాన్ని కంఠస్థం చేయడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

వస్తు పాఠములను పంచుకోండి

ఒక కుటుంబముగా మీరు చదువుతున్న లేఖన భాగాలలోని సువార్త సూత్రములకు సంబంధించిన వస్తువులను కనుక్కోండి. ప్రతీ వస్తువు లేఖనాల్లోని బోధనలతో ఎలా సంబంధం కలిగి ఉందో మాట్లాడడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

ఒక అంశాన్ని ఎంచుకోండి

కుటుంబం కలిసి అధ్యయనం చేసే అంశాన్ని వంతుల వారీగా కుటుంబ సభ్యులు ఎంచుకోనివ్వండి. ఒక అంశం గురించి లేఖన భాగాలను కనుగొనడానికి విషయ దీపిక, బైబిలు నిఘంటువు లేదా లేఖన దీపిక (scriptures.ChurchofJesusChrist.org) ఉపయోగించండి.

ఒక చిత్రాన్ని గీయండి

కుటుంబంగా కొన్ని వచనాలను చదవండి, తరువాత మీరు చదివిన వాటికి సంబంధించినది ఏదైన గీయడానికి కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వండి. ఒక్కొక్కరు గీసిన చిత్రాల గురించి చర్చించడానికి సమయం కేటాయించండి.

ఒక కథను అభినయించండి

ఒక కథ చదివిన తరువాత, దాన్ని అభినయించడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. తరువాత, మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబముగా అనుభవిస్తున్న విషయాలతో ఆ కథ ఎలా సంబంధం కలిగి ఉందో అనేదాని గురించి మాట్లాడండి.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “సువార్త అభ్యాసానికి కేంద్రంగా మీరు మీ ఇంటిని మార్చడానికి శ్రద్ధగా పనిచేసినప్పుడు, కొంతకాలానికి మీ విశ్రాంతి దినములు నిజంగా సంతోషభరితమవుతాయని నేను వాగ్దానమిస్తున్నాను. మీ పిల్లలు రక్షకుని బోధనలను నేర్చుకోవడానికి, జీవించడానికి ఆరాటపడతారు, మరియు మీ జీవితంలో, మీ ఇంటిలో అపవాది ప్రభావము తగ్గుతుంది. మీ కుటుంబములో మార్పులు నాటకీయంగా మరియు ఆమోదయోగ్యంగా ఉంటాయి” (“ఆదర్శవంతమైన కడవరి దిన పరిశుద్ధులగుట,” లియహోనా, నవ. 2018, 113).

ముద్రించు