2023 క్రొత్త నిబంధన
ఏప్రిల్ 10-16. మత్తయి 15–17; మార్కు 7–9: “నీవు క్రీస్తువు”


“ఏప్రిల్ 10-16. మత్తయి 15-17; మార్కు 7–9: ‘నీవు క్రీస్తువు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఏప్రిల్ 10-16. మత్తయి 15-17; మార్కు 7-9,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
క్రీస్తు యొక్క రూపాంతరము

రూపాంతరము, కార్ల్ హెన్రిచ్ బ్లాక్ చేత

ఏప్రిల్ 10-16

మత్తయి 15-17; మార్కు 7-9

“నీవు క్రీస్తువు”

లేఖనాలను చదవడం పరిశుద్ధాత్మను మీ జీవితంలోకి ఆహ్వానిస్తుంది. యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వడం పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన నియమితకార్యాలలో ఒకటి. మీరు ఈ వారం లేఖనాలను చదువుతున్నప్పుడు, రక్షకుని గురించి మీ సాక్ష్యాన్ని బలపరిచే ఆధ్యాత్మిక భావనలపట్ల శ్రద్ధ వహించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు “పరలోకము నుండి ఒక సూచనను” వారికి చూపాలని పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు కోరడం వింతగా లేదా? ఆయన అనేకమైన ప్రసిద్ధి చెందిన అద్భుతములు సరిపోవా? ఆయన శక్తివంతమైన బోధనలు లేదా ప్రాచీన ప్రవచనాలను ఆయన నెరవేర్చిన బహు విధానాల విషయమేమిటి? వారి కోరిక సూచనలు లేకపోవడం చేత కలుగలేదు, కానీ “సూచనలను గ్రహించడానికి” మరియు వాటిని అంగీకరించడానికి సమ్మతించకపోవడం వలన కలిగినది. (మత్తయి 16:1-4 చూడండి.)

పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల వలే పేతురు, రక్షకుని యొక్క అద్భుతాలను ప్రతక్ష్యంగా చూసాడు మరియు బోధనలు విన్నాడు. కానీ “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు,” అన్న పేతురు యొక్క ఖచ్చితమైన సాక్ష్యము అతని శారీరక ఇంద్రియములైన– అతడి “మాంసము మరియు రక్తము” ద్వారా రాలేదు. అతడి సాక్ష్యము మన “పరలోకమందున్న తండ్రి” చేత అతడికి బయల్పరచబడింది. బయల్పాటు అనేది రక్షకుడు తన సంఘమును అప్పుడు, ఇప్పుడు కట్టిన బండ—ఆయన సేవకులకు పరలోకము నుండి ఇవ్వబడిన బయల్పాటు. మరియు ఈ బండపైనే— యేసే క్రీస్తని మరియు ఆయన సేవకులు “దేవుని రాజ్యపు తాళపుచెవులను” కలిగియున్నారనే బయల్పాటుపైనే మనము మన శిష్యత్వమును కట్టగలము. ఈ పునాదిపై మనము కట్టబడినప్పుడు, “పాతాళ లోకద్వారములు [మన] యెదుట నిలువనేరవు” (మత్తయి 16:15–19).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 16:13-17

బయల్పాటు ద్వారా యేసు క్రీస్తును గూర్చి ఒక సాక్ష్యము వస్తుంది.

“మనుష్యు కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు?” అని యేసు నేడు జనులను అడిగిన యెడల, వారు ఏమి చెప్పుచుండవచ్చు? “మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని,” యేసు మిమ్మల్ని అడిగిన యెడల మీరేవిధంగా స్పందిస్తారు? (మత్తయి 16:13–15 చూడండి.)

రక్షకుని గూర్చి మీ సాక్ష్యమును మరియు దానిని మీరు ఎలా పొందారో ధ్యానించండి. దానిని బలపరచగలుగునట్లు మత్తయి 16:15–17 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? సాక్ష్యము మరియు వ్యక్తిగత బయల్పాటు గురించి మీరు ఎక్కువగా నేర్చుకోవాలని కోరినట్లయితే, ఈ లేఖనాలను పరిశీలించండి: యోహాను 15:26; 2 నీఫై 31:17–18; ఆల్మా 5:45–48; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2–3.

మత్తయి16:13–19; 17:1–9; మార్కు 9:2–9

“పరలోక రాజ్యము యొక్క తాళపుచెవులు” నేడు భూమిపై ఉన్నాయి.

పేతురుకు ఇస్తానని రక్షకుడు వాగ్దానము చేసిన “పరలోక రాజ్యము యొక్క తాళపుచెవులే” యాజకత్వపు తాళపుచెవులు (మత్తయి 16:19). యాజకత్వపు తాళపుచెవులు అంటే ఏమిటి? అవి మనకు ఎందుకు అవసరము? మత్తయి 16:13–19లో రక్షకుని వాగ్దానము మరియు మత్తయి 17:1–9; మార్కు 9:2–9 (జోసెఫ్ స్మిత్ అనువాదము, మార్కు 9:3 [మార్కు 9:4, పాదవివరణ లో] కూడా చూడండి) లో దాని నెరవేర్పు గురించి మీరు చదువుతున్నప్పుడు, ఈ ప్రశ్నలను ధ్యానించండి.

యాజకత్వపు తాళపుచెవులు గురించి మీరు నేర్చుకోవడానికి సహాయపడే ఇతర వనరులు సిద్ధాంతము మరియు నిబంధనలు 65:2; 107:18–20; 110:11–16; 128:9–11; లేఖన దీపికలో “యాజకత్వపు తాళపుచెవులు” (scriptures.ChurchofJesusChrist.org); ఈ వనరులను అధ్యయనం చేస్తున్నప్పుడు, యాజకత్వపు తాళపుచెవులు మరియు వాటినుండి వచ్చే దీవెనల గురించి మీరు నేర్చుకొనే వాటిని జాబితా చేయడాన్ని పరిగణించండి. యాజకత్వ సేవను నిర్దేశించే హక్కు కొరకు తాళపుచెవి ఒక మంచి చిహ్నమని మీరెందుకు అనుకుంటున్నారు?

చిత్రం
తాళపుచెవులను పట్టుకొన్న పేతురు విగ్రహము

యాజకత్వపు ఉపయోగమును నిర్దేశించు అధికారమే యాజకత్వపు తాళపుచెవులు.

మత్తయి 17:14–21; మార్కు 9:14–29

గొప్ప విశ్వాసమును వెదికినప్పుడు, నేను ఇప్పటికే కలిగియున్న విశ్వాసముతో మొదలుపెట్టగలను.

మత్తయి 17 మరియు మార్కు 9 లో చెప్పబడిన తండ్రి తన కుమారుడిని యేసు స్వస్థపరచగలడా అని సందేహించడానికి కారణాలు కలిగియున్నాడు. అతడు తన కుమారుడిని స్వస్థపరచమని యేసు శిష్యులను అడిగాడు, కానీ వారు చేయలేకపోయారు. అయితే, ఒక అద్భుతం కొరకు అతడు రక్షకుడిని అడిగినప్పుడు, అతడు విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి ఎంచుకున్నాడు. “ప్రభువా, నేను నమ్ముచున్నాను,” అని అతడు చెప్పాడు. తరువాత, తన విశ్వాసము పరిపూర్ణమైనది కాదని అంగీకరిస్తూ, “నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని” అతడు చెప్పాడు.

ఈ అద్భుతమును గూర్చి మీరు చదివినప్పుడు ఆత్మ మీకు ఏమని బోధించెను? మీ విశ్వాసమును వృద్ధి చేయుటకు పరలోక తండ్రి మీకేవిధంగా సహాయపడ్డారు? మీరు ఇదివరకే కలిగియున్న విశ్వాసమును వృద్ధిచేయడానికి మీరేమి చేయగలరు? బహుశా మీరు మీ విశ్వాసమును బలపరిచిన లేఖనాలు, సమావేశ సందేశాలు లేదా అనుభవాల జాబితాను సంగ్రహించగలరు.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 15:7–9; మార్కు 7:6-7.మన పెదవులతో లేదా మాటలతో దేవుడిని ఘనపరచడానికి మరియు మన హృదయాలతో ఆయనను ఘనపరచడానికి మధ్య గల తేడా ఏమిటి?

మత్తయి 15:17-20; మార్కు 7:18-23.మనం మన నోటిలో ఏమి పెట్టుకుంటామనే దానిగురించి ఎందుకు జాగ్రత్తగా ఉంటాము? ఈ వచనాలలో యేసు బోధించిన దానిని బట్టి, మన నోటి నుండి మరియు మన హృదయాల నుండి బయటకు వచ్చే దాని గురించి మనం మరింత జాగ్రత్తగా ఎందుకు ఉండాలి? మనం మన హృదయాలను ఎలా స్వచ్ఛంగా ఉంచగలము?

మత్తయి 16:15-17.యేసే “క్రీస్తని, సజీవుడైన దేవుని కుమారుడని” దేవుడు మనకెలా బయల్పరుస్తారు? (16వ వచనము). ఆయన నుండి ఈ బయల్పాటును పొందడానికి మనల్ని మనము ఎలా సిద్ధపరచుకొనగలము?

మత్తయి 16:13–19; 17:1–9. పిల్లలకు యాజకత్వపు తాళపుచెవులను గూర్చి బోధించడానికి ఇంటిని, కారును లేదా ఇతర తాళాలను తెరవడానికి మీ పిల్లలు తాళపుచెవులను ఉపయోగించడానికి మీరు అనుమతించవచ్చు. సంఘము యొక్క అధ్యక్షుని చిత్రమును చూపించి, పేతురు కలిగియున్నట్లుగా ఆయన సమస్త యాజకత్వపు తాళపు చెవులను కలిగియున్నారని సాక్ష్యమిచ్చుటను పరిగణించండి.

మత్తయి 17:20.యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియున్న ప్రవక్తలు నిజంగా కొండలను కదిలించారు (జేకబ్ 4:6; మోషే 7:13 చూడండి). కానీ సాధారణంగా, మనకు కావలసిన అద్భుతము అది కాదు. అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లార్డ్ ఇలా బోధించారు: “మనము చిన్న ఆవగింజంత విశ్వాసం కలిగియున్న యెడల, కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు మరియు ఇంకా సంఘ సభ్యులు కాని వారిని కలిపి, దేవుని యొక్క పిల్లలతో మనము సేవ చేసినప్పుడు, మన ముందున్న కార్యములలో నిరాశ మరియు అనుమానపు కొండలను తొలగించుటకు ప్రభువు మనకు సహాయపడతారు” (“దేవుని నుండి ప్రశస్తమైన వరములు,” లియహోనా, మే 2018, 10). మన జీవితాలలో కదిలించబడుట అవసరమైన కొన్ని కొండలేవి? ఈ కొండలను తీసివేయుటలో మనకు సహాయపడుటకు దేవుని శక్తి యందు విశ్వాసమును మనము ఎలా చూపగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

తరచుగా కలిసి సమావేశమవ్వండి. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధించారు: “యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతమును నేర్చుకొనుటకు పిల్లలను సమావేశపరచు అవకాశమును ఎన్నడూ కోల్పోవద్దు. శత్రువు ప్రయత్నాలతో పోల్చితే అటువంటి క్షణాలు చాలా అరుదు” (“The Power of Teaching Doctrine,” Ensign, May 1999, 74).

చిత్రం
యేసు యెదుట రోగియైన కుమారునితో మనుష్యుడు

బోధకుడా, మీ వద్దకు నా కుమారుడిని తెచ్చాను, వాల్టర్ రానె చేత

ముద్రించు