2023 క్రొత్త నిబంధన
ఏప్రిల్ 17-23. మత్తయి 18; లూకా 10: “నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?”


“ఏప్రిల్ 17-23. మత్తయి 18; లూకా 10: ‘నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఏప్రిల్ 17-23. మత్తయి 18; లూకా 10,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
మంచి సమరయుడు

మంచి సమరయుడు, డాన్ బర్ చేత

ఏప్రిల్ 17-23

మత్తయి 18; లూకా 10

“నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?”

మీరు మత్తయి 18 మరియు లూకా 10 ప్రార్థనాపూర్వకంగా చదివి ధ్యానించినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క నిశ్శబ్ద ప్రేరేపణలపట్ల శ్రద్ధ చూపండి. ఈ బోధనలు మరియు వృత్తాంతములు మీకు ఎలా అన్వయిస్తాయో ఆయన మీకు చెప్తారు. మీరు పొందే మనోభావాలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మీరు ప్రభువును ఒక ప్రశ్న అడిగినప్పుడు, మీరు ఆశించని జవాబును మీరు పొందవచ్చు. నా పొరుగువారు ఎవరు? మీ సహాయము మరియు ప్రేమ అవసరమైన వారు ఎవరైనా. పరలోక రాజ్యములో గొప్పవారు ఎవరు? ఒక బిడ్డ. బాధకు గురిచేసిన వారిని ఏడుసార్లు క్షమించుట సరిపోతుందా? లేదు, మీరు డెబ్బది ఏళ్ళ మారులమట్టుకు క్షమించాలి. (లూకా 10:29–37; మత్తయి 18:4, 21–22 చూడండి.) ప్రభువు నుండి వచ్చే ఆశించని జవాబులు మనం ఆలోచించే, భావించే మరియు చర్య తీసుకొనే విధానాన్ని మార్చుకోవడానికి మనల్ని ఆహ్వానించగలవు. మీరు ఆయన నుండి నేర్చుకొనుటకు నిజముగా కోరుచున్నారు కనుక, మీరు ప్రభువు యొక్క చిత్తమును వెదికిన యెడల, ఆయనతో నిత్యజీవమునకు నడిపించు విధానములో ఎలా జీవించాలో ప్రభువు మీకు బోధిస్తారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 18:21–35

నేను ప్రభువునుండి క్షమాపణను పొందాలంటే నేను ఇతరులను క్షమించాలి.

అతడు ఎవరినైనా ఏడుసార్లు క్షమించగలడనే పేతురు సూచన చాలా ఔదార్యమైనదిగా కనబడవచ్చు, కానీ యేసు ఉన్నతమైన ధర్మశాస్త్రమును బోధించారు. “ఏడుమారులమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను,” (22వ వచనము) అనిన ఆయన జవాబు సంఖ్యలను గూర్చి బోధించుటలేదు, కానీ క్షమాపణ గురించి క్రీస్తువంటి స్వభావమును గూర్చి బోధిస్తుంది. కనికరములేని సేవకుని యొక్క ఉపమానమును మీరు చదివినప్పుడు, దేవుని కృప మరియు కనికరమును మీరు అనుభూతిచెందిన సమయాలను ధ్యానించండి. మీ నుండి కృప మరియు కనికరమును పొందవలసిన వారు ఎవరైనా ఉన్నారా?

ఎల్డర్ డేవిడ్ ఈ. సోరెన్సెన్ ఈ ముఖ్య హెచ్చరిక చేసారు: “మనల్ని గాయపరచిన పొరుగువారిని మనం తప్పక క్షమించవలసి యున్నప్పటికీ, ఆ గాయం పునరావృతం కాకుండా నిరోధించడానికి మనమింకా నిర్మాణాత్మకంగా పనిచేయాలి. … చెడును అంగీకరించమని లేదా సహించమని క్షమాపణ మనల్ని కోరదు. … కానీ మనం పాపానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు, ద్వేషం లేదా కోపం మన ఆలోచనలను లేదా చర్యలను నియంత్రించడానికి మనం అనుమతించకూడదు” (“Forgiveness Will Change Bitterness to Love,” Liahona, May 2003, 12).

లూకా 10:1–20

డెబ్బదిమంది ఎవరు?

పాత నిబంధన కాలములో ఏర్పరచబడిన క్రమమును అనుసరించి (నిర్గమకాండము 24:1; సంఖ్యాకాండము 11:16 చూడండి), ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుటకు, ఆయన సువార్తను ప్రకటించుటకు మరియు ఆయన కార్యములో ఆయనకు సహాయపడుటకు యేసు తన పన్నెండుమంది అపొస్తలులకు అదనముగా “మరొక డెబ్బదిమందిని నియమించారు.” పునఃస్థాపించబడిన సంఘములో ఈ క్రమము కొనసాగుతున్నది. ప్రపంచమంతటా యేసు క్రీస్తు యొక్క ప్రత్యేక సాక్షులుగా వారి నియమితకార్యములో పన్నెండుమందికి సహాయపడుటకు డెబ్బదులు పిలువబడ్డారు.

(సిద్ధాంతము మరియు నిబంధనలు 107: 25–26, 33–34, 97 కూడా చూడండి).

లూకా 10:25–37

నిత్యజీవమును పొందడానికి, నేను దేవుడిని, నావలె నా పొరుగువానిని తప్పక ప్రేమించాలి.

మంచి సమరయుని ఉపమానము, “నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?” మరియు “నా పొరుగువారెవరు?” అన్న రెండు ప్రశ్నలకు యేసు జవాబిచ్చు విధానమని జ్ఞాపకముంచుకొనుట సహాయకరమైనది. (లూకా 10:25, 29). ఈ ఉపమానమును మీరు చదివినప్పుడు, ఈ ప్రశ్నలను మనస్సులో ఉంచుకోండి. మీరు కనుగొన్న జవాబులేవి?

యేసు కాలము నాటికి, యూదులు మరియు సమరయుల మధ్య శత్రుత్వము శతాబ్దాలుగా కొనసాగింది. సమరయలో నివసిస్తున్న యూదుల వారసులే సమరయులు, వారు అన్యులను వివాహము చేసుకున్నారు. అన్యులతో వారి సహవాసము వలన సమరయులు చెడిపోయారని, విశ్వాసభ్రష్టులయ్యారని యూదులు భావించారు. సమరయ గుండా వెళ్ళకుండా ఉండడానికి యూదులు తమ మార్గంలో మైళ్ళ దూరం ప్రయాణించేవారు. (లూకా 9:52–54; 17:11–18; యోహాను 4:9; 8:48 కూడా చూడండి.)

కనికరమునకు మరియు పొరుగువానిని ప్రేమించుటకు మాదిరిగా యూదుల చేత ద్వేషించబడిన సమరయుని రక్షకుడు ఎందుకు ఎన్నుకున్నారని మీరనుకుంటున్నారు? ఏమి చేయమని ఈ ఉపమానము మిమ్మల్ని ప్రేరేపిస్తుంది?

మోషైయ 2:17 కూడా చూడండి.

లూకా 10:38–42

నిత్యజీవితమునకు నడిపించు అనుదిన ఎంపికలను చేయుట ద్వారా మనము “ఉత్తమమైనది” ఎన్నుకుంటాము.

ఆమె తన సమయాన్ని గడుపుతున్న విధానం గురించి భిన్నంగా ఆలోచించమని లూకా 10:38–42లో యేసు మృదువుగా మార్తను ఆహ్వానించారు. ఈ వచనాలను వ్యాఖ్యానించిన తర్వాత, సహోదరి కారోల్ ఎఫ్. మెఖాంకి ఇలా బోధించారు: “మనము పరిశుద్ధముగా ఉండాల్సిన యెడల, ఇశ్రాయేలు యొక్క పరిశద్ధుని పాదముల వద్ద కూర్చొనుట మనము నేర్చుకోవాలి మరియు పరిశుద్ధతకు సమయమివ్వాలి. ఫోను, ఎప్పటికి అంతులేని జాబితాను మరియు లోక చింతలను మనం ప్రక్కన పెడుతున్నామా? ప్రార్థన, అధ్యయనము మరియు దేవుని వాక్యమును లక్ష్యముంచుట, మన ఆత్మలలోనికి ఆయన శుద్ధి చేయు మరియు స్వస్థపరచు ప్రేమను ఆహ్వానించును. పరిశుద్ధముగా ఉండుటకు సమయాన్ని మనము తీసుకొందాం, ఆవిధంగా మనము ఆయన పరిశుద్ధమైన మరియు పరిశుద్ధపరచు ఆత్మతో నింపబడతాము” (“పరిశుద్ధాలంకారము,” లియహోనా, మే 2017, 11). మీ సమయాన్ని—మంచి విషయాలపై కూడా మీరెలా గడుపుతున్నారో పరీక్షించాలని మీరు కోరవచ్చు. మీ శ్రద్ధ ఎక్కువగా కావాల్సిన మరింత “అవసరమైనది” (42వ వచనము) ఏదైనా ఉన్నదా?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 18:1-11.ఒక చిన్న బిడ్డవలే మనము మారాలని యేసు ఎందుకు కోరుతున్నారు? మరింతగా క్రీస్తు వలె కావడానికి పిల్లలు కలిగియున్న ఏ సుగుణాలను మనం వృద్ధిచేసుకోగలము? (మోషైయ 3:19 చూడండి).

చిత్రం
పిల్లలతో యేసు

తన శిష్యులు చిన్నపిల్లల వలే కావాలని యేసు కోరారు.

మత్తయి 18:15.మన కుటుంబ సంభాషణలలో మత్తయి 18:15లోని ఉపదేశమును మనము ఎలా అన్వయించగలము? ఈ విధంగా చేయడం మన కుటుంబాన్ని ఏవిధంగా దీవిస్తుంది?

మత్తయి 18:21-35.యేసు క్రీస్తు గురించి ఈ ఉపమానము మనకేమి బోధిస్తుంది? ఇతరులను ఎలా ఆదరించాలి అనే దాని గురించి ఇది మనకు ఏమి బోధిస్తుంది?

లూకా 10:25-37.కుటుంబ సభ్యులు వేషం వేసుకొని, ఈ ఉపమానాన్ని అభినయించడాన్ని ఆనందించవచ్చు. కొన్నిసార్లు ఉపమానములో ఉన్న భిన్నమైన వ్యక్తుల వలె మనము ఎట్లున్నాము? రక్షకుడు మంచి సమరయుని వలె ఎట్లున్నారు? మనము మంచి సమరయుని వలె ఎలా ఉండగలము?

ఈ ఉపమానములోని సత్యమునకు సహకరించే ఒక కీర్తనను లేదా పిల్లల పాటను కలిసి పాడడాన్ని మీరు పరిగణించవచ్చు. ఒక కీర్తనను లేదా పాటను కనుగొని, అది ఈ ఉపమానానికి ఎలా సంబంధం కలిగియుందో వివరించడాన్ని కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు.

లూకా 10:38-42.మీ కుటుంబ ప్రణాళికలో ఆత్మీయ విషయాలను అమర్చుట ఎప్పటికీ కష్టంగా ఉందా? దానిని ఎలా చేయాలో అనే దాని గురించి ఒక కుటుంబ సలహాసభ లేదా గృహ సాయంకాలమును మరియ, మార్త యొక్క వృత్తాంతము ప్రేరేపించగలదు. ఒక కుటుంబముగా, మీరు “ఉత్తమమైనదానిని” (లూకా 10:42) ఎంపిక చేయు విధానముల జాబితాను చేయవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ప్రేమగల వాతావరణమును పెంపొందించండి. కుటుంబ సభ్యులు ఒకరి గురించి ఒకరు భావించే మరియు ఒకరినొకరు ఆదరించే విధానము మీ గృహములో ఆత్మ యొక్క ప్రభావమును అధికంగా ప్రభావితం చేయగలదు. కుటుంబ సభ్యులందరు ప్రేమగల, గౌరవనీయమైన గృహమును స్థాపించడానికి తమ వంతును చేయుటకు సహాయపడండి, ఆవిధంగా ప్రతీఒక్కరు అనుభవాలు, ప్రశ్నలు మరియు సాక్ష్యములను పంచుకోవడానికి క్షేమంగా భావిస్తారు.

చిత్రం
మరియ మరియు మార్తతో క్రీస్తు

మరియ మరియు మార్త ఇంటిలో క్రీస్తు, వాల్టర్ రానె చేత

ముద్రించు