2023 క్రొత్త నిబంధన
మే 8-14. మత్తయి 19–20; మార్కు 10; లూకా 18: “ఇకను నాకు కొదువ ఏమి?”


“మే 8-14. మత్తయి 19-20; మార్కు 10; లూకా 18: ‘ఇకను నాకు కొదువ ఏమి?,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మే 8-14. మత్తయి 19–20; మార్కు 10; లూకా 18,”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ద్రాక్షతోటలో పనివారు

మే 8-14

మత్తయి 19–20; మార్కు 10; లూకా 18

“ఇకను నాకు కొదువ ఏమి?”

మీరు పొందే ప్రేరేపణలపట్ల శ్రద్ధచూపుతూ మత్తయి 19–20; మార్కు 10; మరియు లూకా 18 చదివి, ధ్యానించండి. ఆ ప్రేరేపణలను వ్రాసుకొని, మీరు వాటిపై ఎలా పని చేస్తారో నిర్ణయించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

రక్షకుడిని ఒక ప్రశ్న అడగడానికి మీకు అవకాశం ఉంటే, అది ఏమైయుంటుంది? ఒక ధనిక యౌవనుడు మొదటిసారి రక్షకుడిని కలిసినప్పుడు, “నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను?” అని ఆయనను అడిగాడు. (మత్తయి 19:16). రక్షకుని ప్రతిస్పందన ఆ యౌవనుడు అప్పటికే చేసిన మంచి పనుల పట్ల ప్రశంసను మరియు మరింత చేయడానికి ప్రేమపూర్వక ప్రోత్సాహాన్ని చూపించింది. నిత్యజీవము యొక్క సాధ్యతను మనం ఆలోచించినప్పుడు, మనం కూడా అదేవిధంగా ఇంకా ఎక్కువ చేయాలా అని ఆశ్చర్యపోవచ్చు. “ఇకను నాకు కొదువ ఏమి?” అని మన స్వంత విధానంలో అడిగినప్పుడు (మత్తయి 19:20), ధనిక యౌవనుడికి ఆయన ఇచ్చిన ప్రతిస్పందన వలె వ్యక్తిగతమైన సమాధానాలను ప్రభువు మనకు ఇవ్వగలరు. ప్రభువు మనల్ని ఏమి చేయమని అడిగినా, ఆయన జవాబుపై పనిచేయడానికి మన స్వనీతి కన్నా ఆయనను ఎక్కువగా విశ్వసించాల్సిన అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది (లూకా 18:9–14 చూడండి) మరియు మనం “చిన్నబిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించాలి” (లూకా 18:17; 3 నీఫై 9:22 కూడా చూడండి).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 19:3–9; మార్కు 10:2–12

స్త్రీ పురుషుల మధ్య వివాహం దేవునిచేత నియమించబడింది.

రక్షకునికి మరియు పరిసయ్యులకు మధ్య ఈ ఇచ్చిపుచ్చుకోలు, వివాహం గురించి రక్షకుడు ప్రత్యేకంగా బోధించిన కొన్ని నమోదు చేయబడిన సందర్భాలలో ఒకటి. మత్తయి 19:3–9 మరియు మార్కు 10:2–12 చదివిన తరువాత, వివాహం గురించి ప్రభువు అభిప్రాయాలను సంక్షిప్తము చేస్తాయని మీరు భావిస్తున్న అనేక వ్యాఖ్యానాల జాబితాను రూపొందించండి.  topics.ChurchofJesusChrist.org తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక గురించి మీ జ్ఞానం వివాహం గురించి మీరు ఆలోచించే మరియు భావించే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

మత్తయి 19:3–9; మార్కు 10:2–12

పరిత్యాగము ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని లేదా విడాకులు తీసుకున్నవారు తిరిగి వివాహం చేసుకోకూడదని యేసు బోధించెనా?

విడాకులు గురించిన ప్రసంగంలో, వివాహ సంబంధం శాశ్వతంగా ఉండాలని పరలోక తండ్రి భావిస్తున్నారని అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ బోధించారు. అయినప్పటికీ, కొన్నిసార్లు విడాకులు అవసరమని దేవుడు కూడా అర్థం చేసుకుంటారు. అధ్యక్షులు ఓక్స్ ఇలా వివరించారు, “ఉన్నత ధర్మశాస్త్రంలో పేర్కొన్న అనైతికత మరక లేకుండా మళ్ళీ వివాహం చేసుకోవడానికి విడాకులు తీసుకున్న వ్యక్తులను ప్రభువు అనుమతిస్తారు. విడాకులు తీసుకున్న సభ్యుడు తీవ్రమైన అపరాధములకు పాల్పడితే తప్ప, అతడు లేదా ఆమె ఇతర సభ్యులకు వర్తించే అదే యోగ్యత ప్రమాణాల ప్రకారం దేవాలయ సిఫారసుకు అర్హత పొందవచ్చు” (“Divorce,” Liahona, May 2007, 70).

మత్తయి 19:16–22; మార్కు 10:17–22; లూకా 18:18–23

నేను ప్రభువును అడిగితే, నిత్య జీవాన్ని వారసత్వంగా పొందడానికి నేను ఏమి చేయాలో ఆయన నాకు బోధిస్తారు.

ధనిక యౌవనుడి వృత్తాంతం నమ్మకమైన, జీవితకాల శిష్యునికి కూడా విరామం ఇవ్వగలదు. మీరు మార్కు 10:17–22 చదువుతున్నప్పుడు, ఆ యౌవనుడి విశ్వసనీయత మరియు నిజాయితీకి మీరు ఏ ఆధారాన్ని కనుగొంటారు? ఈ యౌవనుడి గురించి ప్రభువు ఎలా భావించారు?

“ఇకను నాకు కొదువ ఏమి?” అని అడగడానికి ఈ వృత్తాంతము మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. (మత్తయి 19:20). మనకు కొదువగా ఉన్నదానిని సరిచేయడానికి ప్రభువు మనకేవిధంగా సహాయపడతారు? (ఈథర్ 12:27 చూడండి). వృద్ధిచెందాలని మనం కోరినప్పుడు ఆయన దిద్దుబాటును మరియు సహాయాన్ని అంగీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకొనేందుకు మనమేమి చేయగలము?

మత్తయి 20:1–16

సువార్తను ఎప్పుడు అంగీకరించినప్పటికీ, ప్రతి ఒక్కరూ నిత్యజీవ దీవెనను పొందవచ్చు.

ద్రాక్షతోటలోని పనివారిది ఎవరిదైనా అనుభవంతో మీరు పోల్చుకోగలరా? ఈ పాఠ్యభాగంలో మీ కోసం మీరు ఏ పాఠాలు కనుగొంటారు? ఆత్మ మీకు ఏ అదనపు ప్రేరణలు ఇస్తుంది?

చిత్రం
వినయముగల వ్యక్తి మరియు పరిసయ్యుడు

దేవాలయంలో పశ్చాత్తాపపడిన సుంకరి మరియు అహంకారియైన పరిసయ్యుడు, ఫ్రాంక్ ఆడమ్స్ చేత

లూకా 18:9–14

నా స్వంత నీతిని కాకుండా, నేను దేవుని కనికరమును నమ్మాలి.

ఈ ఉపమానములో ఉన్న రెండు ప్రార్థనల మధ్య తేడాలను మీరు ఎలా సంక్షిప్తపరుస్తారు? ఈ కథలోని సుంకరి వలే ఎక్కువగా మరియు పరిసయ్యుని వలె తక్కువగా ఉండుటకు మీరేమి చేయాలని భావిస్తున్నారో ధ్యానించండి.

ఫిలిప్పీయులకు 4:11-13; ఆల్మా 31:12–23; 32:12–16 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మార్కు 10:13-16; లూకా 18:15-17. యేసు దీవించిన పిల్లల మధ్య ఉండడం ఎలా ఉండియుండవచ్చు? “చిన్నబిడ్డ వలె దేవుని రాజ్యము నంగీకరించుట” అనగా అర్థమేమైయుండవచ్చు? (మార్కు 10:15).

మార్కు 10:23-27.ఐశ్వర్యాన్ని కలిగియుండడం మరియు ఐశ్వర్యాన్ని నమ్మడం మధ్యగల తేడా ఏమిటి? (మార్కు 10:23–24 చూడండి). మీరు 27వ వచనం చదివేటప్పుడు, జోసెఫ్ స్మిత్ అనువాదాన్ని మీరు ఎత్తి చూపాలని అనుకోవచ్చు: “ఐశ్వర్యమందు నమ్మకముంచు వారికి అది అసాధ్యము; కానీ దేవుని యందు నమ్మకముంచి నా కొరకు సమస్తమును విడిచిపెట్టువారికి అసాధ్యము కాదు, ఏలయనగా అటువంటి వారందరికి సంగతులు సాధ్యమే” (జోసెఫ్ స్మిత్ అనువాదము, మార్కు 10:26 [మార్కు 10:27, పాదవివరణ లో]). భౌతిక వస్తువుల కంటే ఎక్కువగా మనం యేసు క్రీస్తును నమ్ముతున్నామని ఒక కుటుంబంగా మనమెలా చూపుతున్నాము?

మత్తయి 20:1-16.మత్తయి 20:1–16 లోని సూత్రాలను వివరించడానికి, మీరు ఒక చిన్న పరుగుపందెం వంటి సాధారణ పోటీని ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ పోటీని పూర్తి చేసిన తర్వాత, చివరి స్థానంలో నిలిచిన వ్యక్తితో ప్రారంభించి, మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి వరకు అందరికీ ఒకే బహుమతిని ప్రదానం చేయండి. పరలోక తండ్రి ప్రణాళికలో నిత్యజీవపు దీవెనలను ఎవరు పొందుతారు అనే దాని గురించి ఇది మనకు ఏమి బోధిస్తుంది?

మత్తయి 20:25-28; మార్కు 10:42–45.“మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ వలెను” అనే వాక్యభాగానికి అర్థమేమిటి? (మత్తయి 20:27). ఈ సూత్రానికి యేసు క్రీస్తు ఎలా నిదర్శనమయ్యారు? మన కుటుంబం, మన వార్డు లేదా శాఖ మరియు మన ఇరుగుపొరుగులో ఆయన మాదిరిని మనమెలా అనుసరించగలము?

లూకా 18:1-14.ఈ వచనాలలో ఉన్న రెండు ఉపమానాల నుండి ప్రార్థన గురించి మనం ఏమి నేర్చుకుంటాము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీకు అనుకూలంగా ఉండే సమయాన్ని కనుగొనండి. మీరు లేఖనాలను అంతరాయం లేకుండా అధ్యయనం చేయగలిగినప్పుడు నేర్చుకోవడం తరచు చాలా సులభమవుతుంది. మీకు అనుకూలంగా ఉండే సమయాన్ని కనుగొనండి మరియు ప్రతి రోజు ఆ సమయంలో స్థిరంగా అధ్యయనం చేయడానికి మీ వంతు కృషి చేయండి.

చిత్రం
క్రీస్తు మరియు ధనిక యౌవనుడు

క్రీస్తు మరియు ధనికుడైన యౌవన అధికారి, హీన్రిచ్ హాఫ్‌మన్ చేత

ముద్రించు