2023 క్రొత్త నిబంధన
మే 1-7. లూకా 12–7; యోహాను 11: “మీరు నాతో కూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినది”


“మే 1-7. లూకా 12–17; యోహాను 11: ‘మీరు నాతో కూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మే 1-7. లూకా 12–7; యోహాను 11,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
తన కుమారుడిని హత్తుకొంటున్న మనుష్యుడు

తప్పిపోయిన కుమారుడు, లిజ్ లెమన్ స్విండిల్ చేత

మే 1-7

లూకా 12–7; యోహాను 11

“మీరు నాతో కూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినది”

మీరు లూకా 12–17 మరియు యోహాను 11 చదువుతున్నప్పుడు, మీరు తెలుసుకోవాలని మరియు చేయాలని పరలోక తండ్రి కోరిన దానిని ప్రార్థనాపూర్వకంగా వెదకండి. ఈ అధ్యాయములను గూర్చిన మీ అధ్యయనము మీ కొరకు ఉద్దేశించబడిన సందేశాలకు మీ హృదయాన్ని తెరవగలదు.

మీ మనోభావాలను నమోదు చేయండి

అనేక సందర్భాలలో, 100లో 99 శ్రేష్ఠమైనవిగా భావించబడతాయి—కానీ అలాంటి సంఖ్యలు దేవుని ప్రియమైన పిల్లల విషయంలో పనికిరావు (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10 చూడండి). ఆ సందర్భములో, తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానములో రక్షకుడు బోధించిన విధంగా, ఒక్క ఆత్మ కూడా “అది [మనకు] దొరకు వరకు” (లూకా 15:4) సమగ్రమైన, తీరని అన్వేషణకు యోగ్యమైనది. అప్పుడు సంతోషము ప్రారంభమగును, ఏలయనగా “మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును” (లూకా 15:7). అది అన్యాయముగా కనబడిన యెడల, నిజానికి “మారుమనస్సు అక్కరలేని” వారెవరూ లేరని జ్ఞాపకముంచుకొనుట సహాయపడుతుంది. మనందరం రక్షించబడాల్సిన అవసరం ఉన్నది. రక్షించబడిన ప్రతీ ఆత్మ గురించి కలిసి సంతోషిస్తూ, మనమందరం రక్షించుటలో పాల్గొనగలము (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:15–16 చూడండి).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత అధ్యయనము కొరకు ఉపాయములు

లూకా 12; 14–16

నిత్య విషయాలపై నా హృదయమును ఉంచినప్పుడు, నేను దీవించబడ్డాను.

కష్టపడి పనిచేస్తూ, విజయవంతమై, గొప్ప కొట్లు కట్టించి, వాటిని తన కష్ట ఫలముతో నింపిన వానిని “వెఱ్ఱివాడా” అని దేవుడు ఎందుకు అన్నాడు? (లూకా 12:16–21 చూడండి). లూకాలోని ఈ అధ్యాయాలలో, లోకమును మించి నిత్యమునకు మన దృష్టిని పైకెత్తుటకు మనకు సహాయపడునట్లు రక్షకుడు కొన్ని ఉపమానాలను బోధించారు. ఈ ఉపమానములలో కొన్ని ఇక్కడ వరుసగా ఇవ్వబడినవి. ప్రతీ ఒక్క సందేశమును మీరు ఎలా సంక్షిప్తపరుస్తారు? ప్రభువు మీకు ఏమి చెప్తున్నారని మీరనుకుంటున్నారు?

మత్తయి 6:19–34; 2 నీఫై 9:30; సిద్ధాంతము మరియు నిబంధనలు 25:10 కూడా చూడండి.

లూకా 15

తప్పిపోయిన వారు కనుగొనబడినప్పుడు పరలోక తండ్రి సంతోషించును.

లూకా 15లో యేసు బోధించిన ఉపమానాలను మీరు చదువుతున్నప్పుడు, పాపము చేసిన వారు లేదా మరొకవిధంగా “తప్పిపోయిన” వారి గురించి పరలోక తండ్రి ఎలా భావిస్తారనే దాని గురించి మీరేమి నేర్చుకుంటారు? వారి గురించి ఒక ఆధ్యాత్మిక నాయకుడు—లేదా మనలో ఎవరైనా ఎలా భావించాలి? పరిసయ్యులు మరియు శాస్త్రులు ఈ ప్రశ్నలకు ఎలా జవాబిచ్చేవారో పరిగణించండి ( (లూకా 15: 1– 2 చూడండి). లూకా 15లో ఉన్న మూడు ఉపమానాలలో యేసు స్పందన కనుగొనబడగలదు. మీరు చదువుతున్నప్పుడు, ఈ ఉపమానాలతో యేసు శాస్త్రులకు, పరిసయ్యులకు ఏమి బోధిస్తున్నారో ఆలోచించండి.

ఈ ఉపమానముల మధ్య పోలికలు మరియు తేడాల జాబితాను చేయుటను కూడా మీరు పరిగణించవచ్చు. ఉదాహరణకు, ప్రతి ఉపమానంలో ఏమి తప్పిపోయినది, ఎందుకు తప్పిపోయినది, అది ఎలా కనుగొనబడింది మరియు అది కనుగొనబడినప్పుడు జనులు ఎలా స్పందించారో మీరు గుర్తించవచ్చు. వారు తప్పిపోయారని అనుకోని వారిని కలిపి—“తప్పిపోయిన” వారి కొరకు యేసు ఏ సందేశాలను కలిగియున్నారు? తప్పిపోయిన వారిని వెదకు జనుల కొరకు ఆయన కలిగియున్న సందేశాలేవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–16 కూడా చూడండి.

చిత్రం
నాణెము కొరకు వెదుకుతున్న స్త్రీ

పొగొట్టుకొనబడిన వెండి నాణెము, జేమ్స్ టిస్సాట్ చేత

లూకా 16:1–12

అన్యాయస్థుడైన గృహనిర్వాహకుని ఉపమానములో క్రీస్తు బోధిస్తున్నదేమిటి?

ఉపమానము నుండి మనము నేర్చుకోగల ఒక పాఠమును ఎల్డర్ జేమ్స్ ఈ. టాల్మేజ్ వివరించారు: “శ్రద్ధ కలిగియుండుము; మీ భూలోక సంపదలను మీరు ఉపయోగించగల రోజు త్వరలోనే గడిచిపోతుంది. నిజాయితీలేనివాడు మరియు దుష్టుని నుండి కూడా ఒక పాఠము నేర్చుకొనుము; వారు ఆలోచించే ఏకైక భవిష్యత్తును అందించేంత జాగ్రత్తపరులైతే, నిత్య భవిష్యత్తును విశ్వసించే మీరు ఇంకా ఎంత ఎక్కువ అందించాలి! ‘అన్యాయపు సిరిని’ ఉపయోగించుటలో తెలివిని, వివేకమును మీరు నేర్చుకోని యెడల, మరింత శాశ్వతమైన సంపదలు ఉపయోగించుటలో మీరు ఎలా విశ్వసించబడతారు? (Jesus the Christ[1916], 464). ఈ ఉపమానములో మీరు కనుగొన్న ఇతర పాఠాలు ఏవి?

లూకా 17:11-19

నా దీవెనల కొరకు కృతజ్ఞత నన్ను దేవునికి దగ్గరగా తెస్తుంది.

పదిమంది కుష్ఠురోగులలో మీరు ఒకరైతే, రక్షకునికి ధన్యవాదాలు తెలుపుటకు మీరు తిరిగి వెళ్ళియుండవచ్చని మీరనుకుంటున్నారా? అతడు ధన్యవాదాలు తెలిపాడు కనుక, కృతజ్ఞుడైన కుష్ఠురోగి పొందిన అదనపు దీవెనలేవి?

“నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” (19వ వచనము) అనే రక్షకుని మాటలను కూడా మీరు ధ్యానించవచ్చు. మీ అభిప్రాయంలో కృతజ్ఞతకు, విశ్వాసానికి గల సంబంధమేమిటి? మనం స్వస్థపరచబడడానికి ఈ రెండూ ఎలా సహాయపడతాయి?

యోహాను 11:1–46

యేసు క్రీస్తే పునరుత్థానము మరియు జీవము.

లాజరును మరణము నుండి లేపిన అద్భుతము శక్తివంతమైనది మరియు యేసు నిజముగా దేవుని కుమారుడని, వాగ్దానము చేయబడిన మెస్సీయ అని తిరస్కరించ వీలులేని సాక్ష్యము. యోహాను 11:1–46 లోని ఏ మాటలు, వాక్యభాగములు లేదా వివరణలు యేసు క్రీస్తే “పునరుత్థానము మరియు జీవము” అనే మీ విశ్వాసమును బలపరుస్తాయి? మీ ఉద్దేశ్యములో యేసే “పునరుత్థానము మరియు జీవము” అనగా అర్థమేమిటి?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

లూకా 15:1-10.ఏదైనా పొగొట్టుకొనుట—లేదా తప్పిపోవుట ఎలా ఉంటుందో మీ కుటుంబ సభ్యులు గ్రహించారా? వారి అనుభవాలను గూర్చి మాట్లాడుట తప్పిపోయిన గొఱ్ఱె మరియు పోగొట్టుకొనబడిన నాణెము యొక్క ఉపమానములను గూర్చిన చర్చను ప్రారంభించవచ్చు. లేదా మీరు ఒక ఆట ఆడవచ్చు, దానిలో ఎవరైనా ఒకరు దాక్కొని, మిగిలిన కుటుంబ సభ్యులు అతడు లేదా ఆమెను వెదకడానికి ప్రయత్నించవచ్చు. ఈ ప్రోత్సాహ కార్యక్రమము ఈ ఉపమానములను గ్రహించుటకు మనకు ఎలా సహాయపడుతుంది?

లూకా 15:11-32.తప్పిపోయిన ప్రియమైన వారిని మనము కలిగియున్నప్పుడు, ఈ వృత్తాంతములోని తండ్రివలే మనము ఎలా ఉండగలము? క్రీస్తువలె ఎక్కువగా ఉండుటకు సహాయపడేలా పెద్ద కుమారుని యొక్క అనుభవము నుండి మనము ఏమి నేర్చుకోగలము? ఈ ఉపమానములో తండ్రి ఏ విధాలుగా మన పరలోక తండ్రి వలె ఉన్నాడు?

లూకా 17:11-19.పదిమంది కుష్ఠు రోగుల వృత్తాంతమును అన్వయించుటకు కుటుంబ సభ్యులకు సహాయపడేందుకు, ఒకరి కోసం ఒకరు కృతజ్ఞతగల మాటలను వ్రాసియుంచమని వారిని మీరు ఆహ్వానించవచ్చు. మీ కుటుంబము పొందిన దీవెనల జాబితాను కూడా మీరు చేయవచ్చు.

యోహాను 11:1-46.కుటుంబ సభ్యులు యేసు క్రీస్తును గూర్చి వారి సాక్ష్యములను పంచుకోవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

సువార్త సూత్రములను బోధించుటకు వృత్తాంతములు మరియు మాదిరులను ఉపయోగించండి. కథలు మరియు ఉపమానములను ఉపయోగించుట ద్వారా సువార్త సూత్రములను గూర్చి రక్షకుడు తరచుగా బోధించారు. మీ జీవితం నుండి, మీ కుటుంబం కొరకు ఒక సువార్త సూత్రాన్ని సజీవంగా చేయగల ఉదాహరణలు మరియు కథల గురించి ఆలోచించండి.

చిత్రం
యేసు యెదుట మోకరించి కృతజ్ఞత తెలుపుతున్న మనుష్యుడు

తొమ్మిదిమంది ఎక్కడున్నారు, లిజ్ లెమన్ స్విండిల్ చేత

ముద్రించు