2023 క్రొత్త నిబంధన
మే 15-21. మత్తయి 21–23; మార్కు 11; లూకా 19–20; యోహాను12: “ఇదిగో, నీ రాజు వచ్చుచున్నాడు”


“మే 15-21. మత్తయి 21–23; మార్కు 11; లూకా 19–20; యోహాను12: ‘ఇదిగో, నీ రాజు వచ్చుచున్నాడు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మే 15-21. మత్తయి 21–23; మార్కు 11; లూకా 19–20; యోహాను12,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
యేసు సమీపించినప్పుడు చెట్టుపై ఉన్న మనుష్యుడు

మేడి చెట్టుపై జెక్కయ్య, జేమ్స్ టిస్సాట్ చేత

మే 15-21

మత్తయి 21–23; మార్కు 11; లూకా 19–20; యోహాను 12

“ఇదిగో, నీ రాజు వచ్చుచున్నాడు”

ఈ సారాంశములోని ఉపాయములను చదవకముందు, మత్తయి 21–23; మార్కు 11; లూకా 19–20; మరియు యోహాను 12 చదవండి. మీ కుటుంబముతో లేదా మీ సంఘ తరగతులలో మీరు పంచుకోగల మనోభావాలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

బేతనియ నుండి యెరూషలేముకు ప్రయాణించిన తరువాత రక్షకుడు ఆకలిగొనెను మరియు దూరములో అంజూరపు చెట్టు ఆహారానికి ఆధారముగా కనబడింది. కానీ యేసు చెట్టును సమీపించినప్పుడు, అది ఫలించలేదని ఆయన కనుగొనెను (మత్తయి 21:17–20; మార్కు 11:12–14, 20 చూడండి). ఒక విధానములో, అంజూరపు చెట్టు యెరూషలేములోని వేషధారులైన మత నాయకుల వలె ఉన్నది: పరిశుద్ధతను గూర్చి వారి శూన్య బోధనలు మరియు బాహ్య ప్రదర్శనలు ఏ ఆత్మీయ పోషణను ఇవ్వలేదు. పరిసయ్యులు మరియు శాస్త్రులు అనేక ఆజ్ఞలను పాటించినట్లు కనబడినప్పటికీ, రెండు గొప్ప ఆజ్ఞలను కోల్పాయారు: దేవుడిని ప్రేమించుట మరియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట (మత్తయి 22:34–40; 23:23 చూడండి).

దానికి విరుద్ధంగా, అనేకమంది జనులు యేసు యొక్క బోధనలలో మంచి ఫలమును గుర్తించసాగారు. ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు, వారు చెట్ల కొమ్మలను కత్తిరించి, ఆయన మార్గములో పరిచి, “మీ రాజు వచ్చుచున్నాడు” (జెకర్యా 9:9) అనే ప్రాచీన ప్రవచనము చెప్పినట్లుగా చివరికి ఆనందిస్తూ ఆయనకు స్వాగతమిచ్చారు. ఈ వారము మీరు చదివినప్పుడు, రక్షకుని బోధనల ఫలములను గూర్చి, మీ జీవితంలో ప్రాయశ్చిత్త త్యాగమును గూర్చి మరియు “విస్తారముగా ఫలమును” (యోహాను 12:24) మీరు ఎలా తేగలరనే దాని గురించి ఆలోచించండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

లూకా 19:1-10

ప్రభువు బాహ్య ఆకారమును బట్టి కాదు, గాని హృదయపు కోరికలను బట్టి తీర్పు తీర్చును.

యేసు కాలములో, సుంకరులు లేదా సుంకపు గుత్తదారులు అవినీతిపరులని, జనుల నుండి దొంగిలిస్తారని అనేకమంది జనులు ఊహించారు. కనుక సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ధనికుడైనందున అతడు ఎక్కువగా అనుమానించబడ్డాడు. కానీ యేసు జక్కయ్య హృదయములోనికి చూసెను. జక్కయ్య హృదయము గురించి లూకా 19:1–10 ఏమి బయల్పరచును? రక్షకునిపట్ల తన భక్తిని చూపుటకు జక్కయ్య చేసిన దానిని వర్ణించునట్లు ఈ వచనములలోని మాటలను మీరు గుర్తించవచ్చు. మీ హృదయపు కోరికలు ఏవి? జక్కయ్య వలె, రక్షకుని వెదకుటకు మీరు ఏమి చేస్తున్నారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 137:9 కూడా చూడండి.

మత్తయి 23; లూకా 20:45-47

వేషధారణను యేసు ఖండించును.

జక్కయ్యతో పరస్పర సంభాషణకు వ్యతిరేకంగా శాస్త్రులు మరియు పరిసయ్యులతో రక్షకుని పరస్పర సంభాషణ ఆసక్తికరమైన తేడాను రూపించును. అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ ఇలా వివరించారు, “వారు ఆశీర్వదించాల్సిన జనులను ఎల్లప్పుడూ హింసించుచూ, లోకము యొక్క స్తుతి, ప్రభావము మరియు ఐశ్వర్యమును గెలుచుటకు నీతిమంతులుగా కనబడుటకు ప్రయత్నించిన—శాస్త్రులు, పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు వంటి వేషధారులకు వ్యతిరేకంగా [యేసు] నీతిగల కోపముతో పైకి లేచాడు” (“On Being Genuine,” Liahona, May 2015, 81).

మత్తయి 23లో, వేషధారణను వర్ణించుటకు రక్షకుడు అనేక రూపకములను ఉపయోగించారు. ఈ ఉపమానములను గుర్తించుట లేక వరుసగా వ్రాయుట, వేషధారణ గురించి అవి చెప్పేదానిని గుర్తించుటకు ఆలోచించండి. సువార్తను జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు, మనమందరం వ్యవహరించే మానవ బలహీనతలు మరియు వేషధారణ మధ్య గల తేడా ఏమిటి? రక్షకుని బోధనల వలన మీరేమి భిన్నంగా చేయడానికి ప్రేరేపించబడ్డారు?

మత్తయి 21:1-11; మార్కు 11:1-11; లూకా 19:29-44; యోహాను 12:1–8, 12–16

యేసు క్రీస్తు నా రాజు.

యేసు తన ప్రాయశ్చిత్తమును సాధించడానికి కొన్ని రోజుల ముందు ఆయన యెరూషలేముకు చేరుకున్నప్పుడు, వారి రాజుగా ఆయనను గుర్తించిన వారు యెరూషలేములోనికి ఆయన మార్గము వెంబడి దుస్తులను, ఖర్జూరపుమట్టలను వేసి, స్తుతులు చెల్లిస్తూ, ఆయనను అభిషేకించుట ద్వారా వారి భక్తిని చూపారు. రక్షకుని జీవితములో చివరి వారమును ప్రారంభించిన సంఘటనలను గూర్చి మీ గ్రహింపును క్రింది వనరులు ఎలా అధికం చేయగలవో ఆలోచించండి.

  • ఒక రాజును అభిషేకించుట యొక్క ప్రాచీన మాదిరి: 2 రాజులు 9:1–6, 13

  • విజయవంతమైన ప్రవేశమును గూర్చి ఒక ప్రాచీన ప్రవచనము: జెకర్యా 9:9

  • హోసన్న అను పదమునకు అర్థము: లేఖనదీపికలో (scriptures.ChurchofJesusChrist.org) “హోసన్న

  • రక్షకుడు మరలా ఎలా తిరిగి వస్తారనే దాని గురించి ప్రవచనాలు: ప్రకటన 7:9-12

మీ ప్రభువుగా మరియు రాజుగా రక్షకుడిని మీరు ఎలా గౌరవించి, స్వీకరిస్తారు?

మత్తయి 22:34–40

రెండు గొప్ప ఆజ్ఞలేవనగా, దేవుడిని ప్రేమించుట మరియు నా వలె ఇతరులను ప్రేమించుట.

యేసు క్రీస్తును అనుసరించుటకు మీరు ప్రయాసపడినప్పుడు మీరు ఎప్పుడైనా నిష్పలంగా భావించిన యెడల, మత్తయి 22 లో న్యాయవాదితో రక్షకుని మాటలు మీ శిష్యత్వమును సరళీకృతం చేసి, దానిపై దృష్టిసారించుటకు మీకు సహాయపడగలవు. దీనిని చేయడానికి ఇక్కడ ఒక విధానమున్నది: ప్రభువు యొక్క ఆజ్ఞలలో అనేకమును జాబితా చేయండి. మీ జాబితాలోని ప్రతిది రెండు గొప్ప ఆజ్ఞలతో ఎలా సంబంధం కలిగియుంది? రెండు గొప్ప ఆజ్ఞలపై దృష్టిసారించుట మిగిలిన వాటిని పాటించుటకు మీకు ఎలా సహాయపడుతుంది?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 21:12-14.ఆయన దేవాలయం గురించి ఎలా భావించారనే దానిని మత్తయి 21:12–14లో యేసు యొక్క మాటలు మరియు క్రియలు ఎలా చూపుతాయి? దేవాలయం గురించి మనం ఎలా భావిస్తున్నామనే దానిని మనమెలా చూపుతాము? మన ఇంటిని ఎక్కువగా దేవాలయంవలె మార్చడానికి మన జీవితాలలో నుండి దేనిని మనం “వెళ్ళగొట్టగలము” (12వ వచనము)?

మత్తయి 21:28-32.ఇద్దరు కుమారులుగల మనుష్యుని యొక్క ఉపమానమునుండి ఏ పాఠములు మీ కుటుంబానికి సహాయపడవచ్చు? ఉదాహరణకు, నిజాయితీగల విధేయత మరియు పశ్చాత్తాపము యొక్క ప్రాముఖ్యతను చర్చించుటకు ఈ కథను మీరు ఉపయోగించవచ్చు. బహుశా మీ కుటుంబము ఉపమానమును అభినయించుటకు సంభాషణలను వ్రాయవచ్చు మరియు వేర్వేరు పాత్రలను వంతులవారీగా నటించవచ్చు.

మత్తయి 22:15-22; లూకా 20:21-26.యేసు యొక్క “రూపమును పైవ్రాతయు” గల నకిలీ నాణాలను తయారు చేయడాన్ని పిల్లలు ఆనందించవచ్చు. మనము ఆయనకు ఇవ్వగలిగిన “దేవునివి అన్న విషయాలలో” (మత్తయి 22:21) కొన్నిటిని వారు నాణాల వెనుకవైపు వ్రాయవచ్చు. మనపై రక్షకుని “రూపమును పైవ్రాతయు” కలిగియుండడమనగా అర్థమేమిటనే దాని గురించి కూడా మీరు మాట్లాడవచ్చు (మత్తయి 22:20; మోషైయ 5:8; ఆల్మా 5:14 కూడా చూడండి).

యోహాను 12:1-8.మరియ రక్షకుని కొరకు తన ప్రేమను ఎలా చూపింది? ఆయన కొరకు మన ప్రేమను మనము ఎలా చూపగలము?

చిత్రం
యేసు పాదములను తన వెంట్రుకలతో తుడుస్తున్న స్త్రీ

యేసు పాదములను కడుగుట, బ్రైయన్ కాల్ చేత

యోహాను 12:42-43.క్రీస్తుయందు మన నమ్మకమును తెలుపుట లేదా కాపాడుట నుండి కొన్నిసార్లు మనల్ని నిరాశపరచే సామాజిక పర్యవసానములేవి? సామాజిక ఒత్తిడికి లోబడని జనుల యొక్క మాదిరుల కొరకు దానియేలు 1:3–20; 3; 6; యోహాను 7:45–53; 9:1–38; మరియు మోషైయ 17:1–4 చూడండి. వారి మత విశ్వాసములను వ్యక్తపరచినప్పుడు లేదా కాపాడినప్పుడు ఇతరులపట్ల గౌరవమును మనము ఎలా చూపగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

కుటుంబ సభ్యులను నిమగ్నము చేయడానికి కళను ఉపయోగించండి.ChurchofJesusChrist.org వద్ద The Gospel Art Book (సువార్త కళా గ్రంథము) మరియు the Gospel Media Library భావనలు లేదా సంఘటనలను దృశ్యీకరించుటకు [మీ కుటుంబముకు] సహాయపడగల చిత్రములు మరియు వీడియోలను కలిగియున్నది” (Teaching in the Savior’s Way, 22).

చిత్రం
క్రీస్తు యొక్క విజయవంతమైన ప్రవేశము

విజయవంతమైన ప్రవేశము, వాల్టర్ రానె చేత

ముద్రించు