2023 క్రొత్త నిబంధన
మే 22–28. జోసెఫ్ స్మిత్—మత్తయి 1; మత్తయి 24–25; మార్కు 12–13; లూకా 21: “మనుష్యకుమారుడు వచ్చును”


“మే 22–28. జోసెఫ్ స్మిత్—మత్తయి 1; మత్తయి 24–25; మార్కు 12–13; లూకా 21: ‘మనుష్యకుమారుడు వచ్చును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మే 22–28. జోసెఫ్ స్మిత్—మత్తయి 1; మత్తయి 24–25; మార్కు 12–13; లూకా 21,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
రెండవ రాకడ

రెండవ రాకడ, హ్యారీ ఆండర్సన్ చేత

మే 22–28

జోసెఫ్ స్మిత్—మత్తయి 1; మత్తయి 24–25; మార్కు12–13; లూకా 21

“మనుష్యకుమారుడు వచ్చును”

జోసెఫ్ స్మిత్—మత్తయి 1; మత్తయి 24–25; మార్కు 12–13; మరియు లూకా 21 మీరు చదివినప్పుడు, “నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిలుపు కొరకు ఈ అధ్యాయాలు ఏ సందేశాలను కలిగియున్నాయి?” అని మీరు అడుగవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు యొక్క శిష్యులకు ఆయన ప్రవచనము ఆశ్చర్యాన్ని కలిగించియుండవచ్చు: యెరూషలేము యొక్క శక్తివంతమైన దేవాలయము, యూదుల యొక్క ఆత్మీయ మరియు సాంస్కృతిక కేంద్రము ఎంతగా నాశనము చేయబడతాయనగా, “రాతిమీద రాయి ఒకటియైనను అక్కడ నిలిచియుండకుండా పడద్రోయబడును.” సహజంగానే శిష్యులు ఎక్కువగా తెలుసుకొనగోరారు. “ఈ సంగతులు ఎప్పుడు జరుగును?” “నీ రాకడకు సూచనలేవి?” అని వారడిగారు. (జోసెఫ్ స్మిత్—మత్తయి1:2–4). యెరూషలేముకు రాబోతున్న గొప్ప వినాశనము—క్రీ.శ. 70 లో నెరవేరిన ఒక ప్రవచనము—అంత్య దినములలో ఆయన రాకడ యొక్క సూచనలతో పోల్చితే చాలా తక్కువగా ఉండునని రక్షకుని జవాబులు బయల్పరిచాయి. యెరూషలేములోని దేవాలయము కంటే నిలకడయైనవిగా కనిపించే—సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేశాలు మరియు సముద్రము కూడా తాత్కాలికమైనవిగా నిరూపించబడతాయి. “ఆకాశమందలి శక్తులు కదిలింపబడును” (జోసెఫ్ స్మిత్—మత్తయి 1:33). మనము ఆత్మీయముగా యెరిగియున్నట్లయితే, నిజంగా శాశ్వతమైన దానియందు మన నమ్మకమును ఉంచాలని ఈ కల్లోలము మనకు బోధించగలదు. యేసు వాగ్దానమిచ్చినట్లుగా, “భూమియు ఆకాశమును గతించినను, నా మాటలు ఏ మాత్రము గతింపవు. … నా మాటలను తన హృదయమందు భద్రపరచుకొనువాడు మోసగించబడడు” (జోసెఫ్ స్మిత్—మత్తయి 1:35, 37).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఏమిటి ఈ జోసెఫ్ స్మిత్—మత్తయి?

అమూల్యమైన ముత్యములో ఉన్న జోసెఫ్ స్మిత్—మత్తయి అనునది మత్తయి 23 యొక్క చివరి వచనము మరియు మత్తయి 24 మొత్తము యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదము. కోల్పోబడిన విలువైన సత్యాలను జోసెఫ్ స్మిత్ యొక్క ప్రేరేపిత సవరణలు పునరుద్ధరిస్తాయి. 12–21 వచనాలు పూర్వకాలమందు యెరూషలేము నాశనమును సూచిస్తాయి; 21–55 వచనాలు అంత్య దినముల గురించి ప్రవచనాలను కలిగియున్నాయి.

జోసెఫ్ స్మిత్—మత్తయి 1:21–37; మార్కు 13:21–37; లూకా 21:25–38

రక్షకుని రెండవ రాకడ గురించిన ప్రవచనాలు విశ్వాసముతో భవిష్యత్తును ఎదుర్కోవడానికి నాకు సహాయపడగలవు.

యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు దారితీసే సంఘటనల గురించి చదవడం కలవరపెట్టవచ్చు. కానీ ఈ సంఘటనల గురించి యేసు ప్రవచించినప్పుడు, “కలవరపడకుడి” అని ఆయన తన శిష్యులతో చెప్పారు (జోసెఫ్ స్మిత్—మత్తయి 1:23). భూకంపాలు, యుద్ధాలు, మోసాలు, కరువుల గురించి వినినప్పుడు, మీరు “కలవరపడకుండా” ఎలా ఉండగలరు? మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మీరు కనుగొనే తిరిగి హామీనిచ్చు సలహాను గుర్తించండి లేదా వ్రాయండి.

జోసెఫ్ స్మిత్—మత్తయి 1:26–27, 38–55; మత్తయి 25:1–13; లూకా 21:29–36

రక్షకుని రెండవ రాకడ కొరకు నేను ఎల్లప్పుడు తప్పక సిద్ధంగా ఉండాలి.

“మనుష్యకుమారుడు వచ్చు దినమైనను గడియయైనను” దేవుడు బయల్పరచలేదు (మత్తయి 25:13). కానీ ఆ దినము మన మీదికి “అకస్మాత్తుగా” రావాలని ఆయన కోరలేదు (లూకా 21:34), కావున ఎలా సిద్ధపడాలనే దాని గురించి ఆయన మనకు సలహా ఇచ్చారు.

మీరు ఈ వచనాలను చదివినప్పుడు, ఆయన రెండవ రాకడ కొరకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని మనకు బోధించడానికి రక్షకుడు ఉపయోగించిన ఉపమానాలు మరియు ఇతర పోలికలను గుర్తించండి. వాటి నుండి మీరేమి నేర్చుకుంటారు? ఏమి చేయడానికి మీరు ప్రేరేపించబడ్డారు?

ఆయన రెండవ రాకడ కొరకు లోకాన్ని సిద్ధపరచడానికి మీరు ఏ విధంగా సహాయపడాలని రక్షకుడు కోరుతున్నారనే దాని గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. రక్షకుడు వచ్చినప్పుడు ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా ఉండడమంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు?

మత్తయి 25:14–30

ఆయన బహుమానాలను నేను తెలివిగా ఉపయోగించాలని పరలోక తండ్రి ఆశిస్తున్నారు.

రక్షకుని ఉపమానంలో, ఒక “తలాంతు” డబ్బును సూచిస్తున్నది. కానీ తలాంతుల గురించిన ఉపమానము, కేవలం డబ్బు కాకుండా మన దీవెనలలో వేటినైనా మనమెలా ఉపయోగిస్తున్నామో ధ్యానించడానికి మనల్ని ప్రేరేపించగలదు. ఈ ఉపమానాన్ని చదివిన తర్వాత, పరలోక తండ్రి మిమ్మల్ని నమ్మి ఇచ్చిన దీవెనలు మరియు బాధ్యతలలో కొన్నింటిని మీరు జాబితా చేయవచ్చు. ఈ దీవెనలతో మీరు ఏమి చేయాలని ఆయన ఆశిస్తున్నారు? ఈ బహుమానాలను మరింత తెలివిగా మీరెలా ఉపయోగించగలరు?

మత్తయి 25:31–46

నేను ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు, నేను దేవుడిని సేవిస్తున్నాను.

మీ జీవితాన్ని ప్రభువు ఎలా తీర్పుతీరుస్తారని మీరు ఆలోచించినట్లయితే, గొఱ్ఱె మరియు మేకల ఉపమానాన్ని చదవండి. అవసరంలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపడం దేవుని “రాజ్యమును స్వతంత్రించుకొనుటకు” మిమ్మల్ని సిద్ధపరచడంలో సహాయపడుతుందని మీరెందుకు అనుకుంటున్నారు?

ఈ ఉపమానం మత్తయి 25 లో ఉన్న మరో రెండిటిని ఎలా పోలియున్నది? మూడు ఉమ్మడిగా కలిగియున్న సందేశాలేవి?

మోషైయ 2:17; 5:13 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

జోసెఫ్ స్మిత్—మత్తయి. ఈ అధ్యాయాన్ని పరిశోధించడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, ఆయన రెండవ రాకడకు మనమెలా సిద్ధపడగలమనే దాని గురించి రక్షకుని బోధనల కొరకు చూడమని వారిని ఆహ్వానించండి (ఉదాహరణకు, 22–23, 29–30, 37, 46–48 వచనాలు చూడండి). ఈ సలహాను అనుసరించడానికి మనమేమి చేయగలము? రక్షకుని రెండవ రాకడ ఎలా ఉంటుందనే వారి ఊహను బొమ్మలుగా చిత్రించడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు.

జోసెఫ్ స్మిత్—మత్తయి 1:22, 37.దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవడమంటే అర్థమేమిటి? వ్యక్తిగతంగా మరియు ఒక కుటుంబంగా దీనిని మనమెలా చేయగలము? ఆ విధంగా చేయడం మోసాన్ని తప్పించుకోవడానికి మనకెలా సహాయపడుతుంది?

మత్తయి 25:1–13.మత్తయి 25:1–13 చర్చించడానికి ఈ సారాంశముతో పాటు ఉన్న పది కన్యకల చిత్రాన్ని మీరు ఉపయోగించవచ్చు. ఈ వచనాలలో వర్ణించబడిన ఏ వివరాలను ఈ చిత్రములో మనం చూస్తున్నాము?

మీరు ఒక కాగితాన్ని నూనె చుక్కల ఆకారంలో కత్తిరించి, మీ ఇంటి చుట్టూ దాచియుంచవచ్చు. చుక్కలను మీరు లేఖనలు లేదా దేవాలయ చిత్రం వంటి వస్తువులతో జతచేసి ఉంచవచ్చు. కుటుంబ సభ్యులు చుక్కలను కనుగొనినప్పుడు, ఈ వస్తువులు రెండవ రాకడకు సిద్ధపడేందుకు మనకెలా సహాయపడతాయో మీరు చర్చించవచ్చు.

మార్కు 12:38–44; లూకా 21:1–4.రక్షకుడు మన అర్పణలను ఎలా చూస్తారనే దాని గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి? దశమభాగము మరియు ఉపవాస అర్పణలను ప్రభువుకు ఎలా చెల్లించాలో మీ కుటుంబానికి చూపండి. దేవుని రాజ్యమును నిర్మించుటకు ఈ అర్పణలు ఎలా సహాయపడతాయి? “(మనకు కలిగినది) అంతయు” ప్రభువుకు మనం అర్పించగల మరికొన్ని విధానాలేవి? (మార్కు 12:44).

చిత్రం
డబ్బాలో నాణెమును వేస్తున్న స్త్రీ

విధవరాలి కాసు, శాండ్రా రాస్ట్ చేత

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీ పరిసరాలను సిద్ధం చేయండి. “సత్యమును నేర్చుకొని, అనుభవించుటలో మన సామర్థ్యమును మన పరిసరాలు చాలా లోతుగా ప్రభావితం చేయగలవు” (Teaching in the Savior’s Way15). లేఖనాలను అధ్యయనం చేయడానికి పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఆహ్వానించే ప్రదేశాన్ని కనుగొనేందుకు ప్రయత్నించండి. ఉన్నతమైన సంగీతము మరియు చిత్రాలు కూడా ఆత్మను ఆహ్వానించగలవు.

చిత్రం
దీపాలను పట్టుకున్న స్త్రీలు

వారిలో ఐదుగురు బుద్ధిగలవారు, వాల్టర్ రానె చేత

ముద్రించు