2023 క్రొత్త నిబంధన
మే 29–జూన్ 4. మత్తయి 26; మార్కు 14; యోహాను 13: “జ్ఞాపకము చేసుకొనుటకు”


“మే 29–జూన్ 4. మత్తయి 26; మార్కు 14; యోహాను 13: ‘జ్ఞాపకము చేసుకొనుటకు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మే 29–జూన్ 4. మత్తయి 26; మార్కు 14; యోహాను 13,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ప్రభురాత్రి భోజనం

నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు, వాల్టర్ రానె చేత

మే 29–జూన్ 4

మత్తయి 26; మార్కు 14; యోహాను 13

“జ్ఞాపకము చేసుకొనుటకు”

మత్తయి 26; మార్కు 14; మరియు యోహాను 13లో వివరించబడిన సంఘటనల గూర్చి మీరు చదివినప్పుడు, మీరు పొందే మనోభావనలు, ప్రత్యేకంగా యేసు క్రీస్తు నందు మీ విశ్వాసాన్ని మరియు ఆయనపట్ల మీ నిబద్ధతను పెంపొందించే మనోభావనల పట్ల శ్రద్ధ వహించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఆయన మరణించడానికి ముందు రోజు, ఆయనను జ్ఞాపకముంచుకోవడానికి యేసు తన శిష్యులకు ఒకటి ఇచ్చారు. ఆయన “ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వారికిచ్చి, దీనిలోనిది మీరందరు త్రాగుడి, ఇది నా రక్తము” అనెను (మత్తయి 26:26–28).

అది సుమారు 2000 సంవత్సరాల క్రితం, మనలో చాలామంది ఎన్నడూ చూడని ప్రదేశంలో, మనలో కొద్దిమంది అర్థం చేసుకోగల భాషలో జరిగింది. కానీ ఇప్పుడు, ప్రతీ ఆదివారం మన స్వంత సమావేశ ప్రదేశాలలో, యేసు క్రీస్తు నామములో పనిచేయడానికి అధికారమివ్వబడిన యాజకత్వము గలవారు ఒకప్పుడు ఆయన చేసిన దానిని చేస్తారు. వారు రొట్టె మరియు నీటిని తీసుకొని, వాటిని దీవించి, ఆయన శిష్యులమైన మనలో ప్రతిఒక్కరికి వాటిని ఇస్తారు. ఇది సరళమైన చర్య—రొట్టె తినడం మరియు నీరు త్రాగడం కంటే అధిక ప్రధానమైనది, సరళమైనది ఏదైనా ఉండగలదా? కానీ ఆ రొట్టె మరియు నీరు మనకు పవిత్రమైనవి, ఎందుకంటే అవి ఆయనను జ్ఞాపకముంచుకోవడానికి మనకు సహాయపడతాయి. “నేను ఆయనను ఎన్నడూ మరచిపోను” అని మనం చెప్పే విధానమది—“ఆయన బోధనలు మరియు ఆయన జీవితం గురించి నేను చదివిన దానిని నేను ఎన్నడూ మరచిపోను” అని మాత్రమే కాదు. బదులుగా, “ఆయన నా కోసం చేసిన దానిని నేను ఎన్నడూ మరచిపోను” అని మనం చెప్తున్నాము. “నేను సహాయం కోసం మొరపెట్టినప్పుడు, ఆయన నన్ను ఎలా కాపాడారో నేను ఎన్నడూ మరచిపోను.” మరియు “నా పట్ల ఆయన నిబద్ధతను, ఆయన పట్ల నా నిబద్ధతను—మేము చేసిన నిబంధనను నేను ఎన్నడూ మరచిపోను.”

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 26:6-13; మార్కు 14:3-9

“నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును అభిషేకించుటకు … ఆమె వచ్చెను.”

ఆరాధన యొక్క వినయముగల చర్యతో ఈ వచనాలలో వర్ణించబడిన స్త్రీ, యేసు ఎవరో మరియు ఆయన ఏమి చేయబోతున్నారో తాను ఎరుగుదునని చూపింది (మత్తయి 26:12 చూడండి). ఆమె చర్యలు రక్షకునికి అంత అర్థవంతముగా ఎందుకు ఉన్నాయని మీరనుకుంటున్నారు? (13వ వచనము చూడండి). ఆ స్త్రీ మరియు ఆమె విశ్వాసం గూర్చి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేది ఏమిటి? ఆమె మాదిరిని మీరెలా అనుసరించగలరో ధ్యానించండి.

యోహాను 12:1-8 కూడా చూడండి.

మత్తయి 26:20-22; మార్కు 14:17-19

“ప్రభువా, నేనా?”

ఈ వచనాలలో వారు ప్రభువును అడిగిన ప్రశ్న నుండి శిష్యుల గురించి మీరేమి నేర్చుకుంటారు? వారెందుకు దానిని అడిగారని మీరనుకుంటున్నారు? “నేనా?” అని ప్రభువును మీరెలా అడగవచ్చో పరిగణించండి.

మత్తయి 26:26-29; మార్కు 14:22-25

సంస్కారము రక్షకుడిని జ్ఞాపకముంచుకొనుటకు ఒక అవకాశము.

రక్షకుడు తన శిష్యులకు సంస్కారమును పరిచయం చేసినప్పుడు, వారికి ఏ ఆలోచనలు మరియు భావాలు కలిగియుండవచ్చని మీరు ఊహిస్తున్నారు? మత్తయి 26:26–29 మరియు మార్కు 14:22–25 లో వారి అనుభవం గురించి మీరు చదివినప్పుడు, దీని గురించి ఆలోచించండి. ఆయనను జ్ఞాపకముంచుకోవడానికి మన కోసం ఈ విధానాన్ని యేసు ఎందుకు ఎంచుకున్నారని మీరనుకుంటున్నారు? సంస్కార సమయంలో మీకు కలిగిన అనుభవాలను కూడా మీరు ధ్యానించవచ్చు. మీ అనుభవమును మరింత పవిత్రంగా మరియు అర్థవంతముగా చేయడానికి మీరు చేయగలిగినదేమైనా ఉన్నదా?

ఈ వచనాలను చదివి, ధ్యానించిన తరువాత, రక్షకుని గురించి జ్ఞాపకముంచుకోవడానికి మీరు ప్రేరేపించబడిన కొన్ని విషయాలను మీరు వ్రాయవచ్చు. మరొకసారి మీరు సంస్కారమును తీసుకొనేటప్పుడు ఈ విషయాలను మీరు పునర్వీక్షించవచ్చు. “ఆయనను ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొనుటకు” (మొరోనై 4:3) ఒక విధానంగా ఇతర సమయాల్లో కూడా మీరు వాటిని పునర్వీక్షించవచ్చు.

లూకా 22:7–39; 3 నీఫై 18:1–13; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:76–79; సువార్త అంశములు, “సంస్కారము,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

యోహాను 13:1–17

వినయముగా ఇతరులకు సేవ చేయుటకు రక్షకుడు మనకు మాదిరిగా ఉన్నారు.

యేసు కాలములో, మరొక వ్యక్తి పాదములు కడుగుట సేవకుల పని అయ్యున్నది, కానీ నాయకులది కాదు. కానీ, నడిపించడం మరియు సేవ చేయడం అంటే అర్థమేమిటనే దాని గురించి తన శిష్యులు భిన్నంగా ఆలోచించాలని యేసు కోరారు. యోహాను 13:1–17లో రక్షకుని మాటలు మరియు క్రియలలో ఏ సందేశాలను మీరు కనుగొంటారు? మన సంప్రదాయంలో, సేవ చేయడానికి ఇతరుల పాదాలు కడగడం సాధారణమైన విధానం కాకపోవచ్చు. కానీ, రక్షకుని వినయముగల సేవ యొక్క మాదిరిని అనుసరించడానికి మీరేమి చేయగలరో పరిగణించండి.

తన అపొస్తలులతో ఉన్న ఈ పవిత్ర సమయంలో యేసు ఎరిగిన మరియు భావించిన విషయాలను గమనించడం కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు (1 మరియు 3 వచనాలు చూడండి). రక్షకుని గురించి ఏమి అర్థం చేసుకోవడానికి ఈ అంతరార్థములు మీకు సహాయపడతాయి?

లూకా 22:24-27 కూడా చూడండి.

యోహాను 13:34-35

ఇతరుల కొరకు నేను కలిగియున్న ప్రేమ నేను యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యుడను అనుటకు ఒక చిహ్నము.

ఇంతకుముందు, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” (మత్తయి 22:39) అని యేసు ఒక ఆజ్ఞనిచ్చారు. ఇప్పుడు ఆయన “ఒక క్రొత్త ఆజ్ఞను” ఇచ్చారు. యేసు మిమ్మల్ని ప్రేమించినట్లుగా ఇతరులను ప్రేమించడం అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (యోహాను 13:34 చూడండి).

మీరు యేసు క్రీస్తు శిష్యులని ఇతరులు ఎలా తెలుసుకుంటారో కూడా మీరు ధ్యానించవచ్చు. ప్రేమ అనేది మిమ్మల్ని నిర్వచించే లక్షణమని ఒక క్రైస్తవునిగా మీరెలా నిశ్చయపరచగలరు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 26:26-29; మార్కు 14:22-25.ప్రతీవారము సంస్కారమందు మీ కుటుంబము యొక్క అనుభవము ఎలా ఉంటుంది? మొదటి సంస్కారము గురించి చదువుట, సంస్కారము యొక్క ప్రాముఖ్యత గురించి మరియు మీ అనుభవాన్ని వృద్ధి చేయగల విధానములను గూర్చి ఒక చర్చను ప్రేరేపించవచ్చు. సంస్కారమును అందించుట (Gospel Art Book (సువార్త కళా గ్రంథము), no. 108) చిత్రమును ప్రదర్శించుటను మరియు సంస్కారమందు, దానికి ముందు మరియు సంస్కారము తరువాత మీరు చేయగల దాని గురించి ఆలోచనలు పంచుకొనుటను పరిగణించండి.

చిత్రం
సంస్కారమును తీసుకుంటున్న స్త్రీ

యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుటకు సంస్కారము మనకు సహాయపడుతుంది.

మత్తయి 26:30.యేసు మరియు ఆయన అపొస్తలులు చేసినట్లు ఒక కీర్తనను, బహుశా ఒక సంస్కార కీర్తనను పాడడాన్ని పరిగణించండి. ఆ సమయంలో యేసు మరియు ఆయన అపొస్తలులకు కీర్తన పాడడం ఒక దీవెనగా ఎట్లు ఉండియుండవచ్చు? కీర్తనలు మనకు ఏ విధంగా దీవెన కాగలవు?

యోహాను 13:1-17.మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, ఈ సారాంశం చివరన ఉన్న చిత్రాన్ని మీ కుటుంబ సభ్యులకు చూపాలని మీరు కోరవచ్చు. ఆయన చర్యల ద్వారా రక్షకుడు ఏ సత్యాలను బోధించారు? చిత్రములోని ఏ వివరాలు ఈ సత్యాలను గ్రహించడానికి మనకు సహాయపడతాయి? ఈ సత్యాలను బట్టి జీవించడం వారికి సంతోషాన్ని ఎలా తెచ్చిందో బహుశా కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు (యోహాను 13:17 చూడండి).

యోహాను 13:34-35.ఈ వచనాలు చదివిన తరువాత, మీరు యేసు క్రీస్తు శిష్యులని ఇతరులు ఎలా తెలుసుకుంటారో అనే దాని గురించి మీరు కలిసి మాట్లాడవచ్చు. తన అనుచరులు ఏ విధంగా తెలియబడాలని రక్షకుడు కోరుతున్నారు? ఇతరుల పట్ల వారి ప్రేమ కారణంగా వారు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు అనబడే జనుల గురించి మాట్లాడమని కుటుంబ సభ్యులను మీరు అడగవచ్చు. ఒక కుటుంబముగా మరింత ఎక్కవ ప్రేమను మీరు చూపగల విధానాలను కూడా మీరు చర్చించవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ధ్యానించండి. మనం ఇతర పుస్తకాలను చదివినట్లుగా పద్ధతి లేకుండా లేఖనాలను చదివినట్లయితే, వాటిలో ఉండే ఆధ్యాత్మిక అర్థాలను మనం కోల్పోవచ్చు. ఒక అధ్యాయాన్ని పూర్తి చేయడానికి కంగారు పడవద్దు. మీరు చదువుతున్న విషయాల గురించి లోతుగా ఆలోచించడానికి సమయం కేటాయించండి.

చిత్రం
శిష్యుల పాదములు కడుగుతున్న యేసు

రాజ్యములో గొప్పవాడు, జె. కర్క్ రిఛర్డ్స్ చేత

ముద్రించు