2023 క్రొత్త నిబంధన
జూన్ 12-18. లూకా 22; యోహాను 18: “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక”


“జూన్ 12-18. లూకా 22; యోహాను 18: ‘నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జూన్ 12-18. లూకా 22; యోహాను 18,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
గెత్సేమనేలో క్రీస్తు మరియు శిష్యులు

Gethsemane Grove [గెత్సేమనే వనము], డెరెక్ హెగ్స్టెడ్ చేత

జూన్ 12-18

లూకా 22; యోహాను 18

“నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక”

ఈ వారం లూకా 22 మరియు యోహాను 18 చదవడానికి సమయం కేటాయించండి. మీరు చదివిన దాని గురించి ధ్యానించి, ప్రార్థించండి. ఇది చేయడం లేఖనాలు నిజమని మీ హృదయానికి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఆత్మకు ఇస్తుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి

గెత్సేమనే వనములో యేసు క్రీస్తు బాధ అనుభవించుటను చూచిన వారు ముగ్గురు మర్త్యులు మాత్రమే— మరియు వారు చాలామట్టుకు నిద్రపోయారు. ఆ సమయములో జీవిస్తున్న వారెవరు జరుగుతున్న దానిని ఎరుగనప్పటికీ, ఆ వనములో మరియు తరువాత సిలువపై యేసు ఎప్పటికీ జీవించిన ప్రతీ వ్యక్తి యొక్క పాపములు, నొప్పులు మరియు బాధలను తనపై తీసుకొనెను. నిత్యత్వము యొక్క అత్యంత ముఖ్యమైన సంఘటనలు తరచుగా లోక సంబంధమైన ఆసక్తి లేకుండా జరుగుతాయి. కానీ తండ్రియైన దేవునికి తెలుసు. ఆయన తన విశ్వసనీయుడైన కుమారుని యొక్క మనవిని విన్నాడు: “తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము: అయినను నా యిష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. అప్పుడు పరలోకమునుండి ఒక దూత ఆయనకు కనబడి, ఆయనను బలపరిచెను” (లూకా 22:42–43). ఈ నిస్వార్ధమైన మరియు అప్పగించే చర్యకు సాక్ష్యమిచ్చుటకు మనము భౌతికంగా లేనప్పటికీ, మనము యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమునకు సాక్షులమైయున్నాము. మన పాపములను బట్టి మనము పశ్చాత్తాపపడి, క్షమాపణ పొందిన ప్రతీసారి, మనము రక్షకుని యొక్క బలపరచే శక్తిని అనుభవించిన ప్రతీసారి, గెత్సేమనే వనములో జరిగిన దాని వాస్తవికతను గూర్చి మనము సాక్ష్యమివ్వగలము.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

లూకా 22:31–34, 54–62; యోహాను 18:17–27

పరివర్తన అనేది నిరంతర ప్రక్రియ.

రక్షకునితో పేతురుకు కలిగిన అనుభవాలను—అతడు ప్రత్యక్షంగా చూసిన అద్భుతములు మరియు అతడు నేర్చుకొన్న సిద్ధాంతము గూర్చి ఆలోచించండి. “నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము” అని రక్షకుడు పేతురుకు ఎందుకు చెప్పియుండవచ్చు? (లూకా 22:32; ఏటవాలు అక్షరాలు చేర్చబడినవి). మీరు దీనిని ధ్యానించినప్పుడు, ఒక సాక్ష్యమును కలిగియుండుట మరియు నిజముగా మార్పు చెందుట మధ్య తేడాను పరిగణించండి.

లూకా 22:31-34, 54-62 (యోహాను 18:17–27 కూడా చూడండి)లో పేతురు యొక్క అనుభవాలను మీరు చదువుతున్నప్పుడు, మీ స్వంత మార్పును గురించి ఆలోచించండి. మీరు “[రక్షకుని]తోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నారని,” పేతురు వలె అంత నిబద్ధులుగా మీరెప్పుడైనా భావించారా? (లూకా 22:33). కొన్నిసార్లు ఆ భావాలు ఎందుకు క్షీణిస్తాయి? రక్షకునికి సాక్షులుగా ఉండడానికి లేదా నిరాకరించడానికి అనుదిన అవకాశాలున్నాయి; ప్రతీరోజు ఆయనకు సాక్షులుగా ఉండేందుకు మీరు ఏమి చేస్తారు? పేతురు అనుభవం నుండి ఏ ఇతర పాఠాలను మీరు నేర్చుకుంటారు?

మీరు క్రొత్త నిబంధనను చదవడం కొనసాగించినప్పుడు, పేతురు యొక్క నిరంతర పరివర్తనకు సాక్ష్యం కొరకు చూడండి. “నీ సహోదరులను స్థిరపరచుమని” (లూకా 22:32; అపొస్తలుల కార్యములు 3–4 చూడండి) ప్రభువు చెప్పిన పనిని అతడు అంగీకరించిన విధానాలను కూడా గమనించండి.

మార్కు 14:27-31 కూడా చూడండి.

లూకా 22:39-46

రక్షకుడు నా కోసం గెత్సేమనేలో బాధపడెను.

“రక్షకుడు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము గురించి తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించారు (“మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొందుట,” లియహోనా, మే 2017, 40).

అధ్యక్షులు నెల్సన్ యొక్క ఆహ్వానమును అంగీకరించుటకు మీరు చేసే దానిని ఆలోచించండి. ఈ వచనములలో వివరించబడినట్లుగా, గెత్సేమనేలో రక్షకుని యొక్క బాధను ప్రార్థనాపూర్వకంగా ధ్యానించుట మరియు మనస్సులోనికి వచ్చే మనోభావనలను, ప్రశ్నలను వ్రాయుట ద్వారా మీరు ప్రారంభించవచ్చు.

రక్షకుడు మరియు ఆయన ప్రాయశ్చిత్తము గురించి లోతైన అధ్యయనము కొరకు, క్రింది ప్రశ్నలకు జవాబుల కొరకు ఇతర లేఖనాలను పరిశోధించుటకు ప్రయత్నించండి:

గెత్సేమనేలో జరిగిన దాని గురించి మీరు నేర్చుకున్నప్పుడు, అది గెత్సేమనే ఓలీవ వృక్షముల తోట అని, ఓలీవలను నలుపుటకు ఉపయోగించు ఓలీవ గానుగను కలిగియున్నదని తెలుసుకొనుట ఆసక్తికరమైనది మరియు తీయబడిన నూనె దీపము వెలిగించుటకు మరియు ఆహారము కొరకు, అదేవిధంగా స్వస్థపరచుటకు ఉపయోగించబడింది (లూకా 10:34 చూడండి). ఓలీవల నుండి నూనె తీసే ప్రక్రియ, గెత్సేమనేలో రక్షకుడు మన కొరకు చేసిన దానికి చిహ్నముగా ఎలా ఉండవచ్చు?

మత్తయి 26:36–46; మార్కు 14:32-42 చూడండి.

యోహాను 18:28-38

రక్షకుని “రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు.”

ఒక రాజకీయ నాయకునిగా పొంతి పిలాతు, ఈ లోకపు శక్తి మరియు రాజ్యములను బాగా ఎరిగియున్నాడు. కానీ, యేసు చాలా భిన్నమైన రాజ్యము గురించి మాట్లాడారు. రక్షకని జీవితం గురించి మీరు చదివిన దానిపై దృష్టిపెడుతూ, ఆయన “రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” అనడానికి మీరు చూసే సాక్ష్యమేమిటి? (యోహాను 18:36). దీనిని తెలుసుకోవడం మీకు ఎందుకు ముఖ్యమైనది? పిలాతుతో యేసు మాటల గురించి ఇంకేది మీకు ప్రత్యేకంగా అనిపిస్తుంది?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

లూకా 22:31-32.అతడు మరియు అతని విశ్వాసం కొరకు యేసు ప్రార్థించారని తెలుసుకొని పేతురు ఎలా భావించియుండవచ్చు? “[వారి] నమ్మకము తప్పిపోకుండునట్లు” మనము ఎవరి కొరకు ప్రార్థించగలము? (32వ వచనము).

లూకా 22:39-46.గెత్సేమనేలో రక్షకుని వేదన గురించి నేర్చుకోవడం మీ కుటుంబం కొరకు ఒక పవిత్ర అనుభవం కాగలదు. మీరు లూకా 22:39–46 చదువుతున్నప్పుడు, భక్తిపూర్వకమైన మరియు ఆరాధనాపూర్వకమైన ఆత్మను కల్పించడానికి మీరు ఏమి చేయగలరో ఆలోచించండి. రక్షకుని గురించి మీ కుటుంబానికి ఇష్టమైన కీర్తనలు లేదా పిల్లల పాటలు మీరు కలిసి వాయించవచ్చు లేదా పాడవచ్చు లేదా సంబంధిత కళాచిత్రాలను చూడవచ్చు. మీరు వచనాలను చదువుతున్నప్పుడు, కుటుంబ సభ్యులు వారికి ప్రత్యేకంగా అర్థవంతమైన వాక్యభాగాలను—బహుశా, రక్షకుని ప్రేమను వారు అనుభవించేందుకు సహాయపడిన ఒక వాక్యభాగాన్ని పంచుకోవచ్చు (మత్తయి 26:36–46; మార్కు 14:32–42 కూడా చూడండి). యేసు క్రీస్తు మరియు ఆయన పునరుత్థానమును గూర్చి వారి సాక్ష్యములను పంచుకోమని కూడా మీరు వారిని ఆహ్వానించవచ్చు.

లూకా 22:42.“నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అని చెప్పుటను వారు నేర్చుకున్నప్పటి అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.

లూకా 22:50-51; యోహాను 18:10–11.ఈ వచనాల నుండి యేసు గురించి మనం ఏమి నేర్చుకుంటాము?

చిత్రం
సేవకుని చెవిని బాగుచేస్తున్న క్రీస్తు

ఈ మట్టుకు తాళుడి, వాల్టర్ రానె చేత

యోహాను 18:37-38.“సత్యమనగా ఏమిటి?” అనే పిలాతు ప్రశ్నకు మనమెలా జవాబిస్తాము? (38వ వచనము). కొన్ని ఉపాయాల కొరకు, యోహాను 8:32; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:45; 93:23–28 చూడండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలను అధ్యయనము చేయండి. లేఖనములందు మీరు కనుగొన్న సత్యములను గూర్చి కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలులు బోధించిన దానిని చదవండి. ఉదాహరణకు, ఇటీవల సర్వసభ్య సమావేశ లియహోనా సంచిక యొక్క విషయసూచికలో “ప్రాయశ్చిత్తము” అనే విషయమును మీరు వెదకవచ్చు (Teaching in the Savior’s Way, 21 చూడండి).

చిత్రం
గెత్సేమనేలో క్రీస్తు

నా చిత్తము కాదు, మీ చిత్తమే, వాల్టర్ రానె చేత

ముద్రించు