2023 క్రొత్త నిబంధన
జూన్ 19-25. మత్తయి 27; మార్కు 15; లూకా 23; యోహాను 19: “సమాప్తమైనది”


“జూన్ 19-25. మత్తయి 27; మార్కు 15; లూకా 23; యోహాను 19: ‘సమాప్తమైనది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జూన్ 19-25. మత్తయి 27; మార్కు 15; లూకా 23; యోహాను 19,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
పిలాతు యెదుట క్రీస్తు

ఎక్కి హోమో, ఆంటోనియో సిసెరి చేత

జూన్ 19-25

మత్తయి 27; మార్కు 15; లూకా 23; యోహాను 19

“సమాప్తమైనది”

మత్తయి 27; మార్కు 15; లూకా 23; మరియు యోహాను 19 రక్షకుని మర్త్య జీవితంలో చివరి గడియల వివరణలను కలిగియున్నాయి. ఆయన త్యాగము మరియు మరణము గురించి మీరు అధ్యయనము చేసినప్పుడు మీ కొరకు ఆయన ప్రేమను అనుభూతి చెందుటకు వెదకండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ప్రతీ మాటలో మరియు క్రియలో యేసు క్రీస్తు పౌలు పిలిచిన దాతృత్వము, అనగా శుద్ధమైన ప్రేమను మాదిరిగా చూపెను (1 కొరింథీయులకు 13 చూడండి). రక్షకుని యొక్క మర్త్య జీవితములో చివరి గడియలలోకంటే ఎక్కువగా ఏ సమయములోను ఇది ఇంత స్పష్టముగా కనిపించలేదు. తప్పుడు ఆరోపణలను ఎదుర్కొనుటలో ఆయన మర్యాదగల మౌనము, ఆయన “త్వరగా కోపపడడు” (1 కొరింథీయులకు 13:5) అని రుజువు చేయును. తన హింసలు అంతము చేయుటకు ఆయన తన శక్తిని నిరోధిస్తుండగా—కొరడాతో కొట్టబడుట, ఎగతాళి చేయబడుట మరియు సిలువ వేయబడుటకు లోబడుటకు ఆయన సమ్మతి—ఆయన “దీర్ఘకాలము సహించును” మరియు “అన్నిటికి తాళుకొనును” (1 కొరింథీయులకు 13:4, 7) అని చూపును. ఆయన తన స్వంత సాటిలేని బాధయందు కూడా తన తల్లిపట్ల ఆయన దయ మరియు ఆయనను సిలువ వేయు వారిపట్ల కనికరము—ఆయన “(తన) స్వంత ప్రయోజనము చూడలేదు” ( 1 కొరింథీయులకు 13:5) అని బయల్పరచును. భూమి మీద ఆయన చివరి గడియలందు, మనకు చూపించుట ద్వారా బోధిస్తూ—యేసు తన మర్త్య పరిచర్య అంతటా చేసిన దానిని చేయుచుండెను. వాస్తవానికి, దాతృత్వము అనగా “క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ” (మొరోనై 7:47).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 27; మార్కు 15; లూకా 23; యోహాను 19

బాధను అనుభవించుటకు యేసు క్రీస్తు యొక్క సమ్మతి తండ్రి కొరకు మరియు మనందరి కొరకు ఆయన ప్రేమను చూపును.

రక్షకుడు “దేవదూతల సైన్యము”ను (మత్తయి 26:53) పిలుచుటకు అధికారము కలిగియున్నప్పటికీ, అన్యాయమైన శిక్షలు, క్రూరమైన ఎగతాళి మరియు ఊహింపశక్యముగాని శారీరక బాధను భరించుటకు ఆయన స్వచ్ఛందంగా ఎన్నుకున్నారు. ఆయన దానిని ఎందుకు చేసారు? “నరుల సంతానము యెడల ఉన్న ఆయన కృపాతిశయము మరియు దీర్ఘశాంతమును బట్టి” (1 నీఫై 19:9) అని నీఫై సాక్ష్యమిచ్చెను.

చిత్రం
సిలువను మోస్తున్న క్రీస్తు

“ఆయన తన సిలువ మోసికొని … గొల్గొతాకు వెళ్ళెను” (యోహాను19:17).

1 నీఫై 19:9 చదువుట ద్వారా రక్షకుని యొక్క చివరి గడియలను గూర్చి మీ అధ్యయనమును మీరు ప్రారంభించవచ్చు. మత్తయి 27; మార్కు 15; లూకా 23; మరియు యోహాను 19 లో యేసు అనుభవిస్తారని నీఫై చెప్పిన ప్రతీ దాని మాదిరిని మీరు ఎక్కడ కనుగొంటారు?

  • “[వారు] ఆయనను పనికిరాని వస్తువుగా తీర్పు తీర్చుదురు”

  • “వారు ఆయనను కొరడాతో బాధింతురు”

  • “వారు ఆయనను కొట్టుదురు”

  • “వారు ఆయనపై ఉమ్మి వేయుదురు”

ఏ వాక్యభాగములు మీ పట్ల రక్షకుని ’“కృపాతిశయమును” అనుభూతి చెందుటకు మీకు సహాయపడతాయి? ఈ వృత్తాంతాలను మీరు చదివినప్పుడు మీకు కలిగిన ఇతర ఆలోచనలు లేదా మనోభావాలు ఏవి? వాటిని వ్రాయుటకు లేదా ఎవరితోనైనా పంచుకొనుటకు ఆలోచించండి.

మత్తయి 27:27–49, 54; మార్కు 15:16–32; లూకా 23:11, 35–39; యోహాను 19:1–5

ఎగతాళి సత్యాన్ని మార్చలేదు.

యేసు తన పరిచర్య అంతటా ఎగతాళిని సహించియుండగా, అది ఆయనను కొరడాతో కొట్టి, సిలువ వేసినప్పుడు మరింత తీవ్రమయ్యింది. కానీ ఈ ఎగతాళి, యేసు దేవుని యొక్క కుమారుడు అనే సత్యాన్ని మార్చలేదు. యేసు సహించిన అవమానమును మీరు చదివినప్పుడు, ఈరోజు ఆయన కార్యము ఎదుర్కొంటున్న వ్యతిరేకత మరియు ఎగతాళి గురించి ఆలోచించండి. వ్యతిరేకతను సహించుట గురించి మీరు పొందే అంతరార్థములేవి? మత్తయి 27:54 లో శతాధిపతి మాటలను గూర్చి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేది ఏమిటి?

మత్తయి 27:46; మార్కు 15:34

యేసు క్రీస్తు ఒంటరిగా బాధపడ్డారు, కాబట్టి నేను బాధపడనవసరం లేదు.

సిలువపై ఆయన అత్యంత కఠినమైన క్షణాలలో ఒకదానిలో, ఎల్లప్పుడూ తన పరలోక తండ్రిపై ఆధారపడిన యేసు అకస్మాత్తుగా వదిలివేయబడినట్లు భావించారు. దాని గురించి చదవడం, దేవుని నుండి మీరు దూరంగా భావించిన సమయాల గురించి ఆలోచించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. సిలువపై రక్షకుని త్యాగముు ఆ దూరాన్ని జయించడాన్ని మీకు ఎలా సాధ్యపరుస్తుందో మీరు ఆలోచించవచ్చు. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ సాక్ష్యమిచ్చినట్లుగా, “అటువంటి సుదీర్ఘమైన, ఏకాంత మార్గంలో యేసు ఒంటరిగా నడిచినందువలన, మనము ఆ విధంగా చేయనవసరము లేదు. … కల్వరి శిఖరము నుండి ప్రకటించబడిన సత్యము ఏదనగా, కొన్నిసార్లు మనము విడవబడినట్లు భావించినప్పటికీ, మనమెన్నడూ ఒంటరిగా లేదా సహాయము లేకుండా విడువబడము” (“None Were with Him,” Liahona, May 2009, 88). ఎల్డర్ హాలండ్ యొక్క సందేశములో మిగిలిన దానిని మీరు చదువుతున్నప్పుడు, ఒంటరితనాన్ని జయించడానికి రక్షకుడు మీకెలా సహాయపడగలరో పరిగణించండి.

లూకా 23:34

క్షమాపణకు రక్షకుడు మనకు మాదిరిగా ఉన్నారు.

లూకా 23:34లో రక్షకుని యొక్క మాటలను మీరు చదివినప్పుడు మీరెలా భావిస్తారు? (పాదవివరణ లో జోసెఫ్ స్మిత్ అనువాదము చేత ఇవ్వబడిన అంతరార్థమును చూడండి). రక్షకుని యొక్క మాటలను సూచిస్తూ, అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధించారు: “మనకు కోపము తెప్పించిన వారిని మనము తప్పక క్షమించాలి మరియు వారికి ఎటువంటి హాని తలపెట్టవద్దు. రక్షకుడు సిలువపై మాదిరిని ఉంచారు. … మనకు కోపము తెప్పించిన వారి హృదయాలను మనము ఎరుగము” (“That We May Be One,” Ensign, May 1998, 68). ఎవరినైనా క్షమించుటకు మీకు కష్టమైన యెడల ఈ వచనము మీకు ఎలా సహాయపడగలదు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 27; మార్కు 15; లూకా 23; యోహాను 19 ఈ అధ్యాయాలలో వర్ణించబడిన సంఘటనల గురించి మీరు చదివిన తర్వాత, వారి స్వంత మాటలలో కథలను తిరిగి చెప్పమని మీరు పిల్లలను ఆహ్వానించవచ్చు. మన కోసం ఆయన బాధపడినందువలన రక్షకుని గురించి వారెలా భావిస్తున్నారో కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.

మత్తయి 27:11–26; మార్కు 15:1–15; లూకా 23:12-25; యోహాను 19:1–16.యేసు అమాయకుడని ఎరిగినప్పటికీ, పిలాతు యేసును సిలువ వేయుటకు ఎందుకు అప్పగించాడు? సరైనదని మనము ఎరిగిన దాని కొరకు నిలబడుట గురించి పిలాతు యొక్క అనుభవము నుండి మనము ఏ పాఠాలు నేర్చుకుంటాము? సరైన దాని కొరకు నిలబడుటను సాధన చేయుటకు వారిని అనుమతించు సందర్భాలను నటించుట మీ కుటుంబమునకు సహాయకరముగా ఉండవచ్చు.

మత్తయి 27:46; లూకా 23:34, 43, 46; యోహాను 19:26–28, 30.బహుశా ఈ వచనములలో కనుగొనబడినవి, సిలువపై రక్షకుడు చేసిన ఒకటి లేదా ఎక్కువ వ్యాఖ్యానములను చదవమని ప్రతీ కుటుంబ సభ్యునికి మీరు చెప్పవచ్చు. రక్షకుడు మరియు ఆయన నియమితకార్యము గురించి ఈ వ్యాఖ్యానముల నుండి వారు నేర్చుకొన్న దానిని పంచుకోమని వారిని అడగండి.

మార్కు 15:39.సిలువ వేయబడుటను గూర్చి చదువుట, యేసు “దేవుని కుమారుడు” అనే మీ సాక్ష్యమును ఎలా బలపరచింది?

యోహాను 19:25–27.మనము కుటుంబ సభ్యులను ఎలా ప్రేమించి, సహకరించాలనే దాని గురించి ఈ వచనముల నుండి మనము ఏమి నేర్చుకుంటాము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

రక్షకుని యొక్క జీవితమును అనుకరించండి. “రక్షకుడు బోధించిన విధానములను—ఆయన ఉపయోగించిన పద్ధతులను మరియు ఆయన చెప్పిన సంగతులను అధ్యయనము చేయుట సహాయపడుతుంది. కానీ, బోధించుటకు మరియు ఇతరులను హెచ్చించుటకు రక్షకుని యొక్క శక్తి, ఆయన జీవన విధానము మరియు ఆయన వ్యక్తిగత స్వభావం నుండి వచ్చింది. యేసు క్రీస్తు వలె జీవించుటకు మీరు ఎక్కువ శ్రద్ధగా ప్రయాసపడే కొద్దీ మీరు ఆయనలాగే బోధించగలుగుతారు” (Teaching in the Savior’s Way, 13).

చిత్రం
సిలువపై క్రీస్తు

సిలువపై క్రీస్తు, కార్ల్ హీన్రిచ్ బ్లాక్ చేత

ముద్రించు