2023 క్రొత్త నిబంధన
ఆగష్టు 7-13. రోమీయులకు 1–6: “రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది”


“ఆగష్టు 7-13. రోమీయులకు 1–6: ‘రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుంటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఆగష్టు 7-13. రోమీయులకు 1–6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుంటుంబాల కొరకు: 2023

చిత్రం
పత్రికను వ్రాస్తున్న పౌలు

ఆగష్టు 7-13

రోమీయులకు 1–6

“రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది”

ప్రేరణలను నమోదు చేయడం, ఆత్మ మీకు బోధించే దానిని జ్ఞాపకముంచుకొనుటకు సహాయపడుతుంది. ఈ ప్రేరణల గురించి మీరు భావించేదానిని నమోదు చేయడాన్ని కూడా పరిగణించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

రోమాలో ఉన్న యూదులు మరియు అన్యుల యొక్క విభిన్న సమూహమైన సంఘ సభ్యులకు పౌలు ఈ పత్రిక వ్రాసే సమయానికి, యేసు క్రీస్తు యొక్క సంఘము గలిలయ నుండి వచ్చిన విశ్వాసుల యొక్క చిన్న గుంపును మించి చాలా అధికముగా వృద్ధి చెందింది. రక్షకుడు పునరుత్థానము చెంది దాదాపు 20 సంవత్సరాల తరువాత, శక్తివంతమైన సామ్రాజ్యం యొక్క రాజధానియైన రోమ్‌తో సహా అపొస్తలులు సహేతుకంగా ప్రయాణించగలిగే ప్రతిచోటా క్రైస్తవుల సమూహాలు ఉన్నాయి. అయినప్పటికీ, రోమా సామ్రాజ్యము యొక్క విస్తారముతో పోల్చితే, సంఘము చిన్నదిగా ఉండి, తరచు హింసకు గురయ్యింది. అటువంటి పరిస్థితులలో, కొందరు “క్రీస్తు యొక్క సువార్తను గూర్చి సిగ్గుపడియుండవచ్చు”—కానీ, పౌలు మాత్రము అలా కాదు. “రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియైయున్న” నిజమైన శక్తి యేసు క్రీస్తు యొక్క సువార్తలో కనుగొనబడుతుందని అతడు ఎరిగియున్నాడు మరియు సాక్ష్యమిచ్చాడు (రోమీయులకు 1:16).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

పత్రికలు అనగా ఏమిటి మరియు అవి ఏవిధంగా అమర్చబడ్డాయి?

పత్రికలు అనేవి ప్రపంచములోని వివిధ భాగాలలో ఉన్న పరిశుద్ధులకు సంఘ నాయకులచేత వ్రాయబడిన లేఖలు. అపొస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలోని పత్రికలలో చాలావరకు అనగా రోమీయులతో మొదలై హెబ్రీయులతో ముగిసే వాటిని వ్రాసెను. అతని పత్రికలలో హెబ్రీయులకు వ్రాసినవి తప్ప, మిగిలినవి వాటి నిడివిని బట్టి అమర్చబడ్డాయి (బైబిలు నిఘంటువు, “పౌలు వ్రాసిన పత్రికలు” చూడండి). రోమీయులకు వ్రాసినది క్రొత్త నిబంధనలో ​​మొదటి పత్రిక అయినప్పటికీ, అది వాస్తవానికి పౌలు యొక్క సువార్త పరిచర్య ప్రయాణాల ముగింపులో వ్రాయబడింది.

రోమీయులకు 1-6

“నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.”

రోమీయులకు రాసిన పత్రికను బాగా అర్థం చేసుకోవడానికి ఈ క్రింది నిర్వచనాలు మీకు సహాయపడవచ్చు:

ధర్మశాస్త్రము.పౌలు “ధర్మశాస్త్రం” గురించి వ్రాసినప్పుడు, ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నాడు. పౌలు రచనలలో “క్రియలు” అనే పదం మోషే ధర్మశాస్త్రానికి సంబంధించిన బాహ్య క్రియలను సూచిస్తుంది. మోషే ధర్మశాస్త్రము మరియు దానికి అవసరమైన పనులు రోమీయులకు 3:23–31 లో వర్ణించబడిన “విశ్వాస న్యాయము” నుండి ఏవిధంగా భిన్నంగా ఉన్నాయో పరిగణించండి.

సున్నతి గలవారు, సున్నతి లేనివారు.పూర్వం, సున్నతి అనేది దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనకు ఆనవాలు లేదా చిహ్నమైయున్నది. పౌలు “సున్నతి గలవారు” అనే పదాన్ని యూదులను (నిబంధన జనులు) సూచించడానికి మరియు “సున్నతి లేనివారు” అనే పదాన్ని అన్యజనులను సూచించడానికి ఉపయోగించాడు. దేవుని యొక్క నిబంధన జనులు కావడం అంటే నిజంగా అర్థమేమిటనే దాని గురించి రోమీయులకు 2:25–29 బోధించే దానిని ధ్యానించండి. తన జనులతో దేవుని నిబంధనకు ఇకపై సున్నతి ఆనవాలుగా లేదని గమనించండి (అపొస్తలుల కార్యములు 15: 23–29 చూడండి).

నీతిమంతులుగా తీర్చబడుట, నీతిమంతులుగా తీర్చబడు, నీతిమంతులుగా తీర్చబడ్డారు:ఈ పదాలు పాప క్షమాపణను లేదా మన్నింపును సూచిస్తాయి. మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనము క్షమించబడతాము, అపరాధము చేయనివారిగా ప్రకటించబడతాము మరియు మన పాపాల కొరకు నిత్య శిక్ష నుండి విముక్తి పొందుతాము. మీరు ఈ పదాలను చూసినప్పుడు, నీతిమంతులుగా తీర్చబడుటను ఏది సాధ్యపరుస్తుందనే దాని గురించి పౌలు బోధించిన దానిని గమనించండి (లేఖన దీపిక, “నీతిమంతులుగా తీర్పుతీర్చబడుట, నీతిమంతులుగా తీర్పుతీర్చు,” scriptures.ChurchofJesusChrist.org కూడా చూడండి). రోమీయులకులో “నీతిమంతులు” మరియు “నీతిన వంటి పదములకు పర్యాయపదములుగా “నీతిమంతులు” మరియు “నీతిమంతులుగా తీర్చబడుట” వంటి పదములను చూడవచ్చు.

కృప.కృప అనేది “దైవిక… సహాయం లేదా బలం, యేసు క్రీస్తు యొక్క విస్తారమైన దయ మరియు ప్రేమ ద్వారా ఇవ్వబడుతుంది.” కృప ద్వారా, ప్రజలందరూ పునరుత్థానం చెందుతారు మరియు అమర్త్యత్వమును పొందుతారు. అదనంగా, “కృప అనేది పురుషులు మరియు స్త్రీలు తమ ఉత్తమ ప్రయత్నాలు చేసిన తరువాత నిత్యజీవము మరియు ఉన్నతస్థితిని పొందడానికి అనుమతించే శక్తి.” మన ప్రయత్నాల ద్వారా కృపను పొందలేము; బదులుగా, ఈ కృప “మనకు మంచి పనులను చేయడానికి బలం మరియు సహాయం ఇస్తుంది, అది లేకపోతే [మనం] ఈ విధంగా నిర్వహించలేము” (బైబిలు నిఘంటువు,“కృప”; 2 నీఫై 25:23కూడా చూడండి). మీరు రోమీయులకు చదువుతున్నప్పుడు, రక్షకుని కృప గురించి మీరు నేర్చుకొనే దానిని నమోదు చేయండి.

రోమీయులకు 2:17–29

నా చర్యలు నా పరివర్తనను ప్రతిబింబించాలి మరియు పెంచాలి.

మోషే ధర్మశాస్త్రం యొక్క ఆచారకర్మలు మరియు సంస్కారవిధులు రక్షణ తెచ్చాయని రోమాలోని కొంతమంది యూదా క్రైస్తవులు ఇంకా విశ్వసించినట్లు స్పష్టమవుతోంది. మనము మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవించనందున ఇది ఇకపై వర్తించని సమస్యలా అనిపించవచ్చు. కానీ మీరు పౌలు రచనలను, ముఖ్యంగా రోమీయులకు ​​2:17-29 చదివేటప్పుడు, సువార్తను జీవించడానికి మీ స్వంత ప్రయత్నాల గురించి ఆలోచించండి. సంస్కారము తీసుకోవడం లేదా దేవాలయానికి హాజరుకావడం వంటి మీ బాహ్య ప్రదర్శనలు, మీ పరివర్తనను హెచ్చిస్తున్నాయా మరియు క్రీస్తు యందు మీ విశ్వాసాన్ని బలోపేతం చేస్తున్నాయా? (ఆల్మా 25: 15–16 చూడండి). మీ బాహ్య చర్యలు హృదయ మార్పుకు దారితీసేలా మీరు మార్చుకోవలసినది ఏదైనా ఉందా?

రోమీయులకు 3:10–31; 5

యేసు క్రీస్తు ద్వారా నా పాపాలు క్షమించబడగలవు.

“నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు” ( రోమీయులకు ​​3:10) అని పౌలు ధైర్యంగా ప్రకటించడం పట్ల కొంతమంది నిరుత్సాహపడవచ్చు. కానీ రోమీయులకులో ఆశాజనక సందేశాలు కూడా ఉన్నాయి. వాటి కొరకు 3 మరియు 5వ అధ్యాయాలలో చూడండి మరియు “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” (రోమీయులకు ​​3:23) అనే విషయాన్ని జ్ఞాపకముంచుకోవడము యేసు క్రీస్తు ద్వారా “నిరీక్షణనుబట్టి అతిశయపడుటను” నేర్చుకోవడానికి ఒక ముఖ్యమైన ముందడుగు ఎందుకో పరిగణించండి (రోమీయులకు ​​5: 2).

రోమీయులకు 6

“నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు” యేసు క్రీస్తు నన్ను ఆహ్వానిస్తారు.

యేసు క్రీస్తు సువార్త మన జీవన విధానాన్ని మార్చాలని పౌలు బోధించాడు. రక్షకుడిని అనుసరించడం “నూతనజీవము పొందినవారమై నడుచుకొనుటలో” మీకెలా సహాయపడిందని రోమీయులకు ​​6లోని ఏ ప్రకటనలు వివరిస్తాయి? (4వ వచనము).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

రోమీయులకు 1:16–17.మనం “క్రీస్తు యొక్క సువార్తను గూర్చి సిగ్గుపడువారము కాదు” అని ఎలా చూపగలము?

రోమీయులకు 3:23–28.మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, దేవుని కృపను “సంపాదించడం”, దానిని మనమెన్నడూ చేయలేము, మరియు దానిని పొందడం, మనం తప్పక చేయవలసినది, రెండింటికి మధ్య గల తేడాను మీరు చర్చించవచ్చు. దేవుని కృపను మనమెప్పుడు భావించాము? దానిని మరింత సంపూర్ణంగా మనమెలా పొందగలము?

రోమీయులకు 5:3-5.మనం ఏ శ్రమలను అనుభవించాము? సహనం, అనుభవం మరియు నిరీక్షణను పెంపొందించడానికి ఈ శ్రమలు మనకు ఎలా సహాయపడ్డాయి?

రోమీయులకు 6:3–6.బాప్తిస్మము యొక్క సంకేతార్థము గురించి పౌలు ఈ వచనాలలో ఏమి చెప్పాడు? బహుశా మీ కుటుంబం రాబోయే బాప్తిస్మమునకు హాజరు కావడానికి ప్రణాళిక చేసుకోవచ్చు. లేదా మీ కుటుంబంలోని వారెవరైనా అతని లేదా ఆమె బాప్తిస్మము యొక్క చిత్రాలు లేదా జ్ఞాపకాలను పంచుకోవచ్చు. మన బాప్తిస్మపు నిబంధనలను చేయడం మరియు పాటించడం “నూతనజీవము పొందినవారమై నడుచుకొనుటకు” మనకెలా సహాయపడుతుంది?

చిత్రం
సరస్సులో మరొకరికి బాప్తిస్మమిస్తున్న వ్యక్తి

బాప్తిస్మము క్రీస్తు యొక్క శిష్యునిగా కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని సూచిస్తుంది.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రశ్నలు అడగండి. మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, మనస్సులో ప్రశ్నలు తలెత్తవచ్చు. ఈ ప్రశ్నలను ధ్యానించండి మరియు సమాధానాల కోసం చూడండి. ఉదాహరణకు, రోమీయులకు ​​1–6 లో “కృప అంటే ఏమిటి?” అనే ప్రశ్నకు సమాధానాల కోసం మీరు చూడవచ్చు.

చిత్రం
నీటిప్రవాహం నుండి ఒక అమ్మాయిని రక్షిస్తున్న క్రీస్తు

భయపడవద్దు, గ్రెగ్ కె. ఓల్సెన్ చేత

ముద్రించు