2023 క్రొత్త నిబంధన
ఆగష్టు 21–27. 1 కొరింథీయులకు 1–7: “సన్నద్ధులైయుండుడి”


“ఆగష్టు 21–27. 1 కొరింథీయులకు 1–7: ‘సన్నద్ధులైయుండుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఆగష్టు 21–27. 1కొరింథీయులకు 1–7,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ప్రాచీన కొరింథు

Corinth, Southern Greece, the Forum and Civic Center (కొరింథు, దక్షిణ గ్రీసు, ఫోరమ్ మరియు సివిక్ సెంటర్), బాలాగి చేత చిత్రలేఖనము Balogh/www.ArchaeologyIllustrated.com

ఆగష్టు 21–27

1 కొరింథీయులకు 1–7

“సన్నద్ధులైయుండుడి”

1 కొరింథీయులకు 1–7 మీరు చదివినప్పుడు మీ మనోభావాలను నమోదు చేయండి. ఈ మనోభావాలు ఒక ఆలోచనను ఇంకా అధ్యయనము చేయుటకు, మీరు నేర్చుకొన్నదానిని ఇతరులతో పంచుకొనుటకు లేదా మీ జీవితంలో మార్పులు చేయుటకు ప్రేరేపేణలను కలిపియుండవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

కొరింథులో పౌలు గడిపిన నెలలలో “కొరింథీయులలో అనేకులు [అతడిని] విని విశ్వసించి, బాప్తిస్మము పొందిరి” (అపొస్తలుల కార్యములు 18:8). కేవలము కొన్ని సంవత్సరాల తరువాత, కొరింథీయ పరిశుద్ధుల మధ్య “విభజనలు” మరియు “కలహములు” ఉన్నాయని మరియు అతడు లేనప్పుడు వారు “ఈ లోక జ్ఞానమును” (1 కొరింథీయులకు 1:10–11, 20) ఆలకించుట ప్రారంభించసాగిరని వినుట పౌలుకు హృదయ వేదన కలిగించియుండవచ్చు. దానికి స్పందనగా మనమిప్పుడు 1 కొరింథీయులని పిలిచే లేఖను పౌలు వ్రాసాడు. అది లోతైన సిద్ధాంతముతో నిండియున్నది, అయినప్పటికీ అదే సమయములో అతడు వారికిచ్చిన సిద్ధాంతములన్నిటినీ పొందుటకు పరిశుద్ధులు సిద్ధముగా లేరని పౌలు నిరాశ చెందినట్లుగా కనబడుచున్నది. “సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని”, “ఏలయనగా మీరు శరీర సంబంధులై యున్నారు” అని అతడు విలపించాడు (1 కొరింథీయులకు 3:1–3) పౌలు మాటలు చదవడానికి మనము సిద్ధపడినప్పుడు, ఆత్మను ఆలకించుటకు మరియు మన కుటుంబాలలో, మన సహ పరిశుద్ధులతో మరియు దేవునితో ఐక్యత కొరకు ప్రయాసపడుటకు మన సమ్మతితోపాటు—సత్యమును పొందడానికి మన స్వంత సిద్ధపాటును పరీక్షించుటకు అది సహాయకరమైనదిగా ఉండవచ్చు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

1 కొరింథీయులకు 1:10–17; 3:1–11

క్రీస్తు సంఘము యొక్క సభ్యులు ఐక్యత కొరకు ప్రయత్నిస్తారు.

కొరింథీయ పరిశుద్ధుల మధ్య ఐక్యత లేకపోవుట గురించిన వివరాలన్నీ మనకు తెలియవు, కానీ మన స్వంత అనుబంధాలలో ఐక్యత లేకపోవుట గురించి మనకు తెలుసు. మీ జీవితంలో మరింత ఐక్యత నుండి ప్రయోజనము పొందగల ఒక అనుబంధము గురించి ఆలోచించండి; తరువాత 1 కొరింథీయులకు 1:10–17; 3:1–11 లో కొరింథీయ పరిశుద్ధుల మధ్య ఐక్యత లేకపోవుట గురించి పౌలు బోధించిన దాని కొరకు వెదకండి. ఇతరులతో గొప్ప ఐక్యతను ఎలా వృద్ధి చేయాలనే దాని గురించి మీరు పొందగల అంతరార్థములేవి?

మోషైయ 18:21; 4 నీఫై 1:15–17; సిద్ధాంతము మరియు నిబంధనలు 38:23–27; 105:1–5; సువార్త అంశాలు, “ఐక్యత,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

1 కొరింథీయులు 1:17–31; 2

దేవుని కార్యమును నెరవేర్చుటకు, నాకు దేవుని జ్ఞానము అవసరము.

మనము జ్ఞానమును ఎక్కడ కనుగొనగలిగినా దానిని వెదకుట—మంచిది—మరియు ప్రోత్సహించబడినది, అయినప్పటికీ (2 నీఫై 9:29; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:118 చూడండి) లోపభూయిష్టమైన మానవ జ్ఞానము గురించి పౌలు కొన్ని బలమైన మాటలతో హెచ్చరికలను చేసాడు, దానిని అతడు “ఈ లోక జ్ఞానము” అని పిలిచాడు. మీరు 1 కొరింథీయులు 1:17–25 చదివినప్పుడు, ఈ వాక్యభాగానికి అర్థమేమిటో ధ్యానించండి. “దేవుని జ్ఞానము” ద్వారా అనగా పౌలు ఉద్దేశ్యమేమిటని మీరనుకుంటున్నారు? దేవుని కార్యమును నెరవేర్చుటకు మనకు దేవుని జ్ఞానము ఎందుకు అవసరము?

దేవుని కార్యమును సాధించుటలో మీ బాధ్యతలను నెరవేర్చుటకు మీ ప్రయత్నములందు, పౌలు కొరింథులోని పరిశుద్ధులకు బోధించినప్పుడు అతడు అనుభవించిన “భయమును, … ఎంతో వణకును” మీరు ఎప్పుడైనా అనుభవించారా? (1 కొరింథీయులకు 2:3). 1 కొరింథీయులకు 2:1–5 లో మీరు కనుగొన్నది ఏది మీకు ధైర్యము ఇస్తుంది? “మనుష్య జ్ఞానము” కంటె ఎక్కువగా “దేవుని యొక్క శక్తిని” మీరు నమ్ముతారని మీరు ఎలా చూపగలరో ఆలోచించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17–28 కూడా చూడండి.

1 కొరింథీయులకు 2:9–16

దేవుని సంగతులను గ్రహించుటకు నాకు పరిశుద్ధాత్మ అవసరము.

ఆటోమోటివ్ మెకానిక్స్ లేదా మధ్య యుగపు నిర్మాణము వంటి దేనిగురించైనా మీరు నేర్చుకోవాలని కోరిన యెడల, మీరు దానిని ఎలా చేస్తారు? 1 కొరింథీయులు 2:9–16 ప్రకారము, “దేవుని సంగతులను” నేర్చుకొనుట “మనుష్య సంగతులను” నేర్చుకొనుట నుండి భిన్నముగా ఎలా ఉన్నది? దేవుని సంగతులను గ్రహించుటకు మనకు పరిశుద్ధాత్మ ఎందుకు అవసరము? ఈ వచనములు చదివిన తరువాత, ఆత్మీయ విషయాలను ఎక్కువ పరిపూర్ణంగా గ్రహించడానికి మీరు చేయాల్సినదేమిటని మీరు అనుకుంటున్నారు? అతడు లేదా ఆమె సాక్ష్యముతో ప్రయాసపడుతున్న వారెవరికైనా పౌలు యొక్క మాటలు ఎలా సహాయపడగలవు?

1 కొరింథీయులకు 6:13–20

నా శరీరము పవిత్రమైనది.

కొరింథులో అనేకమంది జనులు లైంగిక దుర్నీతి అంగీకారమైనదని మరియు వారి శరీరాలు సంతోషము కొరకు ప్రధానంగా చేయబడినవని భావించారు. మరొక మాటలో చెప్పాలంటే, కొరింథు ఈనాటి ప్రపంచము నుండి భిన్నముగా లేదు. పవిత్రమైన జీవితము జీవించుటకు మీరు ఎందుకు కోరుతున్నారో ఇతరులకు వివరించుటకు 1 కొరింథీయులు 6:13–20లో పౌలు బోధించినదేది మీకు సహాయపడగలదు ?

1 కొరింథీయులు 7:29–33

వివాహితులుగా కంటే అవివాహితులుగా ఉండుట మేలని పౌలు బోధించాడా?

1 కొరింథీయులకు 7లో అనేక వచనాలు వివాహము అంగీకారమైనదిగా సూచించినట్లు కనిపించినా, ఒంటరిగా ఉండుటకు మరియు లైంగిక సంబంధాల నుండి పూర్తిగా దూరంగా ఉండుటకు ప్రాధాన్యమివ్వబడింది. అయినప్పటికీ, వారి పరిచర్యలో వారు ఒంటరిగా ఉన్నయెడల, వారు దేవునికి బాగా సేవ చేయగలరని గమనిస్తూ, పూర్తికాల సువార్తికులుగా పిలువబడిన వారిని పౌలు సూచిస్తున్నాడని గ్రహించుటకు జోసెఫ్ స్మిత్ అనువాదము, 1 కొరింథీయులకు 7:29–33 (లేఖన దీపిక చూడండి) సహాయపడుతుంది. వివాహము ఆయన నిత్య ప్రణాళికలో భాగమని మరియు ఉన్నతస్థితి కొరకు ఆవశ్యకమైనదని పౌలుతోపాటు, ఆయన సేవకుల ద్వారా ప్రభువు బోధించారు (1 కొరింథీయులకు 11:11; సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4 చూడండి).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

1 కొరింథీయులకు 1:10–17; 3:1–11మీ కుటుంబ సభ్యులు ఈ వచనాలను చదివినప్పుడు, వారు ఎక్కువ ఐకమత్యముగా ఉండడానికి వారికి సహాయపడగల అంతరార్థమును కనుగొనమని వారిని ఆహ్వానించండి.

1 కొరింథీయులకు 3:1–2.పాలు త్రాగుతూ, మాంసం తింటూ మీరు ఈ వచనాలను చదువవచ్చు. మనము ఆత్మీయంగా ఎదగగల విధానముతో పసిపిల్లలు పెద్దవారిగా ఎదుగు విధానమును మీరు పోల్చవచ్చు.

1 కొరింథీయులకు 3:4–9.పౌలు తన సువార్తసేవ ప్రయత్నాలను విత్తనాలను నాటడంతో పోల్చాడు. సువార్తను పంచుకోవడం గురించి అతని పోలిక మనకేమి బోధిస్తుంది?

1 కొరింథీయులు 6:19–20.పౌలు చేసినట్లుగా, మన శరీరాలను దేవాలయముతో పోల్చుట, మన శరీరాల యొక్క పవిత్రత గురించి బోధించుటకు ఒక శక్తివంతమైన విధానము కాగలదు. బహుశా ఈ సారాంశముతో చేర్చబడినటువంటి దేవాలయ చిత్రములను మీరు చూపించవచ్చు. దేవాలయములు ఎందుకు పవిత్రమైనవి? మన శరీరాలు దేవాలయాల వలే ఎట్లున్నాయి? మన శరీరాలను దేవాలయముల వలే చూచుటకు మనము ఏమి చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీపట్ల మీరు సహనము కలిగియుండండి. మనము సువార్తను నేర్చుకుంటున్నప్పుడు, మాంసమునకు ముందుగా పాలు అవసరమని పౌలు బోధించాడు (1 కొరింథీయులకు 3:1–2 చూడండి). కొన్ని సిద్ధాంతములు గ్రహించుటకు ఇప్పుడు కష్టమైనట్లుగా మీరు కనుగొన్న యెడల, సహనము కలిగియుండండి. మీరు విశ్వాసము కలిగియుండి, శ్రద్ధగా అధ్యయనము చేసినప్పుడు జవాబులు వస్తాయని నమ్మండి.

చిత్రం
నాలుగు దేవాలయములు

పౌలు దేవాలయము యొక్క పవిత్రతతో మన శరీరాలను పోల్చాడు. పైన ఎడమనుండి సవ్యదిశ: టిహువానా మెక్సికో దేవాలయము, తాయ్‌పే తైవాన్ దేవాలయము, తెగుసిగల్పా హండురస్ దేవాలయము, హ్యుస్టన్ టెక్సాస్ దేవాలయము.

ముద్రించు