2023 క్రొత్త నిబంధన
ఆగష్టు 28–సెప్టెంబరు 3. 1 కొరింథీయులకు 8–13: “మీరు క్రీస్తు యొక్క శరీరమైయున్నారు”


“ఆగష్టు 28–సెప్టెంబరు 3. 1 కొరింథీయులకు 8–13: ‘మీరు క్రీస్తు యొక్క శరీరమైయున్నారు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఆగష్టు 28–సెప్టెంబరు 3. 1కొరింథీయులకు 8–13,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
సంస్కార సమావేశము

ఆగష్టు 28–సెప్టెంబరు 3

1 కొరింథీయులకు 8–13

“మీరు క్రీస్తు యొక్క శరీరమైయున్నారు”

మీరు 1 కొరింథీయులకు 8–13 ప్రార్థనాపూర్వకంగా చదివినప్పుడు, పరిశుద్ధాత్మ సూక్ష్మ విధానములలో మీతో మాట్లాడవచ్చు (1 రాజులు 19:11–12 చూడండి). ఈ మనోభావాలను నమోదు చేయడం మీ అధ్యయనములో మీకు కలిగిన భావాలను మరియు ఆలోచనలను జ్ఞాపకము చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి

పౌలు కాలములో, కొరింథు రోమన్ సామ్రాజ్యం నలుమూలల నుండి వచ్చిన నివాసితులు గల ఒక సంపన్న వాణిజ్య కేంద్రము. పట్టణములో గల అనేక భిన్నమైన సంప్రదాయాలు మరియు మతములతో కొరింథులోని సంఘ సభ్యులు ఐక్యతను కాపాడేందుకు కష్టపడ్డారు, కాబట్టి క్రీస్తుయందు వారి విశ్వాసములో ఐక్యతను కనుగొనడానికి పౌలు వారికి సహాయపడేందుకు ప్రయత్నించాడు. ఈ ఐక్యత కేవలము శాంతియుత సహజీవనము కంటె అధికమైనది; ఒకరి భిన్నత్వాలను ఒకరు సహించమని మాత్రమే పౌలు వారిని అడగలేదు. బదులుగా, యేసు క్రీస్తు యొక్క సంఘములో మీరు చేరినప్పుడు, మీరు “ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందారు” మరియు ప్రతీ శరీర భాగము అవసరమైనదని అతడు బోధించాడు (1 కొరింథీయులకు 12:13). ఒక సభ్యుడు తప్పిపోయినప్పుడు, అది ఒక అవయవమును కోల్పోవుట వలె ఉన్నది మరియు దాని ఫలితంగా శరీరము బలహీనమవుతుంది. ఒక సభ్యుడు బాధపడినప్పుడు, మనమందరము దానిని అనుభవించాలి మరియు దానిని ఉపశమింపజేయడానికి మన వంతు చేయాలి. ఈ రకమైన ఐక్యతలో, భిన్నత్వాలు కేవలము అంగీకరించబడుట మాత్రమే కాదు కానీ ఆనందించబడతాయి, ఎందుకంటే విభిన్న ప్రతిభలు మరియు సామర్థ్యాలు గల సభ్యులు లేకుండా సంఘము పరిమితం చేయబడుతుంది. సంఘములో మీరు ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా ఉన్నట్లు భావించినా లేదా మీరు నిజముగా చెందుతారా అని ఆశ్చర్యపడుతున్నా, ఐక్యత సమానత్వము కాదు అనేది పౌలు మీకిచ్చిన సందేశము. మీ సహ పరిశుద్ధులు మీకు అవసరము మరియు మీ సహ పరిశుద్ధులకు మీరు అవసరము.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

1 కొరింథీయులకు 10:1–13

శోధనను తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని అందిస్తారు.

అద్భుతమైన ఆత్మీయ అనుభవాలు కూడా, “సాధారణముగా మనుష్యులకు” (1 కొరింథీయులకు 10:13) కలుగు శోధనల నుండి మనకు మినహాయింపు ఇవ్వవు. మోషే కాలములో ఇశ్రాయేలీయులు బలమైన అద్భుతాలకు సాక్షులుగా ఉన్నప్పటికీ, శోధనతో వారు ఎలా కష్టపడ్డారో పౌలు వ్రాయడానికి అది ఒక కారణము కావచ్చు (నిర్గమకాండము 13:21; 14:13–31 చూడండి). 1 కొరింథీయులకు 10:1–13 మీరు చదివినప్పుడు, ఇశ్రాయేలీయుల అనుభవాలలో ఏ హెచ్చరికలు మీకు వర్తిస్తున్నట్లు అనిపించాయి? మీ కోసం పరలోక తండ్రి శోధననుండి ఏ రకమైన “పలాయన మార్గాలను” అందించారు? (ఆల్మా 13:27–30; 3 నీఫై 18:18–19 కూడా చూడండి).

1 కొరింథీయులకు 10:16–17; 11:16-30

క్రీస్తు సంఘము యొక్క సభ్యులుగా సంస్కారము మనల్ని ఏకము చేస్తుంది.

సంస్కారము మీకు మరియు ప్రభువుకు మధ్య ఒక వ్యక్తిగత నిబద్ధతను కలిపియున్నప్పటికీ, అది మీరు ఇతరులతో పంచుకొనే ఒక అనుభవము కూడా. పరిశుద్ధుల సమూహముగా, మనము దాదాపుగా ఎల్లప్పుడూ సంస్కారములో కలిసి పాల్గొంటాము. సంస్కారము గురించి పౌలు బోధించిన దానిని చదవండి మరియు ఈ పవిత్రమైన విధి “అనేకమంది” క్రీస్తుయందు “ఒక్కటిగా” కావడానికి ఎలా సహాయపడగలదో ఆలోచించండి (1 కొరింథీయులకు 10:17). సంస్కారములో పాలుపంచుకోవడం క్రీస్తుకు మరియు ఇతర విశ్వాసులకు దగ్గరగా భావించేలా మీకెలా సహాయపడుతుంది? సంస్కారము మరియు దాని కోసం మీరు సిద్ధపడే విధానము గురించి మీ భావాలను ఈ వచనాలు ఏవిధంగా ప్రభావితం చేస్తాయి?

1 కొరింథీయులకు 11:11.

దేవుని ప్రణాళికలో స్త్రీ పురుషులు ఒకరికొకరు అవసరము.

1 కొరింథీయులకు 11:4–15లో, మనము నేడు పాటించని సాంస్కృతిక ఆచారాల గురించి పౌలు ప్రస్తావించాడు. అయినప్పటికీ, నిత్యము వర్తించే ఒక ముఖ్యమైన సత్యాన్ని కూడా పౌలు బోధించాడు, అది 11వ వచనంలో కనుగొనబడుతుంది. ఈ వచనానికి అర్థమేమిటని మీరనుకుంటున్నారు మరియు ఇది ఎందుకు ముఖ్యమైనది? ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించినట్లుగా, “ స్త్రీ పురుషులు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని, బలపరచుకొని, దీవించుకొని, సంపూర్ణులగుటకు ఉద్దేశించబడ్డారు” (“We Believe in Being Chaste,” Liahona, May 2013, 42). ఈ సత్యము వివాహాన్ని ఎలా ప్రభావితం చేయాలి? సంఘంలో మనం సేవ చేసే విధానాన్ని ఇది ఎలా ప్రభావితం చేయాలి?

1 కొరింథీయులకు 12–13

పరలోక తండ్రి యొక్క పిల్లలందరికి ప్రయోజనము కలిగించుటకు ఆత్మీయ వరములు ఇవ్వబడినవి.

1 కొరింథీయులకు 12–13 లో గల ఆత్మీయ వరముల జాబితా సంపూర్ణమైనది కాదు. కానీ పరలోక తండ్రి మీకిచ్చిన ఆత్మీయ వరములను మీరు గుర్తించి, ధ్యానించినప్పుడు ప్రారంభించుటకు ఇది మంచి స్థలము. సువార్త అంశాలలో “ఆత్మీయ వరములు” వ్యాసము (topics.ChurchofJesusChrist.org) ఈ వరములను బాగా గ్రహించడానికి మీకు సహాయపడవచ్చు. పౌలు జాబితా చేసిన వరములను మీరు చదివినప్పుడు, ఇతరులలో, మీలో లేదా లేఖనాలలోని జనులలో మీరు గమనించిన వాటిలో కొన్నిటిని చేర్చవచ్చు. మీకు గోత్ర జనకుని దీవెన ఉన్నయెడల, అది మీ ఆత్మీయ వరములలో కొన్నిటిని తెలుపవచ్చు. ఇతరులను దీవించడానికి ఈ వరములు మీకెలా సహాయపడతాయి? “శ్రేష్టమైన బహుమానములను ఆసక్తితో” (1 కొరింథీయులకు 12:31) మీరెలా ఆపేక్షించగలరో పరిగణించండి.

1 కొరింథీయులకు 14; మొరోనై 10:8–21, 30; సిద్ధాంతము మరియు నిబంధనలు 46:8–26; విశ్వాస ప్రమాణములు 1:7 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

1 కొరింథీయులకు 9:24–27.సువార్తను జీవించుటను పౌలు ఒక పరుగుపందెముతో పోల్చాడు కనుక, అతడి విషయాన్ని వివరించడానికి మీరు కుటుంబపు పరుగుపందెమును ఏర్పాటు చేయవచ్చు. పందెమును ముగించిన ప్రతీఒక్కరికి ఒక కిరీటమును బహుమానమివ్వండి మరియు ఈ జీవితంలో యేసుక్రీస్తును అనుసరించుటలో శ్రద్ధగల వారందరు ఎలా “అక్షయమైన” బహుమానమును (1 కొరింథీయులకు 9:25; 2 తిమోతి 4:7–8 కూడ చూడండి) గెలుచుకుంటారో చర్చించండి. ఒక పరుగుపందెము కొరకు సిద్ధపడేందుకు పరుగెత్తేవాడు ఏమి చేస్తాడు? పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళుటకు సిద్ధపడేందుకు మనము ఏమి చేయగలము?

చిత్రం
పరుగుపందెంలో పరుగెత్తుతున్నవారు

సువార్తను జీవించుటను పౌలు ఒక పరుగుపందెముతో పోల్చాడు.

1 కొరింథీయులకు 12:1–11.కలిసి ఈ వచనాలను చదివిన తర్వాత, ప్రతీఒక్కరికి ఒక కాగితపు ముక్కపై మరొక కుటుంబ సభ్యుని పేరు వ్రాసి ఇవ్వడాన్ని పరిగణించండి. ఆ వ్యక్తిలో వారు గమనించిన ఆత్మీయ వరములను వరుసగా వ్రాయమని ప్రతీఒక్కరిని అడగండి. తరువాత ప్రతీ కుటుంబ సభ్యుని వరములను గూర్చి వ్రాయడానికి ప్రతీఒక్కరికి అవకాశము వచ్చే వరకు గుండ్రంగా మీరు కాగితములను అందించవచ్చు.

1 కొరింథీయులకు 12:3.యేసు క్రీస్తు గూర్చి సాక్ష్యము పొందడానికి పరిశుద్ధాత్మ ఎందుకు ఆవశ్యకమైనది? ఆయనను గూర్చి మన సాక్ష్యములను బలపరిచేందుకు పరిశుద్ధాత్మను ఆహ్వానించడానికి మనము ఏమి చేయగలము?

1 కొరింథీయులు 12:12–27.కుటుంబ ఐక్యతను చర్చించడానికి పౌలు చెప్పిన శరీర సాదృశ్యము ఒక జ్ఞాపకార్థమైన విధానము కాగలదు. ఉదాహరణకు, కుటుంబ సభ్యులు కళ్ళు లేదా చెవులు మాత్రమే గల శరీరమును గీయడానికి ప్రయత్నించవచ్చు (17వ వచనము చూడండి). కుటుంబ సభ్యులుగా మనము ఒకరినొకరం ఎలా ఆదరించుకోవాలనే దాని గురించి ఈ వచనాలు ఏమి సూచిస్తున్నాయి?

1 కొరింథీయులకు 13:4–8.దాతృత్వమును గూర్చి పౌలు యొక్క నిర్వచనము మీ కుటుంబము కొరకు ప్రేరణాపూర్వక నినాదముగా ఉండవచ్చు. 4–8 వచనములలో ఒక వాక్యభాగమును అధ్యయనము చేసి, నిర్వచనాలు, మాదిరులు మరియు వ్యక్తిగత అనుభవాలను ఉపయోగించుట అనగా అర్థమేమిటో మిగిలిన కుటుంబ సభ్యులకు బోధించమని ప్రతీ కుటుంబ సభ్యుడికి మీరు చెప్పవచ్చు. రక్షకుడు ఈ లక్షణాలకు మాదిరిగా ఎలా ఉన్నారు? ఈ వాక్యభాగాలలో ప్రతీ దానికోసం పోస్టర్లను మీరు కలిసి తయారుచేసి, మీ ఇల్లంతా కూడా వాటిని ప్రదర్శించవచ్చు. సృజనాత్మకంగా ఉండండి!

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఒక లేఖనమును ప్రదర్శించండి. అర్థవంతమైనదిగా మీరు కనగొనిన ఒక వచనమును కుటుంబ సభ్యులు తరచూ చూడగల ప్రదేశములో ప్రదర్శించండి. ప్రదర్శించడానికి వంతులవారీగా ఒక లేఖనాన్ని ఎంపిక చేయమని మిగిలిన కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

చిత్రం
సంస్కార సమావేశము

“మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపంచుకొనుటయే గదా? రొట్టె యొక్కటే గనుక, అనేకులమైన మనము ఒక్క శరీరమైయున్నాము” (1 కొరింథీయులకు 10:16–17).

ముద్రించు