2023 క్రొత్త నిబంధన
సెప్టెంబరు 18-24. 2 కొరింథీయులకు 8–13: “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును”


“సెప్టెంబరు 18-24. 2 కొరింథీయులకు 8–13: ‘దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“సెప్టెంబరు 18-24. 2 కొరింథీయులకు 8–13,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
చిన్నబిడ్డతో మాట్లాడుతున్న యేసు

సెప్టెంబరు 18-24

2 కొరింథీయులకు 8–13

“దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును”

ఆత్మీయ మనోభావాలను నమోదు చేయడం లేఖన అధ్యయన సమయంలో మీరు నేర్చుకొన్న దానిని జ్ఞాపకముంచుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఒక అధ్యయన దినచర్య పుస్తకములో మీరు వ్రాయవచ్చు, మీ లేఖనాల అంచులలో వివరణలను వ్రాయవచ్చు, సువార్త గ్రంధాలయ యాప్‌లో వివరణలు చేర్చవచ్చు లేదా మీ ఆలోచనలను ఒక ఆడియోలో రికార్డు చేయవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

మరొక ప్రాంతములో పేదరికముతో కష్టపడుతున్న పరిశుద్ధుల సమూహము గురించి మీరు వినిన యెడల, మీరు ఏమి చేస్తారు? 2 కొరింథీయులకు 8–9 లోని కొరింథీయ పరిశుద్ధులకు పౌలు వివరించిన స్థితి ఇది. వారి సమృద్ధిలో కొంత అవసరతలో ఉన్న పరిశుద్ధులకు విరాళమివ్వమని కొరింథీయ పరిశుద్ధులను ప్రోత్సహించాలని అతడు ఆశించాడు. విరాళముల కొరకు అభ్యర్థనను మించి, పౌలు మాటలలో ఇవ్వడం గురించి లోతైన సత్యములు కూడా ఉన్నాయి: “సణగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను: దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” (2 కొరింథీయులకు 9:7). మన కాలములో, ప్రపంచమంతటా సహాయము అవసరమైన పరిశుద్ధులు ఇంకా ఉన్నారు. కొన్నిసార్లు వారి కోసం మనము ఎక్కువగా చేయగలిగేది, ఉపవాసముండి, ఉపవాస కానుకలు చెల్లించడం. మిగిలిన సందర్భాలలో, మనము ఇచ్చేది ఎక్కువ నేరుగా, వ్యక్తిగతంగా ఉండవచ్చు. మన త్యాగములు ఏ రూపములో ఉన్నప్పటికీ, ఇవ్వడానికి మన ప్రేరేపణలను పరీక్షించుట విలువైనది. మన త్యాగములు ప్రేమ యొక్క వ్యక్తీకరణలేనా? అన్నిటికంటే, ప్రేమ ఇచ్చేవారిని ఉల్లాసంగా చేస్తుంది.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

2 కొరింథీయులకు 8:1–15; 9:5–15

పేదవారిని, అవసరతలో ఉన్నవారిని దీవించుటకు నాకు కలిగిన దానిని నేను సంతోషంగా పంచుకుంటాను.

ప్రపంచమంతటా అవసరతలో ఉన్న జనులు అనేకమంది ఉన్నారు. మనము ఎలా వైవిధ్యం చూపగలము? ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఈ సలహా ఇచ్చారు: “ధనికులమైనా లేదా పేదవారమైనా, ఇతరులు అవసరతలో ఉన్నప్పుడు ‘మనకు సాధ్యమైనది చేయాలి’ [మార్కు 14:6, 8 చూడండి]. … పదేపదే ఆయన మనకిచ్చిన ఆజ్ఞను పాటించుటకు మీరు న్యాయబుద్ధితో కోరి, ప్రార్థించి, దానిని పాటించు విధానముల కొరకు వెదికిన యెడల, శిష్యత్వము యొక్క కనికరముగల క్రియలందు [దేవుడు] మీకు సహాయపడును మరియు మిమ్మల్ని నడిపించును” (“Are We Not All Beggars?,” Liahona, Nov. 2014, 41).

పేదవారు, అవసరతలో ఉన్నవారిపట్ల శ్రద్ధ తీసుకొనుటకు పౌలు బోధించిన సూత్రములను గూర్చి వివరణను వ్రాస్తూ, 2 కొరింథీయులకు 8:1–15; 9:6–15 చదవండి. పౌలు యొక్క సలహా గురించి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి? అవసరతలో ఉన్న ఎవరినైనా దీవించుటకు మీరు చేయగల దాని గురించి నడిపింపు కొరకు మీరు ప్రార్థించవచ్చు. మీరు పొందే మనోభావాలను నమోదు చేసి, వాటిని అమలు చేయడానికి నిశ్చయించుకోండి.

మోషైయ 4:16–27; ఆల్మా 34:27–29; రస్సెల్ ఎమ్. నెల్సన్, “రెండవ గొప్ప ఆజ్ఞ,” లియహోనా, నవ. 2019, 96–100 కూడా చూడండి.

2 కొరింథీయులకు 11:1–6, 13–15; 13:5–9

“మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి.”

నేడు, పౌలు కాలంలో వలె, “క్రీస్తు ఎడలనున్న సరళత నుండి” (2 కొరింథీయులకు 11:3) మనల్ని దూరంగా నడిపించి వేయాలని చూసే వారున్నారు. ఆ కారణంగానే, “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి” (2 కొరింథీయులకు 13:5) అని పౌలు సూచించినట్లుగా చేయడం ముఖ్యమైనది. “విశ్వాసముగలవారై యుండుట” అనగా అర్థమేమిటనే దాని గురించి ఆలోచించడం ద్వారా మీరు ఈ ప్రక్రియను మొదలుపెట్టవచ్చు. మీరు విశ్వాసముగలవారై యున్నారని మీకెలా తెలుసు? మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకోవడానికి మీకు గల అవకాశాలను పరిగణించండి.

మీ పరీక్షలో భాగంగా, “క్రీస్తు ఎడలనున్న సరళత” (2 కొరింథీయులకు 11:3) అనే వాక్యభాగాన్ని కూడా మీరు ధ్యానించవచ్చు. క్రీస్తు మరియు ఆయన సువార్త ఎడలనున్న సరళతను మీరెలా కనుగొన్నారు? మీ మనస్సు ఎట్లు “[ఆ] సరళత నుండి చెరుపబడియుండవచ్చు”? 2 కొరింథీయులకు 11:1–6, 13–15 లో మీరు కనుగొన్న సహాయకరమైన సలహా ఏది?

అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ నుండి ఈ సలహాను కూడా పరిగణించండి: “సువార్త మీ కోసం సరిగ్గా పనిచేయడం లేదని మీరెప్పుడైనా అనుకుంటే, ఒక అడుగు వెనక్కి వేసి, పై నుండి మీ జీవితాన్ని పరీక్షించుకోమని మరియు శిష్యత్వానికి మీ మార్గాన్ని సరళంగా చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సువార్త యొక్క ముఖ్య సిద్ధాంతాలు, సూత్రాలు మరియు అన్వయాలపై దృష్టి పెట్టండి. ఒక పరిపూర్ణమైన జీవితానికి మీ మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తారని మరియు దీవిస్తారని, సువార్త ఖచ్చితంగా మీ కొరకు బాగా పనిచేస్తుందని నేను వాగ్దానమిస్తున్నాను” (“It Works Wonderfully!,” Liahona, Nov. 2015, 22).

2 కొరింథీయులకు 12:5–10

నా బలహీనతలందు బలమును కనుగొనుటకు సహాయపడేందుకు రక్షకుని కృప నాకు చాలును.

పౌలు యొక్క “శరీరములో ముల్లు” ఏమిటో మనకు తెలియదు, కానీ మన జీవితాల నుండి దేవుడు తీసివేయాలని మనం కోరుకునే మన స్వంత ముల్లులను మనమందరం కలిగియున్నాము. మీరు 2 కొరింథీయులకు 12:5–10 చదువుతున్నప్పుడు, మీ ముల్లుల గురించి ఆలోచించండి మరియు ఈ వచనాలలో యేసు క్రీస్తు గురించి మీరు నేర్చుకొనే దానిని ధ్యానించండి. శ్రమలు మరియు బలహీనత గురించి పౌలు ఈ వచనాలలో ఏమి బోధించాడు? దేవుని కృప మీకు చాలును అన్నది మీకు ఏ అర్ధమును కలిగియున్నది?

మోషైయ 23:21–24; 24:10–15; ఈథర్ 12:27; మొరోనై 10:32–33 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

2 కొరింథీయులకు 8–9.పేదవారు మరియు అవసరతలో ఉన్నవారిని చేరుకొనుటకు ప్రేరేపించునట్లు ఈ అధ్యాయములలో మనము ఏమి కనుగొంటాము? అవసరతలో ఉన్నవారికి సేవచేయడానికి కుటుంబముగా ప్రణాళిక చేయుటకు ఇది మంచి సమయము కావచ్చు.

2 కొరింథీయులకు 9:6–7.“ఉత్సాహముగా ఇచ్చువారిగా” వర్ణించగల వారు ఎవరైనా మీ కుటుంబానికి తెలుసా? ఇతరులకు మనం చేసే సేవను ఎక్కువ ఉత్సాహముగా మనము ఎలా చేయగలము? యువ కుటుంబ సభ్యులు, “నేను ఉత్సాహముగా ఇచ్చువాడిని” అని తెలిపే బాడ్జిలను తయారు చేయవచ్చు. వారు ఒకరి కొరకు ఒకరు ఉత్సాహంగా సేవ చేయడాన్ని మీరు చూసినప్పుడల్లా కుటుంబ సభ్యులకు మీరు బాడ్జిలను బహూకరించవచ్చు.

2 కొరింథీయులకు 10:3–7.దుష్టత్వముకు వ్యతిరేకంగా మన “యుద్ధోపకరణములు” గురించి మీ కుటుంబానికి మీరేమి బోధిస్తారు? కుర్చీలు మరియు దుప్పట్లతో ఒక గోడ లేదా కోట కట్టుటను మీ కుటుంబము ఆనందిస్తుందా? దేవుని నుండి మనల్ని దూరముగా నడిపించు విషయాలను ఎలా పారద్రోలాలి మరియు “క్రీస్తుపట్ల విధేయతకు ప్రతీ ఆలోచనను ఎలా బంధించి తేవాలో” చర్చించుటకు ఇది దారితీయవచ్చు. మన ఆలోచనలను అదుపు చేయుటకు మనము ఉపయోగించే ఆత్మీయ “ఆయుధములు” ఏవి? (ఎఫెసీయులకు 6:11–18 చూడండి).

2 కొరింథీయులకు 11:3.“క్రీస్తు ఎడలనున్న సరళత” పై ఎక్కువగా దృష్టిసారించుటకు మీ కుటుంబము ఏమి చేయగలదు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీ మనోభావాలను నమోదు చేయండి. ఎల్డర్ రిచర్డ్ జి. స్కాట్ ఇలా చెప్పారు: “జాగ్రత్తగా వ్రాయబడిన జ్ఞానము అవసరతగల సమయములో లభ్యమయ్యే జ్ఞానము. … [ఆత్మీయ నడిపింపును వ్రాయుట] మీరు మరింత వెలుగును పొందే అవకాశాన్ని పెంచుతుంది” (“Acquiring Spiritual Knowledge,” Ensign, Nov. 1993, 88; see also Teaching in the Savior’s Way, 1230).

చిత్రం
సేవా కార్యక్రమంలో సహాయపడుతున్న యౌవనులు

“సణగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను: దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” (2 కొరింథీయులకు 9:7).

ముద్రించు