2023 క్రొత్త నిబంధన
సెప్టెంబరు 25–అక్టోబరు 1. గలతీయులకు: “ఆత్మానుసారముగా నడుచుకొనుడి”


“సెప్టెంబరు 25–అక్టోబరు 1. గలతీయులకు: ‘ఆత్మానుసారముగా నడుచుకొనుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“సెప్టెంబరు 25–అక్టోబరు 1. గలతీయులకు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
చెరసాలలో పౌలుకు ప్రత్యక్షమైన క్రీస్తు

పునరుత్థానం చెందిన రక్షకుడు చెరసాలలో పౌలును దర్శించారు (అపొస్తలుల కార్యములు 23:11 చూడండి). “దాస్యమను కాడి” నుండి (గలతీయులకు 5:1) యేసు క్రీస్తు మనలను స్వతంత్రునుగా చేయగలరు.

సెప్టెంబరు 27–అక్టోబరు 1

గలతీయులకు

“ఆత్మానుసారముగా నడుచుకొనుడి”

గలతీయులకు వ్రాసిన పత్రికను మీరు చదువుతున్నప్పుడు, మీరు పొందే మనోభావాలను నమోదు చేయండి. ఆ విధంగా చేయడం మీరు వాటిని గుర్తుంచుకోవడానికి మరియు భవిష్యత్తులో వాటిని ధ్యానించడానికి సహాయపడుతుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు క్రీస్తు సువార్త, ఆత్మీయ దాస్యము నుండి స్వేచ్ఛను కలిగిస్తుంది. కానీ కొన్నిసార్లు సువార్త యొక్క స్వేచ్ఛను అనుభవించిన జనులు దాని నుండి మరలిపోయి, “మరల దాసులైయుండగోరతారు” (గలతీయులకు 4:9). కొద్దిమంది గలతీయ పరిశుద్ధులు ఇదే చేయుచున్నారు—క్రీస్తు వారికి అందించిన స్వేచ్ఛ నుండి వారు మరలిపోతున్నారు (గలతీయులకు 1:6 చూడండి). అప్పుడు గలతీయులకు పౌలు వ్రాసిన పత్రిక, “క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్న ఆ స్వాతంత్య్రమునకు” తిరిగి రమ్మను అత్యవసరమైన పిలుపు (గలతీయులకు 5:1). ఇది మనము కూడా విని, చెవియొగ్గవలసిన పిలుపు, ఎందుకనగా పరిస్థితులు మారినప్పటికీ, స్వాతంత్య్రము మరియు దాస్యము మధ్య పోరాటము నిరంతరమైనది. పౌలు బోధించినట్లుగా, “స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుట” సరిపోదు (గలతీయులకు 5:13); క్రీస్తు పై ఆధారపడుట ద్వారా దానియందు మనము తప్పక “స్థిరముగా నిలిచియుండాలి” కూడా (గలతీయులకు 5:1).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

గలతీయులకు 1–5

క్రీస్తు యొక్క చట్టము నన్ను స్వతంత్రునిగా చేస్తుంది.

అబద్ధ బోధనలచేత వారు దారితప్పుతున్నారని తెలుసుకొనినప్పుడు, పౌలు గలతీయ పరిశుద్ధులకు వ్రాసాడు (గలతీయులకు 1:6–9 చూడండి). సువార్తను అంగీకరించిన అన్యులు రక్షించబడేందుకు సున్నతి చేయించుకోవాలి మరియు మోషే ధర్మశాస్త్రము యొక్క ఇతర ఆచారాలను పాటించాలి అనేది ఈ బోధనలలో ఒకటి (గలతీయులకు 2 చూడండి). పౌలు ఈ ఆచారాలను “దాస్యమను కాడి” (గలతీయులకు 5:1) అని పిలిచాడు. గలతీయులకు పౌలు ఇచ్చిన సలహాను మీరు చదివినప్పుడు, నిజమైన స్వాతంత్య్రమేదో గ్రహించునట్లు మీకు సహాయపడగల సూత్రాల కొరకు చూడండి. మీ జీవితంలో ఉండగల తప్పుడు ఆచారాలు లేదా దాస్యపు కాడిల గురించి కూడా మీరు ధ్యానించవచ్చు. సువార్త అందించు స్వాతంత్య్రాన్ని అనుభవించడం నుండి ఏదైనా మిమ్మల్ని ఆటంకపరుస్తున్నదా? క్రీస్తు మరియు ఆయన సువార్త ఏవిధంగా ”(మిమ్మల్ని) స్వతంత్రులను చేసింది”? (గలతీయులకు 5:1).

2 నీఫై 2:27; 9:10–12 కూడా చూడండి.

గలతీయులకు 3

అబ్రాహాముకు వాగ్దానమివ్వబడిన దీవెనలకు నేను వారసుడిని.

వారు అబ్రాహాము యొక్క స్వంత వారసులు (“సంతానము”) కానందువల్ల, ఉన్నతస్థితితో కలిపి అబ్రాహాముకు వాగ్దానమివ్వబడిన దీవెనలను వారు పొందలేరేమోనని కొందరు గలతీయ పరిశుద్ధులు విచారించారు. గలతీయులకు 3:7–9, 13–14, 27–29 ప్రకారం, “అబ్రాహాము సంతతిగా” కావడానికి ఒక వ్యక్తిని ఏది అర్హునిగా చేస్తుంది?

topics.ChurchofJesusChrist.org అబ్రాహాముకు వాగ్దానమివ్వబడిన దీవెనలు మీకు ఎందుకు ముఖ్యమైనవి?

గలతీయులకు 3:6–25

అబ్రాహాము యేసు క్రీస్తు యొక్క సువార్తను కలిగియుండెను.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా వివరించారు: “చాలామంది అనుకుంటున్నట్లుగా చరిత్రలోని యుగాలన్నిటిలో పూర్వీకులు పరలోక చట్టాలు తెలియకుండా ఉన్నారంటే మేము నమ్మలేము, ఇప్పటివరకు రక్షించబడిన వారందరు ఈ గొప్ప విమోచన ప్రణాళిక ద్వారానే రక్షించబడ్డారు, క్రీస్తు రాక మునుపు నుండి, వచ్చినప్పటి నుండి కూడా. … దీనితో సంబంధం లేకుండా అబ్రాహాము బలిని అర్పించాడు మరియు సువార్త అతనికి ప్రవచించబడింది” (“The Elders of the Church in Kirtland to Their Brethren Abroad,” The Evening and the Morning Star, Mar. 1834, 143, JosephSmithPapers.org). అబ్రాహాము మరియు ఇతర ప్రాచీన ప్రవక్తలు యేసు క్రీస్తు యొక్క సువార్తను కలిగియుండెనని పౌలు కాలంలోని పరిశుద్ధులు తెలుసుకోవడం ముఖ్యమైనదని మీరెందుకు అనుకుంటున్నారు? దీని గూర్చి తెలుసుకొనుట మీకు ఎందుకు ముఖ్యమైనది? (హీలమన్ 8:13–20; మోషే 5:58–59; 6:50–66 చూడండి.)

గలతీయులకు 5:13–26; 6:7–10

నేను “ఆత్మానుసారముగా నడుచుకొనినట్లయితే,” నేను “ఆత్మ ఫలమును” పొందుతాను.

ఎంత పూర్తిగా మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారో అంచనా వేయడానికి ఈ వచనాలను అధ్యయనం చేయడం మీకు సహాయపడగలదు. 22–23 వచనాలలో చెప్పబడిన ఆత్మ ఫలమును మీరు అనుభవిస్తున్నారా? ఆత్మీయ జీవనం యొక్క ఏ ఇతర ఫలాన్ని లేదా ఫలితాలను మీరు గమనించారు? మరింత ఎక్కువగా ఈ ఫలాన్ని పండించడానికి మీరేమి చేయాలో ధ్యానించండి. ఈ ఫలాన్ని పండించడం, మీ జీవితంలో ముఖ్యమైన బంధాలను ఎలా వృద్ధిచేయగలదు?

చిత్రం
చెట్టు మీద ఆపిల్ పండ్లు

నా జీవితంలో నేను తప్పక “ఆత్మ ఫలమును” వెదకాలి.

మీరు ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మీ ప్రయత్నాలు వాగ్దానమివ్వబడిన ఫలాన్ని అందిస్తున్నట్లుగా కనిపించకపోతే గలతీయులకు 6:7–10 చదవండి. ఈ వచనాలలో ప్రభువు మీ కొరకు ఏ సందేశాన్ని కలిగియున్నారని మీరు భావిస్తున్నారు?

ఆల్మా 32:28, 41–43; సిద్ధాంతము మరియు నిబంధనలు 64:32–34 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

గలతీయులకు 3:11.“విశ్వాసమూలముగా జీవించడం” అనగా అర్థమేమిటి? ఒక కుటుంబముగా మనము విశ్వాసమూలముగా ఎలా జీవిస్తున్నాము?

గలతీయులకు 4:1–7.ఒక రాజుగారి దాసులు మరియు ఆయన పిల్లలకు మధ్య గల తేడాలను చర్చించడం ద్వారా మీరు గలతీయులకు 4 పరిచయం చేయవచ్చు. ఒక దాసుడు కలిగియుండలేని ఏ అవకాశాలను లేదా సామర్థ్యాన్ని ఒక రాజుగారి బిడ్డ కలిగియుండగలడు? 1–7 వచనాలను మీరు కలిసి చదువుతున్నప్పుడు దీని గురించి ఆలోచించండి. పరలోక తండ్రితో మన సంబంధం గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి?

గలతీయులకు 5:16-26.“శరీరకార్యములు” మరియు “ఆత్మ ఫలము” మధ్య గల తేడాను చర్చించడాన్ని పరిగణించండి. మీ చర్చకు కొంత హాస్యాన్ని జోడించడానికి, ఆత్మ ఫలమును వర్ణించడానికి పౌలు ఉపయోగించిన పదాలను మీ కుటుంబము వేర్వేరు పండ్లకు పేర్లుగా వ్రాయవచ్చు. తరువాత ప్రతి కుటుంబ సభ్యుడు ఒకదానిని ఎంచుకొని, దానిని నిర్వచించి, ఆ ఫలానికి ఉదాహరణగా నిలిచే ఒకరి గురించి మాట్లాడవచ్చు. మీ కుటుంబము ఆత్మను మీ ఇంటిలోనికి ఆహ్వానించి, ఈ ఫలాన్ని పండించగల విధానాల గురించి చర్చించడానికి ఇది దారితీయగలదు. చర్చ తరువాత, మీరంతా కలిసి పండ్ల మిశ్రమాన్ని ఆస్వాదించవచ్చు.

గలతీయులకు 6:1–2.మీ కుటుంబములో ఎవరైనా ఒకరు “తప్పిదములో చిక్కుకొనిన” సమయాలుండవచ్చు. అటువంటి పరిస్థితులలో ఏమి చేయాలనేదాని గురించి గలతీయులకు 6:1–2 లో ఏ సలహాను మీరు కనుగొంటారు?

గలతీయులకు 6:7–10.మీ కుటుంబమంతా కలిసి ఎప్పుడైనా ఏదైనా విత్తినట్లయితే, “మనష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” (7వ వచనము) అనే సూత్రాన్ని నిరూపించడానికి మీరు ఆ అనుభవాన్ని ఉపయోగించవచ్చు. లేదా వారికిష్టమైన పండ్లు లేదా కూరగాయల గురించి మీరు కుటుంబ సభ్యులను అడగవచ్చు మరియు దానిని ఉత్పత్తి చేయడానికి ఒక మొక్కను పెంచడం ఎంత కష్టమనే దానిగురించి మాట్లాడవచ్చు. (ఈ సారాంశం చివరన ఉన్న చిత్రాన్ని చూడండి.) మీ కుటుంబము పొందాలని ఆశపడుతున్న దీవెనలు మరియు ఆ దీవెనలను ఎలా “పొందాలి” అనేదాని గురించి మీరు మాట్లాడవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

లేఖనాలను తమతో పోల్చుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడండి. “అవి మాకు ప్రయోజనకరముగా ఉండునట్లు మరియు మేము నేర్చుకొనునట్లు లేఖనములన్నిటినీ మాతో పోల్చితిని” (1 నీఫై 19:23) అని నీఫై చెప్పాడు. దీనిని చేయడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, గలతీయులకు 5:22–23 లో వివరించబడిన ఆత్మ ఫలమును వారు అనుభవించిన సమయాలను ధ్యానించమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. (Teaching in the Savior’s Way21 చూడండి.)

చిత్రం
చెట్టు మీద బేరిపండ్లు

మనము ఆత్మానుసారముగా నడుచుకొనినప్పుడు, మన జీవితాల్లో “ఆత్మ ఫలము”ను మనం అనుభవిస్తామని పౌలు బోధించాడు.

ముద్రించు