2023 క్రొత్త నిబంధన
అక్టోబరు 9-15. ఫిలిప్పీయులకు; కొలొస్సయులకు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను”


“అక్టోబరు 9-15. ఫిలిప్పీయులకు; కొలొస్సయులకు: ‘నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“అక్టోబరు 9-15. ఫిలిప్పీయులకు; కొలొస్సయులకు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
జైలునుండి ఒక లేఖను చెప్పి వ్రాయిస్తున్న పౌలు

అక్టోబరు 9-15

ఫిలిప్పీయులకు; కొలొస్సయులకు

“నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను”

క్రొత్త నిబంధన అధ్యయన సమయంలో మీరు నమోదు చేసిన ఆత్మీయ భావనలను చివరిసారి ఎప్పుడు చదివారు? మీరు పొందుతున్న ప్రేరేపణలను పునర్వీక్షించుట సహాయకరంగా ఉండవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

అతడు రోమాలో జైలులో ఉండగా, ఫిలిప్పీయులకు మరియు కొలొస్సయులకు పౌలు తన పత్రికలను వ్రాసాడు. కానీ జైలులో ఉన్న వారి నుండి మీరు ఆశించినట్లుగా ఈ లేఖలు ధ్వనించవు. బాధలు మరియు శ్రమల కంటే ఎక్కువగా ఆనందము, సంతోషము, మరియు కృతజ్ఞత గురించి పౌలు మాట్లాడాడు: “క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును” (ఫిలిప్పీయులకు 1:18) అని అతడు చెప్పాడు. “నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడ ఉండి … క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను” (కొలొస్సయులకు 2:5). నిశ్చయముగా, తన కష్టమైన పరిస్థితులందు పౌలు “సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానమును” (ఫిలిప్పీయులకు 4:7) అనుభవించాడు, ఏది ఏమైనప్పటికీ అది వాస్తవము. మన స్వంత శ్రమలందు, మనము అదే సమాధానమును అనుభవించగలము మరియు “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించగలము” (ఫిలిప్పీయులకు 4:4 ). పౌలు చేసినట్లుగా, మనము యేసు క్రీస్తుపై పూర్తిగా ఆధారపడవచ్చు, “ఆయనయందు మనకు విమోచనము కలుగుచున్నది” (కొలొస్సయులకు 1:14). “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” (ఫిలిప్పీయులకు 4:13; కొలొస్సయులకు 1:11 కూడా చూడండి) అని పౌలు చెప్పినట్లుగా మనము చెప్పగలము.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఫిలిప్పీయులకు 2:5–11; కొలొస్సయులకు 1:12–23

నా విశ్వాసము యేసు క్రీస్తుపై స్థాపించబడింది.

యేసు క్రీస్తు గురించిన వచనాలపై తన లేఖన అధ్యయనమును ఆయన కేంద్రీకరించినప్పుడు, “నేను ఒక విభిన్నమైన మనిషిని” అని ఆయన భావించేలా అది ఆయనపై ప్రభావాన్ని కలిగియుండెనని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు (“మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొందుట,” లియహోనా, మే 2017, 39). మీరు ఫిలిప్పీయులకు మరియు కొలొస్సయులకు చదువుతున్నప్పుడు, ఆయన మాదిరిని అనుసరించడాన్ని పరిగణించండి (ప్రత్యేకించి, ఫిలిప్పీయులకు 2:5–11; కొలొస్సయులకు 1:12–23 చూడండి). రక్షకుని గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? “ఒక విభిన్నమైన పురుషుడు” లేదా స్త్రీ కావడానికి ఈ సత్యాలు మీకెలా సహాయపడగలవు?

ఫిలిప్పీయులకు 2:12–13

మనము “[మన] సొంత రక్షణను కొనసాగిస్తున్నామా”?

“మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి” (ఫిలిప్పీయులకు 2:12) అను వాక్యభాగము మన స్వంత ప్రయత్నాల ద్వారా మాత్రమే మనము రక్షించబడతామనే ఆలోచనను బలపరచుటకు కొందరు జనుల చేత ఉపయోగించబడింది. రక్షణకు ఏ క్రియలు అవసరము లేదని వాదించడానికి, “విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడియున్నారు” (ఎఫెసీయులకు 2:8) అనే పౌలు బోధనను మరికొందరు ఉపయోగిస్తారు. ఏమైనప్పటికీ, రక్షణ పొందడానికి యేసు క్రీస్తు యొక్క కృప మరియు వ్యక్తిగత ప్రయత్నము రెండూ అవసరమని పౌలు రచనలతో కలిపి, లేఖనాలు స్పష్టంగా బోధిస్తున్నాయి. మన రక్షణను కొనసాగించడానికి మన అత్యుత్తమ ప్రయత్నాలలో కూడా, “మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే” (ఫిలిప్పీయులకు 2:13; ఫిలిప్పీయులకు 1:6; 2 నీఫై 25:23; బైబిలు నిఘంటువు, “కృప” కూడా చూడండి).

ఫిలిప్పీయులకు 3:4–14

యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రతీ త్యాగమునకు అర్హమైనది.

యేసు క్రీస్తు యొక్క సువార్తకు మార్పు చెందినప్పుడు, యూదా సమాజంలో పరిసయ్యునిగా అతనికి కలిగిన ప్రభావవంతమైన స్థానముతో సహా పౌలు చాలా వదలుకున్నాడు. ఫిలిప్పీయులకు 3:4–14 లో, సువార్త కొరకు త్యాగములు చేయుటకు అతడు సుముఖంగా ఉన్నందున పౌలు సంపాదించిన వాటి కొరకు వెదకండి. తన త్యాగములను గూర్చి అతడు ఎలా భావించాడు?

తరువాత మీ స్వంత శిష్యత్వమును ఆలోచించండి. యేసు క్రీస్తు యొక్క సువార్త కొరకు మీరు ఏమి త్యాగము చేసారు? మీరు ఏమి పొందారు? రక్షకునికి ఎక్కువ సమర్పించబడిన శిష్యునిగా మారుటకు మీరు చేయాల్సిన అవసరమున్నదని భావించిన అదనపు త్యాగములు ఏవైనా ఉన్నాయా?

3 నీఫై 9:19–20; సిద్ధాంతము మరియు నిబంధనలు 58:2-5; టేలర్ జి. గడోయ్, “మరొక్క రోజు,” లియహోనా, మే 2018, 34–36 కూడా చూడండి.

ఫిలిప్పీయులకు 4:1–13

నా పరిస్థితులు లక్ష్యపెట్టకుండా, క్రీస్తునందు నేను ఆనందమును కనుగొనగలను.

పౌలు యొక్క జీవితం, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత వ్యక్తపరచబడిన సత్యమునకు స్పష్టమైన మాదిరి: “మన జీవితాల దృష్టి … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై కేంద్రీకరించబడినప్పుడు, మన జీవితాలలో—ఏమి జరుగుచున్నది—లేదా జరుగుటలేదు అనే దానిని లక్ష్యపెట్టకుండా మనము ఆనందమును అనుభవించగలము. ఆయన నుండి మరియు వలన ఆనందము వస్తుంది” (“Joy and Spiritual Survival,” Liahona, Nov. 2016, 82).

ఫిలిప్పీయులకు—ప్రత్యేకంగా 4వ అధ్యాయము—మీరు చదివినప్పుడు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులలోనైనా మీరు సంతోషమును కనుగొనుటకు సహాయపడగల వ్యాఖ్యానముల కొరకు అన్వేషించండి. కష్టమైన సమయములో “దేవుని యొక్క సమాధానమును” మీరు ఎప్పుడు అనుభవించారు? (7వ వచనము) కష్టమైన పనులు చేయుటకు “క్రీస్తు ద్వారా” బలమును మీరు ఎప్పుడు కనుగొన్నారు? 13వ వచనము). అన్ని సమయాలలో “సంతృప్తి కలిగియుండుట” ఎందుకు ముఖ్యమైనదని మీరనుకుంటున్నారు?(11వ వచనము) 8వ వచనము లోని లక్షణాలను సాధన చేయడం మీ పరిస్థితులలో ఆనందాన్ని కనుగొనడానికి మీకు ఎలా సహాయపడగలదు?

ఆల్మా 33:23 చూడండి.

కొలొస్సయులకు 3:1–17

యేసు క్రీస్తు యొక్క శిష్యులు ఆయన సువార్తను జీవించినప్పుడు “నూతనంగా” మారతారు.

ఒక “నూతన పురుషుడు [లేదా స్త్రీ]” గా మారడానికి యేసు క్రీస్తు మీకు సహాయపడుతున్నారని మీరెలా చెప్పగలరు? దీనిని ధ్యానించుటకు ఒక విధానము కొలొస్సయులకు 3:1–17 అన్వేషించుట మరియు “పాత వ్యక్తి” యొక్క స్వభావాలు, లక్షణాలు, క్రియల జాబితాను, “నూతన వ్యక్తి” యొక్క స్వభావాలు, లక్షణాలు, మరియు క్రియల జాబితాను చేయుట.

రక్షకుడు మిమ్మల్ని ఎలా మారుస్తున్నారనే దాని గురించి మీ ఆలోచనలను నమోదు చేయండి, తద్వారా భవిష్యత్తులో మీరు వాటిని పునర్వీక్షించి, మీరు ఎలా అభివృద్ధి చెందుతున్నారో ధ్యానించవచ్చు.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ఫిలిప్పీయులకు.ఫిలిప్పీయులకులో ఆనందము లేదా సంతోషించు అను మాటలు తరచుగా పునరావృతం చేయబడ్డాయని మీ కుటుంబము గమనించవచ్చు. ఈ పదాలలో ఒక దానిని మీరు చూసిన ప్రతీసారి, మీరు ఆగి, ఆనందమును ఎలా కనుగొనాలనే దాని గురించి పౌలు బోధించిన దానిని చర్చించవచ్చు.

ఫిలిప్పీయులకు 2:14–16.మనము ఎలా “లోకమందు జ్యోతులవలె కనబడగలము”?

ఫిలిప్పీయులకు 4:8.ఈ వచనములోని వివరణలకు సరిపోయే “ధ్యానముంచుకొను” విషయాలను బహుశా కుటుంబ సభ్యులు గుర్తించవచ్చు (విశ్వాస ప్రమాణాలు 1:13 కూడా చూడండి). పౌలు యొక్క సలహాను అనుసరించుట ద్వారా మీ కుటుంబము ఎలా దీవించబడుతుంది?

కొలొస్సయులకు 1:23; 2:7బహుశా మీ కుటుంబము ఒక చెట్టు చుట్టూ కూర్చొని లేదా ఒక చెట్టు చిత్రమును చూస్తుండగా ఈ వచనములు చదువవచ్చు (ఈ సారాంశముతోపాటు ఉన్నటువంటిది). క్రీస్తుయందు “వేరుపారిన వారై” మరియు “స్థిరముగా” ఉండుట అనగా అర్థమేమిటి? మన ఆత్మీయ వేర్లను బలపరచుకొనుటకు మనం ఒకరికొకరం ఎలా సహాయపడగలము?

కొలొస్సయులకు 2:2–3.మీరు సువార్తలో కనుగొనే “బుద్ధి మరియు జ్ఞానపు నిధులు” మరియు “సంపదల”ను సూచించే వాటితో “నిధి పెట్టె”ను నింపడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

మీ సాక్ష్యాన్ని జీవించండి. “మీరు ఏమైయున్నారో దానినే మీరు బోధిస్తారు,” అని ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ బోధించారు. “ఒక ప్రత్యేక పాఠములోని ప్రత్యేక సత్యము కంటే … మీ లక్షణాలు ఎక్కువగా జ్ఞాపకముంచుకొనబడతాయి” (Teaching in the Savior’s Way, 13లో).

చిత్రం
అనేక వేర్లు గల చెట్టు

మన విశ్వాసము యేసు క్రీస్తునందు “వేరుపారి” యుండాలని (కొలొస్సయులకు 2:7) పౌలు బోధించాడు.

ముద్రించు